November 10, 2019, 3:22 am
![]()
ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కి భారత్‌లో లెక్కకి మించి అభిమానులున్నారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న డేవిడ్ వార్నర్‌ని ఇండియాలో భారత క్రికెటర్ల తరహాలో ఎక్కడికి వెళ్లినా అభిమానులు ఆదరిస్తుంటారు. అందుకే వార్నర్ కూడా ఐపీఎల్ అనే కాదు.. ఆస్ట్రేలియా తరఫున సిరీస్ కోసం ఇక్కడికి వచ్చినా ఫ్యామిలీని తీసుకొస్తుంటాడు. తాజాగా తన భార్య కాండిస్, కూతుళ్లు ఇవీ మై, ఇండీ రేతో కలిసి వార్నర్ ఇంట్లోనే సరదాగా క్రికెట్ ఆడాడు.
ఇండీకి కాసేపు బౌలింగ్ చేసిన వార్నర్.. చిన్నారి కొట్టిన షాట్స్ చూసి.. ఆమె విరాట్ కోహ్లీ కావాలనుకుంటోంది అని వీడియోలు పోస్ట్ చేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధానికి గురైన .. ఈ ఏడాది ఐపీఎల్ టైమ్‌లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నాడు. తాజాగా పాకిస్థాన్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడిన వార్నర్.. ఆస్ట్రేలియా సిరీస్ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు.
వాస్తవానికి డేవిడ్ వార్నర్‌ది దూకుడు స్వభావం. కెరీర్ ఆరంభంలో మద్యం సేవించి క్లబ్‌లో గొడవపడిన వార్నర్ కొన్ని రోజులు నిషేధం కూడా ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత కూడా ప్రాక్టీస్ సెషన్‌లకి డుమ్మా కొట్టడం ద్వారా అతనిపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. కానీ.. తండ్రిగా మారిన తర్వాత వార్నర్‌లో ఊహించని మార్పు వచ్చింది. ఇప్పుడు మైదానంలోనే కాదు వెలుపల కూడా ఎలాంటి గొడవలకి వెళ్లడం లేదు. సహచర క్రికెటర్లతో నవ్వుతూ పలకరిస్తుంటాడు. కానీ.. గత ఏడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సమయంలో మాత్రం డికాక్.. తన భార్య గురించి కామెంట్ చేయడంతో వార్నర్ సహనం కోల్పోయి గొడవకి దిగాడు. ఇదే బాల్ టాంపరింగ్‌కి అతడ్ని ఉసిగొల్పింది.
↧
November 10, 2019, 3:23 am
![]()
సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ మరొకరి చావుకు కారణమైంది. డబ్బులు తీసుకుని పరారయ్యాడంటూ ఫొటోలను వైరల్ చేయడంతో ఓ తెలుగు యువకుడు కువైట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పనిచేస్తున్న కంపెనీలో దినార్లు తీసుకుని పరారయ్యాడంటూ ఫ్రెండ్స్ వైరల్ చేసిన వీడియోతో మనస్థాపానికి గురైన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువకుడి తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. ఈ విషాద సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read:
రాజోలు మండలం శివకోటి గ్రామానికి చెందిన పుచ్చకాయల మోహన్ కుమార్ ఉపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లాడు. అక్కడే పని చేసుకుంటూ గ్రామంలో ఉంటున్న తల్లికి డబ్బులు పంపేవాడు. మోహన్ కువైట్‌లో చిట్టీలు వేసి అక్కడి కరెన్సీ రెండు వేల దినార్లు తీసుకుని పరారయ్యాడంటూ అతని స్నేహితులు వడ్డీ దుర్గారావు, మధు తదితరులు వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో మోహన్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. కువైట్‌లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Read Also:
ఈ నెల 3 వ తేదీనే ఘటన జరగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోహన్ కువైట్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న బంధువులు ఇండియన్ ఎంబసీ, కువైట్ ఎంబసీని సంప్రదించి మృతదేహాన్ని స్వగ్రామం శివకోటికి తీసుకకువచ్చారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన కుమారుడు శవంగా తిరిగిరావడం చూసి ఆ తల్లి గుండె బద్దలైంది. కొడుకు డెడ్‌బాడీని చూసి మోహన్ తల్లి బోరున విలపించడం పలువురిని కలచివేసింది.
↧
↧
November 10, 2019, 3:20 am
![]()
హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని గోల్నాకలో విషాదం చోటు చేసుకుంది. ఫంక్షన్ హాల్‌లో గోడ కూలి నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. గోల్నాకలోని పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం (నవంబర్ 10) మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడుక జరుగుతుండగా.. ఫంక్షన్ హాల్‌లోని వేదిక వెనుక నిర్మాణంలో ఉన్న భారీ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఓ మహిళ సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. శిథిలాల కింద 10 మంది వరకు చిక్కుకున్నట్లు సమాచారం. వీరిలో ఐదుగురిని స్థానికులు కాపాడారు.
సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read:
ఫంక్షన్ హాల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి రక్షణ చర్యలు, అనుమతులు లేకుండా గోడ నిర్మాణం చేశారని మండిపడుతున్నారు. 6 నెలల తర్వాత ఆదివారమే ఫంక్షన్ హాల్‌ను తిరిగి ప్రారంభించారని చెప్పారు. పిల్లర్ సహాయం లేకుండానే భారీ గోడ నిర్మాణం చేపట్టారని తెలిపారు.
మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని బంధువులు డిమాండ్ చేశారు. ఈ ఘటనలో రెండు ఆటోలు, పలు బైక్‌లు ధ్వంసమయ్యాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
↧
November 8, 2019, 9:43 pm
![]()
పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా? చాలా మంది డబ్బు అవసరమైతే పీఎఫ్ డబ్బులను తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌వో) కొన్ని రూల్స్ కలిగి ఉంది. వీటి ద్వారా పీఎఫ్ ఖాతాదారులకు కాంపౌండింగ్ ప్రయోజనం కలుగుతుంది. అలాగే పెన్షన్ ప్రయోజనాలు కూడా పొందొచ్చు.
