Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all 86069 articles
Browse latest View live

జూనియర్‌ ఎన్టీఆర్‌ కొత్త అవతారం.. ఆర్‌ఆర్‌ఆర్‌ కన్నా ముందేనా?

$
0
0
యంగ్ టైగర్‌ మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ప్రస్తుతం హీరోగా ఫుల్‌ ఫాంలో ఉన్న ఈ స్టార్‌ హీరో త్వరలో కొత్త బాధ్యతలు తలకెత్తుకునేందుకు సిద్ధమవుతున్నాడు. అధికారికంగా ప్రకటించకపోయినా త్వరలోనే ఎన్టీఆర్‌ అభిమానులకు బిగ్‌ న్యూస్‌ చెప్పనున్నాడన్న టాక్‌ బలంగా వినిపిస్తోంది. అదేంటంటే ఎన్టీఆర్ కూడా త్వరలో నిర్మాతగా మారుతున్నాడట. ఇప్పటికే ఈ జనరేషన్‌ హీరోలు మహేష్ బాబు, పవన్‌ కళ్యాణ్‌, రామ్‌ చరణ్‌, నితిన్‌ లాంటి హీరోలతో పాటు మరికొంత మంది యంగ్‌ హీరోలు నిర్మాతలుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అదే బాటలో ఎన్టీఆర్‌ కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. Also Read: ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుంచి రామకృష్ణ సినీ స్టూడియోస్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లు ఉన్నాయి. తాజాగా బాలకృష్ణ కూడా ఎన్బీకే ఫిలింస్‌ బ్యానర్‌ను స్థాపించి ఎన్టీఆర్‌ బయోపిక్‌ను రెండు భాగాలుగా స్వయంగా నిర్మించాడు. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి నాలుగో నిర్మాణ సంస్థగా ఎన్టీఆర్‌ సొంత నిర్మాణ సంస్థ ప్రారంభం కానుంది. Also Read: అయితే ఈ బ్యానర్‌లో వరుస సినిమాలు చిత్రీకరిస్తారా లేక.. కేవలం ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ విషయంపై తన సన్నిహితులతో ఎన్టీఆర్‌ చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై తారక్‌ ఓ నిర్ణయం తీసుకొని అభిమానులకు స్వయంగా తెలుపనున్నాడు. అయితే ఆ నిర్ణయం ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా రిలీజ్‌ కన్నా ముందే ఉండవచ్చన్న టాక్‌ కూడా వినిపిస్తోంది ఇక సినిమాల విషయానికివస్తే... ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్‌ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ మరో హీరోగా నటిస్తున్నాడు. చరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ తెలంగాణ సాయుధపోరాట యోధుడు కొమరం భీం పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 జూలై నెలాఖరున రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Also Read:

బంగారం విషయంలో వివాదం.. పెద్దమ్మను ట్రాక్టర్‌తో తొక్కించి దారుణహత్య

$
0
0
బంగారు నగల విషయంలో వచ్చిన వివాదాలతో ఓ యువకుడు సొంత పెద్దమ్మనే కిరాతకంగా చంపేసిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. తాకట్టు కోసం తీసుకున్న బంగారు నగలను ఎప్పుడిస్తావని అడిగిన పెద్దమ్మను ట్రాక్టర్‌తో తొక్కించి ప్రాణాలు తీశాడు. చెల్లెలి కుమారుడే కదా అని అవసరానికి సాయం చేసిన ఆ మహిళ తన ప్రాణాలే కోల్పోయింది. Also Read: గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో డేగల సుబ్బమ్మ(55) అనే మహిళ కుటుంబంతో కలిసి జీవిస్తోంది. ఆమెకు పొరుగు గ్రామమైన మోరవాగుపాలెంలో నివసించే పగడం రాజశేఖర్‌రెడ్డి స్వయానా చెల్లెలి కుమారుడు. గతంలో తనకు డబ్బు అవసరం ఉందని అడగ్గా సుబ్బమ్మ తన 16 సవర్ల బంగారు ఆభరణాలను ఇచ్చింది. వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టిన రాజశేఖర్‌రెడ్డి ఇటీవల విడిపించి తన వద్దే ఉంచుకున్నాడు. Also Read: ఈ విషయం తెలుసుకున్న సుబ్బమ్మ శనివారం తనఇంటి ముందుగా ట్రాక్టరుపై వెళ్తున్న రాజశేఖర్‌రెడ్డిని ఆపింది. తన బంగారు నగలు తిరిగివ్వాలని కోరగా అతడు ఇవ్వనని తెగేసి చెప్పాడు. దీంతో తన ఆభరణాలు ఇచ్చే వరకు వెళ్లనివ్వనని సుబ్బమ్మ ట్రాక్టర్‌కు ఎదురుగా కూర్చుంది. కోపంతో రగిలిపోయిన రాజశేఖర్‌రెడ్డి ట్రాక్టర్‌ను ఆమెపై నుంచి నడిపాడు. తీవ్రగాయాలతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటనతో విస్తుబోయిన స్థానికులు నిందితుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. Also Read:

వరకట్న వేధింపులు.. పెళ్లయిన ఆర్నెల్లకే రాలిపోయిన ‘దివ్య’

$
0
0
వరకట్న వేధింపులకు మరో మహిళ ప్రాణాలు తీసుకుంది. అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, అత్తమామలు పెట్టే చిత్రహింసలకు తట్టుకోలేక పెళ్లయిన ఆరు నెలలకే ఆత్మహత్య చేసుకుని కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. విశాఖ జిల్లా మునగపాకకు చెందిన పెంటకోట సన్యాసిరావు ముంచంగిపుట్ట మండల వ్యవసాయ విస్తరణాధికారిగా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె దివ్య(22) అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ పూర్తిచేసింది. Also Read: దివ్యకు అనకాపల్లి గవరపాలెంకు చెందిన బుద్ధ చైతన్య అనే యువకుడితో మే 18వ తేదీన ఘనంగా వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.4లక్షల కట్నం, 12తులాల బంగారంతో పాటు మరో లక్ష రూపాయల విలువైన సారె అందజేశారు. అయితే పెళ్లయిన నెలరోజులకే దివ్యకు అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధింపులు మొదలయ్యాయి. భర్త, అత్త, ఇద్దరు ఆడపడుచులు ఆమె తీవ్రంగా వేధించారు. ఈ క్రమంలోనే పది రోజుల కిత్రం భర్త దివ్యను కొట్టి పుట్టింటికి పంపేశాడు. Also Read: అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటున్న దివ్య డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగేసింది. ఈ విషయాన్ని గమనించిన తల్లి పూర్ణ కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. ఆమెను కారులో హుటాహుటిన అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో దివ్య ప్రాణాలు కోల్పోయింది. తమ కుమార్తె మృతికి అత్తింటి వారే కారణమని ఆమె తండ్రి సన్యాసిరావు ఫిర్యాదు చేశారు. అనకాపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెళ్లైన ఆరుమాసాలకే కుమార్తె మృతి చెందడం పట్ల ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. Also Read:

మహేష్ బాబు బాలీవుడ్‌ ఎంట్రీ కన్‌ఫర్మ్‌.. దర్శకుడెవరంటే?

