Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all 86034 articles
Browse latest View live

బయో డైవర్సిటీ కారు ప్రమాదం: మృతురాలి కుటుంబానికి నష్టపరిహారం

$
0
0
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ వద్ద బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ కారు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారాన్ని అందించింది. ఫ్లైఓవర్ పైనుంచి పల్టీ కొట్టిన కారు కింద బస్సుకోసం వేచి చూస్తున్న మహిళపై పడడంతో ఆమె మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పసల సత్యవాణి మరణించారు. దీంతో అప్పుడే ఈమె కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఆమె కుటుంబానికి అధికారులు చెక్కును అందజేశారు. సత్యవాణి కుమార్తె నాగప్రణీత పేరు మీద ఉన్న చెక్కును ఆమె మేనమామ చక్రవర్తికి అందించారు. హైదరాబాద్ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మంగళవారం ఈ చెక్కును అందజేశారు. Also Read: ఇదే ప్రమాదంలో తుంటికి పెద్ద గాయమై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనంతపురం జిల్లాకు చెందిన కుబ్ర బేగంకు (23) వైద్య ఖర్చుల కోసం ఇటీవల రూ.3.5 లక్షలు చెల్లించామని మేయర్‌ వెల్లడించారు. ఆమె పూర్తిగా కోలుకునే వరకూ అయ్యే ఖర్చులను జీహెచ్‌ఎంసీ తరఫున భరిస్తామని రామ్మోహన్ చెప్పారు. నవంబరు 23న హైదరాబాద్‌లో జరిగిన ఈ కారు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. దాదాపు 105 కిలోమీటర్ల వేగంతో మెరుపులా దూసుకెళ్లిన కారు, మూల మలుపు వద్ద అదుపు తప్పి, 19 మీటర్ల ఎత్తులో ఉన్న వంతెన పై నుంచి కిందికి పల్టీలు కొట్టింది. సమీపంలోని బస్టాపులో బస్సు కోసం వేచి చూస్తున్న మహిళపై కారు పడిపోవడంతో.. ఆ మహిళ అక్కడికక్కడే కన్న కూతురి ఎదుటే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో మరో నలుగురికి కూడా గాయాలయ్యాయి. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో కారు నడుపుతున్న వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. Also Read: ఈ ప్రమాదం జరిగిన వెంటనే మృతి చెందిన సత్యవేణి కుటుంబానికి మేయర్ బొంతు రామ్మోహన్ రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ఘోర ప్రమాదానికి కారు అధిక వేగంతోపాటు, ఫ్లైఓవర్ డిజైన్ కూడా కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎక్కువ మలుపులు లేని డిజైన్ కోసం స్థల సేకరణ చేయాల్సి ఉండడంతో, అధికారులు దాని జోలికి పోలేదని కూడా వార్తలు వచ్చాయి. Also Read:

వైద్యురాలి హత్యాచార ఘటనపై అసభ్య పోస్టులు.. యువకుడి అరెస్ట్

$
0
0
శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్‌పై దారుణ అత్యాచారం, హత్య ఘటన యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. మాటల్లో చెప్పలేని ఘోరమిది. నెత్తురు మరిగించే నేరమిది. నిస్సహాయురాలైన ఓ యువతిపై రాత్రి వేళ తోడేళ్లలా దారి కాచి కిరాతకంగా అత్యాచారం చేసి, ఆపై ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి చంపేసిన వైనాన్ని ఊహించుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. అమ్మాయిలు, వారి తల్లిదండ్రుల వెన్నులో వణుకు పుడుతోంది. అయితే.. ఇంతటి దారుణంపైనా కొంత మంది అథములు నీచమైన పోస్టులు పెడుతున్నారు. నిజామాబాద్‌లో అలాంటి ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. దిశ ఘటనపై అసభ్య కామెంట్లు పెట్టిన నిజామాబాద్‌కు చెందిన ఓ యువకుడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మంగళవారం (డిసెంబర్ 3) అరెస్టు చేశారు. నవీపేట్ మండలం ఫకీరాబాద్‌కు చెందిన చవాన్ శ్రీరామ్ (22) అనే యువకుడు.. వెటర్నరీ వైద్యురాలి హత్యాచార ఘటనపై ఫేస్‌బుక్‌లో జుగుప్సాకరమైన పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. ఈ అంశంపై సుమోటోగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు చర్యలు చేపట్టారు. Also Read: బాధితురాలి ఫోటోను షేర్ చేస్తూ కొంత మంది వ్యక్తులు అభ్యంతరకరమైన, అసభ్య పోస్టులను పెట్టినట్లు నవంబర్ 30న సీసీఎస్ పోలీసులు గుర్తించారు. మహిళలకు వ్యతరేకంగా ఈ పోస్టులు ఉన్నట్లు గుర్తించారు. ఈ అంశంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫేస్‌బుక్‌లో స్టాలిన్ శ్రీరామ్ పేరుతో ఈ కామెంట్లు పెట్టినట్లు గుర్తించారు. మంగళవారం నిందితుడిని తమ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇలాంటి కామెంట్లు చేసిన మరి కొంత మంది నిందితులను పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.

‘ఆడపిల్ల దుస్తులు విప్పించారు, మేం అలాంటివాళ్లం కాదు’

