సుకుమార్ ఓ పక్క దర్శకుడిగా... మరో పక్క నిర్మాతగా సినిమాలు తీస్తున్నాడు. దర్శకుడిగా పెద్ద హీరోలతో, నిర్మాతగా చిన్న సినిమాలను నిర్మిస్తూ చక్కటి విజయాలను అందుకుంటున్నాడు. అతను నిర్మాతగా వ్యవహరించిన తొలి సినిమా 'కుమారి 21 ఎఫ్' మంచి విజయాన్నే అందుకుంది. ఇప్పుడు రెండో సినిమా కూడా సిద్ధమైపోతోంది. ఆ సినిమాకు మొదట 'డైరెక్టర్' అనే పేరు అనుకున్నారు. అయితే దానిని 'దర్శకుడు' అని మార్చారు. ఈ సినిమాకు నూతన దర్శకుడు పనిచేయబోతున్నట్టు తెలుస్తోంది. సినిమా రంగం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ మీడియాకు తెలియజేస్తుంది.
Mobile AppDownload and get updated news