$
0
0
టాలీవుడ్‌ సూపర్‌ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్‌ ఎంట్రీపై చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కొంతమంది దర్శక నిర్మాతలు మహేష్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసేందుకు ప్రయత్నాలు చేసినా అప్పట్లో మహేష్‌ ఆ ప్రతిపాదనలు తిరస్కరించాడు. అయితే ఇటీవల సౌత్‌లో పాన్‌ ఇండియా సినిమాల హవా కనిపిస్తుండటంతో మహేష్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ కూడా ఓ పాన్‌ ఇండియా సినిమా చేయాలని భావిస్తున్నాడట. గతంలో స్పైడర్‌ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించిన మహేష్‌ ఇప్పుడు దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా ప్రారంభమైనట్టుగా ప్రచారం జరుగుతోంది. Also Read: ఇటీవల కన్నడలో సూపర్‌ హిట్ అయిన భారీ చిత్రం కేజీఎఫ్ (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌). యష్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రశాంత్‌ నీల్ దర్శకుడు. ఈ సినిమాతో ప్రశాంత్‌ నీల్‌కు జాతీయ స్థాయిలో ఇమేజ్‌ వచ్చింది. దీంతో తెలుగు హీరోలు కూడా ప్రశాంత్‌తో చర్చలు జరిపారు. స్టార్‌ హీరోలు మహేష్ బాబు, ఎన్టీఆర్‌లు ఈ లిస్ట్‌లో ఉన్నారు. Also Read: అయితే సూపర్‌ స్టార్‌ , చెప్పిన కథకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందించే ఆలోచనలో ఉన్నారు సూపర్‌ స్టార్‌ టీం. అంతేకాదు ఈ సినిమాతో మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై మరి కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మహేష్‌ బాబు ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్, మిలటరీ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో సీనియర్‌ హీరోయిన్‌ విజయ శాంతి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తున్నారు. Also Read:

కొండవీడు చూసొస్తానని వెళ్లి... ప్రియుడి చేతిలో దారుణ హత్య

$
0
0
భర్తతో విభేదాల కారణంగా పుట్టింట్లోనే ఉంటున్న మహిళ మరొక వ్యక్తితో ప్రేమలో పడింది. అతడితో శారీరక సంబంధం పెట్టుకుని ప్రియుడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది. పాత గుంటూరుకు చెందిన గొట్టిపాటి ఆదిలక్ష్మి(32)కి పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. భర్తతో మనస్పర్థల కారణంగా పుట్టింటికి వచ్చేసి తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆదిలక్ష్మి మూడు నెలల క్రితం వరకు గుంటూరులోని ఓ స్టీలు సామగ్రి దుకాణంలో పని చేసేది. ఆ సమయంలో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతనితో తరచుగా ఫోన్‌లో మాట్లాడేది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. Also Read: ఈనెల 5న కొండవీడు పర్యటనకు వెళ్తున్నట్లు కుటుంబసభ్యులకు చెప్పి బయటకు వెళ్లిన ఆదిలక్ష్మి రెండు రోజులైనా తిరిగిరాలేదు. దీంతో ఆందోళన పడిన తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఆరా తీశారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు శనివారం కొండవీడు వచ్చి వెతుకుతుండగా కోట గ్రామం వైపు ఉన్న పురాతన మెట్ల మార్గంలోని దర్గా సమీపంలో ఆదిలక్ష్మి మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. Also Read: దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదిలక్ష్మి కాల్‌డేటాను పరిశీలించగా ఆమె అక్రమ సంబంధం విషయం వెలుగులోకి వచ్చింది. ఆదిలక్ష్మి కొండవీడుకు ప్రియుడితో కలిసి వచ్చినట్లు నిర్ధారించుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆదిలక్ష్మి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో చంపేసినట్లు అతడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు హత్య జరిగిన నాలుగురోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయి గుర్తుపట్టలేని విధంగా మారింది. సంఘటనా స్థలాన్ని చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బారావు, యడ్లపాడు ఎస్సై నాగేశ్వరరావు, యడ్లపాడు తహశీల్దార్‌ జి.నాంచారయ్య శనివారం సందర్శించారు. నుంచి క్లూస్‌టీం సంఘటనా స్థలంలో సాక్ష్యాధారాలను సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. Also Read:

బెంగాల్ వద్ద తీరం దాటిన బుల్‌బుల్.. ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు

$
0
0
బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను బుల్‌బుల్ బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య శనివారం అర్ధరాత్రి తీరం దాటింది. తుఫాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ సహా బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో గంటకు 120-140 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తున్నాయి. ఈ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మత్య్సకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శనివారం రాత్రి 11.30 తర్వాత సాగర్ ఐలాండ్ వద్ద తీరం దాటిన ఈశాన్యదిశలో బంగ్లాదేశ్‌వైపు ప్రయాణించింది. తీరం దాటుతూ క్రమంగా బలహీనపడిన బుల్‌బుల్.. తీరానికి చేరువైన తర్వాత వాయుగుండంగా మారినట్టు పేర్కొంది. బుల్‌బుల్ తుఫాను పశ్చిమ బెంగాల్‌‌లో బీభత్సం సృష్టింస్తోంది. సాగర్ ఐలాండ్ వద్ద తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ప్రచండ గాలులు, భారీ వర్షంతో విరుచుకుపడింది. సౌత్ 24 పరగణాస్ జిల్లాలో గంటకు 120 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచాయి. తుఫాన్ ధాటికి చాలా ప్రాంతాల్లో చెట్లు, స్తంభాలు నేలకొరిగాయి. భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. సముద్రంలో 2 మీటర్ల మేర అలలు ఎగిసిపడ్డాయి. తుఫాన్ ప్రభావంతో బెంగాల్‌లో ఇప్పటి వరకు ఇద్దరు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఒడిశాలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కరిశాయని తెలిపారు. కోల్‌కతా విమానాశ్రయంలో విమానాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. అటు ఒడిశాలోనూ శనివారం భారీ వర్షాలు కురిశాయి. వర్షానికితోడు బలమైన ఈదురుగాలులు వీయడంతో పంటలు దెబ్బతిన్నాయి. జగత్సింగ్‌పూర్, కేంద్రపడ, భద్రక్, బాలసోర్ జిల్లాల్లో చెట్లు, విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు నేలకొరిగాయి. రహదారులు దెబ్బతిని మారమూల ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. బుల్‌బుల్ దిశ మార్చుకుని బంగ్లావైపు పయనించడంతో ఏపీ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. బుల్‌బుల్ ప్రభావం జిల్లాలపై అధికంగా ఉంటుందని ఐఎండీ తొలుత అంచనా వేయడంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురయ్యింది. వరి పంట కోతకు వచ్చే సయమంలో తుఫాను రూపంలో ముప్పు పొంచి ఉందని తెలిసిన రైతుల గుండెలు గుభేలుమన్నాయి. అయితే, తుఫాను అంతగా ప్రభావం చూపకపోవడంతో కాస్త కుదటపడ్డారు.

