November 9, 2019, 10:37 pm
![]()
సినిమాలో సెన్సేషన్ సృష్టించిన నటుడు . గతంలో తెలుగు తెర మీద కనిపించనంత బోల్డ్ క్యారెక్టర్‌తో షాక్ ఇచ్చిన అభిషేక్, ఈ సినిమాతో తను ఆశించిన విజయం సాధించాడు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోయినా కలెక్షన్లు మాత్రం భారీగా వస్తున్నాయి.
అయితే ఏడు చేపల కథ ఫీవర్ కొనసాగుతుండగానే మరో సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేశాడు అభిషేక్ రెడ్డి. పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో కూడా ఏడు చేపల కథ తరహాలోనే బోల్డ్ కంటెంట్‌తో రూపొందుతోంది. నైఫ్ ఈజ్ బెటర్ దాన్ వైఫ్ అనై ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. బోల్డ్ కంటెంట్ కారణంగా ఈ సినిమాకు కూడా ఏ సర్టిఫికేటే వచ్చింది.
Also Read:
ఒకరు ప్రవర్తనతో ఒకరు విసిగిపోయిన భార్యా భర్తల కథతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కుతోంది. అభిషేక్ భార్య సాక్షి నిదియా నటిస్తున్న ఈ సినిమాలో కావ్య, సునీల్ నగరం, సూర్య ఆకొండి, మహేష్ విట్టా, అపర్ణలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read:
జీఎస్‌ఎస్‌పీ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే ఎడిటింగ్ బాధ్యతలు కూడా ఆయనే నిర్వహిస్తున్నాడు. లక్ష్మీ చరిత ఆర్ట్స్, జీఎస్‌ఎస్‌పీకే స్టూడియోస్ బ్యానర్‌లపై జీ చరితా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read:
↧
November 9, 2019, 11:11 pm
![]()
జిల్లా కురబలకోటలో చిన్నారి వర్షిత(5) హత్యాచారం కేసుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. వర్షిత హత్యాచారం తనను తీవ్ర కలిచివేసిందన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టొద్దని పోలీసులను ఆదేశించారు. నేరస్థుడిని వీలైనంత తర్వగా పట్టుకుని చట్టం ముందు నిలబెడతామన్నారు.
Also Reead:
చిత్తూరు జిల్లా కురబలకోటలోని ఓ ఫంక్షన్ హాల్ గురువారం రాత్రి జరిగిన పెళ్లికి వర్షిత తల్లిదండ్రులతో కలిసి హాజరైంది. కొద్దిసేపటి తర్వాత బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన పడుతూ చుట్టుపక్కల గాలించారు. ఫంక్షన్ హాల్ వెనుక చిన్నారి విగతజీవిగా కనిపించడంతో అంతా షాకయ్యారు. పోస్టుమార్టం నివేదికలో వర్షితపై అత్యాచారం చేసి చంపేసినట్లు తెలియడంతో అంతా షాకయ్యారు.
Also Reead:
నిందితుడు బాలికను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు వాటి ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. పెళ్లిలో వర్షితను ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒకరు అనుసరించినట్టు సీసీ టీవీ ఫుటేజీలో గుర్తించారు. చిన్నారితో మాట్లాడుతూ.. ఆమెకు దూరంగా తీసుకెళ్తుండటం స్పష్టంగా కనిపించింది. నిందితుడు కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడుగా అనుమానిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ గాలిస్తున్నారు. మరోవైపు వర్షిత తల్లిదండ్రులకు ఎవరితోనైనా పాత గొడవలు ఉన్నాయా? అన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
Also Reead:
↧
↧
November 9, 2019, 11:13 pm
![]()
సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. వివాదాస్పద 2.77 స్థలం రామజన్మభూమి న్యాస్‌కు చెందుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో ఆలయన నిర్మాణం మొదలుకానుంది. అయితే, ఆలయ నిర్మాణానికి కనీసం అయిదేళ్లు పడుతుందని అంటున్నారు. విశ్వహిందూ పరిషత్ నమూనా ప్రకారం 250 మంది కళాకారులు నిర్విరామంగా పనిచేస్తే ఐదేళ్లలో పూర్తవుతుందని ఆలయ వర్క్‌షాప్ వద్ద ఉన్న ఓ నిపుణుడు తెలిపారు.
వర్క్‌షాప్ శిల్పకారుడు ఈ ఏడాది జులై చివరిలో చనిపోవడంతో ఇంకా వేర వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పగించలేదు. 1990 నుంచి రోజుకు ఎనిమిది గంటలు చొప్పున ఇక్కడ పనులు జరుగుతున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇవి సాగుతున్నా కింది అంతస్తు నిర్మాణంలో సగం మాత్రమే పూర్తయ్యాయి. వీహెచ్‌పీ నమూనా ప్రకారం కింది అంతస్తులో 212 స్తంభాల నిర్మాణం ప్రతిపాదించగా ప్రస్తుతం 106 మాత్రమే సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం వీహెచ్‌పీ వర్క్‌షాప్ వద్ద కార్మికులు ఎవరూ లేరని, ఒకవేళ పనులు ప్రారంభించి రోజుకు 250 మంది కళాకారులు నిర్విరామంగా పనిచేస్తే ఐదేళ్లలో పూర్తవుతుందని అన్నూభాయ్ సోంపుర తెలిపారు.
ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత నిర్మాణ సామాగ్రి తరలింపు మొదలుపెడతామని, పూర్తిచేసిన శిల్పాలను నిలబెట్టి పనులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. కింది అంతస్తుకు సంబంధించిన సగం స్తంభాలు సిద్ధంగా ఉన్నాయని, గోడలకు మార్బుల్ పలకాలను కూడా సిద్ధం చేసినట్టు వివరించారు. డిసెంబరులో ఆలయ నిర్మాణానికి పనులు ప్రారంభించే అవకాశం ఉందని తెలియజేశారు.