పీఎఫ్ సబ్‌స్క్రైబర్లు రిటైర్మెంట్ వరకు పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోకపోతే అప్పుడు వారికి పెన్షన్ బెనిఫిట్స్ లభిస్తాయి. అలాగే పీఎఫ్ వడ్డీపై కాంపౌండిగ్ ప్రయోజనం లభిస్తుంది.
ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు ప్రయోజనం కలిగించే ఈపీఎఫ్‌వో నిబంధనలపై ట్రాన్సెండ్ కన్సల్టెంట్స్ వెల్త్ మేనేజర్ డైరెక్టర్ కార్తిక్ ఝవేరీ మాట్లాడుతూ.. ఉద్యోగం మారినప్పుడు ఉద్యోగుల సాధారణంగానే పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకుంటూ ఉంటారని తెలిపారు. ఇలా చేయడం వల్ల పీఎఫ్ ఖాతాదారులు కేవలం డబ్బులు మాత్రమే వెనక్కు తీసుకోవడం లేదని, పీఎఫ్ వడ్డీ కాంపౌండింగ్ ప్రయోజనం కూడా కోల్పోతారని వివరించారు.
Also Read:
పదవీ విరమణ వరకు పీఎఫ్ డబ్బులు తీసుకోకపోతే rules ప్రకారం అప్పుడు సబ్‌స్క్రైబర్లు పెన్షన్ ప్రయోజనాలు పొందొచ్చని ఝవేరీ తెలిపారు. పీఎఫ్ ఖాతాలో ఎక్కువ కాలం డబ్బులు కొనసాగిస్తే.. వడ్డీ మీద వడ్డీ పొందొచ్చని అప్పుడు ఎక్కువ ప్రయోజనం పొందొచ్చని పేర్కొన్నారు.
Also Read:
పీఎఫ్ ఖాతాదారులు వారి PF డబ్బులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఝవేరీ తెలిపారు. మెచ్యూరిటీ డబ్బులపై ఎలాంటి పన్ను ఉండదని గుర్తు చేశారు. అలాగే సెక్షన్ 80 సీ కింద పీఎఫ్ అకౌంట్‌లో రూ.1.5 లక్షల ఇన్వెస్ట్‌మెంట్‌కు కూడా పన్ను మినహాయింపు ఉందని తెలిపారు.
Also Read:
రిటైర్మెంట్ అయిన తర్వాత వెంటనే పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చని సెబీ రిజిస్టర్డ్ ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుడు జితేంద్ర సోలంకి తెలిపారు. రిటైర్మెంట్ తర్వాత డబ్బులు తీసుకోకపోతే వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Also Read:
ఈ నేపథ్యంలో పీఎఫ్ డబ్బులను తీసుకొని ఇతర ఇన్వెస్ట్‌మెంట్ సాధానాల్లో పెట్టుబడిగా పెడితే ప్రయోజనం పొందొచ్చని సోలంకి సూచించారు. ప్రభుత్వ బాండ్లు, బ్యాంక్ బాండ్లు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చని తెలిపారు.
↧
November 10, 2019, 3:48 am
![]()
బంగారం కొనుగోలు చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ధర కొండెక్కి కూర్చొంది. రూ.40,000కు సమీపంలో కదలాడుతోంది. అయితే ఇప్పుడు మీకు ఉచితంగానే బంగారం గెలుచుకునే ఛాన్స్ అందుబాటులో ఉంది. అది కూడా మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఫోటో తీసి పంపిస్తే.. అది వారికి నచ్చితే మీకు బంగారం వచ్చినట్లే.
ఇక్కడ స్మార్ట్‌ఫోన్ ఉన్న వారందరికీ ఈ ఆఫర్ అందుబాటులో లేదు. ఆండ్రాయిడ్ యూజర్లకు నో ఆఫర్. కేవలం ఐఫోన్ యూజర్లకు మాత్రం ఇది వర్తిస్తుంది. ఐఫోన్ యూజర్లందరికీ బంగారం గెలుచుకునే ఛాన్స్ ఉంది. బంగారం మాత్రమే కాకుండా ఇతర బహుమతులు కూడా పొందొచ్చు.
Also Read:
ఐఫోన్ ఫోటోగ్రఫీ అవార్డు ఎంట్రీస్ ప్రారంభమయ్యాయి. ఇందుకు మీరు ఐఫోన్‌తో తీసిన ఫోటోలను పంపించొచ్చు. అయితే ఇక్కడ యూజర్లు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. మీరు తీసిన ఫోటో ఎక్కడా కూడా పబ్లిష్ కాకూడదు. ఫోటో ఐఫోన్ లేదా ఐపాడ్‌తోనే తీసి ఉండాలి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫోస్ట్‌లు కూడా అర్హత కలిగి ఉంటాయి.
Also Read:
ఫోటోషాప్ వంటి వాటిల్లో ఫోటోకు మార్పులు చేర్పులు చేసి ఉండకూడదు. ఐఓఎస్ ఎడిట్ యాప్స్‌తో ఫోటోకు మార్పులు చేసే అవకాశం ఉంది. ఫోటో సైజ్ 1000 పిక్సెల్స్‌కు తగ్గకుండా ఉండాలి. 18 కేటగిరిలు ఉన్నాయి. మీరు నచ్చిన దానికి ఫోటోను ఎంట్రీ కోసం పంపొచ్చు.
Also Read:
18 కేటగిరిల్లో టాప్‌లో నిలిచిన ఫోటోలకు 18 బంగారు కడ్డీలను అందిస్తారు. 2, 3 స్థానాల్లో నిలిచి ఫోటోలకు పొలాడియా కడ్డీలను బహుమతిగా ఇస్తారు. ఐపీపీఏ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్‌కు ఐపాడ్ ఎయిర్ అందిస్తారు. టాప్ 3 విన్నర్లకు యాపిల్ వాచ్ సిరీస్ 3 లభిస్తాయి.
