ఎయిరిండియా, జెట్ ఎయిర్ వేస్ విమాన సర్వీసులకు బుధవారం నాడు తీవ్ర ఆటంకం ఎదురైంది. ఆ విమానాల్లో బాంబులున్నాయంటూ ఆగంతకులు ఢిల్లీ విమానాశ్రయ అధికారులకు ఫోన్ చేయడంతో సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుండి నేపాల్ రాజధాని కట్మండూకు వెళ్లాల్సిన రెండు విమానాలు ఆలస్యమయ్యాయి. ఎయిర్ పోర్టుల శాఖ డిప్యూటీ కమిషనర్ కు టర్కీ నుండి ఈ మధ్యాహ్నం ఫోన్ కాల్ వచ్చింది. సదరు విమానాల్లో బాంబులు పెట్టామని ఆ ఫోన్ కాల్ సారాంశం. ఫోన్ కాల్ తో ఉరుకులు పరుగులు తీసిన బాంబు నిర్వీర్యదళ సిబ్బంది ముమ్మర శోధనలు జరిపిన మీదట వాటిల్లో ఏ బాంబులు లేవని తేల్చారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా వచ్చిన ఆ బెదిరింపు కాల్ ఎక్కడి నుండి వచ్చిందో పోలీసులు గుర్తించలేకపోయారు.
Mobile AppDownload and get updated news