అవధ్ ప్రాంతానికి చెందిన వీహెచ్‌పీ అధ్యక్షుడు శరద్ శర్మ మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణంపై ఎలా ముందుకెళ్లాలనేది ఇంకా నిర్ణయించలేదన్నారు. దీనిపై రామ్ జన్మభూమి న్యాస్ సభ్యులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ దృష్టంతా దేశంలో శాంతిపైనే ఉందని శర్మ వ్యాఖ్యానించారు. కాగా, 1984 లో ఈ ఆలయానికి నిర్మాణానికి వీహెచ్‌పీ భూమి పూజను నిర్వహించింది. భక్తుల నుంచి పావలా, ఒక రూపాయి ప్రాథమికంగా విరాళంగా సేకరించింది. నిర్మాణానికి మొత్తం రూ .8 కోట్లు విరాళాలు అందినట్టు వీహెచ్‌పీ ఆఫీస్ బేరర్లు తెలిపారు.
↧
November 9, 2019, 11:49 pm
![]()
రైలు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారపడి భార్యభర్తలు మృతి చెందిన ఘటన విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లాకు చెందిన దంపతులు మృతి చెందారు. వీరిని విజయనగరం జిల్లా గరివిడి మండల వెదుళ్లవలస గ్రామానికి చెందిన కె.వెంకటరమణారావు(40), మణి(35)గా గుర్తించారు. వీరు శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి విశాఖకు ప్రత్యేక రైళ్లో స్వగ్రామానికి బయలుదేరారు. విశాఖకు సమీపంలోని దువ్వాడలో మణి తల్లిదండ్రులు ఉండటంతో అక్కడకు వెళ్లాలని భావించారు. ఈ క్రమంలో రైలు ఆదివారం తెల్లవారుజామున దువ్వాడ స్టేషన్‌కు చేరుకోగా దిగేందుకు ప్రయత్నించారు.
నాలుగో నెంబరు ప్లాట్‌ఫాం వద్ద రైలు దిగేందుకు ప్రయత్నించి.. ప్రమాదవశాత్తు పట్టాలపై జారిపడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడిన వెంకటరమణ, మణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై స్పందించిన జీఆర్పీ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం అనకాపల్లి హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి వెంకటరమణ బంధువులకు సమాచారం అందజేశారు.
↧
November 9, 2019, 11:53 pm
![]()
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా . లాంగ్ గ్యాప్ తరువాత బన్నీ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీకి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది.
ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్‌తో పాటు రెండు పాటలను రిలీజ్ చేశారు. రెండు పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సామజవరగమనా పాట అన్ని ప్లాట్ ఫామ్స్‌లో సూపర్ హిట్ అయ్యింది. అందుకే పాట చిత్రీకరణ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధా తీసుకున్నారు చిత్రయూనిట్. ఆడియో సూపర్ హిట్ కావటంతో వీడియో సాంగ్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read:
ఆ అంచనాలను అందుకునే స్థాయిలో డిఫరెంట్ లోకేషన్స్‌లో గ్రాండ్‌గా చిత్రీకరిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణ కోసం యూనిట్ పారిస్ వెళ్లారు. ప్రస్తుతం పారిస్‌లోని సుందరమైన లోకేషన్స్‌లో పాట చిత్రీకరణ జరుగుతోంది. అయితే తాజాగా ఈ పాటకు మరో అరుదైన ఘనత దక్కినట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. ఇప్పటికే ఈఫిల్ టవర్ ప్రాంతంలో పాట చిత్రీకరణ జరిగింది.
Also Read:
తాజాగా మరో ఐకానిక్ లోకేషన్‌లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత డ్యాన్స్ ట్రూప్ లీడో టీంతో కలిసి బన్నీ, పూజాలు ఆడిపాడనున్నారు. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది చిత్రంగా అల వైకుంఠపురములో రికార్డ్ సృష్టించనుంది. లీడో ట్రూప్‌కు కూడా సామజవరగమన పాట బాగా నచ్చిందని చిత్రయూనిట్ తెలిపారు.
ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో యంగ్ హీరో సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్, సీనియర్ నటి టబు, మలయాళ నటుడు జయరామ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Also Read:
↧
↧
November 10, 2019, 12:09 am
![]()
అమెరికాలో ఘోర ఘటన వెలుగుచూసింది. తండ్రీ కూతుళ్లు ఓ మహిళను కిడ్నాప్ చేసి వారం రోజుల పాటు పలు ప్రాంతాలు తిప్పుడూ అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని చిత్రహింసలు పెడుతూ పైశాచికానందం పొందారు. అపస్మాకరస్థితికి చేరుకున్న బాధితురాలిని ఎడారిలో వదిలేసి వెళ్లిపోయారు.
