Mobile AppDownload and get updated news
ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే.. ఒక్క హిట్ ఇస్తే చాలు.. టాప్ హీరోలైనా సరే..చిన్న, పెద్ద డైరెక్టర్లు అని ఆలోచించకుండా..తమ తర్వాత చిత్రాల కోసం ఆ డైరెక్టర్స్‌పై కర్చీఫ్స్ వేసేస్తున్నారు. మరి ఇలాంటి ట్రెండ్‌లో కూడా సంపత్‌నంది గురించి ఎక్కడా వినబడటం లేదు. వాస్తవానికి రామ్‌చరణ్‌తో చేసిన 'రచ్చ' తర్వాత వచ్చిన ఆఫర్ సామాన్యమైంది కాదు. కానీ బ్యాడ్‌లక్. సంపత్‌కి ఆ ఆఫర్ పోవడానికి కూడా అంతే టైమ్ పట్టింది. అయినా సరే! సంపత్‌నంది కసితో రవితేజలో 'బెంగాల్‌టైగర్' తీసి హిట్టుకొట్టాడు. ఎలాంటి హిట్ అంటే..ఇప్పటి వరకు రవితేజ కెరియర్‌లోనే లేదు అలాంటి హిట్టు. మరి ఇంత హిట్టు ఇచ్చిన..సంపత్‌నందితో సినిమా చేయాలని..ఇండస్ట్రీలోని ఏ హీరో నుండి ఇప్పటి వరకు న్యూస్ రాలేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది అనేది ప్రక్కన పెడితే..'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, రన్ రాజా రన్, కార్తీకేయ, స్వామిరారా..' వంటి చిన్న చిత్రాలు చేసిన డైరెక్టర్స్ కూడా ఆ తర్వాత వెంటనే మంచి మంచి ఛాన్స్‌లు పొందారు. కానీ, సంపత్‌నంది విషయంలో మాత్రం అలా జరగడం లేదు. విషయం ఏమై ఉంటుందో..ఆ సంపత్ నందికే తెలియాలి.