Quantcast
Channel: Telugu News, తెలుగు వార్తలు, Latest Telugu News, Telugu News Today Live, Telugu Varthalu, ఈరోజు వార్తలు, Online Telugu News, తెలుగు న్యూస్ లైవ్ - Samayam Telugu
Viewing all 81590 articles
Browse latest View live

SBI ఖాతాదారులకు అలర్ట్.. ఈరోజు నుంచి 3 కొత్త రూల్స్ అమలులోకి.. కస్టమర్లపై ఎఫెక్ట్!

$
0
0
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టే్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో మీకు అకౌంట్ ఉందా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంక్ కొన్ని రూల్స్‌ను మార్చేసింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవి ఈ రోజు నుంచే (నవంబర్ 10) అమలులోకి వచ్చాయి. దీంతో బ్యాంక్ ఖాతాదారులపై ప్రభావం పడనుంది. స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లు ఝలక్ ఇచ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఏకంగా 15 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. ఏడాది నుంచి రెండేళ్లలోపు ఎఫ్‌డీలకు ఇది వర్తిస్తుంది. దీంతో బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే ఇకపై తక్కువ రాబడి వస్తుంది. Also Read: అంతేకాకుండా ఎస్‌బీఐ బల్క్ డిపాజిట్ (రూ.2 కోట్లకు పైన) రేట్లను కూడా తగ్గించేసింది. వీటిపై వడ్డీ రేటును ఏకంగా 30 నుంచి 75 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. వ్యవస్థలో సరిపడినంత లిక్విడిటీ ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని బ్యాంక్ తెలిపింది. Also Read: ఎస్‌బీఐ లేటెస్ట్ ఎఫ్‌డీ రేట్లను గమనిస్తే.. 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలకు 4.5 శాతం, 46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీలకు 5.5 శాతం, 180 రోజుల నుంచి 210 రోజుల ఎఫ్‌డీలకు 5.8 శాతం, 211 రోజుల నుంచి ఏడాది లోపు డిపాజిట్లకు 5.8 శాతం వడ్డీ లభిస్తుంది. Also Read: ఏడాది నుంచి 2 ఏళ్ల వరకు ఎఫ్‌డీలకు 6.25 శాతం వడ్డీ వస్తుంది. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 6.25 శాతం వడ్డీ పొందొచ్చు. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు ఎఫ్‌డీలకు 6.25 శాతం వడ్డీ సొంతం చేసుకోవచ్చు. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఎఫ్‌డీలకు 6.25 శాతం వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు వీటి కన్నా ఎక్కువ వడ్డీ లభిస్తుంది. Also Read: ఎస్‌బీఐ తన కస్టమర్లకు షాక్‌తోపాటు తీపికబురు కూడా అందించింది. రుణ రేట్లను తగ్గించింది. మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)లో 5 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. బ్యాంక్ రుణ రేట్లు తగ్గించడం ఇది 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏడో సారి కావడం గమనార్హం. రేట్ల కోత తర్వాత ఎస్‌బీఐ ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8 శాతానికి దిగొచ్చింది. దీంతో తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులోకి వస్తాయి.

CSIR-UGC NET 2019 హాల్‌టికెట్లు వచ్చేశాయి..

$
0
0
దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో లెక్చరర్‌షిప్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్‌ఎఫ్) అర్హత కోసం నిర్వహించనున్న 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్- డిసెంబరు 2019' పరీక్ష హాల్‌టికెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నవంబరు 9న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంయుక్తంగా ఏడాదికి రెండుసార్లు ఈ అర్హత పరీక్షను నిర్వహిస్తాయి. ఈ ఏడాది ప్రథమార్థానికిగాను జూన్ 16న నెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండో విడతగా డిసెంబరు 15న పరీక్ష నిర్వహించనున్నారు. Read Also: పరీక్ష విధానం ఎలా ఉంటుంది..? ★ మొత్తం 5 సబ్జెక్టులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కెమికల్ సైన్సెస్, ఎర్త్/ అట్మాస్ఫియరిక్/ ఓషియన్/ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టు నుంచి మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు. పరీక్షలో సబ్జెక్టుల వారీగా నెగెటివ్ మార్కులు ఉంటాయి. ★ పరీక్ష పేపర్‌లో మూడు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి) విభాగాలుంటాయి. - 'పార్ట్-ఎ' విభాగంలో జనరల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలసిస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్, ఇతర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. - 'పార్ట్-బి', 'పార్ట్-సి' విభాగాల్లో సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు. Dont Miss: రాత పరీక్ష ఎప్పుడు..? డిసెంబరు 15న రాతపరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉ.9.00 గం.- మ.12.00 గం. వరకు మొదటి సెషన్‌లో, మ.2.00 గం.-సా.5.00 గం. వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం 27 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, గుంటూరులో పరీక్ష నిర్వహణ ఉంటుంది. ముఖ్యమైన తేదీలు.. ★ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.09.2019 ★ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 15.10.2019 (11:50 pm) ★ ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 16.10.2019 (11:50 pm) ★ దరఖాస్తు వివరాల సవరణకు చివరితేదీ: 18 - 25.10.2019 ★ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: 09.11.2019 ★ పరీక్ష తేదీ: 15.12.2019 ★ ఫలితాల వెల్లడి: 31.12.2019 Read More . .➦ ➦

