నిర్భయ నిందితుడు తాను కొన్నాళ్ల పాటూ స్వచ్ఛంద సంస్థ పర్యవేక్షణలోనే ఉండేందుకు ఇష్టపడుతున్నట్టు తెలిపాడు. ఆదివారమే అతనికి విడుదల లభించింది. అయితే ఎక్కడికి వెళ్లాలో తెలియక, బయటికి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడే అతను ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. కాగా శనివారం అతని విడుదలపై స్టే విధించాలని కోరుతూ ఢిల్లీ మహిళా కమిషన్ పిటిషన్ వేసింది. దానిపై సోమవారం ఇద్దరు జడ్జిలతో కూడిన సుప్రీం ధర్మాసనం మహిళా ఢిల్లీ కమిషన్ వాదనను వింటుంది. అతని విడుదలపై వస్తున్న విమర్శలను కమిషన్ నేడు సుప్రీంకు వివరిస్తుంది. అతడు ప్రస్తుతం ఒక స్వచ్ఛంద సంస్థకు చెందిన రీహాబిలిటేషన్ హోంలో ఉన్నాడు. తీర్పుకు అయిదారురోజుల ముందే పోలీసులు అతడిని అక్కడికి తరలించారు. అయితే అతను ఉండే ప్రాంతం, ప్రదేశం మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉంచారు పోలీసులు. ఆ నిందితుడికి హాని జరిగే అవకాశం ఉందనే అనుమానంతోనే వారు ఈ పనిచేశారు. ఢిల్లీ మహిళ కమిషన్ అతని ప్రవర్తన ఇంకా మారలేదని, సమాజానికి హాని చేసే విధంగానే ఉందని వాదిస్తోంది. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టులో నిరూపించి అతని నిర్భంధాన్ని ఇంకా కొనసాగించేలా చేయాలని భావిస్తోంది.
నిర్భయ కేసులో ఇతర నిందితులు...
న్యాయం కోసం పోరాడుతున్న నిర్భయ తల్లిదండ్రులు...
Mobile AppDownload and get updated news