తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలకి సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రకటన వెలువడింది. తెలంగాణ ప్రభుత్వం ఈ జాబితాని విడుదల చేయడంతో హైదరాబాద్ కేంద్రంగా జరగనున్న ఎన్నికల పోరుకి ఇక తెర లేచినట్లయింది. ఆయా వార్డుల నుంచి కార్పొరేటర్‌గా బరిలోకి దిగాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఆశావహులంతా సామాజిక, సాంకేతిక అంశాల పరంగా అసలు తమకి పోటీ చేసే అవకాశం వుంటుందా లేదా అని తెలుసుకోవడం కోసం ఎప్పటినుంచి ఈ జాబితా కోసం వేచిచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం వార్డుల రిజర్వేషన్ల వివరాలిలా వున్నాయి.
>ఎస్సీ జనరల్ డివిజన్లు : మొత్తం డివిజన్ల సంఖ్య : 5 1, 4, 62, 133, 135
>ఎస్సీ మహిళా డివిజన్లు : మొత్తం డివిజన్ల సంఖ్య : 5 60, 90, 142, 144, 147
>బీసీ జనరల్ డివిజన్లు : మొత్తం డివిజన్ల సంఖ్య : 25 3,29,39,43,48,51,52,53,54,55,56,58,64,65,69,70,71,83,88,103,112,113, 125,126 & 127
>బీసీ మహిళా డివిజన్లు : మొత్తం డివిజన్ల సంఖ్య : 25 9,26,34,35,37,41,42,47,49,57,61,63,67,68,72,73,74,75,76,82,86,101, 128,146 & 148
Mobile AppDownload and get updated news