Also Read:
ఒక్కొక్కరు ఒక్క ఫోటో మాత్రమే కాకుండా ఎన్ని ఫోటోలైనా పంపొచ్చు. 25 ఫోటోల వరకు పంపించే ఛాన్స్ ఉంది. 2020 మార్చి 31 వరకు ఫోటోలు పంపొచ్చు. అయితే ఇక్కడ ఫోటోల ఎంట్రీ ఉచితం కాదు. ఒక్క ఫోటోకు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
↧
↧
November 10, 2019, 3:51 am
![]()
తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉంది. అందుకే, తమిళంలో ఆయన హీరోగా తెరకెక్కే ప్రతి సినిమాను తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేస్తుంటారు. ఈ ఏడాది రెండు సినిమాలతో సూర్య ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఒకటి ‘ఎన్జీకే’, మరొకటి ‘బందోబస్త్’. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి. అందుకే ఇప్పుడు మరో కొత్త సినిమాతో సూర్య తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read:
తెలుగులో విక్టరీ వెంకటేష్‌తో ‘గురు’ లాంటి మంచి సినిమాను తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నారు. తమిళంలో ‘సూరరై పోట్రు’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ అనే టైటిల్‌తో విడుదల చేస్తు్న్నారు. అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. తెలుగు, తమిళ ఫస్ట్‌లుక్ పోస్టర్లను హీరో సూర్య ట్వీట్ చేశారు. ‘‘అసాధారణమైన కలతో ఒక సాధారణ వ్యక్తి’’ అని సూర్య ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా, ఈ సినిమాకు సూర్యనే నిర్మాత. సిఖ్యా ఎంటర్‌టైన్మెంట్ సౌజన్యంతో 2డి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజశేఖర్ కర్పూరపాండియన్, గునీత్ మోంగా, ఆలిఫ్ సూర్తి సహనిర్మాతలు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. కాళీ వెంకట్, కరుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న, కృష్ణ కుమార్ తదితరులు నటిస్టున్నారు.
↧
November 10, 2019, 4:03 am
![]()
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల బిగ్‌బాష్ టీ20 లీగ్‌లో సరికొత్త రికార్డ్ నమోదైంది. అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టుకి చెందిన ఓపెనర్ షోపీ డివైన్ (85 నాటౌట్: 56 బంతుల్లో 6x4, 5x6) భారీ షాట్లతో విరుచుకుపడి ఒక ఓవర్‌లోనే వరుసగా ఐదు సిక్సర్లు సాధించింది. దీంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా.. ఛేదనలో ప్రత్యర్థి మెల్‌బోర్న్ స్టార్స్ 147/8కే పరిమితమైంది.
Also Read
మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అడిలైడ్ జట్టు 19 ఓవర్లు ముగిసే సమయానికి 133/4తో నిలవగా.. ఓపెనర్ డివైన్ 51 బంతుల్లో 55 పరుగులు చేసి క్రీజులో ఉంది. దీంతో.. మెల్‌బోర్న్ టీమ్ కెప్టెన్ ఆఖరి ఓవర్‌ని స్పిన్నర్ మెడిలైన్ పెన్నాతో వేయించింది. కానీ.. ఆ నిర్ణయమే ఆ జట్టుకి మ్యాచ్‌ని దూరం చేసింది.
Also Read :
ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో తొలి బంతికి సింగిల్ తీసిన కైట్ (5 నాటౌట్).. డివైన్‌కి స్ట్రైక్ ఇచ్చింది. ఆ తర్వాత ఐదు బంతుల్నీ ఆడిన డివైన్ వరుసగా 6, 6, 6, 6, 6 బాదేసింది. రెండో బంతిని ఫుల్‌టాస్ రూపంలో విసరగా.. దాన్ని మిడ్‌వికెట్ దిశగా సిక్స్ రూపంలో తరలించిన డివైన్.. ఆ తర్వాత బంతిని క్రీజు వెలుపలికి వచ్చి లాంగాన్‌లో బౌండరీ లైన్ అవలకి పంపింది. ఇక మూడో బంతిని మళ్లీ డీప్‌మిడ్ వికెట్ దిశగా.. చివరి రెండు బంతుల్నీ లాంగాన్ దిశగా సిక్సర్లుగా మలిచింది. మొత్తంగా.. ఆ ఓవర్‌లో 31 పరుగుల్ని అడిలైడ్ స్ట్రైకర్స్ టీమ్ రాబట్టింది. ఒకవేళ తొలి బంతిని కూడా డివైన్ ఆడే అవకాశం ఉండుంటే.. ఆరు సిక్సర్లు నమోదయ్యేవేమో..!
Read More:
↧
November 10, 2019, 4:29 am
![]()
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టే్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో మీకు అకౌంట్ ఉందా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంక్ కొన్ని రూల్స్‌ను మార్చేసింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవి ఈ రోజు నుంచే (నవంబర్ 10) అమలులోకి వచ్చాయి. దీంతో బ్యాంక్ ఖాతాదారులపై ప్రభావం పడనుంది.
స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లు ఝలక్ ఇచ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఏకంగా 15 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. ఏడాది నుంచి రెండేళ్లలోపు ఎఫ్‌డీలకు ఇది వర్తిస్తుంది. దీంతో బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే ఇకపై తక్కువ రాబడి వస్తుంది.
Also Read:
అంతేకాకుండా ఎస్‌బీఐ బల్క్ డిపాజిట్ (రూ.2 కోట్లకు పైన) రేట్లను కూడా తగ్గించేసింది. వీటిపై వడ్డీ రేటును ఏకంగా 30 నుంచి 75 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. వ్యవస్థలో సరిపడినంత లిక్విడిటీ ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని బ్యాంక్ తెలిపింది.
