భారత క్రికెట్ దిగ్గజాలలో అజారుద్ధీన్ ఒకరని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఆయన పర్సనల్ లవ్ లైఫ్.. రెండు పెళ్లిళ్లు... కూడా అందరికీ సుపరిచితమే. అయితే ఆయన లైఫ్‌లో బయటికితెలియని ఇంకెన్నో విశేషాల్ని ఆయన అభిమానుల ముందుంచేందుకు త్వరలోనే అజారుద్దీన్ బయోపిక్ రెడీ అవబోతోంది. బాలీవుడ్ ఫిలింమేకర్ రూపొందిస్తున్న ఈ సినిమాలో అజార్ మొదటి భార్య, హైదరాబాదీ లేడీ నౌరీన్ పాత్రలో కనిపిస్తున్న బాలీవుడ్ బ్యూటీ ప్రచీ దేశాయ్ ఆనందానికి అంతులేకుండా పోయింది. అజార్-నౌరీన్‌ల అందమైన ప్రేమకథలో నటిస్తున్నాను. నా మొదటి బయోపిక్ కూడా ఇదే. అజార్ గురించి ఎంతో మందికి తెలుసు. కానీ ఆయన మొదటి భార్య నౌరీన్ గురించి తెలిసింది మాత్రం చాలా తక్కువమందికే. నౌరీన్ ఎప్పుడూ అజార్ సపోర్టర్‌గానే వుండిపోయిందే తప్ప ఆమె ఎవరు ఏంటనే విషయాలేవీ ఏనాడు వెలుగుచూడలేదు. ఇప్పుడు నేనామె పాత్ర పోషిస్తున్నాను అని చెప్పి తెగ సంబరపడిపోయింది ప్రచీ. మరి ఇంతకీ నువ్ నౌరీన్‌ని కలిసి మాట్లాడావా లేదా అని మీడియా అడిగిన ప్రశ్నని దాటవేస్తూ... '' నౌరీన్‌ని కలిశానా లేదా అనేది నేను తర్వాత చెబుతాను కానీ మొత్తానికి అజార్, నౌరీన్‌లది ఓ అందమైన ప్రేమకథ అని మాత్రం కచ్చితంగా చెప్పగలను '' అంటూ తెలివిగా తప్పించుకుంది. అంతేకాకుండా హైదరాబాద్‌లో షూటింగ్ జరిగినన్నినాళ్లు ఇక్కడి మనుషులు, సిటీతో తనకెంతో అనుబంధం ఏర్పడింది అంటోంది ప్రచీ దేశాయ్.
Mobile AppDownload and get updated news