$
0
0
బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కమాండో 3’. నవంబర్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. అయితే ఈ సినిమాను ప్రముఖ రెజ్లర్ సుషిల్ కుమార్ వీక్షించారట. సినిమా తనను ఆగ్రహానికి గురిచేసిందని అన్నారు. ఎందుకంటే ఈ సినిమాలో ఓ రెజ్లర్‌ను ఆడపిల్లలను హింసించే వ్యక్తిగా చూపించారట. ఓ మైనర్ బాలికను ఏడిపిస్తూ అందరూ చూస్తుండగానే ఆమె స్కర్ట్ పైకి లేపుతున్నట్లు చూపించారట. ఆ తర్వాత హీరో ఎంట్రీ ఇచ్చి అతని నుంచి బాలికను కాపాడినట్లు చూపించారు. ఈ విషయంపై సుషిల్ మీడియా ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఈ సన్నివేశాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రెజ్లర్లకు సమాజంలో మంచి పేరు, గౌరవం ఉన్నాయి. రెజ్లర్లను సినిమాలో తప్పుగా చూపించినందుకు కమాండో టీం మాకు సారీ చెప్పాలి. అంతేకాదు ఆ సన్నివేశాన్ని తొలగించాలి. సినిమాలో ఆ సన్నివేశం పెట్టే ముందు రెజ్లర్లపై సినిమా టీం ఎలాంటి రీసెర్చ్ చేయలేదు. మేం చాలా డీసెంట్‌గా, డిసిప్లైన్డ్‌గా ఉంటాం. ఈ విషయంపై ప్రేక్షకులు కూడా అభ్యంతరం తెలిపాలని అనుకుంటున్నాను’ అంటూ మండిపడ్డారు. ‘కమాండో 3’ సినిమాను ఆదిత్య దత్ డైరెక్ట్ చేశారు. ఇందులో ప్రముఖ నటి అదా శర్మ కథానాయికగా నటించారు. అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిందనే చెప్పాలి. సుషిల్ కుమార్ 2012లో లండన్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్‌, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్‌ను సాధించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించిన ఏకైక భారతీయుడిగా సుషిల్ తన పేరును చరిత్రలో లిఖించుకున్నారు.

ముప్పు ఉంటేనే భద్రత.! గాంధీ కుటుంబంపై విజయసాయి పరోక్ష వ్యాఖ్యలు

$
0
0
కుటుంబం టార్గెట్‌గా పరోక్ష వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ . వ్యక్తుల ప్రాణాలకు ఉన్న ముప్పును బట్టి భద్రత కల్పించాలని.. అంతేకానీ కుటుంబ కారణాలతో కాదని వ్యాఖ్యానించారు. ప్రముఖుల భద్రతకు సంబంధించి రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించి జడ్ ప్లస్ కేటగిరీగా మార్పు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయసాయి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాహుల్ సోదరి, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇన్‌చార్జి ప్రియాంక గాంధీలకు కల్పిస్తున్న ఎస్పీజీ భద్రతను కేంద్రం వెనక్కు తీసుకుంది. ఇకపై జడ్‌ప్లస్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అంతకుముందే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఎస్పీజీ భద్రతను తొలగించింది. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే భద్రతను తగ్గించారని ఆరోపిస్తున్నారు. Also Read: తాజాగా వీవీఐపీల భద్రతపై ఈ రోజు రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఎవరి ప్రాణాలకైనా ముప్పు ప్రాతిపదికన మాత్రమే కల్పించాలని అన్నారు. అంతేకానీ ఫలానా కుటుంబంలో పుట్టిన కారణంగా భద్రత కల్పించాల్సిన అవసరం లేదంటూ సోనియా గాంధీ కుటుంబంపై విజయసాయి పరోక్షంగా వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం 1985లో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ)ని నెలకొల్పారు. ఇందిర తనయుడు రాజీవ్ గాంధీ హత్య జరిగిన తరువాత 1991లో ఎస్పీజీ చట్టానికి సవరణలు చేశారు. గాంధీ కుటుంబంలోని వ్యక్తులు సహా.. పలువురు వీవీఐపీలకు ఎస్పీజీ భద్రత కల్పించారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబానికి ఉన్న ఎస్పీజీ భద్రతను వెనక్కి తీసుకోవడంతో ఇకపై కేవలం ఒక్క ప్రధాని మోదీకి మాత్రమే ఎస్పీజీ భద్రత ఉంటుంది. గాంధీ కుటుంబానికి జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తారు. Read Also:

బ్యాంకుల ఎఫెక్ట్.. వారం రోజుల్లో తొలిసారిగా..

$
0
0
దేశీ స్టాక్ మార్కెట్ రివర్స్ గేర్‌లో నడుస్తోంది. బెంచ్‌మార్క్ సూచీలు మంగళవారం నష్టాల్లోనే క్లోజయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌యూఎల్ వంటి హెవీవెయిట్ షేర్లలో అమ్మకాలు కొనసాగడం సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది. నిన్న ఫ్లాట్‌గా ముగిసిన బెంచ్‌మార్క్ సూచీలు ఈ రోజు నష్టాల్లోనే ఆరంభమయ్యాయి. మధ్యాహ్నం కల్లా నష్టాలు మరింత ఎక్కువయ్యాయి. మెటల్, బ్యాంకింగ్ షేర్లపై ఒత్తిడి కొనసాగడం ఇందుకు కారణం. సెన్సెక్స్ ఇంట్రాడేలో 248 పాయింట్ల మేర పడిపోయింది. చివరకు సెన్సెక్స్ 127 పాయింట్ల నష్టంతో 40,675 వద్ద ముగిసింది. నిఫ్టీ 54 పాయింట్ల నష్టంతో 11,994 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 12,000 పాయింట్ల మార్క్ దిగువున ముగియడం ఇదే తొలిసారి. దాదాపు అన్ని రంగాల షేర్లపై అమ్మకాల ఒత్తిగి కనిపించింది. Also Read: Stock Market Highlights.. ✺ నిఫ్టీ 50లో బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్‌సర్వ్, టీసీఎస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. బజాజ్ ఆటో 3 శాతం, టీసీఎస్ దాదాపు 2 శాతం లాభపడ్డాయి. ✺ అదేసమయంలో యస్ బ్యాంక్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు నష్టపోయాయి. యస్ బ్యాంక్ దాదాపు 8 శాతం పడిపోయింది. Also Read: ✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ రియల్టీ మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్ దాదాపు 3 శాతం పడిపోయింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ కూడా 2.6 శాతం కుప్పకూలింది. Also Read: ✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.05 శాతం పెరుగుదలతో 60.95 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.18 శాతం పెరుగుదలతో 56.06 డాలర్లకు ఎగసింది. ✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి దాదాపు ఫ్లాట్‌గానే ట్రేడవుతోంది. 71.69 వద్ద కదలాడుతోంది. Also Read:

