కరీంనగర్లో ఓ సైకో ఉన్మాదిలా ప్రవర్తించాడు. కనిపించిన వారిని కనిపించనట్టు నరకడం మొదలుపెట్టాడు. దీంతో పోలీసులు అతనిపై కాల్పులు జరపాల్సి వచ్చింది. అందిన సమాచారం మేరకు... కరీంనగర్లోని లక్ష్మి నగర్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు బల్విందర్ సింగ్. మంగళవారం ఉదయం ఏమైందో తెలియదు కాని కత్తితో తల్లిదండ్రులపై దాడికి దిగాడు... వారిని తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం ఇంటి నుంచి బయటికి వచ్చి దారిన పోయే వారు, చుట్టుపక్కల ఉండేవారిపై దాడి చేశాడు. కత్తితో, చేతికి దొరికిన రాళ్లతో వారిని దాడి చేసి గాయపరిచాడు. ఇలా దాదాపు 20 మందిని గాయపరిచాడు. వారిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉంది. పట్టుకోవడానికి వచ్చిన పోలీసులను వదిలిపెట్టలేదు. ఓ కానిస్టేబుల్ వేలి నరికేశాడు. చేసేదేమీ లేక పోలీసులు అతని కాళ్లపై కాల్పులు జరిపారు. సైకో నేలపై కుప్పకూలాక, అదుపులోకి తీసుకుని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ సైకో బల్విందర్ సింగ్ మరణించాడు.
Mobile AppDownload and get updated news