Also Read:
లాస్‌వేగాస్‌కు చెందిన ఓ మహిళకు స్థానికంగా నివసించే స్టాన్లీ అల్‌ఫ్రెడ్ లాటన్(54), అతడి కూతురు నికోల్ లాటన్(22) పరిచయస్థులు. ఆ మహిళను అక్టోబర్ 30న తమ ఇంటికి ఆహ్వానించిన తండ్రీకూతుళ్లు ఆమెను బంధించారు. మహిళ బ్యాగులో ఉన్న డబ్బులన్నీ తీసేసుకుని చిత్రహింసలు పెట్టారు. తర్వాత ఓ కారులో ఆమెను ఎక్కించి అనేక ప్రాంతాలు తిప్పారు. స్టాన్లీ బాధితురాలిపై కారులోనే కూతురి ఎదురుగానే అనేకసార్లు అత్యాచారం చేశాడు. తనను వదిలేయాలని మహిళ వేడుకున్నా ఆ ఇద్దరూ కనికరించలేదు. వారం రోజుల పాటు ఆమెకు కనీసం ఆహారం కూడా పెట్టకుండా వేధించారు. బాధితురాలు అపస్మారక స్థితికి వెళ్లిపోవడంతో ఆమెను లాస్‌ఏంజెల్స్‌లోని ఎడ్వర్డ్స్ ఎయిర్‌ఫోర్న్ బేస్ సమీపంలోని ఎడారిలో వదిలేసి వెళ్లిపోయారు. అటుగా వెళ్తున్న సైనికులు బాధితురాలిని గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
Also Read:
ఈ ఘటనపై లాస్‌ఏంజెల్స్ కౌంటీ మేయర్ కెప్టెన్ హెర్నాండెజ్ స్పందిస్తూ.. తనను స్టాన్టీ, అతడి కూతురు తుపాకీతో బెదిరించి వారం రోజుల పాటు నరకం చూపించినట్లు బాధితురాలు తెలిపిందని వెల్లడించారు. ఆమెను ఎడారిలో సైనికులు చూడకపోతే చనిపోయేదని తెలిపారు. బాధితురాలికి ఆరోగ్యం మెరుగవడంతో ఇంటికి తరలించామని, ఆమె ప్రాణాలతో బయటపడటం అదృష్టమేనని హెర్నాండెజ్ అన్నారు. బాధితురాలి వాంగ్మూలంతో పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు వారిద్దరికి బెయిల్ మంజూరు చేసింది.
Also Read:
↧
November 10, 2019, 12:47 am
![]()
ఆర్టీసీ కార్మికులు శనివారం చేపట్టిన చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం హింసాత్మకంగా మారి ఆందోళనకారులపై పోలీసులు దాడిచేసిన విషయం తెలిసిందే. పోలీసుల దాడిలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మహిళలపై కూడా పోలీసులు దాష్టికాన్ని ప్రదర్శించడంపై కార్మిక సంఘాలు, పలు పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ట్యాంక్‌బండ్ వద్ద శనివారం జరిగిన దమకాండను ఖండిస్తున్నామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. కార్మికులపై జరిగిన దాడిని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఖండించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ యూనియన్ కార్యాయంలో అఖిలపక్షం నేతలతో ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీ నాయకులు ఆదివారం సమావేశమయ్యారు. ట్యాంక్‌బండ్ ఘటన, భవిష్యత్ కార్యాచరణ, విపక్షాల మద్దతు, సోమవారం హైకోర్టు విచారణ తదితర అంశాలపై చర్చించారు.
అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఛలో ట్యాంక్‌బండ్’ కార్యక్రమం విజయవంతం చేసిన అందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్ల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. నవంబరు 18న రాష్ట్ర వ్యాప్తంగా సడక్‌బంద్ నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. మంగళవారం నుంచి నలుగురు జేఏసీ నేతలు నిరవధిక నిరాహార దీక్షలో కూర్చుంటారని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌పై శనివారం నిర్వహించిన నిరసనలో మావోయిస్టులు ఎవరూ లేరని అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యానించారు.
హైకోర్టు సూచనల మేరకు ఆర్టీసీ సమ్మెపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు ఎలా వస్తుందో తెలియకుండా సుప్రీంను ఆశ్రయిస్తామని సీఎం అనడం సమంజసం కాదని, ఇప్పటికైనా చర్చలకు పిలవాలని అశ్వత్థామరెడ్డి కోరారు. ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకొచ్చి చర్చలు జరిపేలా కృషి చేయాలని, నిన్న కేవలం ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాలు మాత్రమే ‘చలో ట్యాంక్‌బండ్’ కార్యక్రమంలో పాల్గొన్నాయని స్పష్టం చేశారు.
↧
November 10, 2019, 12:49 am
![]()
మరికొద్ది గంటల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఫంక్షన్ హాల్లో బంధువులు ఆర్తనాదాలు వెల్లువెత్తాయి. అప్పటివరకు సంతోషంగా ఉన్న పెళ్లివారంతా విషాదంలో ముగినిపోయారు. పెళ్లి పీటలెక్కి నూతన జీవితానికి నాందిపలకాల్సిన పెళ్లికొడుకు చేసుకోవడమే ఈ విషాదానికి కారణం.
Also Read:
హైదరాబాద్‌కు చెందిన సందీప్(24) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు ఇటీవల అతడికి ఓ యువతితో వివాహం నిశ్చయించారు. ఆదివారం కొంపల్లిలోని శ్రీ ఫంక్షన్ హాల్లో ఘనంగా పెళ్లి చేసేందుకు ఏర్పాటు చేశారు. శనివారం రాత్రే పెళ్లివారంతా అక్కడికి చేరుకున్నారు. మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉన్న సమయంలో సందీప్ తన గదిలో ఉరేసుకున్నాడు.
Also Read:
ఈరోజు ఉదయం ఫ్యాన్‌కు వేలాడుతున్న సందీప్‌ను చూసి కుటుంబసభ్యులు షాక్ తిన్నారు. వెంటనే అతడికి కిందికి దించి చూడగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అప్పటివరకు సందడిగా ఉన్న వివాహ వేదిక కాస్త విషాదంగా మారిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సందీప్ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రేమ వ్యవహారంతోనే ఇలా చేశాడా? ఇతర కారణాలేవైనా ఉన్నాయా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
↧
November 10, 2019, 1:38 am
![]()
ప్రేమించిన వ్యక్తి దక్కలేదన్న అక్కసుతో ఓ యువతి దారుణానికి పాల్పడింది. తాను ప్రేమించిన వ్యక్తి వేరే యువతి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో అతడి ఇంటికి వెళ్లి భార్య గొంతు కోసేసింది.అ ఘటన జిల్లా కేంద్రంలో కలకలం రేపింది.
