ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి ఆదివారం ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆడ్-ఈవెన్ కారు ఫార్ములా సక్సెస్ అయిందని పేర్కొంటూ ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన థాంక్స్ గివింగ్ సెలబ్రేషన్స్‌లో కేజ్రీవాల్‌పై ఇంకుజల్లి తన అసంతృప్తి వెళ్లగక్కారు ఓ మహిళ. వేదికపై మాట్లాడుతున్న కేజ్రీవాల్ వద్దకెళ్లిన ఓ మహిళ చుట్టూ వున్న భద్రతా సిబ్బంది తేరుకుని అడ్డుకునేలోపే ఆయన ముఖంపై ఇంకుని వెదజల్లారు. అది చూసిన భద్రతా సిబ్బంది ఆమెని అక్కడి నుంచి ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. తనపై ఇంకుతో దాడికి పాల్పడిన మహిళని భద్రతా సిబ్బంది అడ్డుకోవడం గమనించిన సీఎం కేజ్రీవాల్.. సున్నితంగానే వారిని వద్దని వారించారు. ఢిల్లీలో ఎప్పుడు ఏ మంచి పని తలపెట్టినా ఇలాగే జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు కేజ్రీవాల్.
Mobile AppDownload and get updated news