సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. అంటే సూర్యుడు మొత్తం పన్నెండు రాశుల్లో వరుసగా ఒక్కో రాశిలోకి మారుతూ ఉంటాడు. అతడు మకరరాశిలోకి మారగానే వచ్చేదే మకర సంక్రాంతి. తెలుగువారి పెద్ద పండుగ. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణ పథంలో ప్రవేశిస్తాడు. ఆ రోజున స్వర్గ ద్వారాలు తెరిచే ఉంటాయని పెద్దలు చెబుతారు. ఉత్తరాయణంలో సంక్రాంతి రోజును పుణ్యదినంగా భావిస్తారు. ఆ రోజు దానాలు చేస్తే చాలా మంచిదని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ధాన్యం, ఫలాలు, విసనకర్ర, బట్టలు, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకులు మొదలైన వాటిని దానం చేస్తే బోలెడం పుణ్యం మూటగట్టుకోవచ్చు. ఇక గోవును దానం చేస్తే స్వర్గ వాసమే లభిస్తుందట.
Mobile AppDownload and get updated news