Mobile AppDownload and get updated news
కూతురుకి వివాహమైనా కూడా... తండ్రి కి చెందిన ఆర్థికప్రయోజనాల్లో ఆమెకు అర్హత ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాల ప్రకారం... టీటీడీ ఉద్యోగి ఒకరు గతనెలలో మరణించారు. అతన్ని ఉద్యోగం కొడుకు చంద్రశేఖర్ ఇచ్చారు. అలాగే మరణానంతరం వచ్చే ఆర్థిక ప్రయోజనాల కోసం కుటుంబీకులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ ప్రయోజనాల్ని టీటీడీ అయిదు భాగాలుగా చేసి ఉద్యోగి కొడుక్కి, తల్లికి, తండ్రికి, భార్యకి, కుమార్తెకి పంచింది. కుమార్తెకి కూడా పంచడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. తన సోదరికి 2000లోనే పెళ్లయి వెళ్లిపోయిందని, ఆమెకి వాటా ఇవ్వాల్సిన అవసరం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. అలాగే నామినీగా చనిపోయిన ఉద్యోగి తన భార్య పేరును రాశారని పేర్కొన్నారు. అయితే హైకోర్టు నామినీ వ్యక్తికి పూర్తి ఆర్థికప్రయోజనాలు దక్కవని చెప్పింది. ఈ విషయంలో సుప్రీం కోర్టు ఓసారి ఇచ్చిన తీర్పును ఉదాహరణగా చెప్పింది. కూతురు వివాహిత అయినప్పటికీ తండ్రి మరణానంతరం వచ్చే ఆర్థిక ప్రయోజనాలు ఆమెకు కూడా చెందుతాయని స్పష్టంగా చెప్పింది.