కార్పోరేట్ పన్ను విధానాన్ని మరింత సరళతరం చేస్తామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. శనివారం ప్రారంభించిన స్టార్టప్ ఇండియా - స్టాండప్ ఇండియా కార్యక్రమంలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పరిశ్రమలు ఏర్పాటుకు అనువైన వాతావరణం ఏర్పాటు చేసే దిశగా ఎన్డీయే ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో స్టార్టప్ ఇండియా-స్టాండప్ ఇండియా పథకాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. కాలం చెల్లిన పాత పన్ను విధానాలకు స్వస్తి చెప్పి పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఏర్పాటు దిశగా కొత్త పన్ను విధానం అమలు చేయనున్నట్లు జైట్లీ వివరించారు. కొత్త పన్ను విధానం వ్యాపారవేత్తలకు లాభదాయకంగా ఉంటుందన్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత కొత్త పన్ను విధానాన్ని ప్రకటిస్తామన్నారు.
Mobile AppDownload and get updated news