హరిద్వార్లో జరిగే అర్థకుంభమేళాలో అలజడి సృష్టించేందుకు తీవ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు చేదించారు. కుంభమేళా సందర్భంగా దేశం నలుమూలల నుండి లక్షలాది భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో బాంబులను పేల్చితే పెద్ద ఎత్తున ప్రాణహాని కలుగుతుందని అందుకే వారు ఈ విధ్వంసం కోసం పన్నాగం పన్నారు అని హరిద్వార్ స్పెషల్ పోలీస్ కమిషనర్ అరవింద్ దీప్ తెలిపారు. ఈ పన్నాగానికి పాల్పడినట్లుగా భావిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మంగళూరు శివార్లలోని ఒక ఇంట్లో వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితులను 14 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.
Mobile AppDownload and get updated news