UGC NET - 2019 హాల్‌టికెట్లు విడుదల

$
0
0
దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం నిర్వహించనున్న యూజీసీ నెట్ (డిసెంబరు) - 2019 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను నవంబరు 10 విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. యూజీసీనెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూలు ప్రకారం డిసెంబరు 2 నుంచి 6 వరకు నెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. Dont Miss: పరీక్ష విధానం.. ✦ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది. పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. ✦ పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. టీచింగ్, రిసెర్చ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ✦ ఇక పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ✦ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సెషన్‌లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. Read Also: ముఖ్యమైన తేదీలు.. ✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.09.2019 ✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 09.10.2019 (పొడిగించిన తేది: 15.10.2019) ✦ ఫీజు చెెల్లించడానికి చివరితేది: 10.10.2019 (పొడిగించిన తేది: 16.10.2019) ✦ దరఖాస్తుల సవరణకు అవకాశం: 18 - 25.10.2019 వరకు. ✦ అడ్మిట్‌కార్డ్ డౌన్‌లోడ్: 09.11.2019 ✦ నెట్ పరీక్ష తేదీలు: డిసెంబరు 2 - 6 వరకు. ✦ ఫలితాల వెల్లడి: 31.12.2019 Read More.. ➦ ➦

ఆమెకి ఆశ్రయం ఇచ్చారో కటకటాలే.. ఏసీబీ హెచ్చరికలు.. ఎవరో తెలుసా?

$
0
0
భూ సమస్య పరిష్కారం కోసం రూ. 4 లక్షలు లంచం డిమాండ్‌ చేసిన కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనాబీ ఏసీబీకి అడ్డంగా బుక్కైన సంగతి తెలిసిందే. గూడూరుకు చెందిన సురేష్‌ భూ రికార్డులు సరిచేసేందుకు తహసీల్దార్ హసీనాబీ రూ.8 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలున్నాయి. చివరకు రూ.4 లక్షలకు బేరం కుదుర్చుకుంది. లంచం సొమ్ము తీసుకునేందుకు మధ్యవర్తిని పంపిన సమయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సురేష్ నుంచి లక్ష రూపాయలు తీసుకుంటున్న తహసీల్దార్ పంపిన మధ్యవర్తి మహబూబ్‌ బాషాను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. తహసీల్దార్‌ చెప్పడంతోనే డబ్బులు తీసుకునేందుకు వచ్చినట్లు బాషా వెల్లడించడంతో ఏసీబీ అధికారులు తహసీల్దార్‌‌ను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న హసీనాబీ ఆ రోజు నుంచి పరారీలో ఉన్నారు. Also Read: గూడూరు తహసీల్దార్‌ హసీనాబీ తప్పించుకు తిరుగుతున్నారని.. ఆమెకి ఎవ్వరూ ఆశ్రయం కల్పించవద్దని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. హసీనాబీ ఏసీబీ కేసులో ముద్దాయిగా ఉన్నారని, ఆమెకు ఎవరైనా ఆశ్రయం ఇస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆశ్రయం కల్పించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తహసీల్దార్ ఆచూకీ కోసం ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో పలు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలుస్తోంది. తహసీల్దార్ ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కోరారు. హసీనాబీ ఆదేశాల మేరకు లంచం తీసుకున్న మహబూబ్‌ బాషాను శనివారం కోర్టులో హాజరు పరచగా ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్‌ విధించినట్లు డీఎస్పీ తెలిపారు. Read Also:

భార్య వెళ్లిపోయింది, ఒంటరి పురుషుడి పింఛన్ కావాలి.. అసిఫాబాద్ వ్యక్తి డిమాండ్

$
0
0
ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చినట్లే.. తనకూ పింఛన్ ఇవ్వాలని ఓ వ్యక్తి డిమాండ్ చేస్తున్నాడు. తన భార్య తొమ్మిదేళ్ల కిందటే తనను వదిలేసి పోయిందని.. కూలి పనులు చేసుకొని వృద్ధులైన తల్లిదండ్రులను పోషిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కావాలని కోరుతూ గ్రామ సర్పంచికి వినతిపత్రం సమర్పించాడు. ఈ ఆసక్తికర ఘటన కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ‘ఈటీవీ తెలంగాణ’ కథనం ప్రకారం.. అసిఫాబాద్‌ జిల్లా బూరుగూడకి చెందిన ధరణి తిరుపతి తన తల్లిదండ్రులతో కలిసి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. తన భార్య తన నుంచి తొమ్మిదేళ్ల కిందటే విడిపోయిందని.. నాటి నుంచి తాను ఒంటరినైపోయానని చెబుతున్నాడు. కూలి పనులు చేసుకుంటూ వృద్ధులైన తల్లిదండ్రులను పోషించడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. Must Read: తన పేరు మీద భూమి గానీ, ఇతర ఆస్తులు గానీ ఏవీ లేవని తిరుపతి గోడు వెల్లబోసుకున్నాడు. ఒంటరి మహిళలకు నెల నెలా రూ.2016 ఆసరా పింఛన్ అందించినట్లే.. ఒంటరి పురుషుడినైన తనకూ పింఛన్ అందించాలని కోరుతున్నాడు. తన వినతి పత్రంపై స్పందించి ప్రభుత్వం తగిన సాయం చేయాలని కోరాడు. Also Read: తెలంగాణ ప్రభుత్వం.. ఒంటరి మహిళలకు నెల నెలా పింఛను అందిస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో రూ.1016 పింఛన్ ఇవ్వగా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేసీఆర్ సర్కార్ దీన్ని ఇటీవల రూ.2016కు పెంచింది. అయితే.. మహిళల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఈ పింఛన్‌ను తనకూ కావాలని ఓ పురుషుడు కోరడం చర్చనీయాంశంగా మారింది. Photo Credit: ETV Telangana

నో డౌట్.. ప్రభాస్ ‘జాన్’ పాన్ ఇండియా మూవీ, ఇక మూసుకోండి!

