దర్శకుడు అనే ఛట్రంలో ఇరుక్కున్న తాను అందులోంచి బయటికి రావాలి అని అనుకుంటున్నాడట సుకుమార్. ముఖ్యంగా తన ఆలోచనలకి తగిన విధంగా కథలు రాసుకోవడమే తనకి బాగా ఇష్టమని చెబుతున్న సుక్కు.. ఆ కథలని తన అసిస్టెంట్లే బాగా డైరెక్ట్ చేయగలరని అంటున్నాడు. పూర్తిగా రాసుకున్న స్క్రిప్ట్‌కన్నా.. షూటింగ్ సమయంలో చేతిలో వున్న స్క్రిప్ట్‌కి మార్పులుచేర్పులు చేసుకుపోతుండటం వల్ల ఒక్కోసారి అవి బాగా టైమ్ తీసుకుంటున్నాయి. ఇంకొన్నిసార్లు బడ్జెట్ లెక్కకు మించిపోతోంది. వీటన్నింటికితోడు నిరంతరం ఆలోచించడం కారణంగా తాను తన కుటుంబంతో అంతగా సమయం కేటాయించలేకపోతున్నాను. అందుకే ఇకపై డైరెక్షన్ చేయడం మానేద్దామనుకుంటున్నాను అని చెబుతున్నాడు సుకుమార్. పరిస్థితి చూస్తోంటే, ఇటీవలే 'కుమారి 21 F' అనే సినిమాతో నిర్మాతగా అవతారమెత్తిన సుకుమార్ ఇకపై కథలు రాసుకుంటూ వాటిని నిర్మించే బాధ్యతని తీసుకోవాలని భావిస్తున్నట్టు అనిపిస్తోంది. ఇకపై మెగా ఫోన్ పక్కకుపెట్టి పూర్తిగా పెన్ను పట్టుకుంటాడా లేక మనసు మార్చుకుని మళ్లీ డైరెక్టర్ హ్యాట్ పెట్టుకుంటాడా వేచిచూడాల్సిందే మరి!!
Mobile AppDownload and get updated news