అద్భుతం.. మూడు రూబిక్ క్యూబ్‌‌లను గాల్లో తిప్పుతూ పజిల్ పూర్తి చేశాడు

$
0
0
రూబిక్ క్యూబ్‌ పజిల్‌లో అన్ని రంగులను ఒకే చోటకు తీసుకురావడానికి మీకు ఎంత టైమ్ పడుతుంది? సుమారు 15 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువే కదూ. అయితే, కొందరు దీన్ని ఎంతో సులభంగా పూర్తి చేసేస్తుంటారు. చిన్న చిన్న కిటుకులతో అత్యంత వేగంగా పజిల్ పూర్తి చేసి ఆశ్చర్యపరుస్తారు. ఇటీవల చెన్నైకు చెందిన ఓ చిన్నారి కళ్లకు గంతలు కట్టుకుని 2.7 నిమిషాల్లో రూబిక్ క్యూబ్‌ను పూర్తి చేసి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఆమె పేరును గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం పరిశీలిస్తున్నారు. Also Read: ఇక తాజా వైరల్ వీడియో విషయానికి వస్తే.. థియో అనే ట్విట్టర్ యూజర్ ఇటీవల ఓ వీడియోను పోస్టు చేశాడు. ఇందులో ఓ వ్యక్తి మూడు రూబిక్ క్యూబ్‌లను ఒకేసారి పట్టుకున్నాడు. ఆ మూడింటిని గాల్లోకి ఎగరేస్తూ పజిల్‌ను పూర్తిచేశాడు. ఈ వీడియో చూస్తున్నంత సేపు మీరు ఆశ్చర్యంలో మునిగిపోతారు. మళ్లీ మళ్లీ ప్లే చేసి అతడు దాన్ని ఎలా పూర్తి చేశాడో చూడాలని అనుకుంటారు. ఈ వీడియోను ఇప్పటివరకు 7.7 మిలియన్ మంది వీక్షించారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి. Also Read:

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం భారత్‌ గడ్డపై.. మ్యాచ్‌లు షురూ

$
0
0
క్రికెట్‌ని ఓ మతంలా భావించే భారత్ గడ్డపై మరో చిరస్మరణీయమైన వేదిక సిద్ధమైంది. ఇప్పటి వరకూ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ స్టేడియం ఉండగా.. ఇకపై ఆ రికార్డ్‌ గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియానికి దక్కనుంది. 63 ఎకరాల్లో అత్యాధునికంగా నిర్మించిన ఈ స్టేడియం‌ సీట్ల సామర్థ్యం లక్షా 10 వేలుకాగా.. మెల్‌బోర్న్ స్టేడియం సామర్థ్యం 1,00,024 మాత్రమే..! 1982లో నిర్మించిన పటేల్ స్టేడియం 12 టెస్టులు, 24 వన్డేలకి ఆతిథ్యమిచ్చింది. కానీ.. రెండేళ్ల క్రితం స్టేడియాన్ని పూర్తిగా కూల్చివేసిన గుజరాత్ క్రికెట్ అసోషియేషన్.. ఏకంగా రూ.700 కోట్లు వెచ్చించి స్టేడియాన్ని మళ్లీ నిర్మించింది. ఇందులో 70 కార్పొరేట్ బాక్స్‌లు ఉండగా.. నాలుగు డ్రెస్సింగ్ రూములు, ఒక క్లబ్ హౌస్, ఒక స్విమ్మింగ్ పూల్‌‌ని కూడా ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ స్టేడియంలో మ్యాచ్‌లు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 2020, మార్చి నెలలో ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ మధ్య టీ20 సిరీస్ నిర్వహించాలని బంగ్లాదేశ్ క్రికెట్ అసోషియేషన్ (బీసీబీ) ప్లాన్ చేస్తోంది. అయితే.. ఈ సిరీస్‌ని కొత్తగా నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ స్టేడియంలో నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) యోచిస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి అనుమతి తీసుకునేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఐసీసీ అనుమతిస్తే..? భారత్‌‌కి అరుదైన ఘనత దక్కనుంది.

ఇక్కడైతే సెక్స్ సీన్లు ఉండవు కదా.. అందుకే వచ్చా: నటి

$
0
0
బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘రాక్‌స్టార్’ సినిమాతో స్టా్‌ర్‌డం సంపాదించుకున్నారు బాలీవుడ్ బ్యూటీ . ఆ తర్వాత అర కొర సినిమాలు చేశారు తన పర్సనల్ లైఫ్‌లో సమస్యలు రావడంతో వెండితెరకు కూడా దూరమయ్యారు. అయితే నర్గిస్ బాలీవుడ్‌లోకి ఎందుకు వచ్చిందో వెల్లడిస్తున్న ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతోంది. బాలీవుడ్ సినిమాల్లో సెక్స్ సన్నివేశాలు ఉండవు కాబట్టి ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారట నర్గిస్. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. తన విలువలు కోల్పోయే పనులు, సినిమాలు ఎప్పుడూ చేయనని తెలిపారు. అందుకే ప్లేబాయ్ మ్యాగజైన్ అర్థనగ్నంగా ఫొటోషూట్లలో పాల్గొంటే కోట్లు ఇస్తామన్నా కూడా ఒప్పుకోలేదని పేర్కొన్నారు. ‘నేను మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడు ప్లేబాయ్ మ్యాగజైన్ నిర్వాహకులు మా కాలేజ్‌కి వచ్చారు. అబ్బాయిలతో కలిసి సెక్స్ చేస్తున్నట్లుగా పోజులిస్తూ ఫొటోషూట్లు చేస్తే కోట్లల్లో పారితోషికం ఇస్తారని తెలిసింది. నేను ఒప్పుకుని ఉంటే నాకు ఎంతో డబ్బు వచ్చేది. కానీ నేను మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. నాకు బాలీవుడ్‌లో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడి సినిమాల్లో నగ్నంగా కనిపించే అవసరం ఉండదు, సెక్స్ సీన్లలో నటించే పని కూడా ఉండదు’ అని తెలిపారు. దీనిని బట్టి చూస్తే నర్గిస్ అసలు బాలీవుడ్ సినిమాలు చూడరేమో అనిపిస్తోంది. ఎందుకంటే బాలీవుడ్ సినిమాల్లో ఓవర్ ఎక్స్‌పోజింగ్, సెక్స్ రిలేటెడ్ కంటెంట్ కాస్త ఎక్కువే ఉంటుంది. అయితే తన వద్దకు అలాంటి పాత్రలు రాలేదని ఆమె పై విధంగా స్పందించి ఉండొచ్చు. సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోయినా ప్రముఖ దిగ్గజ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ వారసుడు ఉదయ్ చోప్రాను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలని అనుకున్నారు నర్గిస్. కానీ కొన్నికారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఆ బాధ నుంచి తేరుకోవడానికి నర్గిస్ అమెరికా వెళ్లిపోయారు. ఇప్పుడు ఆమె వేరొకరితో డేటింగ్‌లో ఉన్నారు.