$
0
0
మన రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో నేషనల్ స్టార్ అయిపోయారు. ఆల్ ఇండియా లెవల్‌లో ఫ్యాన్ బేస్‌ని సంపాదించుకున్నారు. ‘సాహో’ సినిమా తెలుగులో పెద్దగా రాణించలేకపోయినా బాలీవుడ్‌లో ఓ రేంజ్ కలెక్షన్స్ సాధించిందంటే దానికి కారణం అక్కడ ఆయనకున్న ఫ్యాన్స్. కానీ, కొన్ని హిందీ మీడియా సంస్థలు ప్రభాస్ ఇమేజ్‌ని తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నిస్తున్నాయి. ‘సాహో’ సినిమా హిందీలో లాభాలు తెచ్చిపెట్టినా విమర్శకుల రేటింగ్‌ను పట్టుకుని ఫ్లాప్ అంటున్నాయి. Also Read: వాస్తవానికి ‘సాహో’ హిందీ వర్షన్ రూ.145 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది. మొత్తం మీద అక్కడ నిర్మాతలకైతే నష్టాలు రాలేదు. కానీ, మిగిలిన భాషల్లో మాదిరిగానే హిందీలోనూ ‘సాహో’ ఫ్లాప్ అని హిందీ మీడియా ప్రచారం చేస్తోంది. అంతేకాదు, ప్రస్తుతం ప్రభాస్ చేయబోయే 20వ సినిమా ‘జాన్’ (ఇంకా టైటిల్ ఖరారు కాలేదు) లవ్ స్టోరీ కావడంతో దీన్ని హిందీలో విడుదల చేసే ధైర్యం ప్రభాస్ చేయరని కూడా కథనాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే, దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా అన్ని భాషల్లో విడుదలవుతుందని స్పష్టం చేసింది. Also Read: నిర్మాత ఎస్కేఎన్ కూడా ట్విట్టర్ ద్వారా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో హిందీ వర్షన్ చాలా మంది బాలీవుడ్ స్టార్స్ సినిమాల కన్నా ఎక్కువే వసూలు చేసింది. బాక్సాఫీసు వద్ద స్పష్టమైన విజయాన్ని అందుకుంది. ప్రభాస్ 20వ సినిమా బహుబాషా చిత్రం. హిందీలో కూడా తెరకెక్కుతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొన్ని రోజుల్లో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారీ సెట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది’’ అని ఎస్కేఎన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌తో హిందీ మీడియాను ఇక మూసుకోండి అన్నట్టుగా చెప్పారు ఎస్కేఎన్.

శ్రేయాస్, రాహుల్ హిట్.. బంగ్లా టార్గెట్ 175

$
0
0
నాగ్‌పూర్ వేదికగా ఆదివారం జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కి 175 పరుగుల లక్ష్యాన్ని భారత్ జట్టు నిర్దేశించింది. (62: 33 బంతుల్లో 3x4, 5x6), కేఎల్ రాహుల్ (52: 35 బంతుల్లో 7x4) హాఫ్ సెంచరీలు బాదడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆఖర్లో మనీశ్ పాండే (22 నాటౌట్: 13 బంతుల్లో 3x4) కూడా విలువైన పరుగులు చేయగా.. మరోసారి రిషబ్ పంత్ (6: 9 బంతుల్లో) ఫెయిలయ్యాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో సౌమ్య సర్కార్, సైపుల్ ఇస్లామ్ చెరో రెండు వికెట్లు తీయగా.. అల్ అమిన్ హుస్సేన్ ఒక వికెట్ పడగొట్టాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా భారత్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించాడు. దీంతో.. శిఖర్ ధావన్ (19: 16 బంతుల్లో 4x4)తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ (2: 6 బంతుల్లో) ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఔటైపోగా.. కొద్దిసేపు బ్యాట్ ఝళిపించిన ధావన్ కూడా జట్టు స్కోరు 35 వద్ద పెవిలియన్ చేరిపోయాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి కేఎల్ రాహుల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. Read More: బంగ్లాదేశ్ బౌలర్లని ఉతికారేసిన ఈ జోడీ మూడో వికెట్‌కి 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్న రాహుల్.. ఆ వెంటనే ఔటైనా శ్రేయాస్ అయ్యర్ మాత్రం దూకుడు తగ్గించలేదు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన స్పిన్నర్ ఆపిప్ హుస్సేన్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6 బాదేసిన శ్రేయాస్ టీ20 కెరీర్‌లో ఫస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 144 వద్ద శ్రేయాస్ ఔటవగా.. ఆఖర్లో శివమ్ దూబే (9 నాటౌట్: 8 బంతుల్లో)తో కలిసి మనీశ్ పాండే జట్టుకి మెరుగైన స్కోరుని అందించాడు. Read More:

నేను చచ్చిపోతున్నా.. కలకలం రేపుతున్న దివ్యాంగుడి వీడియో..

