కాంగ్రెస్ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. శనివారం విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన రఘువీరారెడ్డిని మల్లాది విష్ణు అనుచరులు అడ్డుకున్నారు. తమ నేతను అన్యాయంగా మద్యం కేసులో ఇరికిస్తే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. దీంతో పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి కల్తీ మద్యం కేసుపై రఘువీరా స్పందించారు. తమ పార్టీ నేత మల్లాది విష్ణుకు కల్తీ మద్యం కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు. మద్యంలో టీడీపీ వారే కల్తీ కలిపారని ఆయన ఆరోపించారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మల్లాది విష్ణును ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కల్తీ మద్యం కేసుకు సంబంధించిన వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలపై కక్ష సాధింపు చర్యలు ఆపకపోతే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రభుత్వానికి హెచ్చరించారు.
Mobile AppDownload and get updated news