కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన 'పటాస్' చక్కటి విజయాన్ని అందుకోగా.. 'షేర్' కథలో బలం లేకపోవడంతో పరాజయాన్ని చవిచూసింది. ఆది నుంచి జయాపజయాలకు అతీతంగా కెరీర్‌ను కొనసాగిస్తున్న కళ్యాణ్‌రామ్ తాజాగా మరో కొత్త సినిమాకి పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. పిల్లా నువ్వ్వులేని జీవితం సినిమాతో గతేడాది సక్సెస్‌ల బాట పట్టిన దర్శకుడు ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్ హీరోగా ఓ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రవికుమార్... గోపీచంద్‌తో సౌఖ్యం మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. కళ్యాణ్‌రామ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో ఓ కథను సిద్ధం చేసుకున్న రవికుమార్, ఇటీవలే అతడికి వినిపించినట్లు తెలిసింది. కథలోని కొత్తదనం నచ్చడంతో నందమూరి హీరో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. 'సౌఖ్యం' తర్వాత సెట్స్‌పైకి వెళ్లనున్నట్లుగా టాక్ వినిపిస్తున్న ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలిసింది.
Mobile AppDownload and get updated news