MLA Roja: డబ్బు ఉండి అనుభవించలేనోడు దరిద్రుడు - రోజా

$
0
0
జబర్దస్త్‌ కమీడియన్స్.. పంచ్‌లు వేయడం మొదలుపెడితే.. లాజిక్‌ ఉన్నాలేకపోయినా పొట్టచెక్కలు కావడం ఖాయం. వాళ్లు చేసే కామెడీలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయిన జడ్జస్ కూడా ఒక్కోసారి తమ ఒపీనియన్స్‌తో నవ్విస్తుంటారు. డబ్బు ఉన్నా అనుభవించలేని ధరిద్రుడు ఎవరో? కోట్ల ఆస్తికి వారసుడైన ఓ జమిందారి.. రోజుకి ఐదువందలు కూడా వాడుకోలేని దుర్భర పరిస్థితి ఏంటో? ఇప్పుడు చూద్దాం! స్కిట్‌లో.. సత్తిపండు జమిందారు. అతడు పెళ్లి చేసుకుని భార్యను తీసుకుని వస్తాడు. అతడు రావడమే ఊరివాళ్లంతా.. ‘అయ్యా జమిందారయ్యా’ అంటూ చేతులకు ముద్దులు పెడుతూ, మొక్కుతూ ఉంటారు. సత్తిపండు కూడా అంతే గంభీరంగా కనిపిస్తాడు. అదంతా చూసిన భార్య.. ‘ఇంత పెద్ద జమిందారి ఇంటికి కోడలు కావడం నిజంగా నా అదృష్టమండీ..’ అంటుంది. ‘ఇంకా ఏం చూశావే.. మా జనాల అభిమానాలు ఆచారాలు చూస్తే ఇంకా ఆశ్చర్యపోతావు’ అంటాడు సత్తిపండు(జమిందారు). ‘అవునండీ.. మన ఆస్తి ఎంత ఉంటుంది?’ అని అడుగుతుంది భార్య. ‘నాకూ సరిగా తెలియదు.. మన పని వాడికి తెలుస్తుంది. పిలుస్తాను ఆగు’ అంటూ ‘రేయ్ రామూ.. రేయ్ రామూ’ అంటూ పిలుస్తాడు. అప్పుడు వస్తాడు చంద్ర పనివాడు రాము గెటప్‌లో. ‘అవును రామూ.. మన ఆస్తి ఎంతుంటాదిరా?’ అడుగుతాడు గర్వంగా రాము. ‘మన ఆస్తి 2వేల కోట్ల 53 లక్షల 40 వేల 350 రూపాయల 41 పైసా ఉంటుందయ్యా’ అంటాడు పనివాడు రాము(చంద్ర). అది విన్న జమిందారు భార్య.. ‘అంత ఆస్తికి మీరే యజమానులా?’ అంటుంది ఆశ్చర్యంగా. ‘నేనే యజమాన్ని ఏంటే ఇవాళ్టి నుంచి నువ్వు కూడా యజమానురాలివే..’ అంటూనే ‘రేయ్ రామూ తాళాల గుత్తి ఇటు ఇవ్వు’ అని అడుగుతాడు సత్తిపండు(జమిందారు). ‘కుదరదయ్యా’ అంటాడు రాము. అక్కడ నుంచి మొదలవుతుంది అసలు కథ. గోడ మీద ఫొటో(గెటప్ శ్రీనుది) చూపిస్తూ..‘మీ నాన్న కేశవరావు.. ఆడవాళ్ల చేతిలో పెత్తనం పెట్టొద్దని, ఆడపెత్తనం బోడి పెత్తనం అని వీలునామాలో రాశాడయ్యా’ అనే సాకుతో తాళాల గుత్తి ఇవ్వడు రాము. తర్వాత హనీమూన్‌కి వెళ్లడానికి రెండు మూడు లక్షలు అడిగిన జమిందారుకి.. ‘అయ్యా లైట్ ఆఫ్ చేసి ఆన్ చేయడానికి రెండు మూడు లక్షలు ఎందుకయ్యా.. మన పక్కనే ఉన్న గొడ్ల పాకలోకి వెళ్లి రెండు మూడు రోజులు గడిపి రండయ్యా’ అంటూ రెండొందలు చేతిలో పడతాడు. ‘ఇదేంటీ’ అంటూ గొడవపడిన జమిందారుతో.. ‘పెళ్లి చేసుకుని వచ్చిన వారసుడికి రోజుకి 200 ఇవ్వాలని మీ నాన్నగారు వీలునామాలో రాశారయ్యా’ అంటాడు. ఇక పనివాడు రామూ.. తన భార్య పిల్లలు విషయానికి వస్తే.. లగ్జరీ లైఫ్ ఇస్తూ.. భార్యతో తన పిల్లల్ని సినిమాకు ఫ్లైట్‌లో తీసుకుని వెళ్లమంటాడు. అదంతా విన్న జమిందారు భార్య.. ‘చూశావా? ఆ పనివాడికి రెండో భార్యనైనా బాగుండు’ అంటూ జమిందారు గాలితీసేస్తుంది. కనీసం సినిమాకు వెళ్లడానికి కూడా 500 ఇవ్వకుండా చుక్కలు చూపిస్తాడు రాము. దాంతో ‘కనీసం దూరంగా వెళ్లిపోయి.. ఏ కొట్టో పెట్టుకుని బతుకుదాం’ అంటుంది జమిందారు భార్య. దాంతో ఇద్దరూ లగేజ్ తీసుకుని.. బయలుదేరతారు. ఇళ్లు వదిలి వెళ్లిపోతున్న జమిందారుని.. ‘అయ్యా.. వెళ్లొద్దయ్యా.. మీరు మాట వినకపోతే.. నాలుగు పీకైనా సరే అడ్డు చెప్పాలని మీ నాన్నగారు వీలునామాలో రాశారయ్యా’ అంటూ రెండు పీకుతాడు కూడా. అదంతా చూసిన జమిందారు భార్య.. ‘అయ్యా నేను వెళ్లొచ్చా?’ అని పనివాడ్ని పర్మీషన్ అడగడం, పనివాడు వెళ్లమని పర్మీషన్ ఇవ్వడం, భార్య వెళ్లిపోతుంటే.. జమిందారు ఏడుస్తూ.. ‘ఆగవే.. నువ్వు వెళ్లిపోతే.. కనీసం ఆ రెండు వందలు కూడా ఇవ్వడే’ అని తన బాధని చెప్పుకోవడం భలే ఫన్నీగా అనిపిస్తుంది. స్కిట్ అయిన తర్వాత జడ్జెస్ నాగబాబు గారు.. బాగా నవ్వుతూ ‘చాలా దారుణంగా అనిపించింది పాపం. హిలేరియస్‌గా ఉంది’ అంటూ పొగడ్తలు గుప్పించగా.. ‘డబ్బు ఉండి అనుభవించలేనోడు దరిద్రుడు’ అంటూనే నవ్వించారు.

