టి-20: ఆడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ ఉంచిన 188 పరుగుల భారీ టార్గెట్ చేధించే క్రమంలో ఆసీస్ బ్యాట్స్ మెన్లు బోల్తా పడ్డారు. ఫలితంగా 19.3 ఓటర్లకు 151 పరగులు మాత్రమే చేసి ఆసీస్ ఆలౌటైంది. దీంతో టీమిండియా 37 పరుగుల తేడాతో మ్యాచ్ నెగ్గింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లకు 188 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (90) పరుగుల వరద పారిచడం..మిగిలిన బాట్స్ మెన్లు తమ వంత సహకారాన్ని అందించడంతో ఈ స్కోర్ సాధ్యపడింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కంగారులు తొలుత ధాటిగానే ఆడారు. వార్నర్ (17) ఔట్ తో కంగారులు నెమ్మదించారు. రన్ రేట్ పెరుగుతుండంతో ఒత్తిడికి లోనై వికెట్లు చేజార్చుకున్నారు. ఆసీస్ తరుఫున ఫించ్ ఒక్కడే (44) కాస్త పర్వాలేదని పించాడు. ఇలా ఆసీస్ పతనం ప్రారంభమై అంతిమంగా లక్ష్యానికి 37 పరుగుల దూరంలో ఉండి ఆలౌటైంది. దీంతో టీమిండియా ఖాతాలో ఓ విజయం వచ్చిపడినట్లయింది. టీమిండియా తరఫున బర్మా 3 వికెట్లు తీయగా.. అశ్విన్ , జడాజా , పాండ్యా లు తలో రెండు వికెట్లు తీసి రాణించారు.
Mobile AppDownload and get updated news