Also Read:
ఎస్‌బీఐ లేటెస్ట్ ఎఫ్‌డీ రేట్లను గమనిస్తే.. 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలకు 4.5 శాతం, 46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీలకు 5.5 శాతం, 180 రోజుల నుంచి 210 రోజుల ఎఫ్‌డీలకు 5.8 శాతం, 211 రోజుల నుంచి ఏడాది లోపు డిపాజిట్లకు 5.8 శాతం వడ్డీ లభిస్తుంది.
Also Read:
ఏడాది నుంచి 2 ఏళ్ల వరకు ఎఫ్‌డీలకు 6.25 శాతం వడ్డీ వస్తుంది. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 6.25 శాతం వడ్డీ పొందొచ్చు. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు ఎఫ్‌డీలకు 6.25 శాతం వడ్డీ సొంతం చేసుకోవచ్చు. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఎఫ్‌డీలకు 6.25 శాతం వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు వీటి కన్నా ఎక్కువ వడ్డీ లభిస్తుంది.
Also Read:
ఎస్‌బీఐ తన కస్టమర్లకు షాక్‌తోపాటు తీపికబురు కూడా అందించింది. రుణ రేట్లను తగ్గించింది. మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)లో 5 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. బ్యాంక్ రుణ రేట్లు తగ్గించడం ఇది 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏడో సారి కావడం గమనార్హం. రేట్ల కోత తర్వాత ఎస్‌బీఐ ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8 శాతానికి దిగొచ్చింది. దీంతో తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులోకి వస్తాయి.
↧
November 10, 2019, 4:40 am
![]()
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్.. షార్ట్‌గా ఓఆర్ఆర్.. ఇప్పుడీ పదం ఏపీ రాజకీయాల్లో హల్‌చల్ చేస్తోంది. రింగు రోడ్డులో ఎన్ని మలుపులు ఉన్నాయో తెలీదు గానీ నేతల మాటలు మాత్రం చాలా మలుపులు తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు పోటీపడి మరీ మలుపుకో ట్విస్ట్ ఇస్తున్నారు. రింగు రోడ్డుపై యమస్పీడుతో జోరుగా సవారీ చేస్తున్నారు. ఆ.. క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు విమర్శనాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు.
విషయం ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందనుకుంటా..! నేరుగా విషయంలోకి వస్తే.. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తాజాగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి. ఓఆర్‌ఆర్‌కు చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడ్డారని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కష్టంతోనే రింగ్ రోడ్డు నిర్మితమైందని వైఎస్సార్సీపీ ఎంపీ చెప్పారు. పనిలో పనిగా 420 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ని కూడా తానే నిర్మించానని చంద్రబాబు చెబుతారంటూ ఘాటు విమర్శలు చేశారు.
Also Read:
విజయసాయి విమర్శలకు టీడీపీ ఎమ్మెల్సీ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు తలపెట్టిన హైదరాబాద్ రింగు రోడ్డుని వంకర రోడ్డుగా మార్చింది మీ మహామేత వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. రింగు రోడ్డుని అష్ట వంకర్లు తిప్పి అంచనాలు పెంచి భారీ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.
వైఎస్, ఆయన తనయుడు జగన్ అనుచరులతో కలిసి రూ.5,500 కోట్ల ప్రాజెక్టును రూ.35 వేల కోట్లకు పెంచి ఆస్తులు కూడబెట్టిన విషయాన్ని మరచిపోయారా విజయసాయి రెడ్డి గారు అని ఎద్దేవా చేశారు. తప్పుడు రికార్డులతో నష్ట పరిహారం కొట్టేసి మర్చిపోయామంటే కుదరదని.. పద్దు పాత పుస్తకాల్లో ఉంటుంది ఒక సారి దుమ్ము దులపండి అంటూ సెటైర్లు వేశారు.
Read Also:
రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారన్న వ్యాఖ్యాలపైనా వెంకన్న స్పందించారు. చంద్రబాబు హయాంలో చేసిన అప్పు రూ.లక్షా పది వేల కోట్లుగా చెప్పారు. అంటే ఏడాదికి 22 వేల కోట్లని.. ఐదు నెలల జగన్ పాలనలో 18 వేల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. అంతేకాకుండా 2019-2020 బడ్జెట్లో సంవత్సరానికి 48 వేల కోట్ల అప్పులు ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎవరు రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేస్తున్నారని ప్రశ్నించారు. మీ దొంగ మొహాలు చూసి బ్యాంకులు కూడా ఛీ కొడుతున్నాయంటూ ఘాటు విమర్శలు చేశారు.
Also Read:
↧
↧
November 10, 2019, 5:14 am
![]()
భారత్‌తో నాగ్‌పూర్ వేదికగా ఆదివారం జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మూడు టీ20ల ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగియగా.. తొలి టీ20లో బంగ్లాదేశ్, రెండో టీ20లో భారత్ జట్టు విజయాన్ని అందుకుంది. దీంతో.. ఈరోజు మ్యాచ్‌లో గెలిచిన జట్టుకి టీ20 సిరీస్ దక్కనుండటంతో రెండు జట్లూ నువ్వా నేనా అని తలపడబోతున్నాయి.
భారత్ తుది జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఒక మార్పు చేశాడు. కృనాల్ పాండ్యాని జట్టు నుంచి తప్పించి మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండేని తుది జట్టులోకి తీసుకున్నాడు. ఇటీవల ముగిసిన రెండు టీ20ల్లోనూ కృనాల్ పాండ్య కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.
టీ20 రికార్డుల్లో బంగ్లాదేశ్‌పై టీమిండియాదే పైచేయిగా తెలుస్తోంది. ఇప్పటికే 10 టీ20ల్లో బంగ్లాదేశ్‌తో తలపడిన భారత్ జట్టు ఏకంగా 9 మ్యాచ్‌ల్లో విజయాల్ని అందుకుంది. అయితే.. తొలి టీ20లో అనూహ్య ఓటమి తర్వాత ఎలాంటి ఉదాసీనతకి తావివ్వకూడదని భావిస్తోంది.
