కేరళలోని కొచ్చి నగరంలో నిర్మించిన మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయి. దాదాపు 6 వేల కోట్లతో 25 కిలోమీటర్ల పొడవున కొచ్చి మెట్రో రైల్వే వ్యవస్థను నిర్మించారు. ఆలువా నుండి పెట్టా వరకు మొత్తం 22 స్టేషన్లు మెట్రోకోసం ఏర్పాటుచేసారు. దీనికి సంబంధించిన ప్రయోగాత్మక పరుగును శనివారం నాడు విజయవంతంగా నడిపారు. కేరళ సీఎం ఊమెన్ చాందీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో కార్పోరేషన్ దీన్ని నిర్మించింది. ఈ సందర్భంగా ఊమెన్ చాందీ మాట్లాడుతూ రికార్డు స్థాయిలో ఈ ప్రాజెక్టును అతి త్వరిత గతిన పూర్తిచేయగలిగామన్నారు. ఇంత త్వరగా పూర్తయినందుకు ఈ ప్రాజెక్టు రికార్డుల పుస్తకంలోకి ఎక్కాలని ఆకాంక్షించారు. కేరళ ఆవిర్భావ దినోత్సవమైన నవంబర్ ఒకటో తేదీన మెట్రోను కేరళ వాసులకు అంకితమిస్తామని ప్రకటించారు. అన్ని వర్గాల సహకారం వల్లే ఈ ప్రాజెక్ట్ దిగ్విజయంగా ప్రారంభమైందన్నారు.
Mobile AppDownload and get updated news