MS Dhoni: ఆమ్రపాలీ కేసులో ధోనీపై ఎఫ్ఐఆర్

$
0
0
భారత మాజీ కెప్టెన్ చిక్కుల్లో పడ్డాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ కేసులో ఎంఎస్ ధోనీపై పలు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కుట్రపూరిత మోసంలో పాలు పంచుకున్నాడని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. 2003లో ప్రారంభమైన ఈ కంపెనీ 2010 సమయంలో పీక్ స్టేజ్‌కు చేరుకుంది. 2016 వరకు ధోనీ ఈ గ్రూప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. దాదాపు రూ.2,647 కోట్ల విలువైన ఈ స్కాములో ఇళ్లు నిర్మిస్తామని చెప్పి, బాధితుల నుంచి డబ్బు వసూలు చేసిన నిర్వాహకులు.. సొమ్మును దారి మళ్లించి కుంభకోణానికి పాల్పడినట్లు తేలింది. ఎంతకూ తమకు ఇళ్లను నిర్మించకపోవడంతో వేల సంఖ్యలో బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ నేరం వెలుగుచూసింది. Read Also: గతనెల (నవంబరు) 27న ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ధోనీ పేరు చోటు చేసుకుంది. ఆమ్రపాలి సంస్థ నిధులు మళ్లించిన వాటిలో ధోనీ భార్య సాక్షి యాజమాన్యంలోని కంపెనీ కూడా ఉందని తేలింది. విచారణ సందర్భంగా స్కాముకు పాల్పడిన ఆమ్రపాలి సీఈఓ అనిల్ కే శర్మ, ఇతర డైరెక్టర్లను జైలుకు పంపింది. అలాగే అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయాలని నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ)ని గత జులై 23న సుప్రీం ఆదేశించింది. Read Also: తాము ఎంఎస్ ధోనీని చూసే ఈ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టామని, ఈ నేరంలో అతని పేరు కూడా నమోదు చేయాలని బాధితులు కోరడంతో ధోనీ పేరును చేర్చినట్లు తెలుస్తోంది. నిర్వాహకుల మోసపూరిత కుట్రలో ధోనీ కూడా భాగమని బాధితులు వాదిస్తున్నారు. మరోవైపు క్రికెటర్‌గా ధోనీ పేరు, మాజీ ఐఐటీయన్ అని అనిల్‌ను నమ్మి పెట్టుబడి పెట్టామని, స్కాములో ధోనీ పాత్రం బహిర్గతం చేయాలని మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. నిందితుల జాబితాలో ధోనీ పేరు కూడా చేర్చాలని ఫిర్యాదుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా వన్డే వరల్డ్ కప్ ముగిశాక ధోనీ మైదానంలోకి దిగేది ఎప్పుడని ఓవైపు అభిమానుల చర్చించుకుంటుండగా .. అనూహ్యంగా క్రిమినల్ కేసులో ధోనీ పేరు తెరపైకి రావడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. Read Also:

బెయిల్ వచ్చిన ఆనందంలో గన్ పేల్చాడు.. మళ్లీ అరెస్టయ్యాడు!

$
0
0
బెయిల్ వచ్చిన ఆనందంలో గన్ పేల్చాడు.. మళ్లీ అరెస్టయ్యాడు!

‘KCR గిరిజనుల్ని మోసం చేస్తున్నారు..’ ధర్నాతో దద్దరిల్లిన జంతర్ మంతర్

$
0
0
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. గిరిజన రిజర్వేషన్లను ముస్లింల రిజర్వేషన్‌లతో ముడిపెట్టి కేంద్రానికి పంపారని విమర్శించారు. దీనివల్ల జనాభా దామాషా ప్రకారం గిరిజనులకు దక్కాల్సిన రిజర్వేషన్లు ఆలస్యం అయ్యాయని ఉత్తమ్ వివరించారు. జనాభా దామాషా ప్రకారం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసలు గిరిజన రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన తీర్మానం ఎక్కడ ఉందో కూడా తెలియదని ధ్వజమెత్తారు. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో తెలంగాణ గిరిజన శక్తి ఆధ్వర్యంలో మంగళవారం మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు తెరాస ఎంపీలు మాలోతు కవిత, రాములు నాయక్ తదితరులు మద్దతు తెలిపారు. గిరిజనులకు రిజర్వేషన్లు వచ్చేవరకూ వారికి అండగా ఉండి, హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఉత్తమ్ హామీ ఇచ్చారు. Also Read: మరోవైపు కేంద్ర ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లపై పార్లమెంటులో బిల్లు పెట్టాలని తెరాస ఎంపీ మాలోతు కవిత డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో గిరిజన రిజర్వేషన్ల గురించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడం దారుణమని అన్నారు. ఎన్నో బిల్లులు తీసుకొస్తున్న కేంద్రం గిరిజన బిల్లుపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ప్రశ్నించారు. గిరిజనుల బిల్లు కోసం పార్లమెంటులో తెరాస తరపున పోరాటం చేస్తామని చెప్పారు. Also Read:

Jio కొత్త ప్లాన్ ఇదే.. డిసెంబర్ 6 వరకే రీచార్జ్ చేసుకునే అవకాశం!