Read More:
నాగ్‌పూర్ పిచ్‌పై యావరేజ్ స్కోరు 155కాగా.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టే ఎక్కువ సార్లు గెలిచింది. ఎంతలా అంటే..? ఇప్పటి వరకూ ఈ స్టేడియంలో ఆడిన 11 మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఎమినిది సార్లు గెలవగా.. ఛేదనకు దిగిన జట్టు గెలిచింది మూడు సార్లే. అయితే.. తాజా సిరీస్‌లో ముగిసిన రెండు టీ20ల్లోనూ ఛేదనకు దిగిన జట్టే గెలుపొందడం విశేషం.
Read More:
India (Playing XI): Rohit Sharma(c), Shikhar Dhawan, Lokesh Rahul, Shreyas Iyer, Manish Pandey, Rishabh Pant(w), Shivam Dube, Washington Sundar, Deepak Chahar, Yuzvendra Chahal, K Khaleel AhmedBangladesh (Playing XI): Liton Das, Mohammad Naim, Soumya Sarkar, Mushfiqur Rahim(w), Mahmudullah(c), Afif Hossain, Mohammad Mithun, Aminul Islam, Shafiul Islam, Mustafizur Rahman, Al-Amin Hossain
↧
November 10, 2019, 5:05 am
![]()
ఆర్టీసీ యూనియన్లతో ఇక ఎలాంటి చర్చలు జరుపకూడదని సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఇచ్చేది లేదని హైకోర్టుకు వెల్లడించనున్నట్లు సమాచారం. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో సోమవారం (నవంబర్ 11) ఆర్టీసీ వ్యవహారంలో మరో అఫిడవిట్ దాఖలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్టీసీ సంఘాలతో ఇక ఎలాంటి చర్చలు జరిపేది లేదని ఈ అఫిడవిట్‌లో పేర్కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆర్టీసీ అంశంపై అధికారులతో సీఎం కేసీఆర్ శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కార్మికుల సమ్మెపై హైకోర్టులో సోమవారం విచారణ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించినట్లు సమాచారం.
Watch:
ప్రైవేటీకరణపై హైకోర్టు వ్యాఖ్యలు, ఆర్టీసీ కార్మికులు చేపట్టిన మిలియన్ మార్చ్, ఆర్టీసీకి చెల్లింపులు తదితర అంశాలపై సీఎం కేసీఆర్.. అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ, రవాణా శాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆర్టీసీకి సంబంధించి రూ.47 కోట్ల లాంటి బకాయిలు చాలా ఉన్నాయని.. ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థకు చెల్లించేది ఏమీ లేదని సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Also Read:
కార్మికులకు తిరిగి విధుల్లో చేరడానికి అవకాశం ఇచ్చినా.. ఖాతరు చేయని నేపథ్యంలో ఆర్టీసీ విషయంలో సీఎం కేసీఆర్ మరింత దూకుడుగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో ఇప్పటికే 5,100 రూట్లలో ప్రైవేట్ రూట్ పర్మిట్లకు అనుమతిస్తూ కేసీఆర్ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కార్మికులు భేషరతుగా విధుల్లో చేరకుంటే మిగిలిన 5 వేల రూట్లలోనూ ప్రైవేట్ పర్మిట్లు ఇవ్వడానికి వెనుకాడబోమని కేసీఆర్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అంశంపై సీఎం కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
↧
November 10, 2019, 5:17 am
![]()
‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా ప్రమోషన్స్ చూసి ఓ వర్గం ఆగ్రహంతో ఊగిపోతుంటే ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు విడుదల చేసిన ‘పప్పు లాంటి అబ్బాయి’ పాటకు చంద్రబాబు, లోకేశ్ పాత్రధారులతో కలిసి వర్మ స్టెప్పులేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్లోగా సాగే ఈ పాటకు వర్మ స్లో మోషన్‌లో స్టెప్పులేస్తుంటే ఒకటే అరుపులు కేకలు.
మరోవైపు ఈ పాట వస్తుంటే చంద్రబాబు పాత్రధారి.. లోకేశ్ పాత్రధారిని ఓదారుస్తున్నారు. వాళ్లిద్దరినీ వర్మ ఓదారుస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైనట్టు ఉన్నా ఓ వర్గానికి ఈ వీడియో బాగా పనికొచ్చింది. ఆ వర్గమే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోను వైరల్ చేస్తోంది.
ఇదిలా ఉంటే, రామ్ గోపాల వర్మ తన స్వార్థం కోసం రెండు కులాలు, వ్యక్తులను వాడుకొని వారిపై బురదజల్లుతున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం చూసుకున్నా కులాలు, మతాలు, వ్యక్తుల మధ్య విద్వేశాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సినిమాలు చేసినా అది నేరమేనని.. కాబట్టి రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లను అరెస్టు చేసి జైళ్లో పెట్టాలని వాదిస్తున్నారు. తన వ్యాపారం, సంపాదన కోసం ఇతరుల పరువు ప్రతిష్టలను వర్మ ఎలా వాడుకుంటాడని ప్రశ్నిస్తున్నారు.
Also Read:
అయితే.. రామ్ గోపాల్ వర్మ, ఆయన వేషాలను పట్టించుకునేవారు కూడా బాగా తగ్గిపోయారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా టైంలో వర్మకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఆ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదు. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాలో వివాదాస్పద పాత్రలన్నింటినీ తీసుకున్నా ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ఏదో ఒక వర్గానికి చెందిన కొంత మంది మాత్రమే వర్మను సపోర్ట్ చేస్తున్నారు.
↧
November 10, 2019, 5:37 am
![]()
ఆదివారం ఆటవిడుపు ఆరు కుటుంబాల్లో విషాదం నింపింది. సరదాగా సముద్రం చూసొద్దామని వెళ్లిన యువకులు అలల ధాటికి గల్లంతయ్యారు. సముద్రంలో దిగిన ఆరుగురు ఇంటర్ విద్యార్థులు గల్లంతవడంతో బీచ్‌లో భయాందోళన నెలకొంది. ఈ విషాద సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది.
