తాజా హెచ్చరికలతో ఐరోపా దేశాలు అప్రమత్తమయ్యాయి. ఆయా దేశాల్లోని ప్రధాన నగరాల్లో భద్రతను పెంచాయి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వియన్న పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ఆస్ట్రియా పోలీసులు తెలిపారు. మరోవైపు ఎమర్జెన్సీ కొసాగిస్తున్న ఫ్రాన్స్ లో కూడా మరింత భద్రతను పెంచారు. ఆ దేశ రాజధాని పారిస్ లో ఉగ్రమూకలు దాడులకు తెగబడి 130 మంది అమయాకులను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో ఫ్రాన్స్ యాద్ధ ప్రాతిపదికన తనిఖీలు నిర్వహిస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారత్ కూడా ఉగ్రవాద చర్యలుపై నిఘా పెట్టింది. ప్రధాన పట్టణాల్లో భద్రతను పెంచింది.
Mobile AppDownload and get updated news