$
0
0
డిసెంబర్ 6 నుంచి అమల్లోకి రానున్న కొత్త ప్లాన్లను ఇంకా వెల్లడించాల్సి ఉంది. కానీ దానికి ముందే వినియోగదారులను తమకు ఇష్టమైన పాత రీచార్జ్ ప్యాక్ లతో రీచార్జ్ చేసుకోవాల్సిందిగా జియో సూచిస్తోంది. పెరిగిన కాల్ చార్జీల ప్రభావం పడకుండా ఉండటం కోసం ఓ దీర్ఘకాలిక ప్లాన్ ను జియో ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ అసలు ధర రూ.1,776 కాగా, 444 x 4 పేరిట జియో ఈ ప్లాన్ ను ప్రచారం చేస్తుంది. అంటే రూ.444 ఆల్ ఇన్ ప్లాన్ తోనే నాలుగు సార్లు రీచార్జ్ చేసుకోవాల్సిందిగా జియో తన వినియోగదారులకు సూచిస్తోందన్న మాట. Also Read: రూ.444 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. దీని ప్రకారమే ఈ రూ.1,776 ప్లాన్ వ్యాలిడిటీని కూడా 336 రోజులుగా అందించారు. దీనికి సంబంధించిన లాభాలను చూసినట్లయితే.. రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు, జియో నుంచి జియో నెట్ వర్క్ కు అన్ లిమిటెడ్ ఉచిత కాల్స్, జియో నుంచి ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 4,000 ఉచిత నిమిషాలు అందిస్తారు. వీటితో పాటు జియో యాప్స్ కు కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తారు. కాబట్టి పెరిగిన టారిఫ్ ల ప్రభావం మీపై రానున్న 11 నెలల కాలం పాటు ఉండదన్న మాట. Also Read: టారిఫ్ రేట్ల పెంపునకు కొద్ది రోజుల ముందుగానే.. జియో దీన్ని ప్రకటించింది. అయితే రిలయన్స్ జియో తన కొత్త ఆల్-ఇన్-వన్ ప్లాన్లు 40 శాతం అధికంగా ఉంటాయని, 300 శాతం అధిక లాభాలు అందిస్తామని జియో తెలిపింది. దీంతో పాటు తమ వినియోగదారులకు పాత ప్లాన్లు నచ్చినట్లయితే వాటితో రీచార్జ్ చేసుకోవచ్చని మై జియో యాప్, వెబ్ సైట్ ద్వారా తెలుపుతోంది. ప్రస్తుతం ఉన్న ప్లాన్ పరిమితి ముగియగానే కొత్త ప్లాన్లు యాక్టివేట్ అవుతాయని పేర్కొంది. Also Read:

SPG సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. తొలి ఎఫెక్ట్ మోదీపైనే!

$
0
0
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సవరణ బిల్లు, 2019 మంగళవారం సాయంత్రం రాజ్యసభలో ఆమోదం పొందింది. గత వారం ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో.. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడటమే తరువాయి.. సవరణలతో కూడిన ఎస్పీజీ చట్టం అమల్లోకి వస్తుంది. రాజ్యసభలో ఈ బిల్లు చర్చకు వచ్చిన సమయంలో.. సోనియా, రాహుల్, ప్రియాంకలకు ఎస్పీజీ కవర్‌ను తప్పించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ వాకౌట్ చేసింది. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించడానికే ఈ బిల్లును తీసుకొచ్చారన్న ఆరోపణలు అమిత్ షా ఖండించారు. గాంధీ కుటుంబాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చామనడం నిజం కాదని షా తెలిపారు. ముప్పు తీవ్రతను అంచనా వేసిన తర్వాతే.. ఈ బిల్లును తీసుకురావడానికి ముందే.. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించామన్నారు. ఎస్పీజీ చట్టానికి ఇది ఐదో సవరణ అని చెప్పిన అమిత్ షా.. గతంలో నాలుగు సవరణలు మాత్రం ఒకే ఒక కుటుంబాన్ని (గాంధీ) దృష్టిలో ఉంచుకొని జరిగాయన్నారు. తాజా సవరణ ద్వారా ఎక్కువ ప్రభావితం అయ్యేది ప్రధాని మోదీ అని హోం మంత్రి తెలిపారు. ప్రధాని పదవి నుంచి తప్పుకున్న ఐదేళ్ల తర్వాత ఆయనకు ఎస్పీజీ భద్రత ఉపసంహరిస్తారని ఆయన చెప్పారు. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత మాత్రమే కావాలని కాంగ్రెస్ పార్టీ ఎందుకు డిమాండ్ చేస్తోందని అమిత్ షా ప్రశ్నించారు. భద్రత అనేది స్టేటస్ సింబల్ కాదన్న హోం మంత్రి.. ఎస్పీజీ భద్రత అనేది దేశాన్ని నడిపే వారికి మాత్రమే పరిమితమన్నారు. అందరికీ ఎస్పీజీ భద్రత ఇవ్వలేమన్న ఆయన.. మేం ఒక కుటుంబానికి వ్యతిరేకం కాదు. కానీ కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమన్నారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహా రావు, ఐకే గుజ్రాల్, చంద్ర శేఖర్, దేవేగౌడ, మన్మోహన్ సింగ్‌లకు సెక్యూరిటీ కవర్‌ను ప్రభుత్వం తొలగించినప్పుడు ఎలాంటి వివాదం తలెత్తలేదన్నారు. ఎస్పీజీ సవరణ బిల్లు ప్రకారం.. ఇక నుంచి అత్యున్నత స్థాయి ఎస్పీజీ భద్రత కేవలం ప్రధాని, ఆయనతోపాటు అధికారిక నివాసంలో నివసించే కుటుంబ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. మాజీ ప్రధానులు, ఆయనతో కలిసి నివసించే కుటుంబ సభ్యులకు ప్రధాని పదవి నుంచి వైదొలిగిన ఐదేళ్ల వరకు ఎస్పీజీ భద్రత కల్పిస్తారు. ఎస్పీజీ బిల్లుకు లోక్ సభ నవంబర్ 27న మూజువాణి ఓటు ద్వారా ఆమోదం తెలిపింది. అప్పుడు కూడా కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేశారు.

