Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85958

''సీతమ్మ అందాలు..'' సెన్సార్ రిపోర్ట్

$
0
0

ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను పూర్తిచేసుకుని క్రేజీస్టార్‌గా మారిన యువ హీరో రాజ్‌తరుణ్ నటిస్తున్న మరో క్రేజీ చిత్రం 'సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు'. శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీమతి పూర్ణిమ ఎస్‌ బాబు సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ 'ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సున్నితమైన భావోద్వేగాలకుతోడు వినోదానికి పెద్ద పీటవేశాం. రాజ్‌తరుణ్ పాత్ర సరికొత్తగా వుంటుంది. ఈ చిత్రంతో అర్తన అనే నూతన హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతుంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలకు చక్కటి స్పందన వస్తోంది. కాగా ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ సభ్యులను అభినందించి క్లీన్ 'యు' సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ నెల 29న విడుదల కానున్న ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది' అని అన్నారు. రాజ్‌తరుణ్, అర్తన, రణధీర్, రాజా రవీంద్రలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని శ్రీనివాస్ గవిరెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85958

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>