తాగుబోతు భర్త పోరు భరింలేకపోయింది..ఎలాగైనా కసాయి భర్త పీడవిరుగుడు చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది ఆ భార్య. సమయం కోసం వేచి చూసిన ఆమె ఓ రోజు వెదురు కర్రతో కొట్టే చంపేసింది. పశ్చిమ బెంగాల్ లోని మిడ్నాపూర్ జిల్లా దస్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశీర గ్రామంలో ఘటన చోటు చేసుకుంది.
ఆది, సోమ అని రోజులతో సంబంధం లేకండా ప్రతి రోజు తాగడం..భార్యను చితకబాదడం దినచర్యగా పెట్టుకున్నాడు ఆ కసాయి భర్త మణింశంకర్. కుట్టుపని చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న భార్య దగ్గర తాగడానికి డబ్బులు అడిగే వాడు...ఇచ్చేందుకు నిరాకరిస్తే చావగొట్టేవాడు..ఇక వేధింపులు భరింలేక భార్య దీనా ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. చట్టుపక్కల వాళ్లు కూడా ఆమెను భర్త మణిశంకర్ చాలా వేధించే వాడని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా మణిశంకర్ ను కొట్టిచంపినందుకు వదినపై కేసు పెట్టాడు మృతుడి సోదరుడు. దీంతో దీనాపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు . భార్య కొట్టిన దెబ్బల వల్ల మణిశంకర్ మృతి చెందాడా (లేదా) అతిగా తాగి చనిపోయాడా అనే విషయం విచారణలో తేలాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
స్థానికుల సమచారం ప్రకారం మృతుడు గతంలో ఢిల్లీలో వంటమనిషిగా పనిచేసే వాడు. తాగుడు అలవాటుకు బానిసగా మారి అక్కడ దొంగతనం చేయడంతో ఆ ఇంటి యజమాని చితకబాధి అతన్ని బయటికి గెంటేశాడు. దీంతో ఇక చేసేది ఏమీ లేక తను సొంత గ్రామానికి వచ్చి జూలాయిగా తిరిగే వాడని తెలిసింది. మతుడికి 10 ఏళ్ల కుమారుడు ఉన్న ట్లు పోలీసులు వెల్లడించారు
Mobile AppDownload and get updated news