మెడకు ఉరి బిగించుకుని.. వంతెన మీద నుంచి దూకి.. కెమేరాకు చిక్కిన ఘటన

$
0
0
మెడకు ఉరి బిగించుకుని.. వంతెన మీద నుంచి దూకి.. కెమేరాకు చిక్కిన ఘటన

జనసేన పార్టీ బీజేపీలో విలీనం.. పవనే చెప్పారు.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

$
0
0
జనసేన అధ్యక్షుడు వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. జగన్ టార్గెట్‌గా పవన్ పవన్‌ పదునైన విమర్శలతో విరుచుకుపడుతుంటే.. ఏపీ మంత్రులు పవన్‌కి ధీటుగా కౌంటర్ ఇస్తుండడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. తిరుపతి పర్యటనలో ఉన్న పవన్.. ఉల్లి ధరల పెరుగుదలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఇసుక, ఉల్లి వంటి కనీస అవసరాల కోసం క్యూలో నిల్చోవాల్సిన దారుణ పరిస్థితులు వచ్చాయంటూ విమర్శలు గుప్పించారు. జనసేనాని పవణ్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు ఏపీ పౌరసరఫరాల మంత్రి . దేశవ్యాప్తంగా ఉల్లి సమస్యపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారని ఆయన ప్రశ్నించారు. పవన్ తిరుపతిలో సందర్శించిన మార్కెట్ యార్డులో ఉల్లిపాయలు ఎవరు తెచ్చి పెట్టారని నాని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ ధరలకు ఉల్లి అందజేసేందుకు రైతు బజార్లకు తరలించినట్లు చెప్పారు. కనీస అవగాహన లేకుండా మాట్లడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. Also Read: రాయలసీమ ప్రాంతాన్ని కొన్ని గ్రూపులు కబ్జా చేశాయి. మెత్తగా మాట్లాడితే మనుషులు వినరు. అమిత్ షా లాంటి వ్యక్తులే ఈ దేశానికి కరెక్ట్. ఉక్కుపాదంతో అణచివేస్తారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు నాని ఘాటుగా స్పందించారు. జనసేన పార్టీని బీజేపీలో కలిపేందుకు సిద్ధమైనట్లు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పారన్నారు. పార్టీని విలీనం చేయమని అమిత్ షా అడిగారని గతంలో పవన్ వ్యాఖ్యనించారని గుర్తు చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని నాని పేర్కొన్నారు. జైలులో ఉండొచ్చిన వ్యక్తి సీఎం అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని ఎదిరించి బయటకి వచ్చి ప్రజలకు అండగా నిలిచినందుకే జగన్ జైలుకెళ్లారని నాని అన్నారు. అంతేకానీ ప్రధాని మోదీని, అమిత్ షాని ఆకాశానికెత్తుతున్న పవన్ జైలుకెందుకు వెళ్తాడని ప్రశ్నించారు. అమిత్ షాని పొగుడుతున్నందుకు పవన్ జైలుకెళ్లే ప్రసక్తే లేదని.. ఏసీ రూమ్‌లోనే ఉంటారంటూ సెటైర్లు వేశారు. Read Also:

క్యాంటిన్‌లో ఏనుగు బీభత్సం.. టేబుళ్లు, కూర్చీలు తన్నుతూ రచ్చ!

$
0
0
క్యాంటిన్‌లో ఏనుగు బీభత్సం.. టేబుళ్లు, కూర్చీలు తన్నుతూ రచ్చ!

ట్రక్కు కింద నక్కి.. ఫ్రీ జర్నీ చేసిన కొండ చిలువ, చివరికి చిక్కిందిలా!

$
0
0
ట్రక్కు కింద నక్కి.. ఫ్రీ జర్నీ చేసిన కొండ చిలువ, చివరికి చిక్కిందిలా!

తెలంగాణ పదోతరగతి పరీక్షల తేదీలు వెల్లడి

$
0
0
తెలంగాణలో పదోతరగతి వార్షిక పరీక్షల తేదీలను స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ మంగళవారం (డిసెంబరు 3) విడుదల చేసింది. షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది మార్చి 19 నుంచి నిర్వహించనున్నారు. రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1తో పరీక్షలు ముగియనుండగా.. స్పెషల్ లాంగ్వేజ్, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6న పరీక్షలు ముగుస్తాయి. Read Also: ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. స్పెషల్ లాంగ్వేజ్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. Read Also: పదోతరగతి పరీక్షల షెడ్యూలు ఇలా.. Read More . .➦ ➦