ఈరోజే భారత్ vs బంగ్లాదేశ్ ఫైనల్ టీ20.. రికార్డ్స్

$
0
0
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఆసక్తికరంగా జరుగుతున్న టీ20 సిరీస్‌ ఆదివారంతో ముగియనుంది. మూడు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగియగా.. తొలి టీ20లో బంగ్లాదేశ్, రెండో టీ20లో జట్టు విజయాన్ని అందుకుంది. దీంతో.. ఈరోజు నాగ్‌పూర్ వేదికగా రాత్రి 7 గంటలకి జరగనున్న ఆఖరి టీ20పై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకూ టీమిండియాపై ఒక్కసారి కూడా బంగ్లాదేశ్ టీ20 సిరీస్ గెలవలేదు. Read More: టీ20 రికార్డుల పరంగా చూసుకుంటే బంగ్లాదేశ్‌పై భారత్‌దే పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ 10 మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లూ తలపడగా.. భారత్ జట్టు ఏకంగా 9 మ్యాచ్‌ల్లో విజయాల్ని అందుకుంది. ఇక మిగిలిన ఒక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలవగా.. అది కూడా గత ఆదివారం (నవంబరు 3) ఢిల్లీ వేదికగానే కావడం విశేషం. నాగ్‌పూర్ పిచ్ స్పిన్నర్లకి అనుకూలించనుందనే వార్తలు వస్తుండగా.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టే ఆ స్టేడియంలో ఎక్కువగా విజయాల్ని అందుకున్నట్లు రికార్డులు చెప్తున్నాయి. Read More: భారత్ జట్టులో ఓపెనర్/ కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉండగా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఇంకా తడబడుతూనే ఉన్నాడు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ కూడా సిరీస్‌లో గెలిపించే ప్రదర్శన ఒక్కటీ చేయలేదు. బౌలింగ్‌లో చాహల్, దీపక్ చాహర్ మాత్రమే నిలకడగా రాణిస్తున్నారు. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ గత రెండు టీ20ల్లోనూ ధారాళంగా పరుగులిచ్చేసిన నేపథ్యంలో.. అతనిపై వేటు వేసి శార్ధూల్ ఠాకూర్‌‌ని తుది జట్టులోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఆల్‌రౌండర్ శివమ్ దూబే కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో అతని స్థానంలో సంజు శాంసన్‌ టీమ్‌లోకి రావొచ్చు. Read More:

ప్రేమించిన వ్యక్తి దక్కలేదని... ప్రియుడి భార్య గొంతు కోసిన యువతి

$
0
0
ప్రేమించిన వ్యక్తి దక్కలేదన్న అక్కసుతో ఓ యువతి దారుణానికి పాల్పడింది. తాను ప్రేమించిన వ్యక్తి వేరే యువతి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో అతడి ఇంటికి వెళ్లి భార్య గొంతు కోసేసింది.అ ఘటన జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. Also Read: అనంతపురంలోని మహాత్మాగాంధీ కాలనీలో నివసించే శ్రీనివాసులు అనే యువకుడు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడిని అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమించింది. అయితే ఈ విషయాన్ని మాత్రం అతడికి చెప్పడంతో తన ప్రేమను మనసులోనే దాచుకుంది. ఈ విషయం తెలియని శ్రీనివాసులు మహేశ్వరి(19) అనే యువతిని ప్రేమించి పెద్దలకు ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. Also Read: ఈ విషయం తెలుసుకున్న యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. శ్రీనివాసులును తనను దక్కకుండా చేసిన మహేశ్వరిపై పగ పెంచుకుంది. ఆమెను అడ్డు తొలగించుకుంటే అతడి తానే పెళ్లి చేసుకోవచ్చని భావించింది. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్కడికి వెళ్లి యువతి మహేశ్వరితో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలోనే వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి పరారైంది. బాధితురాలి కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్ పోలీసులు నిందితురాలి కోసం గాలిస్తున్నారు. Also Read:

అయోధ్య తుది తీర్పు.. కొత్త సంప్రదాయానికి తెరతీసిన సుప్రీం

$
0
0
భారతదేశ చరిత్రలో శనివారం ఓ కొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. దేశ రాజకీయ, సామాజిక అంశాలపై తీవ్ర ప్రభావం చూపిన శతాబ్ద కాలం నాటి అయోధ్య వివాదానికి సర్వోన్నత న్యాయస్థానం ముగింపు పలికింది. సుప్రీం నిర్ణయం కోసం దేశం యావత్తు ఎంతో ఉద్విగ్నంగా ఎదురుచూడగా తనదైన తీర్పుతో సమస్యకు పరిష్కారం చూపింది. హిందువుల మత విశ్వాసాలకు అనుగుణంగా వివాదాస్పద స్థలంలో రామాలయ నిర్మాణానికి బాటలు వేస్తూ.. ఇటు ముస్లింల కోసం అయోధ్యలోనే ఐదెకరాల భూమిని కేటాయించాలని ఆదేశించింది. తీర్పును మెజార్టీ పక్షాలు స్వాగతించగా, మరికొందరు అసంతృప్తిని వ్యక్తంచేస్తూనే శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేసి లౌకికవాద స్ఫూర్తిని చాటుకున్నారు. అయోధ్య తీర్పు విచారణలో సుప్రీంకోర్టు లోతైన పరిశీలనలు జరిపింది. లిఖిత రూపంలోని మతపరమైన పత్రాలు, ట్రావెలాగ్‌లు, పురావస్తు శాఖ నివేదికలు, బాబ్రీమసీదు కూల్చివేతకు పూర్వం నాటి ఫొటోలు మొత్తం 533 సాక్ష్యాలను రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిచింది. వీటితోపాటు శిలాశాసనాల అనువాదాలు, పలువురు చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తల సహా 88 మంది సాక్షుల వాంగ్మూలాలను సేకరించింది. విచారణలో తమ పరిశీలనకు వచ్చిన అంశాల ఆధారంగా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. మొత్తం 1045 పేజీల తీర్పు సారాంశాన్ని జస్టిస్‌ రంజన్‌ గొగొయి 45 నిమిషాల పాటు చదివి వినిపించారు. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ సభ్యులుగా ఉన్నారు. సుప్రీంకోర్టు చరిత్రలోనే సుదీర్ఘకాలం విచారణ సాగిన రెండో కేసుగా ఆయోధ్య వివాదం గుర్తింపు పొందింది. అలాగే ఈ తీర్పు సమయంలో న్యాయస్థానం సరికొత్త సంప్రదాయానికి తెరతీసింది. ఏదైనా కేసు తీర్పు వెలువరించేటప్పుడు ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఒక్కొక్కరూ అభిప్రాయాలను వెల్లడిస్తారు. కానీ, దీనికి భిన్నంగా అయోధ్య తీర్పు విషయంలో సుప్రీం వ్యవహరించింది. తీర్పును చదువుతున్నప్పుడు ధర్మాసనంలోని సభ్యులు పేర్లను ప్రస్తావించలేదు. ఎవరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారో చెప్పకుండా చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ ఏకాభిప్రాయంతో తీర్పును వెలువరిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు, తీర్పుతో పాటు 116 పేజీల అనుబంధాన్ని కూడా ప్రత్యేకంగా ఇవ్వడం మరో విశేషం. లోని ప్రస్తుత వివాదాస్పద స్థలమే శ్రీరాముడి జన్మస్థలమని విశ్వసించేందుకు ఆధారాలేంటనే విషయాన్ని కూలంకశంగా ఆ అనుబంధంలో వివరించారు. ఆ అనుబంధ ప్రతిని రాసిందెవరో కూడా గోప్యంగానే ఉంచడం విశేషం.

