బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తర్వాతి సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది ఢిల్లీ గాళ్ తాప్సీ. అక్షయ్ కుమార్, రానాలు కలిసి నటించిన బేబీ మూవీలో అండర్ కవర్ ఏజెంట్ రోల్ పోషించిన తాప్సీకి ఆ తర్వాత బాలీవుడ్‌లో ఇంతవరకు ఏ ఆఫర్ రాలేదు అని అనుకుంటుండగానే అమ్మడికి బంపర్ ఆఫర్ తగిలింది. షూజిత్ సర్కార్ నిర్మించనున్న ఈ సినిమాని ప్రముఖ బెంగాలీ దర్శకుడు అనిరుద్ధ రాయ్ చౌదరి తెరకెక్కించనున్నాడు. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఈ మూవీ షూటింగ్ మొత్తం ఢిల్లీలోనే జరగనుంది. ఇదే విషయమై షూజిత్‌ని వివరణ కోరగా.. 'అవును తాప్సీ తన సినిమాలో నటిస్తున్న విషయం నిజమే' అని అంగీకరించారు. బచ్చన్ సాబ్ సినిమాలో ఆఫర్ అందిపుచ్చుకోవడంతో అమ్మడి ఆనందానికి అంతేలేకుండాపోయింది.
Mobile AppDownload and get updated news