$
0
0
అర్ధాంతరంగా ఉద్యోగం నుంచి తీసేస్తే ఏం చేయాలో దిక్కుతోచక ఓ దివ్యాంగుడు ఆత్మహత్యా యత్నం చేశాడు. తాను చనిపోతూ తీసుకున్న వీడియో బయటకు రావడంతో జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. తన వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదని.. తల్లిదండ్రులకు భారం కావడం ఇష్టం లేదని చెబుతూ ఒక్కసారిగా నిద్రమాత్రలు మింగి.. పురుగుమందు తాగేసిన వీడియో సంచలనంగా మారింది. మార్కెట్ యార్డులో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న దివ్యాంగుడు అబ్దుల్ రజాక్ పురుగుమందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. నిద్రమాత్రలు మింగి.. పురుగుల మందు తాగేశాడు. అదంతా వీడియో షూట్ చేయడం సంచలనమైంది. తనకు చావు తప్ప వేరే మార్గం కనిపించడం లేదని.. తన చావుకు ఫలానా వారు కారణమంటూ వీడియో తీశాడు. Also Read: అకారణంగా ఉద్యోగం నుంచి తీసేసి తన పొట్టకొట్టారని.. వికలాంగుడినన్న కనికరం కూడా లేకుండా ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన వల్ల ఎవ్వరికీ ఉపమోగం లేదని.. తల్లిదండ్రులకు భారం కావడం ఇష్టం లేదని చెప్పాడు. తనకు ఆత్మహత్యే శరణ్యమని చెబుతూ ఒక్కసారిగా నిద్రమాత్రలు మింగేసి వెంటనే పురుగుల మందు తాగేశాడు. ఆ వీడియో వైరల్ అవడంతో ఒక్కసారిగా తెనాలి అలజడి రేగింది. అయితే అతని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అబ్డుల్ రజాక్ సహా కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను జూన్‌లోనే ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సమాచారం. అన్నిమార్కెట్ యార్డుల్లో గుట్టుచప్పుడు కాకుండా ఉద్యోగాల నుంచి తీసివేసే తంతు కొనసాగుతోందని.. వైఎస్సార్సీపీ అనుయాయులకు ఇచ్చుకునేందుకేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు నెలలుగా ఖాళీగా ఉండడం.. అప్పుల భారం ఎక్కువవడంతో ఆత్మహత్యా యత్నం చేసినట్లు తెలుస్తోంది. Read Also: అబ్దుల్ రజాక్ ఆత్మహత్యా యత్నంపై రాజకీయ దుమారం రేగుతోంది. అర్ధాంతరంగా ఉద్యోగం నుంచి తీసివేసే సంస్కృతిని ఎన్నడూ చూడలేదని టీడీపీ అధినేత నారా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల కోసం ఉన్నవాళ్లని ఉద్యోగాల నుంచి తొలగిస్తారా? అని ప్రశ్నించారు. రజాక్ ఆత్మహత్యకు పాల్పడుతున్న వీడియోను ట్వీట్ చేస్తూ చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఇది పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కథ: ‘విజయ్ సేతుపతి’ డైరెక్టర్

$
0
0
కొంత మంది దర్శకులు ఒక హీరోని దృష్టిలో పెట్టుకుని కథ రాసుకుంటారు. కానీ, అనుకోని పరిస్థితుల్లో అదే కథను వేరొక హీరోతో చేయాల్సి వస్తుంది. తన పరిస్థితి కూడా అంతే అంటున్నారు ‘విజయ్ సేతుపతి’ దర్శకుడు విజయ్ చందర్. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘సంగతమిళన్’. రాశీఖన్నా హీరోయిన్. నివేద పేతురాజ్ మరో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను తెలుగులో ‘విజయ్ సేతుపతి’ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఈనెల 15న రెండు భాషల్లో ఒకేసారి విడుదలవుతోంది. Also Read: కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు విజయ్ చందర్, ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత రావూరి వి.శ్రీనివాస్, ఇతర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విజయ్ చందర్‌తో ‘సమయం’ కాసేపు ముచ్చటించింది. సినిమా గురించి అడిగి తెలుసుకుంది. ఈ సంభాషణలో విజయ్ చందర్ ఆశ్చర్యకర విషయాలు చెప్పుకొచ్చారు. అసలు ఈ సినిమా కథ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నానని చెప్పారు. కానీ, ఆయన రాజకీయాలతో బిజీ అయిపోవడంతో విజయ్ సేతుపతితో చేశానని అన్నారు. Also Read: తెలుగులో పవన్ కళ్యాణ్ మాదిరిగానే తమిళంలో విజయ్ సేతుపతికి మంచి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, అందుకే కథను ఆయన వద్దకు తీసుకెళ్లానని అన్నారు. కథ నచ్చడంతో విజయ్ సేతుపతి వెంటనే ఓకే చెప్పారని తెలిపారు. టీజర్ చూసి ఇది పక్కా కమర్షియల్ మూవీ అనుకుంటున్నారని, కానీ దీనిలో సోషల్ మెసేజ్ కూడా ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ ఉద్దానం కిడ్నీ సమస్య గురించి పోరాడినట్టే ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక ప్రజా సమస్య గురించి పోరాడతారని చెప్పారు. అంతేకాకుండా, ఈ సినిమాలో విజయ్ సేతుపతి ద్విపాత్రాభినయం చేశారని వెల్లడించారు. Also Read: కాగా, విజయ్ చందర్ ఇప్పటి వరకు రెండు తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. విక్రమ్‌తో చేసిన ‘స్కెచ్’ సినిమా విజయ్ చందర్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. అయితే, తనకు తెలుగులో సినిమాలు చేయాలనే కోరిక ఉందని విజయ్ చందర్ చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ వంటి మాస్ హీరోలతో సినిమాలు చేయడమంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన కోసం కథ సిద్ధం చేస్తానని వెల్లడించారు. తమిళ్ కన్నా తెలుగులో కమర్షియల్ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని, అందుకే ఇక్కడ సినిమాలు చేయాలనుకుంటున్నానని తన మనసులో మాటను బయటపెట్టారు.