కోరిక తీరిందన్న స్టార్ హీరోయిన్‌.. ఫైనల్‌గా సాధించానంటూ పోస్ట్‌

$
0
0
హాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌ తన సోషల్ మీడియా పేజ్‌లో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధించటం కన్నా గొప్ప ఫీలింగ్‌ ఏది ఉండదు. త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనున్న నా బ్రూజ్‌ మూవీ కోసం నేను సెట్ చేసుకున్ గోల్‌ సిక్స్‌ ప్యాక్‌ యాబ్స్‌ సాధించటం. ఈ రోజు నా గోల్ రీచ్‌ అయ్యాను. ఈ విషయం నేనే నమ్మలేకపోతున్నా` అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు 53 ఏళ్ల హాలీ బెర్రీ. హాలీ సిక్స్‌ ప్యాక్‌ సాధించటంపై స్పందించిన ఆమె పర్సనల్‌ ట్రైనర్‌ ముబారక్‌ మాలిక్‌ ఇది ఎచీవ్‌మెంట్ అంత సులభంగా సాధ్యం కాలేదన్నారు. హాలీ రోజుకు నాలుగు గంటల చొప్పున జిమ్‌ చేసేదని తెలిపాడు. అంతేకాదు ఆహారం విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారని అప్పుడప్పుడు ఉపవాసం ఉంటూ కీటో డైట్‌ను ఫాలో అవ్వటం వల్లే సిక్స్‌ ప్యాక్‌ సాదించికగలిగిందని తెలిపారు. Also Read: తన సిక్స్‌ ప్యాక్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ట్వీట్ చేసిన హాలీ బెరీ అందరూ తనలా గోల్స్‌ సెట్‌ చేసుకొని వాటిని సాధించాలని సూచించారు. `మీ ఫిట్‌నెస్‌ గోల్‌ ఏంటి..? మీరు అనుకున్న దానికన్నా ఉన్నతమైన గోల్ సెట్ చేసుకోండి. మీ గోల్‌ను కామెంట్స్‌ ద్వారా తెలిపి వాటిని సాధించేందుకు కష్టపడండి. అది సాధించటం కష్టం కాదు. కానీ మీ కష్టానికి తప్పకుండా ఫలితం ఉంటుంది` అంటూ కామెంట్ చేసింది. Also Read: బాండ్‌ గర్ల్‌గా ఫేమస్‌ అయి హాలీ బెర్రీ అకాడమీ అవార్డును సైతం సాధించింది. సినిమాలతో పాటు టెలివిజన్‌ షోస్‌లో కూడా కనిపించింది. నటిగానే కాక నిర్మాతగాను పలు చిత్రాలను, టీవీ కార్యాక్రమాలను నిర్మించింది. త్వరలో తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న బ్రూయిజ్డ్‌ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె సిక్స్‌ ప్యాక్‌లో కనిపించనుంది.

ఇంగ్లిష్ మీడియంపై కాస్త వెనక్కు తగ్గిన జగన్.. కీలక మార్పులు

$
0
0
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1- 8వ తరగతి వరకూ ఆంగ్లమాధ్యమంలో బోధన అమల్లోకి తీసుకురానున్నట్టు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జగన్ ప్రభుత్వం ఈ విధానంలో స్పల్ప మార్పు చేసింది. కేవలం ఆరో తరగతి వరకూ మాత్రమే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ఈ అంశంపై ఉన్నతాధికారులతో అధికారులతో శనివారం సమీక్షించిన సీఎం.. అనంతరం నిర్ణయం తీసుకున్నారు. అధికారికంగా ఓ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఇంగ్లీష్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని, ‘నాడు-నేడు’లో భాగంగా వీటిని అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి సూచించారు. బోధనకు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విధానాలను అనుసరించాలని ఆయన సూచించారు. తొలుత 1 నుంచి 8వ తరగతి వరకు మాత్రమే మాధ్యమంలో బోధించాలని నిర్ణయించినా, సమీక్ష అనంతరం మార్పులు చేసి 1 నుంచి 6వ తరగతి వరకు పరిమితం చేశారు. ఆ తర్వాత 7, 8, 9, 10 తరగతులకు వరుసగా దీనిని అనుసరిస్తారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విధానాల్లో 10వ తరగతికి దేశ వ్యాప్తంగా కామన్‌ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థులతో పోటీ పడాలంటే ఇప్పుడు 8వ తరగతి తొలిసారి ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థికి కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8 వరకు అన్ని ప్రభుత్వ, ఎంపీపీ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు.. అన్ని తరగతులను ఇంగ్లీష్ మీడియంగా మార్చడానికి పాఠశాల విద్యా కమిషనర్ ఒక ప్రతిపాదనను సమర్పించారు. ఈ విషయాన్ని పరిశీలించిన తరువాత 1 వ తరగతి నుంచి 6 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంగా మార్చడానికి పాఠశాల విద్యా కమిషనర్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉపాధ్యాయులు ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికి ప్రస్తుత విద్యా సంవత్సరం, 2020 వేసవిలో వారికి ఇంటెన్సివ్, విస్తృతమైన శిక్షణ ఇవ్వనున్నారు. నిర్దిష్ట అంశాలు, సాధారణంగా వారి ఇంగ్లీష్ మీడియం బోధనా నైపుణ్యాలను మెరుగుపరిచే వరకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. ఇక, ప్రభుత్వం నిర్ణయం విజయవంతం కావాలంటే భవిష్యత్తులో ఉపాధ్యాయ నియామకాలు, ఇంగ్లీష్ మీడియం బోధనలో ఉత్తమ ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులను నియమించాలి.