Also Read:
అనంతపురంలోని మహాత్మాగాంధీ కాలనీలో నివసించే శ్రీనివాసులు అనే యువకుడు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడిని అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమించింది. అయితే ఈ విషయాన్ని మాత్రం అతడికి చెప్పడంతో తన ప్రేమను మనసులోనే దాచుకుంది. ఈ విషయం తెలియని శ్రీనివాసులు మహేశ్వరి(19) అనే యువతిని ప్రేమించి పెద్దలకు ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.
Also Read:
ఈ విషయం తెలుసుకున్న యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. శ్రీనివాసులును తనను దక్కకుండా చేసిన మహేశ్వరిపై పగ పెంచుకుంది. ఆమెను అడ్డు తొలగించుకుంటే అతడి తానే పెళ్లి చేసుకోవచ్చని భావించింది. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్కడికి వెళ్లి యువతి మహేశ్వరితో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలోనే వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి పరారైంది. బాధితురాలి కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు మహేశ్వరి ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి అని కుటుంబసభ్యులు తెలిపారు.
Also Read:
↧
↧
November 10, 2019, 1:41 am
![]()
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌పై ట్వీట్ చేసిన బీసీసీఐ అధ్యక్షుడు చిక్కుల్లో పడ్డాడు. నాగ్‌పూర్ వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకి ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టీ20 సిరీస్ విజేతగా నిలవనుంది. ఢిల్లీలో జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్, రాజ్‌కోట్‌లో ముగిసిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే.
Read More:
‘భారత్, బంగ్లాదేశ్ మధ్య సిరీస్ పోరు పతాకస్థాయికి చేరింది. సిరీస్ ఇప్పటికే 1-1తో సమమవడంతో విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20పై ఉత్కంఠ నెలకొంది. రెండో టీ20లో గెలిచిన టీమిండియా మూడో టీ20లోనూ ఆ విజయపరంపరని కొనసాగిస్తుందా..? లేదా సిరీస్‌లో బంగ్లాదేశ్ మళ్లీ పుంజుకుంటుందా..? మై11 సర్కిర్‌లో మీరు జట్టుని ఎంపిక చేసుకుని నా జట్టుని ఓడించండి.. అలానే ప్రైజ్‌లు గెలవండి’ అని గంగూలీ ట్వీట్ చేశాడు.
Read More:
బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ ఇలా ఓ క్రికెట్ ఫాంటసీ వెబ్‌సైట్‌ని ప్రమోట్ చేయడమేంటి..? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గంగూలీ ట్వీట్ కారణంగా బీసీసీఐ ప్రస్తుత అఫిషియల్ పార్ట్‌నర్‌గా ఉన్న క్రికెట్ ఫాంటసీ వెబ్‌సైట్ డ్రీమ్ 11పై ఆ ప్రభావం పడుతుందని.. ఇది ఎంత వరకూ న్యాయం..? అని దాదాని సోషల్ మీడియాలో అడుగుతున్నారు.
బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్ గతంలోనే రాహుల్ ద్రవిడ్, కపిల్‌దేవ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు సౌరవ్ గంగూలీకి కూడా విరుద్ధ ప్రయోజనాల అంశం కింద షోకాజ్ నోటీసులు జారీ చేశాడు. బీసీసీఐ పదవుల్లో ఉంటూ.. క్రికెట్ సంబంధిత లేదా అనుబంధంగా ఉన్న వాటిల్లో ఎలాంటి పదవులు, బాధ్యతలు చేపట్టకూడదు. దీంతో.. గంగూలీ, ద్రవిడ్, సచిన్.. క్రికెట్ సలహా కమిటీకి అప్పట్లో రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా గంగూలీ చర్యపై డీకే జైన్ ఏ విధంగా స్పందిస్తాడో..? చూడాలి. మై11 సర్కిల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఇప్పటికీ గంగూలీ కొనసాగుతున్నట్లు తాజా ట్వీట్ ద్వారా స్పష్టమైంది.
↧
November 10, 2019, 1:31 am
![]()
అధినేత చంద్రబాబుపై ట్విటర్ వేదికగా విమర్శలు చేస్తుంటారు ఎంపీ విజయసాయి రెడ్డి. అందుకు దానికి ప్రతిగా తెలుగుదేశం నుంచి కూడా కొందరు నేతలు కౌంటర్ ఇస్తుంటారు. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు సాధారణమే అయినా.. మాత్రం ఈ మధ్య డోస్ బాగా పెంచేసినట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు టార్గెట్‌గా ఘాటు విమర్శలు చేస్తున్నారు. తాజాగా విజయసాయి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
Also Read: దేశ ఆర్థిక వ్యవస్థపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విజయసాయి ఘాటుగా స్పందించారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని 2.60 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టేశారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి నెలా ఓవర్ డ్రాఫ్ట్ కోసం ఆర్బీఐ వద్ద బొచ్చె పట్టుకుని నిల్చునేవాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారని.. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమేనని ప్రధానికి పాఠాలు చెప్తాడట! అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారా అమర్త్యాసేన్ అంటూ ఎద్దేవా చేశారు.
Read Also:
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తన హయాంలో నిర్మించినట్లు చంద్రబాబు చెప్పడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఔటర్ రింగ్ రోడ్డును దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పూర్తి చేశారని.. అది ముమ్మాటికీ ఆయన ఘనతేనన్నారు. రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునేందకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నించారని దుయ్యబట్టారు.