మెల్‌బోర్న్‌లో ప్రతిష్టాత్మక సదస్సుకు కేటీఆర్‌కు ఆహ్వానం

$
0
0
తెలంగాణ మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక సదస్సుకు ఆహ్వానం అందింది. ఆస్ట్రేలియా -ఇండియా నాలుగో లీడర్‌షిప్ సదస్సులో పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానం పంపించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఈ సదస్సు జరగనుంది. ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య రంగాలకు సంబంధించిన కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఆయా రంగాల్లో నిష్ణాతులైన, ప్రభుత్వంలో ప్రభావశీలులైన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. వివిధ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. పలు అంశాల్లో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యానికి సైతం అవకాశాలున్నాయి. విద్య, టెక్నాలజీ రంగంలో ఉన్న అవకాశాలపై జరిగే చర్చలో కేటీఆర్‌ను పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. Also Read: హైదరాబాద్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విదేశీ విద్య కోసం ఆస్ట్రేలియాకు భారీ సంఖ్యలో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో విద్య, టెక్నాలజీ రంగంలో ఉపాధి, పెట్టుబడి అవకాశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. దీనికి కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు.

నకిలీ టికెట్లతో దోపిడీ.. తాత్కాలిక కండక్టర్ దొరికాడిలా!

$
0
0
ర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకూడదని ప్రభుత్వం బస్సులు నడిపిస్తుంటే.. ప్రైవేట్ వ్యక్తులు దాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. డిపోలోని అధికారులకు దొంగ లెక్కలు చూపుతూ ఓ తాత్కాలిక కండక్టర్ టిక్కెట్ల ద్వారా వచ్చిన సొమ్మును జేబులో వేసుకుంటున్న వైనం ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. విధులు ముగిసిన తర్వాత డిపోలో డబ్బులు లెక్క చెబుతుండగా జేబులోంచి అదనపు టికెట్లు కింద పడటంతో కండక్టర్ బాగోతం బయటపడింది. ఖమ్మం జిల్లా డిపోలో శనివారం (నవంబర్ 9) రాత్రి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ సంస్థ ఇచ్చిన అవకాశం అందుకొని శేఖర్ అనే వ్యక్తి మధిర డిపోలో తాత్కాలిక కండక్టర్‌గా విధులు నిర్వహించడానికి ముందుకొచ్చాడు. ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొని సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రయాణికులకు అసలు టికెట్లకు బదులుగా ఇస్తూ.. ఆ టికెట్ డబ్బులను తన జేబులో వేసుకుంటున్నాడు. ఇలా రోజుకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు కొల్లగొడుతున్నాడు. Also Read: రోజూ మాదిరిగానే శనివారం డ్యూటీ ముగిసిన తర్వాత డిపోలో డబ్బు కడుతుండగా.. శేఖర్ జేబులో నుంచి అదనపు టికెట్లు కిందపడ్డాయి. అది గమనించిన అధికారులు నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఆ టిక్కెట్లు నకిలీవనీ తేలింది. ప్రయాణికులకు ఆ నకిలీ టికెట్లను అంటగట్టి వారిచ్చిన డబ్బును స్వాహా చేస్తున్నట్టు తెలిసింది. డిపో అధికారులు శేఖర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్లతో పాటు సూపర్‌వైజర్లు, ఇతర ఉద్యోగులందరూ సమ్మెలోనే ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని తాత్కాలిక సిబ్బంది తమ చేతివాటం చూపుతున్నారు. అయితే.. ఈ అక్రమాలు ప్రభుత్వ అధికారులకు తెలియనివి కావు. వారిని నియంత్రించడానికి ఇప్పటికిప్పుడు సరైన ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవడంతో అధికారులు మిన్నకున్నట్లు వ్యవహరిస్తున్నారు. లాభాలు రాకున్నా సరే.. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని బస్సులు నడిపిస్తున్నారు. Don't Miss:

AP: నిరుద్యోగులకు జగన్ సర్కార్ మరో గుడ్‌న్యూస్.. ఆ నోటిఫికేషన్ జనవరిలో..

$
0
0
జగన్ సర్కార్ నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ అందించింది. ఏటా ఉద్యోగ నియామకాలు చేపడతామని చెప్పిన ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరిలో ఉద్యోగాల భర్తీ కోసం మరో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించింది. సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్న కీలక శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అటవీ శాఖను సిబ్బంది కొరత వేధిస్తోందని.. దానిని అధిగమించేందుకు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2500 పోస్టులను భర్తీ చేయనున్నట్ల వెల్లడించారు. విశాఖ జిల్లాలో జరిగిన అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. Also Read: ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికడతామని మంత్రి తెలిపారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అటవీ అధికారులకు నూతన ఆయుధాలు, వాహనాలు అందించనున్నట్లు చెప్పారు. వాహనాల కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.40 కోట్లు విడుదల చేసిందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 60 టన్నుల ఎర్ర చందనం విక్రయించేందుకు కేంద్రం అనుమతి కోరినట్లు చెప్పారు.

