మృత్యువు ఏ క్షణం ఎలా ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు. ఈ వీడియో చూస్తే ఎవరికైనా ఇది తెలియకమానదు. ముంబయి బోరివలీ స్టేషనులో బుధవారం కన్నుమూసి తెరిచేలోగా ఒక మహిళ ప్రాణాలను కోల్పోయింది. కదులుతున్న రైలులోనుండి దిగబోయిన 55 ఏళ్ల మహిళ, పట్టు తప్పి అందరూ చూస్తుండగానే రైలు బోగీల మధ్యలోకి జారి, పట్టాలపై నుజ్జు నుజ్జు అయిపోయింది. ఇదంతా కేవలం క్షణాల్లోనే జరిగిబోయింది. కళ్ల ముందే ఒక మహిళ రైలు కిందకు జారి చనిపోవడాన్ని నిస్సహాయంగా ఆమె బంధువులు, తోటి ప్రయాణికులు చూస్తుండిపోవడం మినహా ఏమీ చేయలేకపోయారు. ఈ ఘటన చూపరులను కంట తడిపెట్టించింది. స్టేషనులోని సీసీటీవీ కెమేరాల్లో మొత్తం రికార్డయ్యింది.
Mobile AppDownload and get updated news