బాబాయ్, అబ్బాయ్ ల సినిమాలు రెండూ సంక్రాంతికే విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. నిన్నటికి నిన్న బాలయ్య డిక్టేటర్ సినిమాన ఆరు నూరైనా సంక్రాంతికి విడుదల చేస్తామని శపథం చేసి మరీ చెప్పారు. ఇక ఎన్టీఆర్ సినిమా 'నాన్నకు ప్రేమతో' సినిమా షూటింగ్ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బాబాయ్- అబ్బాయ్ లే ఒకరికి ఒకరు పోటీగా నిలబడే పరిస్థితన్న మాట. అందుకే అబ్బాయ్ తన సినిమాను వాయిదా వేయాలనుకుంటున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. కాగా ఇలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో జూ.ఎన్టీఆర్ ట్విట్టర్ ఎకౌంట్లో ఒక కామెంట్ కనిపించింది. 'అభిమానులు... నాన్నకు ప్రేమతో ఆడియో, సినిమా విడుదల గురించి అడుగుతున్నారు... ఆ విషయం నాకు తెలుసనుకుంటున్నారా? అసలు ఆ సినిమా ఏమవుతుందో, ఏం జరుగబోతోందా నాకూ తెలియదు' అని పోస్టు కనిపించింది. ఇదేంటీ జూ.ఎన్టీఆర్ ఇలా మాట్లాడుతున్నాడు... నాన్నకు ప్రేమతో సినిమా సవ్యంగా సాగడం లేదా అని అనుమానాలు కలిగాయి చాలా మందికి. అంతేకాదు ఆ కామెంట్ తొలగించడం, మళ్లీ పెట్టడం ఇలా రోజులో చాలా సార్లు అయింది. అప్పుడు అబ్బాయ్ తన ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయిందని,ఆ కామెంట్ కి తనకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించాడు. కాగా ఈ సినిమా రిలీజ్ సంక్రాంతికే ఉంటుందని చిత్రయూనిట్ మళ్లీ చెప్పింది.
![]()
Mobile AppDownload and get updated news