నమ్రతా శిరోద్కర్ స్టైలిష్ లుక్.. ప్రత్యేక ఆకర్షణగా మహేష్ వైఫ్

$
0
0
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య, ఒకప్పటి హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోయారు. స్టైలిష్ లుక్‌లో అదరగొట్టారు. సినిమా ప్రారంభోత్సవ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహేష్ బాబు మేనళ్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన చిత్ర ప్రారంభోత్సవంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. Also Read: ముహూర్తపు సన్నివేశానికి హీరో అశోక్, హీరోయిన్ నిధి అగర్వాల్‌పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్లాప్ కొట్టారు. మరో హీరో రానా దగ్గుబాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ఇక కృష్ణ, గల్లా అరుణకుమారి, జయదేవ్, పద్మావతి కలిసి స్క్రిప్ట్‌ను దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకు అందజేశారు. ఈ వేడుకలో గల్లా కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు సుధీర్ బాబు, అమల అక్కినేని, సుశాంత్, వీకే నరేష్‌తో పాటు రాజకీయ ప్రముఖులు ఎంపీ కేశినేని నాని, ఎంపీ రామ్మోహన్ నాయుడు, నన్నపనేని రాజకుమారి, జేసీ దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే, ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్‌తో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. ఆయన బదులు సతీమణి నమ్రతా శిరోద్కర్ విచ్చేశారు. బ్లాక్ మిడీ డ్రెస్‌లో మెరిసిపోయారు. బ్లాక్ మిడీ, బ్లాక్ కలర్ బూట్స్ వేసుకుని స్టైలిష్ లుక్‌లో అదరగొట్టారు. 47 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా ఉన్నారు. కాకపోతే, ఆమె సినిమాలను వదిలిపెట్టి చాలా ఏళ్లు అయ్యిందిలెండి. ప్రస్తుతం, మహేష్‌ బాబుకు మంచి భార్యగా.. ఇద్దరు పిల్లల అవసరాలు తీర్చే తల్లిగా ఘట్టమనేని వారి ఇంటి చాలా బాధ్యతతో కూడిన పాత్రను పోషిస్తున్నారు.

ఆఖరి టీ20లో బంగ్లాదేశ్ చిత్తు.. టీమిండియాదే సిరీస్

$
0
0
భారత్ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్ గెలవాలని ఉవ్విళ్లూరిన బంగ్లాదేశ్‌‌‌కి భంగపాటు తప్పలేదు. నాగ్‌పూర్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన సిరీస్ విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సత్తాచాటిన టీమిండియా 30 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ని చిత్తు చేసేసింది. భారత ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ 6/7తో టీ20 చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాల్ని నమోదు చేశాడు. దీంతో మూడు టీ20ల సిరీస్‌ని 2-1తో భారత్ చేజిక్కించుకోగా.. గురువారం నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. మ్యాచ్‌లో తొలుత (62: 33 బంతుల్లో 3x4, 5x6), కేఎల్ రాహుల్ (52: 35 బంతుల్లో 7x4) హాఫ్ సెంచరీలు బాదడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఓపెనర్ మహ్మద్ నయిమ్ (81: 48 బంతుల్లో 10x4, 2x6) నిలకడగా ఆడటంతో బంగ్లాదేశ్ గట్టి పోటీనిచ్చేలా కనిపించింది. కానీ.. టీమ్‌లో అతనికి ఎవరూ సహకారం అందించలేకపోయారు. దీంతో.. ఆ జట్టు ఆఖరికి 19.2 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో దీపక్ చాహర్ కెరీర్ బెస్ట్ ప్రదర్శనని నమోదు చేయగా.. యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే (3/30) కీలక సమయంలో వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ని భారత్‌వైపు తిప్పాడు. Read More: వాస్తవానికి ఛేదనని 12/2తో పేలవంగా ఆరంభించిన బంగ్లాదేశ్ తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. మహ్మద్ నయిమ్ అద్భుతంగా పోరాడాడు. కానీ.. సౌమ్య సర్కార్ (0), ముష్ఫికర్ రహీమ్ (0), ఆపిప్ హుస్సేన్ (0)లను గోల్డెన్ డక్ రూపంలో ఔట్ చేసేసిన టీమిండియా బంగ్లాదేశ్‌ని ఒత్తిడిలోకి నెట్టడంలో సఫలమైంది. మధ్యలో కెప్టెన్ మహ్మదుల్లా (8) కాస్త బ్యాట్ ఝళిపించే ప్రయత్నం చేసినా.. లాభం లేకపోయింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా భారత్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించాడు. దీంతో.. శిఖర్ ధావన్ (19: 16 బంతుల్లో 4x4)తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ (2: 6 బంతుల్లో) ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఔటైపోగా.. కొద్దిసేపు బ్యాట్ ఝళిపించిన ధావన్ కూడా జట్టు స్కోరు 35 వద్ద పెవిలియన్ చేరిపోయాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి కేఎల్ రాహుల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్ బౌలర్లని ఉతికారేసిన ఈ జోడీ మూడో వికెట్‌కి 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్న రాహుల్.. ఆ వెంటనే ఔటైనా శ్రేయాస్ అయ్యర్ మాత్రం దూకుడు తగ్గించలేదు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన స్పిన్నర్ ఆపిప్ హుస్సేన్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6 బాదేసిన శ్రేయాస్ టీ20 కెరీర్‌లో ఫస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 144 వద్ద శ్రేయాస్ ఔటవగా.. ఆఖర్లో శివమ్ దూబే (9 నాటౌట్: 8 బంతుల్లో)తో కలిసి మనీశ్ పాండే జట్టుకి మెరుగైన స్కోరుని అందించాడు. Read More:

