గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ కు లైడిక్టర్ పరీక్షలు జరపాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) భావిస్తోంది. పఠాన్ కోట ఉదంతంలో ఆయన చర్యలు, మాటలు ఒకదానికి ఒకటి పొంతన లేకపోవడంతో నిజానిజాలు తెలుసుకోవడానికి ఈ నిర్ణయానికి అధికారులు వచ్చారు. పఠాన్ కోట వైమానిక స్థావరంపై దాడికి ముందు డిసెంబర్ 31న తనను ఆరుగురు తీవ్రవాదులు కిడ్నాప్ చేశారని సదరు ఎస్పీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతోపాటు అక్కడి దర్గాకు తాను తరచుగా వెళ్తుంటానని, అదే క్రమంలో ఆ రోజు రాత్రి తన స్నేహితుడితో కలిసి దర్గాకు వెళ్తుండగా తీవ్రవాదులు తనను కిడ్నాప్ చేశారని చెప్పారు. అయితే, ఆయన మాటల్లో నిజం లేదని తరువాత తేలింది. దర్గా నిర్వాహకుడిని ఎన్ఐఏ అధికారులు విచారించారు. తాను సదరు ఎస్పీని తొలిసారి చూసానని, అంతకు ముందు ఆయన ఏనాడు తమ దర్గాకు రాలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీకి బెంగలూరులో లేదా ఢిల్లీలో లైడిటెక్టర్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే దీనికి ఆ ఎస్పీ అనుమతి తీసుకోవాల్సి ఉంది. దానికి సల్వీందర్ సింగ్ ఒప్పుకుంటారో లేదో కరారు కాలేదు.
Mobile AppDownload and get updated news