పుస్తక ప్రియులకు శుభవార్త ! హైదరాబాద్ లో గురువారం నుంచి భారీ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలోని తెలంగాణ కళాభారతీ భవన్ లో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దేశంలోనే రెండో అతిపెద్దదైన ఈ పుస్తక ప్రదర్శన ..10 రోజుల పాటు అంటే ఈ నెల 27 వరకు జరగనుంది. ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ నగరాలకు చెందిన మొత్తం 371 ప్రచురణకర్తలు తమ స్టాళ్లను ఏర్పాటు చేశారు. అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 171 స్టాళ్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా పుస్తక ప్రదర్శనను శుక్రవారం సాయంత్రం 5:30కి తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేతుల మీదుగా ప్రారంభిస్తారు.
Mobile AppDownload and get updated news