ఎన్నికల సంస్కర్త, మాజీ సీఈసీ టీఎన్ శేషన్ కన్నుమూత

$
0
0
కేంద్ర మాజీ , ఎన్నికల సంస్కర్తగా సుప్రసిద్ధులైన (87) ఇకలేరు. సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఆదివారం (నవంబర్ 10) రాత్రి చెన్నైలో కన్నుమూశారు. శేషన్ పూర్తి పేరు తిరునళ్లై నారాయణ అయ్యర్ శేషన్. కేంద్ర ఎన్నికల సంఘానికి 10వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఆయన పనిచేశారు. 1990 డిసెంబర్ 12 నుంచి 1996 డిసెంబర్ 11 వరకు పదవిలో ఉన్నారు. తన పదవి కాలంలో భారత ఎన్నికల ప్రక్రియలో ఆయన కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సంచలన నిర్ణయాలతో రాజకీయ నేతలను గడగడలాడించారు. దేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) అమలు చేయడం ద్వారా శేషన్ విశేష గుర్తింపు సాధించారు. ఎన్నికల కోడ్‌ను అమలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ విషయంలో ఆయన ఒక రకంగా రాజకీయ పార్టీలతో యుద్ధమే చేశారని చెప్పవచ్చు. కోడ్ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే.. ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా ఆయన కఠిన చర్యలు తీసుకున్న తీరు అనితరసాధ్యం. రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ధీశాలి గవర్నర్‌ పదవిలో ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కారణంగా మధ్యప్రదేశ్‌లోని ఓ నియోజకవర్గంలో ఏకంగా ఎన్నికలనే రద్దు చేసిన టీఎన్ శేషన్.. రాజకీయ పార్టీలకు తాను చెప్పదలచుకున్నదేమిటో స్పష్టం చేశారు. ఈ సంచలన నిర్ణయం కారణంగా సదరు గవర్నర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందంటే.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి విషయంలో శేషన్ ఎంత నిక్కచ్చిగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. Also Read: ఉత్తర ప్రదేశ్‌‌లో ఓ మంత్రి శేషన్‌ను గుర్తు చేసుకొని ఎన్నికల ప్రచార సమయం ముగియడంతో వేదిక దిగి కిందకి పరుగెత్తడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. టీఎన్ శేషన్.. తమిళనాడు కేడర్‌కు చెందిన 1955 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. 1989లో ఆయన కేంద్ర కేబినెట్ సెక్రటరీగా పని చేశారు. శేషన్ అందించిన సేవలకు గాను 1996లో భారత ప్రభుత్వం ఆయణ్ని రామన్ మెగసెసే అవార్డుతో సత్కరించింది. శేషన్ మృతితో భారత ఎన్నికల చరిత్రలో ఒక శకం ముగిసినట్లయింది.

శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి!

$
0
0
పసిడి ధర తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం పది గ్రాముల 24 క్యారెట్ల రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.39,600కు దిగొచ్చింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం ఉండిపోయిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.36,300కు దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధర తగ్గితే, మాత్రం పైకి నడిచింది. రూ.50 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,650కు చేరింది. Also Read: ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.38,320కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 తగ్గుదలతో రూ.37,050కు దిగొచ్చింది. Also Read: బంగారం ధర పడిపోతే.. వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.50 పైకి కదిలింది. దీంతో ధర రూ.48,650కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. Also Read: అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. ఔన్స్‌కు 0.05 శాతం తగ్గుదలతో 1,461.05 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.33 శాతం పెరుగుదలతో 16.87 డాలర్లకు చేరింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. Also Read: బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Mulugu Panchangam: నవంబరు 11 సోమవారం.. తిథి చతుర్దశి, అశ్వని నక్షత్రం

$
0
0
శుభకార్యాలు, పండగలు, వ్రతాలు లాంటి వాటి విషయానికి వస్తే భారతీయులు సంప్రదాయ కాలగణన సాధనం పంచాంగాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం.. ఈ ఐదింటి కలయికే పంచాంగం. ఇది దుర్ముహూర్తాలు, శుభముహూర్తాలు, వర్జ్యాలు, రాహుకాలం, సూర్యోదయం లాంటి విషయాల గురించి తెలియజేస్తుంది. పంచాంగం కాలగణనకు అనేక పద్దతులు ఉన్నా ప్రస్తుతం మాత్రం రెండు విధానాలే అమల్లో ఉన్నాయి. అవి సూర్యమానం', చంద్రమానం'. చంద్రుని సంచరణతో అనుసంధానమైంది చాంద్రమాన పంచాగం, సూర్యుని సంచరణతో అనుసంధానమైంది సూర్యమాన పంచాంగం. తెలుగువారు చంద్రమానాన్నే అనుసరిస్తారు. కాబట్టి చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాది ఛైత్రంతో ప్రారంభమై, ఫాల్గుణంతో పూర్తవుతుంది. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో సంచరించే స్థితిని బట్టి దీన్ని చాంద్రమానం అంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వివిధ జ్యోతిషశ్శాస్త్ర నిపుణులు పంచాంగాలు మార్కెట్‌లో లభించినా, ములుగు సిద్ధాంతిగారి పంచాంగానికి ఓ ప్రత్యేకత ఉంది. ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగారి పంచాంగంలో తిథి, వార, వర్జ్యాలు, శుభమూహూర్త, దుర్ముహూర్తాల గురించి సరైన సమాచారం ఉంటుంది. గ్రెగేరియన్ క్యాలెండర్‌తోపాటు చంద్రమానం అనుసరించి రోజువారీ, నెలవారీ, వార్షిక పంచాంగాన్ని రూపొందిస్తారు. ములుగు వారి నవంబరు 11 సోమవారం పంచాంగం.
తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
నవంబరు 11 ఇందువాసరే ఉదయం 6.06- సాయంత్రం 5.22
Read Also:
సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం శరదృతువు కార్తీకమాసం-శుక్లపక్షం సిద్ధి మధ్యాహ్నం 12.00 వరకు తదుపరి వ్యతీపాతం- వణిజ సాయంత్రం వరకు 5.25 వరకు తదుపరి భద్ర/విష్ఠి తెల్లవారి 6.00 వరకు చతుర్దశి సాయంత్రం 6.01 వరకు తదుపరి పౌర్ణమి
నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
అశ్వని రాత్రి 7.01 వరకు తదుపరి భరణి మధ్యాహ్నం 2.57 నుంచి 4.41 వరకు తిరిగి తెల్లవారి 5.31 లగాయతు మధ్యాహ్నం 12.14 నుంచి 12.59 వరకు తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి 3.16 వరకు ఉదయం 7.30 నుంచి 9.00 వరకు ఉదయం 11.51 నుంచి 1.35 వరకు ఉదయం 6.30 నుంచి 7.00 తిరిగి సాయంత్రం 5.30 నుంచి 6.00 వరకు

