బాలీవుడ్‌లో నెంబర్ వన్ జోడీగా పేరున్న షారుఖ్.. కాజోల్ జంట కలిసి చేసిన ఈ సినిమా మీద ప్రాజెక్ట్‌ను ప్రకటించిన నాటి నుంచి రోజురోజుకీ అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. దర్శకుడు రోహిత్ శెట్టి రొమాంటిక్ జానర్ లో తెరకెక్కించిన ఈ సినిమా.. రిలీజ్ కు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసింది. అయితే రోహిత్ శెట్టి ఈ సినిమాను అభిమానులు ఆశించిన స్థాయిలో ప్రజెంట్ చేయటంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా షారూఖ్, కాజోల్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా రొటీన్ గా అనిపిస్తాయి. ఈ సినిమా అటు మాస్ కాకుండా, ఇటు ఎంటర్ టెయినర్ కాకుండా, పూర్తి క్లాసూ కాకుండా అందరినీ మెప్పించే ప్రయత్నంలో కిచిడీలా తయారైంది. రొటీన్ టేకింగ్, మితిమీరిన డ్రామాతో తలనొప్పి కలిగిస్తుంది. ఈ సినిమాలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది కాజోల్ గురించి. 40 ఏళ్లు దాటినా ఆమె అందం, అభినయంలో యువ హీరోయిన్లతో పోటీ పడేలా ఉండటం విశేషం. షారుఖ్ ఎప్పటిలాగే అదే జోష్‌తో నటించి మెప్పించాడు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మళ్లీ మనను 1990ల నాటి 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే' కు తీసుకెళ్తుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో మరోసారి బాలీవుడ్ బెస్ట్ కపుల్ అనిపించుకున్నారు. యువజంట వరుణ్, కృతి కూడా తమ పరిధి మేరకు బాగానే నటించారు.
![]()
కథ: రాజ్ (షారూక్ ఖాన్), వీర్ (వరుణ్ ధవన్)లు కార్లను మోడిఫికేషన్ చేసే గ్యారేజ్ నడుపుతుంటారు. వీర్ తన కార్ లో లిఫ్ట్ తీసుకున్న ఇషిత (కృతిసనన్)తో ప్రేమలో పడతాడు. అయితే తమ ప్రేమకు తన అన్నను ఒప్పించే ప్రయత్నం చేయాలనుకుంటాడు. అదే సమయంలో రాజ్ గతం తెలుస్తుంది. రాజ్(షారుఖ్ ఖాన్).. మీరా(కాజోల్)లు ఇద్దరూ రెండు వేర్వేరు డ్రగ్ మాఫియా కుటుంబాలకు చెందిన వారు. వీరిద్దరు ప్రేమలో పడతారు. తర్వాత వారి కుటుంబాల మధ్య శత్రుత్వం పెరిగి.. వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోతారు. ఆ తర్వాత రాజ్ మాఫియాని వదిలేసి మీరా ఉన్న గోవా ప్రాంతంలోనే కార్ మెకానిక్‌గా స్థిరపడతాడు. 15 ఏళ్ల తర్వాత రాజ్ సోదరుడు వీర్(వరుణ్‌ధావన్).. మీరా సోదరి ఇశిత (కృతి సనన్)లు ప్రేమలో పడతారు. వారిని వెతికే ప్రయత్నంలో రాజ్.. మీరాలు మళ్లీ కలుసుకుంటారు. మరి వీరిద్దరి ప్రేమ ఏమైంది? వారి కుటుంబాల మధ్య ఉన్న శత్రుత్వం పోయిందా? వీర్.. ఇశితల ప్రేమ వ్యవహారం మాటేమిటి? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!
Mobile AppDownload and get updated news