Also Read:
ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా అనేక మందితో చంద్రబాబు కేసులు వేయించారని ఎంపీ ఆరోపించారు. రోడ్డుకు అవసరమైన భూ సేకరణను అడ్డుకున్నాడన్నారు. న్యాయస్థానాలతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోరాడి రోడ్డు నిర్మాణాన్ని 90 శాతం పూర్తి చేశారని చెప్పారు. ఇప్పుడు 430 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్.. ఔటర్ రింగ్ రోడ్డు తానే నిర్మించానని కోతలు కోస్తున్నాడని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
↧
November 10, 2019, 1:33 am
![]()
పెళ్లి తరువాత టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న బ్యూటీ సమంత. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న , పెళ్లి తరువాత పాత్రల ఎంపికలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్న ఈ భా, నటనకు ఆస్కారం ఉన్న పాత్రల కోసం ఎదురుచూస్తోంది.
ఇటీవల వరుసగా యూ టర్న్, , మజిలీ సినిమాలతో ఆకట్టుకున్న సమంత ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ మూవీ 96కు రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంతకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయ్యింది. దీంతో తన తదుపరి చిత్రాల మీద దృష్టి పెట్టింది సామ్.
Also Read:
తరువాత సమంత ఏ ప్రాజెక్ట్‌ను అంగీకరించలేదు. ఓ వెబ్ సీరిస్‌లో నటించేందుకు ఓకే చెప్పిన అది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. దీంతో సమంత చేయబోయే నెక్ట్స్ సినిమా ఏంటన్న చర్చ మొదలైంది. సరైన లేడీ ఓరియంటెడ్ కథల కోసం ఎదురుచూస్తున్న సామ్, కొత్త దర్శకులతో అయిన సినిమాకు రెడీ అంటోంది.
Also Read:
రెగ్యులర్ ఫార్ములా సినిమాలకు భిన్నంగా ఉండే కథలు ఎవరైన తీసుకువస్తే తాను చేసేందుకు రెడీ అంటోంది. అంతేకాదు కథ డిమాండ్ చేస్తే బోల్డ్‌గా నటించేందుకు అయినా ఓకే అంటోంది. 96 రీమేక్ తరువాత ప్రస్తుతం బ్రేక్ తీసుకున్న సామ్.. త్వరలోన తదుపరి చిత్రాన్ని ఫైనల్ చేసే పనిలో ఉంది. మరి సమంతను మెప్పించే ఆ దర్శకుడు ఎవరో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read:
↧
November 10, 2019, 1:37 am
![]()
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా రూపొందనున్న తొలి సినిమా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజాకార్యక్రమాలు నిర్వహించి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. హీరోహీరోయిన్లు అశోక్, నిధి అగర్వాల్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్లాప్‌నిచ్చారు. మరో హీరో రానా దగ్గుబాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అశోక్ తాతయ్య సూపర్ స్టార్ కృష్ణ స్క్రిప్ట్‌ను దర్శక నిర్మాతలకు అందించారు.
Also Read:
సందడిగా జరిగిన ఈ కార్యక్రయంలో గల్లా కుటుంబ సభ్యులు రామచంద్రనాయుడు, అరుణ కుమారి, జయదేవ్, పద్మావతితో పాటు నటుడు వీకే నరేశ్, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే, టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా విచ్చేశారు. అంతేకాకుండా, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మహేష్ బాబు అభిమానులు భారీఎత్తున పాల్గొన్నారు. అయితే, సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఈ వేడుకలో పాల్గొనలేదు. దీనికి గల కారణాలు తెలియరాలేదు.
కాగా, ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’, ‘దేవదాస్’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణ కుమారి సమర్పణలో అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
↧
↧
November 10, 2019, 2:03 am
![]()
భారత్‌తో విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20కి ముందు బంగ్లాదేశ్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాగ్‌పూర్ వేదికగా ఆదివారం రాత్రి 7 గంటల నుంచి మూడో టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌కి గాయం కారణంగా ఆల్‌రౌండర్ మసదేక్ హుస్సేన్, ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. గురువారం రాజ్‌కోట్‌లో జరిగిన రెండో టీ20 సమయంలో గాయపడిన ఈ ఇద్దరూ శనివారం ప్రాక్టీస్ సెషన్‌కి హాజరుకాలేదు. నవంబరు 14 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో.. ఈ ఇద్దరికీ విశ్రాంతినివ్వాలని బంగ్లాదేశ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
స్పిన్ ఆల్‌రౌండర్ హుస్సేన్ రెండో టీ20లో పేలవ బౌలింగ్‌తో నిరాశపరిచాడు. లయ తప్పిన అతని బౌలింగ్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఉతికారేశాడు. అతను వేసిన తొలి ఓవర్‌లో ఫస్ట్ మూడు బంతుల్నీ సిక్సర్లుగా మలిచిన రోహిత్ శర్మ.. మొత్తంగా ఆ ఓవర్‌లో 21 పరుగులు రాబట్టాడు. ముస్తాఫిజుర్ కూడా సిరీస్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ కనబర్చలేదు. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉన్నా.. ముస్తాఫిజుర్ మాత్రం ధారాళంగా పరుగులిచ్చేశాడు.
ఇప్పటికే నిషేధం కారణంగా షకీబ్ అల్ హసన్ సేవల్ని కోల్పోయిన బంగ్లాదేశ్.. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ కూడా టూర్‌కి హ్యాండ్ ఇవ్వడంతో బలహీనంగా కనిపిస్తోంది. అయినప్పటికీ.. తొలి టీ20లో ముష్ఫికర్ రహీమ్ మెరుపు హాఫ్ సెంచరీ బాదడంతో గెలిచిన ఆ జట్టు.. రెండో టీ20లో రోహిత్ శర్మ జోరుతో పరాజయాన్ని చవిచూసింది. దీంతో.. సిరీస్ 1-1తో సమమైన నేపథ్యంలో.. ఈరోజు మూడో టీ20లో గెలిచి సిరీస్ గెలవాలని ఆశిస్తోంది. కానీ.. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు జట్టుకి దూరమవడం ఆ జట్టుపై ప్రభావం చూపనుంది.
