యంగ్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం 'నేను... శైలజ'. ట్రైలర్ల ద్వారానే ఆ సినిమా మంచి క్రేజీని సంపాదించుకుంది. ఈ సినిమా జనవరి 1 న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కాగా సెన్సార్ బోర్డు నేను... శైలజకు క్లీన్ 'యు' సర్టిఫికెట్ ఇచ్చినట్టు చిత్రయూనిట్ తెలిపింది. సెన్సార్ బోర్టు సభ్యుల అభినందనలు కూడా సినిమా పొందినట్టు యూనిట్ తెలిపింది. కిశోరఱ్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించింది. చిత్రం క్లీన్ 'యు' సర్టిఫికెట్ పొందిన సందర్భంగా 'స్రవంతి' రవికిశోర్ మాట్లాడుతూ చక్కటి కుటుంబపరమైన చిత్రం నేను... శైలజ అని చెప్పారు. ఈ సినిమాలో రామ్ డీజేగా నటించాడని, ఇంతకుముంద అతను చేసిన సినిమాలన్నింటికీ ఈ చిత్రం భిన్నంగా ఉంటుందని తెలిపారు. రామ్ కి తండ్రి సీనియర్ నటుడు సత్యరాజ్ నటించినట్టు తెలిపారు. దేవి శ్రీ ప్రసాద్ పాటలు అందరినీ ఆకట్టుకున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. 2015, జనవరి 1న తమ సంస్థ ద్వారా విడుదలైన 'రఘువరన్ బి.టెక్' కు మంచి విజయం సాధించిందని, ఇప్పుడు 2016 జనవరి 1న విడుదలవుతున్న 'నేను... శైలజ' కూడా అదే స్థాయిలో విజయాన్ని సాధిస్తుందని నమ్మకంతో ఉన్నట్టు తెలిపారు.
Mobile AppDownload and get updated news