భార్య కాళ్లు, చేతులు కట్టేసి గ్యాంగ్‌రేప్.. అనంతపురంలో అత్యంత దారుణ ఘటన

$
0
0
హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ హత్యాచార ఘటన మరువకముందే ఏపీలో మరో అమానుష ఘటన జరిగింది. కట్టుకున్న భర్తే భార్య కాళ్లు, చేతులు కట్టేసి స్నేహితులతో కలిసి గ్యాంగ్‌రేప్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. స్నేహితులతో వచ్చి విచక్షణా రహితంగా పశువుల్లా పడి అత్యాచారం చేశారని బాధితురాలు వాపోయింది. సొంత భర్తే ఘాతుకానికి పాల్పడడంతో బాధిత మహిళ కుంగిపోయింది. బయటకు చెప్పుకోలేక కన్నీరుమున్నీరైంది. కట్టుకున్న భర్త పశువులా మారి స్నేహితులతో కలిసి భార్యను చెరబట్టిన దారుణ ఘటన అనంతపురంలో జరిగింది. కదిరికి చెందిన మల్లేష్ ఫుల్లుగా మద్యం తాగి స్నేహితులతో కలసి ఇంటికి వచ్చాడు. తన అర్ధాంగి అని కూడా చూడకుండా కాళ్లు, చేతులు కట్టేసి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. మల్లేష్, అతని స్నేహితులు పశువుల్లా పైన పడి తమ పశువాంఛ తీర్చుకున్నారు. ప్రతిఘటించినందుకు బాధితురాలి శరీరాన్ని గోళ్లతో చీల్చి దారుణంగా రేప్ చేశారు. రక్తగాయాలైన మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. Also Read: కట్టుకున్న భర్తే ఘాతుకానికి పాల్పడడంతో ఆ భార్య గుండెపగిలింది. ఎవరికీ చెప్పుకోలేక బాధితురాలు మౌనంగా రోధించింది. చివరకు అంగన్‌వాడీ సిబ్బంది సాయంతో ధైర్యం తెచ్చుకుని తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు భర్త మల్లేష్‌పై రేప్ కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. Read Also: అయితే మల్లేష్ గతంలో తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటనలో జైలుకి వెళ్లాడు. జైలు శిక్ష అనుభవించాక కూడా తనలో ఎలాంటి మార్పు రాకపోగా భార్యపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మద్యంమత్తులో దారుణానికి పాల్పడ్డాడు. తప్పతాగి స్నేహితులతో కలిసి గ్యాంగ్‌రేప్‌కి పాల్పడడం స్థానికులను కలచివేస్తోంది.