నేటి రాశి ఫలాలు- మిథున రాశివారికి కార్యజయం!

$
0
0
మేషం దూరప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. భూములు, భవనాలు కొనుగోలు చేస్తారు. వాహనసౌఖ్యం ఉంది. వృషభం కష్టపడ్డా ఫలితం అంతగా ఉండదు. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. మిథునం సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కార్యజయం ఉంది. భూ వివాదాలు తీరి లబ్ది పొందుతారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. కర్కాటకం ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. వాహనయోగం పొందుతారు. సింహ ఇంటాబయటా ఒత్తిడులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. పనులలో జాప్యం జరిగినా నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కన్య దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. తుల చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. సోదరులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వృశ్చికం మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగులు చేస్తారు. వాహనయోగం పొందుతారు. ధనుస్సు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఋణ బాధలు తప్పవు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. జీవితభాగస్వామి నుంచి సాయం అందుకుంటారు. మకరం కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఋణాలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుంభం మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. మీనం ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. పనులు నిదానంగా పూర్తిచేస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సోదరుల నుంచి ధనలాభాలు పొందుతారు.

పెట్రోల్, డీజిల్ ధరలు.. ఒకటి తగ్గితే.. మరోకటి పెరిగింది!

$
0
0
దేశీ ఇంధన ధరలు మిశ్రమంగా స్పందించాయి. సోమవారం పెరిగితే, తగ్గింది. పెట్రోల్ 16 పైసలు పైకి కదిలింది. డీజిల్ ధర 7 పైసలు దిగొచ్చింది. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.77.90కు చేరింది. డీజిల్ ధర రూ.71.86కు తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు క్షీణించాయి. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 15 పైసలు పెరుగుదలతో రూ.77.51కు చేరింది. డీజిల్‌ ధర 7 పైసలు తగ్గుదలతో రూ.71.16కు క్షీణించింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 15 పైసలు పెరుగుదలతో రూ.77.14కు చేరింది. డీజిల్ ధర 7 పైసలు తగ్గుదలతో రూ.70.82కు దిగొచ్చింది. Also Read: దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 15 పైసలు పెరుగుదలతో రూ.73.20కు చేరింది. డీజిల్ ధర 6 పైసలు తగ్గుదలతో రూ.65.85కు క్షీణించింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 15 పైసలు పెరుగుదలతో రూ.78.87కు చేరింది. డీజిల్ ధర 6 పైసలు తగ్గుదలతో రూ.69.07కు క్షీణించింది. Also Read: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.78 శాతం తగ్గుదలతో 62.12 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.54 శాతం క్షీణతతో 56.92కు తగ్గింది. Also Read: ఇకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. Also Read:

'లోకేష్ గెలిస్తే ఇళ్లు పోతాయన్నారు.. ఇప్పుడు జీవితాలే లేకుండా..'

$
0
0
ఏపీలో వెలుగు యానిమేటర్లను జగన్ సర్కార్ అన్యాయంగా ఉద్యోగాల్లో నుంచి తొలగించిందని ఆరోపిస్తోంది టీడీపీ. ఎన్నికల సమయంలో న్యాయం చేస్తామని చెప్పిన జగన్.. ఇప్పుడు ఏకపక్షంగా వారిని ఉద్యోగాల నుంచి తొలగించారని చెబుతోంది. అన్యాయంగా యానిమేటర్లను రోడ్లపై పడేశారని.. తిరిగి వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఉద్యోగుల తొలగింపుపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్పందించారు. ఎన్నికల సమయంలో తనపై తప్పుడు ప్రచారం చేశారని.. ఇప్పుడు ఉద్యోగులనే పట్టించుకోవడం లేదంటూ పరోక్షంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేపై మండిపడ్డారు. ‘ఎన్నికల ముందు మంగళగిరిలో 'లోకేష్ గెలిస్తే మీ ఇళ్లు తొలగిస్తాడు' అని అసత్య ప్రచారం చేసిన నాయకుడు.. ఇప్పుడు మంగళగిరిలో జీవితాలే లేకుండా చేస్తున్నారు. మంగళగిరిలో పగలు, రాత్రి అని లేకుండా పోరాటం చేస్తున్నా పట్టించుకోవడం లేదు’అంటూ మండిపడ్డారు నారా లోకేష్. ‘మా అక్కా,చెల్లెలకు అండగా నేను ఉంటాను. వైకాపా వాలంటీర్ల పేరుతో ఏడాదికి రూ.4 వేల కోట్ల దోపిడీ చేస్తున్నారు. అయినా మీ ధనదాహం తీరదా జగన్ గారు? 27,700 మంది యానిమేటర్లలో ఒక్కరి ఉద్యోగం పోయినా వైకాపా ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు’అంటూ లోకేష్ హెచ్చరించారు.
Viewing all 81590 articles
Browse latest View live