పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం త్వరలో పాలిథిన్ నుండి విముక్తం కాబోతోంది. ఆ రాష్ట్రంలో పాలిథిన్ వాడకంపై నిషేధం విధించే దిశగా సమాజ్ వాదీ పార్టీ శుక్రవారం నాడు నిర్ణయం తీసుకుంది. అయితే ఏ రోజు నుండి పాలిథిన్ పై నిషేధం వర్తిస్తుందో మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఉత్తరప్రదేశ్‌లో పాలిథిన్ వాడకాన్ని నిషేధించాలని గత నెలలో అలహాబాద్ హైకోర్ట్ తీర్పు చెప్పింది. ఈ నెలాఖరు (డిసెంబర్ 31)లోగా పాలిథిన్ పై నిషేధాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వర్తింపచేయాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. యూపీని పర్యావరణ హిత రాష్ట్రంగా రూపొందించే బృహత్తర కార్యక్రమంలో భాగంగా న్యాయస్థానం ఆదేశాల మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా దీనిపై స్వయంగా ప్రకటన చేశారు. పాలిథిన్ వాడకానికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నామన్నారు. శుక్రవారం నాడు జరిగిన యూపీ క్యాబినెట్ బేటీలో పాలిథిన్ నిషేధ నిర్ణయానికి ఆమోదం లభించింది.
Mobile AppDownload and get updated news