‘పెళ్లి చేసుకోకపోతే యాసిడ్ పోస్తా’ నంటూ వేధింపులు.. యువకుడి అరెస్ట్

$
0
0
ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మల్కాజ్‌గిరి పీఎస్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన యువతి(20) సికింద్రాబాద్‌లోని ఓ సూపర్‌మార్కెట్లో పనిచేస్తోంది. కొంతకాలం క్రితం ఆమెకు కూకట్‌పల్లికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు బస్టాప్‌లో పరిచయమయ్యాడు. Also Read: కొద్దిరోజుల తర్వాత నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటా.. అంటూ శ్రీనివాస్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. తనకు ఇష్టం లేదని యువతి చెప్పినా వినకుండా వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు యువకుడిని మందలించారు. మరోసారి వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. Also Read: దీంతో కొద్దిరోజుల పాటు సైలెంట్‌గా ఉన్న శ్రీనివాస్ మంగళవారం యువతిని కలిశాడు. తనను పెళ్లి చేసుకోకపోతే యాసిడ్ పోసేస్తానని యువతిని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన బాధితురాలు మల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:

Milda un Nabi మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజు.. మిత్రులకు ఇలా విషెస్ చెప్పండి

$
0
0
మహ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్-ఉన్-నబీగా ముస్లింలు జరుపుకుంటారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం.. మూడో నెల రబీ-అల్-అవ్వల్‌లో పౌర్ణమి ముందురోజు మహ్మద్ ప్రవక్త జన్మించినట్టు భావిస్తారు.మహ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్-ఉన్-నబీగా ముస్లింలు జరుపుకుంటారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం.. మూడో నెల రబీ-అల్-అవ్వల్‌లో పౌర్ణమి ముందురోజు మహ్మద్ ప్రవక్త జన్మించినట్టు భావిస్తారు. అనంత కరుణామయుడైన అల్లాహ్... సర్వమానవాళి శ్రేయస్సు, శాంతి నెలకొల్పడం కోసం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్‌ను ఎన్నకున్నట్టు అంతిమ దైవ గ్రంథం పవిత్ర ఖురాన్‌ షరీఫ్‌‌లో చెప్పబడింది. విశ్వ ప్రవక్త మహమ్మద్‌ కేవలం ముస్లింల కోసం కాదని సర్వ కోటి జీవరాశులకు ఈ విశ్వానికి ప్రవక్తగా అల్లాహ్‌ నియమించారని అందులో తెలియజేశారు. విశ్వ ప్రవక్త తాను స్వతహాగా ఏదీ తెలియజేయరు. తాను అల్లాహ్‌ ద్వారా ఏది వినేవారే అదే తెలిపేవారు. దీనికి సాక్ష్యంగా అనేక దైవ గ్రంథాల్లో ముందుగానే వివరించారు. మరో సాక్ష్యం ఏంటంటే మహమ్మద్‌ ప్రవక్త (ఉమ్మి) అక్షరాస్యత తెలియని వారు. ఇది అల్లాహ్‌ తహ లా మహిమ పవిత్ర ఖురాన్‌ను దైవవాణి రూపంలో ప్రవక్తను అవతరింపజేసి తన శక్తిని సర్వ మానవాళికి తెలియజేశారు. అందుకే విశ్వ ప్రవక్త ప్రవచనాలు సర్వమానవాళి జీవన శైలికి హితోపదేశాలు అయ్యాయి. అల్లాహ్‌కు అత్యం ప్రీతి పాత్రులైన మహమ్మద్‌ (సఅస) ఇస్లాం క్యాలెండర్‌లోని మూడో నెల రబీవుల్‌ అవ్వల్‌ 12వ తేదీ సోమవారం, హిందువుల క్యాలెండర్‌ విక్రమాదిత్య శకం 628 జ్వేష్టశుద్ధ 9వ తేదీ సోమవారం, 570 సంవత్సరం ఏప్రిల్‌ 20వ తేదీ గ్రెగేరియన్‌ క్యాలెండర్‌ (క్రిస్టియన్‌) ప్రకారం జన్మించారని ఉంది. మక్కా పెద్ద అయిన అబ్దుల్‌ మత్తలబు కుమారుడు అబుద్దాలా అమీనాలకు జన్మించారు. ప్రవక్త జన్మదినం రోజున ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేయండిలా..

కాకినాడలో కిరాతకం.. రూ.2ల కోసం వ్యక్తి హత్య

$
0
0
కాకినాడలో దారుణ ఘటన వెలుగుచూసింది. కేవలం రూ.2ల విషయంలో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. కాకినాడలోని వలసపాక ప్రాంతంలో సాంబ అనే వ్యక్తి సైకిల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం సువర్ణరాజు అనే యువకుడు షాపుకు వచ్చి సైకిల్‌కు గాలి కొట్టించుకున్నాడు. అతడిని రెండు రూపాయలు ఇవ్వాలని సాంబ కోరగా తిట్టాడు. డబ్బులు ఇవ్వనని చెప్పి సాంబతో గొడవపడి చేయి చేసుకున్నాడు. Also Read: ఆ సమయంలో షాపు వద్దనే ఉన్న సాంబ స్నేహితుడు అప్పారావు ఆవేశంతో రెచ్చిపోయాడు. కత్తితో సువర్ణరాజును విచక్షణా రహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో బాధితుడు అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి హుటాహుటిన చేరుకుని సువర్ణరాజును ఆస్పత్రికి తరలించారు. Also Read: డాక్టర్లు చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించి సువర్ణరాజు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అప్పారావు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. Also Read:

వెక్కి వెక్కి ఏడుస్తున్న పప్పు.. చుక్కలు చూపిస్తున్న వర్మ

$
0
0
సంచలన దర్శకుడు తెరకెక్కిన మరో వివాదాస్పద చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వర్మ సెటైరికల్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయం సెన్సేషన్‌గా మారుతోంది. ఇప్పటికే పోస్టర్‌లు, టీజర్‌, సాంగ్స్‌లో కావాల్సినంత కాంట్రవర్సీ క్రియేట్‌ చేసిన ఆర్జీవీ తాజాగా మరో బాండ్ పేల్చాడు. సినిమాలోని పప్పులాంటి అబ్బాయి వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశాడు వర్మ. ఆ పాట చూస్తే ఆ పాట ఎవరి ఉద్దేశించి రూపొందించాడో ఇట్టే అర్థమైపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి పక్షనాయకుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ బాబును పోలిన పాత్రల నేపథ్యంలో ఈ పాటను రూపొందించాడు వర్మ. లోకేష్‌ను ప్రత్యర్థి పార్టీలు పప్పు అని పిలుస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పడే అదే పేరుతో వర్మ పాట రిలీజ్ చేయటం హాట్‌ టాపిక్‌గా మారింది. Also Read: అంతేకాదు పాటు తన వారసత్వాన్ని పప్పు లాంటి కొడుకు ఇవ్వాలని తపన పడే తండ్రి, తన కొడుకు అప్రయోజకత్వానికి చూసి మథన పడటం లాంటి సీన్స్‌తో రూపొందించాడు. దీంతో లోకేష్, చంద్రబాబు రాజకీయ వారసత్వన్ని అందుకోలేకపోతున్నాడంటూ వర్మ సెటైర్‌ వేస్తున్నాడని భావిస్తున్నారు. వర్మ రూపొందిస్తున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో చంద్రబాబు, లోకేష్‌లతో పాట ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, పవన్‌ కళ్యాణ్‌, కేఏ పాల్, వంగవీటి రాధలను పోలిన పాత్రలు కూడా ఉన్నాయి. అయితే వర్మ మాత్రం తాను ఎవరినీ దృష్టిలో పెట్టుకొని ఆ పాత్రలు సృష్టించలేదని, ఎవరికైన అలా అనిపిస్తే అది యాదృశ్చికమే అంటున్నాడు. Also Read: ఎన్నికల ముందు లక్ష్మీష్ ఎన్టీఆర్‌ సినిమాతో కూడా ఇదే స్థాయిలో హల్‌చల్‌ చేశాడు వర్మ. ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ పార్వతి బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అయితే అప్పట్లో ఆ సినిమా రిలీజ్‌ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించింది. దీంతో వర్మ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా సమయంలోనే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాను ప్రకటించాడు. చెప్పినట్టుగా ఇప్పుడు సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేశాడు. టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్‌, అజయ్‌ మైసూర్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రామ్‌ గోపాల్ వర్మ, సిద్ధార్థ్ తాతోలులు దర్శకత్వం వహిస్తున్నారు. Also Read:

