దర్శకధీరుడు రాజమౌళిని ఇక 'పద్మశ్రీ రాజమౌళి' అని పిలవాలి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ఎవరెస్టు ఎక్కించిన జక్కన్న తనకి పద్మశ్రీ రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ పురస్కారానికి తాను అర్హుడిని కానంటూ వ్యాఖ్యానించారు. అసలు తన పేరు పంపినట్టు కూడా తెలియదని అంటున్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన మరిన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. ఆయన పోస్టు చేసిన ట్వీట్లను బట్టి గతేడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు తన పేరును పంపుతామని అనుమతి అడిగింది. దానికి రాజమౌళి ఒప్పుకోలేదు. ప్రభుత్వం చాలా ఒత్తిడి తెచ్చినప్పటికీ ఆయన ఒప్పుకోలేదు. దీంతో తన ప్రయత్నాన్ని విరమించుకుంది ఏపీ ప్రభుత్వం. అయితే మరి ఈ పద్మశ్రీ అవార్డుకు ఎలా వచ్చిందా అని చూస్తే, కర్ణాటక ప్రభుత్వం నా పేరును సిఫారసు చేసింది. నేను కర్ణాటకలో పుట్టాను, ఆంధ్రలో చదువుకున్నాను, తమిళనాడులో పనిచేశాను, తెలంగాణాలో సెటిలయ్యాను. అన్ని రాష్ట్రాలకు బిడ్డనవడం ఆనందంగా ఉంది.
![]()
Mobile AppDownload and get updated news