సోమవారం వైకుంఠ ఏకాదశి కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతువన్నాయి. సోమవారం తెల్లవారు జాము నుంచే వైష్ట దేవాలయాలకు భక్తులు బారులుతీరారు. తిరుమల, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, మంగళగిరి, యాదగిరి గుట్ట, వేముల వాడ, అలాగే భద్రాచలం రామయ్య ఆలయాలు సర్వాంగ సుందరంగా సిద్ధమయ్యాయి. ప్రత్యేకపూజలతో కళకళ లాడుతున్నాయి. ముఖ్యంగా తిరుమలలో ఈ రోజు శ్రీవారు వైకుంఠ ద్వారం నుంచి దర్శనమిస్తున్నారు. వేకువ జామున ఒంటిగంటనుంచే ప్రముఖులు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. దాదాపు మూడు కిలోమటర్ల మేర క్యూలైన్లలో భక్తులు వేచియున్నారు.
Mobile AppDownload and get updated news