↧
November 10, 2019, 2:02 am
![]()
హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఉద్యోగావకాశాన్ని కల్పిస్తూ ఒబమా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనను ట్రంప్ రద్దుచేసిన విషయం తెలిసిందే. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్‌లో పిల్ దాఖలయ్యింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ట్రంప్ సర్కార్ ఆదేశాల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని దిగువ కోర్టును కోరిన యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్.. క్షుణ్నంగా పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని సూచించింది. అప్పటి వరకు నిబంధనలను నిలుపుదల చేయడం ఉత్తమమని పేర్కొంది.
అలాగే తుది తీర్పును కూడా నిలిపివేయాలని కోరింది. దీంతో వేలాది మంది భారతీయులకు తాత్కాలిక ఉపశమనం లభించింది. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఒబామా సర్కార్ హెచ్-4వీసా విధానాన్ని 2015లో ప్రవేశపెట్టింది. అయితే, దీని వల్ల స్థానికులు నష్టపోతున్నారని, అమెరికాలో ఉద్యోగాలు- స్థానికులకు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన తన హమీ నెరవేర్చే ప్రయత్నంలో హెచ్-1బీ వీసాల జారీ విధానంలో సమూలంగా మార్పులు తీసుకొచ్చారు.
హెచ్-4 వీసాల కింద వేలాది భారతీయులు, ఇతర దేశాల వారు అమెరికా సంస్థల్లో పనిచేస్తున్నారు. హెచ్-1బీ వీసా తర్వాత హెచ్-4 వీసాకు విపరీతమైన డిమాండ్ ఉంది. అమెరికాలోని ఐటీ సంస్థల్లో హెచ్ 1బీ వీసాపై భారతీయులు పెద్దసంఖ్యలో పనిచేస్తున్నారు. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా కాంగ్రెస్‌లో అన్నా జీ ఈషో, లోఫ్‌గ్రీన్‌లు హెచ్-4 ఉద్యోగ రక్షణ చట్టం కింద బిల్లును ప్రవేశపెట్టారు. ఈ వీసాలను రద్దు చేస్తే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందని, ఉద్యోగ విధానాల్లో పారదర్శకత లోపిస్తుందని బిల్లులో పేర్కొన్నారు.
తాజాగా కొలంబియాలోని యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్స్‌కు చెందిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం ఈ ఉత్తర్వులు వెలువరించింది. ఈ అభిప్రాయానికి అనుగుణంగా తదుపరి చర్యల కోసం జిల్లా కోర్టును వివరణ కోరింది. అంతేకాదు, ప్రస్తుతం హెచ్-1బి నాన్-ఇమ్మిగ్రెంట్స్ చట్టబద్దంగా అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు అవకాశం కల్పించడం వల్ల కొంత అసంతృప్తిని తగ్గించవచ్చని న్యాయమూర్తులు అన్నారు.
అయితే, హెచ్-1బి నాన్-ఇమ్మిగ్రెంట్స్, వారి కుటుంబాలు శాశ్వత నివాసం పొందే ప్రక్రియలో తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వివరించింది. ఈ సమయంలో హెచ్-4 వీసాదారులకు ఉద్యోగాలు లభించక వ్యక్తిగత, ఆర్థిక కష్టాలకు దారితీస్తుందని తెలిపింది. అంతేకాదు, ఇది కాలక్రమేణా తీవ్రరూపం దాల్చి చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదాను పొందడానికి స్థానికులకు ప్రోత్సాహకాలను పెంచడం.. ఉన్నత విద్యావంతులు, అధిక నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగాలను నిలుపుకోవడానికి సంస్థల యజమానులకు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది.
↧
November 10, 2019, 2:28 am
![]()
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను తప్పనిసరి చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు మీడియంలో బోధన నిలిపివేయడం తగదని, ఇప్పటి వరకు తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారిగా ఇంగ్లిష్ మీడియంకు మారాలంటే విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలన్న డిమాండ్లు వినపడుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను కొనసాగించాలని విపక్షాలు ఆందోళనలకు దిగుతున్నాయి. తాజాగా ఇంగ్లిష్ మీడియం వ్యవహారంపై జనసనే అధ్యక్షుడు స్పందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను నిలిపివేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పవన్ తప్పుబట్టారు. తెలుగులో బోధన ఆపేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:
ప్రభుత్వ నిర్ణయం తనను లైబ్రరీకి వెళ్లేలా చేసిందని.. లైబ్రరీలో ఉన్న తెలుగు పుస్తకాలను గౌరవంగా చూసుకున్నట్లు చెప్పారు పవన్. వైఎస్సార్సీపీ నాయకత్వానికి తెలుగు భాషా సంపద ఎంత గొప్పదో అర్థం కావడం లేదని విమర్శించారు. విలువ తెలిసి ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం నిర్ణయం తీసుకుని ఉండేవారు కాదని ఆయన వ్యాఖ్యానించారు.
పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ని చూసి నేర్చుకోవాలని సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ యాసని.. సంస్కృతిని కాపాడుకోవడానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. 2017లో హైదరాబాద్‌లో నిర్వహించిన తెలుగు మహాసభలను ప్రస్తావించారు. భాష, సంస్కృతిని కాపాడుకోవడంలో వైఎస్సార్సీపీ నాయకత్వం కేసీఆర్‌ని చూసి పాఠాలు నేర్చుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also:
↧
November 10, 2019, 2:39 am
![]()
ప్రముఖ వ్యాపారవేత్త, పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ హీరోగా తొలి చిత్రం ప్రారంభమైంది. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో చిత్ర ప్రారంభోత్సవం ఆదివారం రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ కృష్ణ, రామ్ చరణ్, రానా దగ్గుబాటి, ఆది శేషగిరిరావు, సుధీర్ బాబు అమల అక్కినేని, నమ్రత శిరోద్కర్, సుశాంత్, పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
సినిమా ముహూర్తపు సన్నివేశానికి రామ్ చరణ్ క్లాప్ ఇవ్వగా రానా దగ్గుబాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సూపర్‌స్టార్ కృష్ణ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. సూపర్‌స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి, పద్మావతి గల్లా, జయదేవ్ గల్లా స్క్రిప్ట్‌ను డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యకు అందించారు.
Also Read:
సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న అశోక్ గల్లాకు ఆల్ ది బెస్ట్. గల్లా జయదేవ్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. నన్ను బ్రదర్‌లా ట్రీట్ చేస్తుంటారు. ఆయన నిర్మాతగా అశోక్‌తో తొలి సినిమా చేస్తున్నారు. పద్మావతి గారికి, అశోక్‌కి, హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ఆల్ ది బె వెరీ బెస్ట్ తెలువుతున్నాను’’ అన్నారు.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘‘అశోక్ గల్లాకి ఆల్ ది వెరీ బెస్ట్. మంచి కథ, కథనాలతో కూడిన సినిమాతో అశోక్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుండటం సంతోషంగా ఉంది. నిర్మాతగా పద్మగారు లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా మూవీ యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్ తెలువుతున్నాను’’ అని అన్నారు.
Also Read:
హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. ‘‘అశోక్ చాలా పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చినా సరే గ్రౌండ్ లెవల్లో వర్క్ చేసుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమాల్లోకి రాకముందు తాను ఎంతో హోమ్ వర్క్ చేసాడు. కచ్చితంగా తను సక్సెస్ సాధిస్తాడు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య సహా ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు’’ అని అన్నారు.
↧
↧
November 10, 2019, 3:25 am
![]()
వ్యభిచార ముఠాలు కొత్త దారులు వెతుక్కున్నట్లు కనిపిస్తోంది. చిన్న నగరాలు, పట్టణాలను టార్గెట్ చేసి గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో పోలీసుల నిఘా పెరగడంతో నయా దారులు ఎంచుకుంటున్నారు. పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు మాయమాటలు చెప్పి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. ఫ్యామిలీతో అద్దెకు ఉంటామని చెప్పి ఇళ్లను కిరాయికి తీసుకొని సుదూర ప్రాంతాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నారు. పట్టణంలో బయటపడ్డ ద్వారా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
జనగామ పట్టణంలో హైటెక్ సెక్స్ రాకెట్ బయటపడింది. కొంత మంది మహిళలు ముఠాగా ఏర్పడి పట్టణంలో హైటెక్ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు.. వ్యభిచారం నిర్వహిస్తున్న ఆరుగురు మహిళలు, ఇద్దరు విటులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also Read:
సీఐ మల్లేశ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా కేంద్రంలోని యశ్వంతపూర్ రోడ్డుతో పాటు గిర్నిగడ్డ ప్రాంతాల్లో కొంత మంది వ్యక్తులు ఫ్యామిలీలతో ఉంటామని ఇళ్లు అద్దెకు తీసుకున్నారు. అయితే.. ఆ గృహాల్లో మహిళల ప్రవర్తనపై స్థానికులకు అనుమానం కలిగింది. వ్యభిచారం నిర్వహిస్తున్నారనే అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వ్యభిచారాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. గురువారం (నవంబర్ 7) ప్రత్యేక నిఘా పెట్టి ఆరుగురు మహిళలు, ఇద్దరు విటులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని కాచిగూడకు చెందిన కీర్తి మల్లీశ్వరి, మల్కాజిగిరికి చెందిన బి సుజాత.. జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన గాదె జశ్వంత, కొడవటూరు గ్రామానికి చెందిన మణిపురం బుచ్చమ్మతో కలిసి జనగామ పట్టణంలో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Must Read:
నిందితులు హైదరాబాద్‌తో పాటు ఏపీలోని రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి యువతులను రప్పించి జనగామలో కొద్ది రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమాయకులైన నిరుపేద అమ్మాయిలను లక్ష్యం చేసుకొని వ్యభిచార కూపిలోకి లాగి, ఈ దందాను జోరుగా సాగిస్తున్నట్లు సీఐ మల్లేశ్ తెలిపారు.
ఈ కేసులో నిందితులైన నలుగురు మహిళలతో పాటు ఎ ఆంజనేయులు, జీ నరేందర్ అనే ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్స్ రాకెట్ మూలాలు ఎక్కడెక్కడో ఉన్న నేపథ్యంలో ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు సీఐ మల్లేశ్ చెప్పారు. ఈ కేసులో మరో ముగ్గురు మహిళలను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు.
Don't Miss:
ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వివరాలు చెక్ చేసుకోవాలని.. ఎవరికి పడితే వారికి ఇళ్లను కిరాయిలకు ఇవ్వొద్దని పోలీసులు సూచించారు. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు.
↧
November 10, 2019, 3:10 am
![]()
ప్రముఖ వ్యాపారవేత్త, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్‌గా హీరోగా పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. తన కొడుకుని హీరోగా పరిచయం చేయడానికి సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌ను కూడా స్థాపించారు జయదేవ్. అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్ అనే సంస్థను స్థాపించి తొలి ప్రొడక్షన్‌గా తన కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. నిధి అగర్వాల్ హీరోయిన్. ఈ సినిమాను ఆదివారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభించారు.