ఫలించిన తెలుగు బాక్సర్ జరీన్ పోరాటం.. మేరీకోమ్‌తో ఫైట్

$
0
0
టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కి ముందు ట్రయల్స్ నిర్వహించాలని పోరాడిన తెలంగాణ బాక్సర్ ఎట్టకేలకి విజయం సాధించింది. వచ్చే ఏడాది జనవరిలో క్వాలిఫయర్స్ జరగనుండగా.. ఎలాంటి ట్రయల్స్ లేకుండా 51 కేజీల విభాగంలో మేరీకోమ్‌ని పంపాలని భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) తొలుత భావించింది. అదే జరిగితే..? గత కొంతకాలంగా ఆ విభాగంలో పోటీపడుతున్న తనకి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన నిఖత్ జరీన్.. మేరీకోమ్‌తో ట్రయల్స్ నిర్వహించి ఎవరు గెలిస్తే వారిని క్వాలిఫయర్స్‌కి పంపాలని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజుకి లేఖ రాసింది. ఆమెకి అభినవ్ బింద్రాతో పాటు చాలా మంది క్రీడాకారుల మద్దతు కూడా లభించడంతో.. మేరీకోమ్, జరీన్ గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. దీంతో.. బీఎఫ్ఐ ఎట్టకేలకి వెనక్కి తగ్గి ట్రయల్స్ నిర్వహిస్తామని ప్రకటించింది. సమస్య ఎక్కడ మొదలైందంటే..? సుదీర్ఘకాలంగా 48 కిలోల కేటగిరీలో పోటీపడుతున్న మేరీకోమ్.. ఆరు స్వర్ణాలు, ఒక రజత పతకం గెలుపొందింది. కానీ.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 48 కేజీల విభాగం లేకపోవడంతో.. ఆమె ఇటీవల 51 కిలోల కేటగిరీకి మారింది. దీంతో.. ఇన్నాళ్లు 51 కిలోల విభాగంలో పోటీపడుతున్న జరీన్‌ని పక్కన పెట్టిన భారత బాక్సింగ్ ఫెడరేషన్.. ఇటీవల ఆ కేటగిరీలో మేరీకోమ్‌ని డైరెక్ట్‌గా వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌కి పంపింది. అక్కడ సెమీస్‌లోనే వెనుదిరిగిన మేరీకోమ్.. కాంస్య పతకంతో సరిపెట్టింది. కానీ.. ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కి కూడా మేరీకోమ్‌ని ఎలాంటి ట్రయల్స్ నిర్వహించకుండానే పంపాలని మరోసారి ఫెడరేషన్ యోచించడంతో జరీన్ పోరాడింది. ట్రయల్స్‌లో భాగంగా డిసెంబరు 29, 30 తేదీల్లో మేరీకోమ్, జరీన్ మధ్య ఫైట్ జరగనుంది. ఈ ఫైట్‌లో గెలిచిన వారు జనవరిలో టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో పోటీపడతారు.

బయటపడుతున్న సెక్స్ సైకో లీలలు, బాలికలను బట్టలో వేసుకునేందుకు ఏం చేసేదంటే..

$
0
0
తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన మహిళ సుమలత వికృత చేష్టల వ్యవహారంతో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఆడవాళ్లపై మోజు పెంచుకున్న సుమలత వారిని ఆకట్టుకునేందుకు ఎన్నో వేషాలు వేసేదని పోలీసుల విచారణలో తేలింది. ఆమె మగాడిలా కనిపించేందుకు విగ్గు పెట్టుకుని, ఫ్యాంట్, షర్ట్ వేసుకునేదని పోలీసులు చెబుతున్నారు. తనకు నచ్చిన మహిళలను లోబరుచుకునేందుకు వారికి ప్రేమలేఖలు రాసేదని తెలిసింది. దీనికి సంబంధించి కొన్ని లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమకు దొరికిన ప్రేమ లేఖల్లో సుమలత తన పేరును 'సాయి చరణ్' అని పేర్కొన్నట్టు గుర్తించారు. Also Read: సుమలత ఆడవాళ్లతో మాట్లాడేటప్పుడు గొంతు మార్చి మగాడిలా మాట్లాడేదని, తన ట్రాప్‌లో పడిన యువతులు, బాలికలను ఇంటికి రప్పించి మత్తు పదార్థాలు ఇచ్చి, తర్వాత సెక్స్ టాయ్స్ ద్వారా వారిపై లైంగిక దాడికి పాల్పడేదని పోలీసులు తెలుపుతున్నారు. ఆమె ఇంట్లో దొరికిన సెక్స్ టాయ్స్, మగాళ్ల విగ్గులు చూసిన పోలీసులు సుమలత పైశాచికత్వాన్ని తెలుసుకుని విస్తుపోయారు. Also Read: అయితే సుమలత పురుషుడిలా నటిస్తూ మహిళలను ఎందుకు ట్రాప్ చేసేది అన్నది మాత్రం పోలీసులకు అంతు చిక్కడం లేదు. తన వికృత లైంగిక కోర్కెలను తీర్చుకునేందుకే ఇలాంటి పద్దతులను అనుసరించిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న సుమలతను పోలీసులు అనేక కోణాల్లో విచారిస్తున్నారు. ఓ మైనర్ బాలిక ఫిర్యాదుతో సుమలత వ్యవహారం బట్టబయలు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఆడవాళ్లలో ఇలాంటి వారు కూడా ఉంటారా? అని చాలామంది ముక్కున వేలేసుకుంటున్నారు. Also Read:

అయోధ్య తీర్పుపై అద్వానీ భావోద్వేగం.. ఇది కల నెరవేరిన క్షణం!