శ్రీకాకుళం పట్టణంలో ఇంటర్ చదువుతున్న ఆరుగురు విద్యార్థులు సముద్ర స్నానం కోసం కళింగపట్నం బీచ్‌కి వచ్చారు. అంతా సముద్రంలో దిగి కేరింతలు కొడుతుండగా అనుకోని ఉపద్రవం ముంచుకొచ్చింది. తీవ్రమైన అలలు రావడంపతో ఒక్కసారిగా ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. నీటమునుగుతూ కేకలు వేయడంతో అక్కడి వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు.
Also Read:
అప్పటికే ఒక విద్యార్థి ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరిని పోలీసులు రక్షించినట్లు సమాచారం. మిగిలిన ముగ్గురి జాడ కోసం మెరైన్ పోలీసులు ప్రత్యేక బోట్లలో గాలిస్తున్నారు. సరదాగా సముద్ర స్నానానికి వచ్చిన విద్యార్థులు గల్లంతవడంతో బీచ్ పరిసరాల్లో విషాదం అలుముకుంది.
↧
↧
November 10, 2019, 5:51 am
![]()
‘డ్రీమ్’ చిత్రంతో ఏడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు దక్కించుకున్న భవానీ శంకర్ దర్శకత్వంలో తాజాగా రూపొందుతోన్న చిత్రం ‘క్లైమాక్స్’. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, పృథ్వీ, శివశంకర్ మాస్టర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాషా సింగ్, రమేష్, చందు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏ విషయాన్నైనా ధైర్యంగా ప్రశ్నించే వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఇందులో నిజ జీవిత పాత్రను పోషిస్తున్నారు.
కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై పి.రాజేశ్వర్ రెడ్డి, కె. కరుణాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు భవాని శంకర్ మాట్లాడుతూ.. ‘‘ఓ మర్డర్ మిస్టరీని పొలిటికల్ సెటైర్ నేపథ్యంలో అల్లుకున్నాం. మేం తీసుకున్న కథాంశం చాలా వైవిధ్యంగా ఉంటుంది. దానికి తగ్గట్టు చిత్రీకరించిన తీరు కూడా సరికొత్తగా అనిపిస్తుంది. సినిమాలో పాత్రలు సంఖ్యా పరంగా తక్కువగానే కనిపిస్తాయి. కానీ ప్రతి పాత్రా హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తుంది. ప్రతి క్యారెక్టర్‌ను పటిష్టంగా తీర్చిదిద్దాం.
మనసులోని భావాల్ని నిర్భయంగా వ్యక్తం చేస్తూ, ఎదుటివారి స్థాయికి వెరవకుండా, నమ్మిన సిద్ధాంతాల కోసం నిలుచునే వివాదాస్పద నటిగా శ్రీరెడ్డి కనిపిస్తారు. ఆమె రియల్ లైఫ్ క్యారెక్టర్‌కి దగ్గరగా ఉండే పాత్ర అది. సినీ ఇండస్ట్రీలో కనిపించే స్టీరియోటైప్ ఆలోచనలకి విరుద్ధంగా ఉండే పాత్రలు, సన్నివేశాలు మా చిత్రంలో మెండుగా ఉంటాయి’’ అని అన్నారు.
Also Read:
శ్రీరెడ్డి మాట్లాడుతూ.. ‘‘వివాదాస్పద నటిగా ఈ చిత్రంలో నటించాను. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో సాగే సినిమా ఇది. నా పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంది. నా పాత్ర చుట్టూ కథ చాలా మలుపులు తీసుకుంటుంది. నేను పలికే ప్రతి డైలాగూ, నేను కనిపించే ప్రతి సీనూ చాలా చాలా బావుంటాయి. ఇంత మంచి పాత్ర కోసం నన్ను అప్రోచ్ అయిన భవానీ శంకర్‌గారికి, టీమ్‌కి థాంక్స్’’ అని అన్నారు.
నిర్మాత పి.రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కొన్ని సినిమాలు కెరీర్లో గుర్తుండిపోతాయి. మేం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కూడా అంతే గొప్ప పేరు తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. హైదరాబాద్‌లోనే మొత్తం తెరకెక్కించాం. త్వరలో ఓ పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేసి తెరకెక్కిస్తాం’’ అని తెలిపారు.
↧
November 10, 2019, 5:41 am
![]()
దిగొచ్చింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర మూడు నెలల కనిష్ట స్థాయికి పతనమైంది. స్పాట్ గోల్డ్ బంగారం ధర శుక్రవారం ఔన్స్‌కు 1455.8 డాలర్లకు పడిపోయింది. ఆగస్ట్ నెల నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి కావడం గమనార్హం. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ధర కూడా 0.2 శాతం తగ్గుదలతో ఔన్స్‌కు 1462.9 డాలర్లకు క్షీణించింది.
అమెరికా, చైనా మధ్య వాణిజ్య డీల్ కుదరొచ్చనే అంచనాలు బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపాయి బంగారం ధర బాటలోనే కూడా నడిచింది. వెండి ధర 1.2 శాతం క్షీణతతో ఔన్స్‌కు 16.9 డాలర్లకు పడిపోయింది. అమెరికా-చైనా డీల్ ఓకే కావొచ్చనే అంచనాల నేపథ్యంలో బంగారం ధరపై ఒత్తిడి నెలకొందని యస్ సెక్యూరిటీస్ పేర్కొంది.
Also Read:
అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే అప్పుడు అమెరికా చైనా దిగుమతులపై టారిఫ్‌లను ఎత్తివేసే ఛాన్స్ ఉంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇంకా డీల్ కుదరలేదని మీడియాతో పేర్కొన్నాడు. ఇది బంగారం ధరకు సానుకూలమైన అంశం.
Also Read:
అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ ఏడాది బంగారం ధర 14 శాతానికి పైగా పరుగులు పెట్టడానికి అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలే ప్రధాన కారణం. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్ సాధనమైన బంగారం డిమాండ్ పెరుగుతుంది. అందువల్ల ధరలు పైకి కదులుతాయి.
