దీపికా పదుకుణే, రణ్‌వీర్ సింగ్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'బాజీరావ్ మస్తానీ'. డిసెంబర్ 18న విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీనిని ఇటీవలే యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కుటుంబంతో కలిసి చూశారు. ఆ సినిమాకు అభిమానులై పోయి, చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు ఉత్తర ప్రదేశ్ లో బాజీరావ్ మస్తానీ సినిమాకి పన్ను మినహాయింపును ఇచ్చారు. విడుదలై నెల రోజులైన ఈ సినిమా ఇప్పటికి 350 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇందులో నటనకు గాను రణ్ వీర్ సింగ్ ఫిల్మ్ ఫేర్ ఉత్తమనటుడి అవార్డును అందుకున్నాడు.
Mobile AppDownload and get updated news