చెట్టు కొమ్మకు చిక్కుకున్న గాలిపటాన్ని దించబోయిన పదేళ్ల బాలుడు విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. రామంతపూర్లోని గోఖలేనగర్లో ఈ దుర్ఘటన జరిగింది. గంగాధర్ అనే వడ్రంగి కుమారుడైన పదేళ్ల రవికుమార్ గాలి పటాన్ని ఎగురవేస్తున్న సమయంలో అది ఒక చెట్టుకొమ్మకు చిక్కుకుంది. దాని కొమ్మలు విద్యుత్ తీగలకు తగులుతుంటాయి. అది తెలియని రవికుమార్ చెట్టుపైకి ఎక్కి గాలిపటాన్ని తీయబోయాడు. ఆ ప్రయత్నంలో భాగంగా విద్యుత్ తీగలకు దగ్గరగా వెళ్లడంతో విద్యుత్ షాక్ తగిలి కిందపడిపోయాడు. వెంటనే ఆ బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఉప్పల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Mobile AppDownload and get updated news