Mobile AppDownload and get updated news
తెదేపా ఎమ్మెల్యే అనిత మంగళవారం ఏపీ శాసన సభలో కన్నీరు పెట్టారు. సభలో మాట్లాడుతూ ఎమ్మెల్యే రోజా తనపై చేసిన వ్యాఖ్యల్ని తలచుకున్నారు. రోజా మాట్లాడిన మాటలు తనను చాలా బాధ పెట్టాయని, ఆ బాధతో రెండు రోజులుగా ఇంట్లోనే ఉండిపోయానని అన్నారు. దళితురాలైన తనను అవమానించిన రోజాను సస్పెండ్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. అందుకోసం ఏకంగా సమావేశాలనే బాయ్ కాట్ చేయాలా అని జగన్ ను ఉద్దేశించి అన్నారు. అలాగే మహిళా మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ తనతో కూడా రోజా అమర్యాదగా ప్రవర్తించిందని చెప్పారు. తాను ఒక మహిళే అన్న విషయాన్నే రోజా మరిచిపోయి ప్రవర్తిస్తుందన్నారు. వీరిద్దరి ప్రసంగం విన్నాక బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. రోజా సస్పెన్షన్ తగ్గించాలని ఇంతకుముందు తాను సభాపతిని కోరానని, ఇప్పుడు ఆ మాటల్ని ఉపసంహరించుకుంటున్నానని అన్నారు. తనకు రోజా ఏం మాట్లాడిందో అప్పుడు తెలియదని, అందుకే సస్పెన్షన్ కాలం తగ్గించమని అడిగానని వివరించారు.