Also Read:
అమెరికా ఫెడరల్ రిజర్వు తాజాగా వడ్డీ రేట్లను మళ్లీ తగ్గించింది. ఇది కూడా బంగారం ధరకు ఊరటనిచ్చే అంశమే. అయితే తదుపరి రేట్ల కోత ఉండదని, ఆర్థిక వ్యవస్థ డౌన్‌టర్న్ తీసుకుంటేనే రేట్ల కోత అంశం గురించి ఆలోచిస్తామని ఫెడరల్ రిజర్వు పేర్కొంది. ఇది బంగారం ధరపై ఒత్తిడి పెంచే నిర్ణయం.
Also Read:
ఇకపోతే భారత్ విషయానికి వస్తే.. దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఎంసీఎక్స్ మార్కెట్‌లో శుక్రవారం 0.28 శాతం పెరుగుదలతో 10 గ్రాములకు రూ.37,682కు చేరింది. అయితే బంగారం ధర సెప్టెంబర్ నెల ఆరంభంలో రూ.40,000 మార్క్‌కు చేరింది. అప్పటి నుంచి చూస్తే.. ఇప్పుడు బంగారం ధర రూ.2,000 దిగువునే ఉంది. ఇక వెండి ధర కేజీకి రూ.43,950 స్థాయిలో కదలాడుతోంది.
↧
November 10, 2019, 6:09 am
![]()
మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వా్న్ని ఏర్పాటు చేయలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని కలిసి వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీ చేసిన , బీజేపీ పార్టీల మధ్య సీఎం పీఠం విషయంలో భేదాభిప్రాయాలు రావడంతో ‘మహా’ రాజకీయాల్లో సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 105 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తదితర నాయకులు ఆదివారం (నవంబర్ 10) సాయంత్రం గవర్నర్‌ను కలిశారు. తగిన సంఖ్యాబలం లేని కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నామని వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శివసేనపై విమర్శలు కురిపించారు.
Also Read:
శివసేన తమను అవమానించిందని బీజేపీ నేతలు మండిపడ్డారు. బీజేపీ, శివసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రజలు కోరుకున్నారని.. కానీ, ప్రజాభీష్టాన్ని కాదని ఆ పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటోందని విమర్శించారు. వారికి మా శుభాకాంక్షలు అంటూ ఎద్దేవా చేశారు. తమకు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవడంతోనే తాజా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడటం, శనివారంతో మహారాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఫలితాల అనంతరం అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. సోమవారం లోగా అసెంబ్లీలో బల నిరూపణ చేయాలని గవర్నర్ గడువు విధించారు. దీనిపై ఆదివారం సాయంత్రం ఫడ్నవీస్ నివాసంలో భేటీ అయిన బీజేపీ కోర్ కమిటీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవద్దని నిర్ణయించింది. అనంతరం గవర్నర్‌ను కలిసి ఆ నిర్ణయాన్ని తెలిపింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారాయి.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 145 సీట్లు (మ్యాజిక్ ఫిగర్) కావాల్సి ఉండగా.. బీజేపీ 105, శివసేన 56 సీట్ల సంఖ్యాబలం ఉంది. మరో కూటమిగా ఏర్పడి పోటీ చేసిన ఎన్సీపీ 54 సీట్లు, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ కోసం బీజేపీకి కనీసం 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీలు అప్రమత్తమయ్యాయి. తమ ఎమ్మెల్యేలను క్యాంప్‌లకు తరలించాయి.
↧
November 10, 2019, 6:32 am
![]()
బంగ్లాదేశ్‌తో నాగ్‌పూర్ వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ పేలవంగా వికెట్ చేజార్చుకున్నాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచి బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. శిఖర్ ధావన్ (19: 16 బంతుల్లో 4x4)తో కలిసి భారత్ ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ (2: 6 బంతుల్లో) రెండో ఓవర్‌లో ఔటైపోయాడు.
ఫాస్ట్ బౌలర్ సైపుల్ ఇస్లామ్ విసిరిన షార్ట్ లెంగ్త్ బంతిని ఎటువంటి పాదాల కదలికలు లేకుండా ఆడేందుకు రోహిత్ శర్మ ప్రయత్నించాడు. కానీ.. బంతిని బ్యాట్‌కి మిడిల్ చేయలేకపోయాడు. దీంతో ఎడ్జ్ తాకిన బంతి వెనక్కి వచ్చి లెగ్ స్టంప్‌ని ఎగరగొట్టింది. మ్యాచ్ కామెంటేటర్ మురళీ కార్తీక్ మాటల్లో చెప్పాలంటే రోహిత్ శర్మ తన బద్దకంతో మూల్యం చెల్లించుకున్నాడు. తొలి టీ20లోనూ ఇలానే సైపుల్ బౌలింగ్‌లో పాదాల్ని కదల్చకుండా ఆడిన రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూగా వికెట్ల ముందు దొరికిపోయాడు.
Read More:
రోహిత్ శర్మ పెవిలియన్‌కి వెళ్తుండగా.. అతనికి ఎదురుగా మైదానంలోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. దీంతో.. అతడ్ని కొన్ని క్షణాల పాటు ఆపిన రోహిత్ శర్మ.. ఏదో సూచన చేసినట్లు కనిపించింది. ఆ ఓవర్‌లో రాహుల్‌కి కూడా సైపుల్ అదే తరహా బంతులు సంధించాడు. కానీ.. రాహుల్ మాత్రం కొద్దిపాటి పాదాల కదలికలతో వాటిని బ్యాట్‌తో అడ్డుకున్నాడు. ఆ తర్వాత మ్యాచ్ 4వ ఓవర్‌లోనూ రాహుల్‌కి మరోసారి రోహిత్ శర్మకి విసిరిన బంతుల్ని సైపుల్ సంధించగా.. ఆఫ్ స్టంప్ లైన్‌పైకి వచ్చిన రాహుల్ వరుసగా 4, 4 బాదేశాడు. బహుశా.. రాహుల్‌కి రోహిత్ చెప్పిన సూచన అదేనేమో..!
