ఆంధ్ర ప్రభుత్వాన్ని కుదిపేసిన కాల్ మనీ కేసును ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే ఆరోపణలు వస్తుండడంతో స్వీయ రక్షణలో పడ్డారు. కాలమనీ సెక్స్ రాకెట్ పై వార్తలు ప్రసారం చేసిన, సేకరించిన, ప్రచురించిన మీడియాకు కూడా నోటీసులు పంపిస్తున్నట్టు చంద్రబాబు సభాముఖంగా చెప్పారు. నిజనిజాలు తెలుసుకునేందుకే ఇలా చేస్తున్నామని, మీడియా వద్ద ఇతర ఆధారాలు ఉంటే సేకరిస్తామని చెప్పారు. అంతేకాకుండా రాజకీయ నాయకులు చాలా మందిగా ఫొటోలు దిగుతారని, వారందరితోనూ సంబంధాలు ఉన్నట్టు కాదని అన్నారు. కాల్ మనీ కి సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న ఆధారాలన్నీ సభ ముందు పెట్టామని, ఇంకేమైనా ఉంటే ప్రతిపక్ష సభ్యులు పెట్టొచ్చని అన్నారు.
Mobile AppDownload and get updated news