Also Read:
ఈ సందర్భంగా ఎంపీ జయదేవ్ మాట్లాడుతూ.. ‘‘అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థను చాలా రోజుల క్రితమే రిజిష్టర్ చేశాం. కేవలం సినిమాలే కాదు.. టెలివిజన్ రంగంలోనూ కొత్త కంటెంట్‌ను అందించాలని మేం భావిస్తున్నాం. అలాగే నా భార్య పద్మావతి సూపర్‌స్టార్ కృష్ణ కుమార్తె అన్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగానే కాదు.. డైరెక్టర్‌గా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తన మార్కును క్రియేట్ చేశారు. ఇప్పుడు మా ఫ్యామిలీ నుండి అశోక్ గల్లాను హీరోగా పరిచయం చేస్తున్నాం.
శ్రీరామ్ ఆదిత్యగారు డైరెక్ట్ చేసిన గత రెండు చిత్రాలు చూశాను. చాలా బావున్నాయి. నచ్చాయి. ఇది కూడా తప్పకుండా అందరినీ మెప్పించేలా ఉంటుంది. అశోక్‌కి చిన్నప్పటి నుండే సినిమాలంటే ఇష్టం. మా మావయ్య కృష్ణగారి సినిమాల్లో చిన్నప్పుడు యాక్ట్ చేశాడు. కృష్ణగారే తన ఫస్ట్ నిర్మాత, దర్శకుడు. అలాగే ‘నాని’ సినిమాలో సూపర్‌స్టార్ మహేష్‌తో యాక్ట్ చేశాడు.
అశోక్ 7వ తరగతి నుండి ఇంటర్ వరకు సింగపూర్‌లో చదివాడు. ఆ సమయంలో తను డ్రామా అనే సబ్జెక్ట్‌ను ఎంచుకుని నేర్చుకున్నాడు. డిగ్రీని కూడా టెక్సాస్ ఫిల్మ్ అండ్ టెలివిజన్‌లోనే చేశాడు. తర్వాత రెండు, మూడు ఏళ్లు హార్డ్ వర్క్ చేసి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు’’ అని చెప్పారు.
నిర్మాత పద్మావతి గల్లా మాట్లాడుతూ.. ‘‘అమర రాజా గ్రూప్ చాలా పెద్ద సంస్థ. మేం మొదలు పెట్టిన అన్ని సంస్థలు గొప్పగా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థను మొదలు పెట్టాం. ఈ వెంచర్ కూడా మిగతా వాటిలా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం. అశోక్ చిన్నప్పటి నుండి హీరో కావాలని ఎంతో కష్టపడ్డాడు. తను పెద్ద యాక్టర్ కావాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
↧
November 10, 2019, 3:13 am
![]()
ఇండియన్ రైల్వేస్‌కు చెందిన రైల్వే ఇటికెటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్‌సీటీసీ తాజాగా మరో అదిరిపోయే టూర్ ప్యాకేజ్‌ను ప్రకటించింది. స్ల్పెండర్స్ ఆఫ్ దుబాయ్ పేరుతో టూర్ ప్యాకేజ్‌ను అందిస్తోంది. హైదరబాద్ నుంచి ఈ టూర్ ప్రారంభమౌతుంది. బూర్జ్ ఖలిఫా సహా పలు ప్రాంతాలను చూసి రావొచ్చు. ఈ టూర్ ఐదు రోజులు ఉంటుంది.
హైదరాబాద్- దుబాయ్ టూర్ కేవలం 25 మందికే అందుబాటులో ఉంటుంది. 2019 డిసెంబర్ 2, 2020 ఫిబ్రవరి 3, 2020 మార్చి 8 తేదీల్లో టూర్ ప్రారంభమౌతుంది. టూర్ ప్యాకేజీ ధర రూ.61,950 నుంచి ప్రారంభమౌతుంది.
Also Read:
టూర్ హైదరాబాద్ ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రారంభమౌతుంది. ఉదయం పది గంటలకు ఫ్లైట్ ఉంటుంది. డైరెక్ట్ దుబాయ్ వెళ్లొచ్చు. లంచ్ అయిపోయిన తర్వాత హోటల్‌కు తీసుకెళ్తారు. సాయంత్రం డెజర్ట్ సఫారీకి వెళ్లొచ్చు. డిన్నర్ కూడా అక్కడే ఉంటుంది.
Also Read:
తర్వాత ఉదయం హోటల్‌లో టిఫెన్ చేసిన తర్వాత దుబాయ్ సిటీ టూర్ ఉంటుంది. దుబాయ్ మ్యూజియం వంటివి చూపిస్తారు. బూర్జ్ ఖలిఫాలో లైట్ అండ్ షో కార్యక్రమం ఉంటుంది. రాత్రికి హోటల్‌కు వచ్చేస్తారు. ఉదయం అబుదాబి వెళ్తారు. రాత్రికి హోటల్‌కు రావాలి. తర్వాతి రోజు దుబాయ్‌లోనే షాపింగ్ చేసేందుకు వెళ్లొచ్చు. తర్వాత ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి విమానం ఎక్కి హైదరాబాద్‌కు రావాల్సి ఉంటుంది.
Also Read:
పోయిరావడానికి విమాన టికెట్లు, అక్కడ హోటల్, ఫుడ్ సహా బూర్జ్ ఖలిఫా, గ్లోబల్ విలేజ్, మిరాకిల్ గార్డెన్, ఇతర సైట్‌సీయింగ్ ఎంట్రెన్స్ టికెట్ ఖర్చులు వంటివి అన్నీ ఐఆర్‌సీటీసీనే భరిస్తుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉచితంగా అందిస్తుంది.
Also Read:
↧