గొడ్డు మాంసాన్ని నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లపై బొంబాయి హైకోర్ట్ విచారణ పూర్తిచేసింది. తన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ అంశంపై కోర్టులో విచారణ సందర్భంగా పిటీషనర్లకు ప్రభుత్వం తరఫు వారికి తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. మహారాష్ట్ర జంతువుల సంరక్షణ (సవరణ) చట్టానికి గత ఏడాది మార్చినెలలో ఆమోదం తెలిపారు. దాని కింద ఆవులను, ఎద్దులను వధించడాన్ని నేరంగా పరిగణిస్తారు. గోవధకు పాల్పడిన వారికి ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.10వేల వరకు జరిమానా విధిస్తారు. ఈ చట్టం కింద గోమాంసం లేదా ఎద్దు మాంసాన్ని ఇంట్లో ఉంచుకున్నా నేరంగానే పరిగణిస్తారు. వేరే రాష్ట్రంలో వధించిన గోమాంసాన్ని తెచ్చుకున్నా నేరమే. దీనికి కూడా పెద్ద ఎత్తున జరిమానా ఉంటుంది. అధికారులు తలచుకుంటే జైలు శిక్షకు సంబంధించిన సెక్షన్లను కూడా సదరు నిందితులపై నమోదు చేయగలరు.
Mobile AppDownload and get updated news