Mobile AppDownload and get updated news
సంక్రాంతికి అతి కష్టమ్మీద జనాలంతా సొంత ఊళ్లకు చేరారు. మరి రావడం? బస్సులు, రైళ్లు అన్నీ నిండుకుండల్లా నిండుతున్నాయి. చిన్నపిల్లల ఉన్న వాళ్ల పరిస్థితి మరీ అధ్వానం. అందుకే ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రత్యేక బస్సులు, రైళ్లను రెండు రోజుల పాటూ వేసింది. 1. కాకినాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లేందుకు 07076 నెంబర్ ఉన్న రైలు 17న కాకినాడలో సాయంత్రం 4.45కి ప్రారంభమవుతుంది. 2. తిరుపతి నుంచి కాకినాడ వెళ్లే 07432 నెంబరు గల ట్రైన్ తిరుపతిలో 16 సాయంత్రం 7 గంటలకు బయలుదేరుతుంది. 3. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే 07208 నెంబరు గల రైలు 18 ఉదయం ఆరున్నరకి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ వెళుతుంది. 4. సికింద్రాబాద్ నుంచి కాకినాడ వెళ్లే 07011 నెంబరు గల ట్రైన్ 17 సాయంత్రం 7.15కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. 5. కాకినాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే 07054 నెంబరు గల రైలు 17 సాయంత్రం 5.45కి కాకినాడ నుంచి బయలుదేరుతుంది. 6. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే 02764 రైలు 18 రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బయలుదేరుతుంది. 7. అలాగే విశాఖ పట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే 08577/08578 అనే రైలు 17,18 తేదీల్లో విశాఖ నుంచి 4.45కి బయలుదేరుతుంది. తిరిగి 18,19 తేదీల్లో సాయంత్రం 5.25 కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి విశాఖ వెళుతుంది.