Read More:
↧
↧
November 10, 2019, 6:27 am
![]()
తమిళ నటి, ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్‌కు డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్‌గా పేరుంది. ఆమె నటనే కాదు మాటలు కూడా చాలా పవర్‌ఫుల్‌గా, బోల్డ్‌గా ఉంటాయి. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, లేడీ విలన్‌గా పలు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించిన వరలక్ష్మి.. విజయ్ ‘సర్కార్’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ఇది తమిళ డబ్బింగ్ సినిమా. సందీప్ కిషన్ హీరోగా వస్తోన్న ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ సినిమాతో వరలక్ష్మి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు రవితేజ సినిమాలో చేయడానికి అంగీకరించారు.
‘డాన్‌శీను’, ‘బలుపు’ వంటి సూపర్‌హిట్ చిత్రాల తర్వాత మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొందనుంది. లైట్ హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ 66వ చిత్రమిది. రవితేజ ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉండేలా దర్శకుడు గోపీచంద్ మలినేని కథను ప్రిపేర్ చేస్తున్నారు.
Also Read:
ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అలాగే తమిళ చిత్రాల్లో వైవిధ్య పాత్రలతో మెప్పిస్తున్న సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు మరో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కథ, పాత్ర నచ్చడంతో ఆమె ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారు. అయితే, ఆమె ఎలాంటి పాత్ర చేస్తున్నారన్న విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకవేళ ఇందులోనూ లేడీ విలన్ పాత్రే అయితే మాస్ మహారాజాతో వరలక్ష్మి పోటీపడి నటించడం ఖాయం. ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈనెలలోనే సినిమా ప్రారంభం కానుంది.
↧
November 10, 2019, 6:29 am
![]()
కమ్యూనికేషన్.. ఈ పోటీ ప్రపంచంలో అతి కీలకమైన అంశం. ఏదైనా అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు అవసరమైన అనుభవం.. నైపుణ్యాలు ఉన్నప్పటికీ.. కొన్నిసార్లు అవకాశాలు చేజారిపోతుంటాయి. మన నైపుణ్యాలను స్పష్టంగా.. సమర్థంగా చెప్పలేకపోవడమే దానికి కారణం. మన భావాలను ఎదుటి వ్యక్తితో స్పష్టంగా చెప్పగలిగితే అవకాశాలను అందిపుచ్చుకోగలం. అంతటి ప్రాధాన్యం ఉన్న భావ వ్యక్తీకరణలో నైపుణ్యం సాధించేందుకు యువత కోసం ప్రత్యేకంగా సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించనుంది.
వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో యువత కోసం ప్రత్యేకంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందించేందుకు ఈ కోర్సును రూపొందించారు. కమ్యూనికేషన్ ద్వారా సంబంధాలు పెంచుకోవడం.. భయం, బెరుకు లేకుండా వేదికలపై అనర్గళంగా మాట్లడడం వంటి అంశాలపై శిక్షనిస్తారు.
Also Read:
ఆత్మవిశ్వాసం తొణికిసలాడేలా ఎలా మాట్లాడాలి. బృంద చర్చలు, పబ్లిక్ మీటింగ్‌లో వ్యవహరించాల్సిన తీరు.. మాట్లాడే భాష.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణకు 20 నుంచి 30 ఏళ్లలోపు యువత మాత్రమే అర్హులు. ఈ నెల 11 వ తేదీ నుంచి డిసెంబర్ 7 వ తేదీ వరకు శిక్షణ తరగతులు జరుగుతాయి. సాయంత్రం 6.15 గంటల నుంచి 7.30 గంటల వరకు నాలుగు వారాలపాటు తరగతులు ఉంటాయి.
↧
November 10, 2019, 6:30 am
![]()
వాహన కొనుగోలుదారులకు శుభవార్త. వీరికి దీపావళి మళ్లీ వచ్చింది. దేశీయ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ తన కస్టమర్ల కోసం మెగా ఆఫర్ ప్రకటించింది. వాహన కొనుగోలుపై ఏకంగా రూ.5 లక్షల బంగారం గెలుచుకునే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా వాషింగ్ మెషీన్, ఎల్ఈడీ టీవీ, మిక్సర్, స్మార్ట్‌ఫోన్ వంటి బహుమతులు కూడా గెలుచుకోవచ్చు.
టాటా మోటార్స్ ఎస్‌యూవీ లేదా పికప్ ట్రక్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు ఈ అద్భుతమైన బహుమతులను ఇంటికి పట్టుకెళ్లొచ్చు. దీంతో కస్టమర్ల జీవితాల్లో మరోసారి దీపావళి వెలుగులు నింపుతామని టాటా మోటార్స్ తెలిపింది. కంపెనీ ట్విట్టర్ వేదికగా ఈ ఆఫర్లను ప్రకటించింది.
Also Read:
Also Read:
టాటా మోటర్స్ తన ఎస్‌యూవీ కారును లేదా పికప్ ట్రక్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు టీవీ, వాషింగ్ మెషీన్, మిక్సీ వంటి గిఫ్ట్‌లను అందిచనుంది. అంతేకాకుండా వీటితోపాటు ఏకంగా రూ.5 లక్షల విలువైన బంగారాన్ని కూడా ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
Also Read:
ఇకపోతే దేశీ మార్కెట్‌లో వాహన కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వాహన అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో కంపెనీలు వరుసబెట్టి కస్టమర్లకు ఆఫర్లు అందిస్తున్నాయి. దీపావళి పండుగ సీజన్‌లోనూ వాహన కంపెనీలు అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు అందించాయి. ఇప్పుడు టాటా మోటార్స్ మళ్లీ ఆఫర్లు తీసుకువచ్చింది.
Also Read:
↧