$
0
0
అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది. ప్రధానంగా ఆ నినాదంతోనే రాజకీయంగా కమలం పార్టీ ఎదిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 1980వ దశకం తర్వాత అయోధ్య అంశానికి దేశవ్యాప్తంగా ఇంతటి ప్రాచుర్యం రావడానికి బీజేపీ అగ్రనేతలు వాజ్‌పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి కృషే కారణం. నాడు వారు చేసిన పోరాటం, త్యాగం ఫలితంగానే నేడు అనుకూలంగా తీర్పు వచ్చింది. సుప్రీం తీర్పుపై బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వాణీ స్వాగతించారు. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఏకగ్రీవ తీర్పుతో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైందని ఆయన వ్యాఖ్యానించారు. తీర్పుపై ఒకింత భావోద్వేగానికి గురైన ఆయన ఇది కల నెరవేరిన క్షణమని పేర్కొన్నారు. భారతదేశ సాంస్కృతిక, వారసత్వ సంపదల్లో రామజన్మభూమికి గౌరవమైన స్థానం ఉందని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని అన్నారు. అంతేకాదు కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో రామజన్మభూమికి పవిత్ర స్థానం ఉందని అద్వాణీ ఉద్ఘాటించారు. వారి నమ్మకాలకు గౌరవం చేకూరేలా వచ్చిన ఈ తీర్పు ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. అయోధ్యలో రామ మందిరం, బాబ్రీ మసీదు వివాదం ముగిసిన తరుణంలో ఎలాంటి హింసకూ చోటివ్వకుండా శాంతిని నెలకొల్పాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఈ క్రమంలో దేశ ఐక్యతను, సమగ్రతను బలపర్చేందుకు అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై పని చేయాలని అద్వాణీ పిలుపునిచ్చారు. అలాగే, మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని సుప్రీం చెప్పడం కూడా హర్షణీయమని స్వాగతించారు. అయోధ్యలో రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలంలో రామాలయ నిర్మాణం కోసం ఎల్‌కే అద్వానీ పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఆయన గుజరాత్‌లోని సోమనాథ్‌ నుంచి అయోధ్య వరకు రథయాత్ర చేపట్టారు. సరిగ్గా ఆయన 92వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న మర్నాడే ఈ తీర్పు వెలువడటం విశేషం. 1990 అక్టోబర్ 23న రథయాత్రలో భాగంగా బీహార్లోని సమస్తిపూర్ మీదుగా వస్తున్న అద్వానీని అప్పటి లాలూ ప్రభుత్వం అడ్డుకుంది. నాటకీయ పరిణామాల మధ్య ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. దేశ రాజకీయాలను ఈ సంఘటన కీలక మలుపు తిప్పడడమే కాదు, బీజేపీకి పాపులారిటీని తీసుకొచ్చింది. అద్వానీ అరెస్టుతో ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చోటుచేసుకున్నాయి. కొన్నిచోట్ల మత ఘర్షణలు చెలరేగాయి. అద్వానీ అరెస్టుకు నిరసనగా కేంద్రంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి బీజేపీ మద్ధతు ఉపసంహరించుకోవడంతో వీపీ సింగ్ సర్కారు కూలిపోయింది. అక్టోబర్ 30న వేలాదిగా అయోధ్యకు బయలుదేరిన కరసేవకులను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు. ఓ వెయ్యి మంది మాత్రమే అయోధ్యకు చేరుకుని, మసీదులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో కరసేవకులపై యూపీ పోలీసులు కాల్పులకు పాల్పడటంతో 28 మంది చనిపోయారు. ఇది జరిగిన రెండేళ్ల తర్వాత 1992లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నపుడు వీహెచ్పీ, బీజేపీ అయోధ్యలో కరసేవకుల ర్యాలీ ఏర్పాటు చేసింది. డిసెంబర్ 6న జరిగిన ఈ ర్యాలీలో 1,50,000 మంది కరసేవకులు పాల్గొని, బాబ్రీ మసీదులోకి చొచ్చుకెళ్లారు. తర్వాత ర్యాలీ అదుపు తప్పి, హింసాత్మకంగా మారింది. కరసేవకులు మసీదును కూల్చేశారు. ఈ కేసులో పోలీసులు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ కతియార్ సహా పలువురు నేతలపై చార్జిషీట్ దాఖలు చేశారు.

టీ20 సూపర్ ఓవర్.. కివీస్‌పై ఇంగ్లాండ్ గెలుపు

$
0
0
న్యూజిలాండ్‌ని సూపర్ ఓవర్ గండం మళ్లీ వెంటాడింది. ఇటీవల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సూపర్ ఓవర్ కారణంగా కొద్దిలో కప్‌ని చేజార్చుకున్న కివీస్.. ఆదివారం మరోసారి చేతిలోనే సూపర్ ఓవర్‌లో ఓడిపోయి టీ20 సిరీస్‌ని చేజార్చుకుంది. వర్షం కారణంగా 11 ఓవర్లకి కుదించిన మ్యాచ్‌లో రెండు జట్లు సరిగ్గా 146 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అవగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు. ఆ సూపర్ ఓవర్‌లో మాత్రం ఇంగ్లాండ్ ఎక్కువ పరుగులు చేసి గెలుపొందింది. దీంతో.. ఐదు టీ20ల సిరీస్ కూడా 3-2తో ఇంగ్లాండ్ వశమైంది. Read More: ఆక్లాండ్ వేదికగా ఈరోజు జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌ని వర్షం కారణంగా 11 ఓవర్లకి కుదించారు. దీంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు.. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (50: 20 బంతుల్లో 3x4, 5x6), కొలిన్ మున్రో (46: 21 బంతుల్లో 2x4, 4x6), టిమ్ సైపర్ట్ (39: 16 బంతుల్లో 1x4, 5x6) సిక్సర్ల వర్షం కురిపించడంతో 11 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో జానీ బెయిర్‌స్టో (47: 18 బంతుల్లో 2x4, 5x6), శామ్ కరన్ (24: 11 బంతుల్లో 2x4, 2x6) చెలరేగడంతో ఇంగ్లాండ్ కూడా సరిగ్గా 11 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేయగలిగింది. దీంతో.. స్కోర్లు సమమవగా.. సూపర్ ఓవర్ అనివార్యమైంది. Read More: సూపర్ ఓవర్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్.. 17 పరుగులు చేసింది. టిమ్ సౌథీ వేసిన ఆ ఓవర్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్, జానీ బెయిర్ స్టో చెరొక సిక్స్ కొట్టారు. అనంతరం ఛేదనలో క్రిస్ జోర్దాన్ బౌలింగ్ చేయగా.. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ సైపర్ట్ ఒక ఫోర్ కొట్టి ఔటవగా.. గ్రాండ్‌హోమ్ తేలిపోయాడు. దీంతో.. ఆ జట్టు 8 పరుగులు మాత్రమే చేయగలిగింది. Read More:
Viewing all 86069 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>