ఏపీ శాసన సభ శీతాకాల సమావేశాలు మూడో రోజు కూడా ప్రారంభమయ్యాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం సాగుతోంది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిందన్న కారణంగా వైకాపా సభ్యురాలు రోజాను స్వీకర్ కోడెల శివప్రసాద్ ఏడాది పాటూ అసెంబ్లీకి రాకుండా శుక్రవారం నిషేధం విధించారు. దీనిపై ప్రతిపక్షనాయకుడు జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ తో వాగ్యుద్ధానికి దిగారు. ఏడాది పాటూ సస్పెండ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు. ఏ నిబంధనల ప్రకారం సస్పెండ్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై ఆర్థిక మంత్రి యనమల స్పందించారు. సభకు ఉన్న అధికారాల ప్రకారమే నిర్ణయం తీసుకోవడం జరిగిందని, దీనిని ప్రశ్నించే హక్కు న్యాయస్థానాలకు కూడా లేదని అన్నారు. కాల్ మనీపైనా కూడా మళ్లీ చర్చ సాగింది.
Mobile AppDownload and get updated news