యంగ్‌టైగర్ ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్‌లో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న 'నాన్నకు ప్రేమతో..' చిత్రం జనవరి 13న సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అవనుంది. ఈమేరకు చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఓ అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ - ''యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత కాస్ట్‌లియెస్ట్ చిత్రంగా రూపొందిన 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని జనవరి 13న సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఆడియో ఇప్పటికే చాలా పెద్ద హిట్ అయింది. అన్ని ఏరియాల నుంచి ఆడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అన్నీ సూపర్ హిట్ పాటలు కంపోజ్ చేశారు. ఎన్టీఆర్, సుకుమార్ ఫస్ట్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం మా బేనర్‌లో మరో సూపర్ హిట్ మూవీ అవుతుంది'' అని అన్నారు. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సరసన రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్ తదితరులు నటిస్తున్నారు.
Mobile AppDownload and get updated news