ఎవ్వరికీ ఒక్క పైసా రెమ్యునరేషన్ ఇవ్వలేదు: శ్రీనివాసరెడ్డి

$
0
0
నటుడిగా రాణిస్తోన్న శ్రీనివాసరెడ్డి ఇప్పుడు దర్శకుడి అవతారం ఎత్తారు. అంతేకాదు, ఫ్లయింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్షన్స్ అనే బ్యాన‌ర్‌‌ను స్థాపించి నిర్మాత కూడా అయ్యారు. శ్రీనివాసరెడ్డి దర్శక నిర్మాతగా మారి తెరకెక్కించిన తొలి సినిమా ‘భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు’. ఈ సినిమాలో ఆయనతో పాటు స‌త్య, ష‌క‌ల‌క శంక‌ర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా డిసెంబ‌ర్ 6న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శక నిర్మాత శ్రీనివాస‌రెడ్డి మీడియాతో కాసేపు ముచ్చటించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ద‌ర్శకుడిగా ఎలా? ఎందుకు మారారు? త‌క్కువ బ‌డ్జెట్‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ మూవీని ప్రొడ్యూస్ చేయాల‌ని చాలా రోజులుగా అనుకునేవాడిని. అలాంటి స‌మ‌యంలో నేను చేయాల్సిన ఓ సినిమా 20 రోజుల పాటు వాయిదా ప‌డింది. ఆ స‌మ‌యంలో నాతో ‘జ‌యమ్ము నిశ్చయ‌మ్మురా’ సినిమా చేసిన ప‌రం చెప్పిన పాయింట్ మీద క‌థ‌ను డెవ‌ల‌ప్ చేశాం. క‌థ చాలా బాగా వ‌చ్చింది. దాంతో ఈ సినిమా ఫ్లయింగ్ క‌ల‌ర్స్ బ్యాన‌ర్‌లో ప్రొడ్యూస్ చేయాల‌ని అనుకున్నాను. అయితే చాలా మంది క‌మెడియ‌న్స్ వ‌స్తే కొత్త ద‌ర్శకుడు హ్యాండిల్ చేస్తాడో లేదోన‌నిపించింది. అందుక‌నే నేనే సినిమాను డైరెక్ట్ చేయాల‌ని అనుకున్నాను. నేను ద‌ర్శక నిర్మాత‌గా చేయ‌బోయే సినిమా గురించి మా ఆర్టిస్టుల‌కు చెప్పగానే త‌మ నుండి ఎలాంటి సాయం కావాల‌న్నా చేస్తామ‌ని అన్నారు. నేను వారికి ఎలాంటి రెమ్యున‌రేష‌న్స్ ఇవ్వలేదు. ఓన్ రిలీజ్ చేస్తుండ‌టం వ‌ల్ల రిలీజ్ త‌ర్వాతే డ‌బ్బులు తీసుకుంటామ‌ని అంద‌రూ అన్నారు. అలా నేను ‘భాగ్యన‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మత్తు’ సినిమాకు డైరెక్టర్‌గా మారాను. Also Read: మీరే ద‌ర్శక నిర్మాత అంటే విమ‌ర్శలు వ‌స్తాయేమోన‌ని అనుకోలేదా? సినిమా ఎలాగోలా ఉంటుంద‌ని అనుకుని చేయ‌లేదు. ముందుగా నాకున్న నాలెడ్జ్‌తో ప్రేక్షకుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌గ‌ల‌నని భావించి రాసుకున్న క‌థ‌. ప్రీ వ‌ర్క్ బాగా చేశాం. నేను, ప‌టేల్ అనే రైట‌ర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌బ్జెక్ట్‌పై న‌మ్మకంగా ఉన్నాం. ఈ క‌థ‌ను విన్నవాళ్లెవ‌రూ ఎందుకులే అన్నా! క‌థ‌లో అంత ద‌మ్ములేదు అనలేదు. ఇంట్లోవాళ్లకి కూడా క‌థ వినిపించాను. అనిల్ రావిపూడిగారికి కూడా క‌థ వినిపించాను. ఆయ‌న‌కు బాగా న‌చ్చింది. జాగ్రత్తగా చేసుకుంటే బావుంటుంద‌నే స‌ల‌హా ఇచ్చారంద‌రూ. మ‌న విజువ‌లైజేష‌న్ వేరుగా ఉంటుంది. ప్రాక్టికల్‌గా వేరుగా ఉంటుంది. అన్ని ఓ ప్రాసెస్‌లా నేర్చుకుంటూ వ‌చ్చాను. దిల్‌ రాజు గారు ట్రైల‌ర్ క‌ట్ చేసినప్పుడు ఇచ్చిన స‌ల‌హాలు నాకు బాగా హెల్ప్ అయ్యాయి. ఇంత మంది ఆర్టిస్టుల‌తో ప్రేక్షకుల‌ను క‌థ‌లోకి తీసుకెళ్లడం అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ‘భాగ్యన‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మత్తు’ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ఆసాంతం ప్రేక్షకులు క‌డుపుబ్బా న‌వ్వుతారు. మెయిన్ పాయింట్ ఏంటి? స‌ర్వైవ‌ల్ ప్రాబ్లమ్ ఒక‌రికి, లాట‌రీ టికెట్స్ పిచ్చి మ‌రొక‌రికి ఉంటుంది. ఇలా ఎంట‌ర్‌టైనింగ్‌గా సినిమా సాగుతుంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన‌ చాలా విష‌యాల‌ను మా సినిమాలో ఎంట‌ర్‌టైనింగ్ వేలో చెప్పాం. ఉదాహ‌ర‌ణ‌కి శివాజీగారి ఆప‌రేష‌న్ గ‌రుడ‌వేగ ఉంది. దాన్ని శివాజీగారు ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం బావుంది. దాన్ని మా సినిమాలో ఉప‌యోగించుకున్నాం. ఓంకార్‌గారి వ‌న్ మినిట్ సీన్‌ ఉంది. సృజ‌న‌, ప్రియాప్రకాష్, బ్రతుకు ఎడ్లబ‌ండి లాంటి సీన్‌, ర‌స‌గుల్లా లాంటి సీన్స్ ఇలా ప్రేక్షకుల‌ను మెప్పించేవి చాలానే ఉన్నాయి. ఒక‌రోజులో జ‌రిగే క‌థ ఇది. దేన్నీ మిస్ చేయ‌కూడ‌ద‌ని తొలి స‌న్నివేశాన్ని మా నాన్నగారిపై తీశాను. సినిమాను పూర్తి చేసిన త‌ర్వాత ఆయ‌న క‌న్నుమూశారు. మా నాన్నకు డ‌బ్బింగ్‌ను మ‌హ‌ర్షి సినిమాలో రైతు పాత్ర చేసిన గురుస్వామిగారు చెప్పారు. మాద‌కద్రవ్యాల ముఠాను ఓ పోలీస్ ఆఫీస‌ర్ ప‌ట్టుకోవాల‌నుకుంటే దాంట్లోకి మేం ఎలా ఇరుక్కున్నామ‌నేదే క‌థ‌. నేను, స‌త్య, ష‌క‌ల‌క శంక‌ర్ ప్రధానంగా న‌టించాం. మీ మేన‌ల్లుడు పాత్ర ఎలా ఉంటుంది? మా మేన‌ల్లుడు సుజిత్‌ ఇందులో మంచి పాత్రలో క‌న‌ప‌డ‌తాడు. డ‌గ్స్ర్‌కి బానిసైన యువ‌కుడిగా క‌న‌ప‌డ‌తాడు. యూత్‌కు వెళ్లాల్సిన మెసేజ్ త‌న ద్వారానే వెళుతుంది. ద‌ర్శక నిర్మాత‌గా చేయ‌డం వ‌ల్ల మీరు సినిమాలు మిస్ అయ్యార‌ని అనుకుంటున్నారా? ఆర్టిస్ట్‌, ద‌ర్శకుడు, నిర్మాత రోల్స్‌లో నాకు ఆర్టిస్ట్‌గా ఉండ‌టమే ఇష్టం. ఈ సినిమా కోసం ద‌ర్శక నిర్మాత‌గా మారడం వ‌ల్ల ‘స‌రిలేరు నీకెవ్వరు’ చేయ‌లేక‌పోయాను. అయితే ‘మ‌హ‌ర్షి’ సినిమా కోసం గ్యాప్ తీసుకుని వెళ్లి న‌టించాను. ఆర్టిస్ట్‌గా ఇప్పటి వ‌ర‌కు ఎంజాయ్ చేశాను. డైరెక్టర్‌గా నేనేం చేశాన‌నేది నాకు తెలుసు. ఆర్టిస్ట్‌గా ఎక్కడా ఆగే స‌మ‌స్య లేదు. ఆల్ రెడీ న‌టుడిగా నాలుగైదు సినిమాల‌ను క‌మిట్ అయ్యాను. ప్రస్తుతం న‌టుడిగా చేస్తున్న సినిమాలేంటి? బాల‌కృష్ణగారి ‘రూల‌ర్‌’లో న‌టించాను. క‌ళ్యాణ్‌రామ్‌, మ‌ల్లిడి వేణు కాంబినేష‌న్‌లో రూపొంద‌బోయే సినిమాలో న‌టించ‌బోతున్నాను. మ‌రికొన్ని డిస్కష‌న్స్ ఉన్నాయి. ఇక డైరెక్టర్‌గా చూస్తే.. నేను బేసిగ్గా క‌మెడియ‌న్‌ని కాబ‌ట్టి డైరెక్టర్‌గా కూడా ఆడియెన్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికే ప్రయ‌త్నిస్తాను. సినిమా మేకింగ్‌లో ఎలాంటి స‌పోర్ట్ ల‌భించింది.. ఫీడ్ బ్యాక్ ఎలా ఉంది? సినిమా తెర‌కెక్కించిన త‌ర్వాతే కాదు.. ముందు నుండి చాలా కాన్ఫిడెంట్‌గానే ముందుకెళ్లాం. అంద‌రూ త‌మ వంతు స‌పోర్ట్ చేశారు. ట్రైల‌ర్ చూసి రాజ‌మౌళిగారు ట్వీట్ చేయ‌డం చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ట్రైల‌ర్ విడుద‌ల చేసిన వ‌రుణ్ తేజ్‌గారికి ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను. సినిమా పూర్తయిన త‌ర్వాత దిల్‌ రాజుగారు, శిరీష్‌గారు, మా కుటుంబ స‌భ్యులు అంద‌రూ ఈ సినిమాను చూశారు. అంద‌రికీ సినిమా బాగా న‌చ్చింది.
Viewing all 86034 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>