2014 లోక్ సభ ఎన్నికల్లో నరేంద్రమోడీ ఆధ్వర్యంలో బీజేపీ ఓట్లను ఊడ్చేసిన సమయంలో ఇంటర్నెట్ అంతటా ఒక ఫోటో హల్ చల్ చేసింది. బహుశా అది మోడీ అంటే చెవికోసుకునే అనుయాయుల పనో మరెవరి పనో కానీ, 1988 నాళ్లలో తీసిన ఫోటో అని చెపుతున్నట్లుగా ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో బాగా పాప్యులర్ అయింది. ఆ ఫోటోలో చీపురు పట్టుకుని నిక్కరు తొడుక్కుని ఎంతో వినయంగా నేలను ఊడుస్తున్న భంగిమలో మోడీ ఉన్నారు. ఆ ఫోటోను నెట్లో పెట్టడం ద్వారా మోడీ గత జీవితం ఎంత కష్టాలమయమో.. ఎన్ని ఒడిదుడుకులను తట్టుకుని ఆయన నేడు ప్రధాని స్థాయికి చేరారో చెప్పేందుకు ప్రయత్నించారు. అప్పట్లో నేలను ఊడ్చిన వ్యక్తి ఇప్పుడు ప్రతి పక్షాల ఓట్లను ఊడ్చేశారని దాని సారాంశం. అయితే, ఆ ఫోటోపై అప్పట్లోనే నెటిజన్లు అనుమానాలు వెలిబుచ్చారు. చివరకు అహమ్మదాబాదుకు చెందిన ఆర్టీఐ కార్యకర్త అసలు ఆ ఫోటో నిజమైనదా లేక ఫేకా అని పరిశోధన ప్రారంభించారు. చివరకు ఆ ఫోటో నకిలీ దని ఆయన తేల్చారు. వేరే వ్యక్తికి చెందిన ఆ ఫోటోను మార్ఫింగ్ చేసి తలను మార్చి మోడీ తలను అతికించారు. ఆ వ్యక్తి ఫోటో ఇది.
Mobile AppDownload and get updated news