Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all 85987 articles
Browse latest View live

సినిమా థియేటర్‌లో అలజడి.. ప్రేక్షకులను పరుగులు పెట్టించిన ‘మూత్రం’

$
0
0
మూవీ థియేటర్‌లో ప్రేక్షకులంతా సినిమాలో లీనమైన ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా సినిమా ప్రదర్శన ఆపేశారు. ఏం జరిగిందో తెలియక ప్రేక్షకులు కాసేపు గందరగోళానికి గురయ్యారు. ఆ తర్వాత ఎగ్జిట్ డోర్లు తెరిచి.. కంగారు పడకుండా అంతా బయటకు వెళ్లాలని థియేటర్ యాజమాన్యం ప్రకటించారు. దీంతో ప్రేక్షకులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇలా మధ్యలో పంపేస్తున్నారంటే.. ఏదో బాంబు ఉండి ఉంటుందని భయపడ్డారు. థియేటర్ మొత్తం ఖాళీ అయిన తర్వాత పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఏం జరిగింది?: వాషింగ్టన్‌లోని నార్త్ బెండ్‌లోని ఓ థియేటర్‌కు ఓ పార్శిల్ వచ్చింది. అదేమిటో తెలుసుకోకుండా సిబ్బంది దాన్ని థియేటర్‌లో పెట్టారు. కొద్ది సేపటి తర్వాత దాన్ని పరిశీలించగా.. ‘అత్యంత అంటుకొనే మానవ పదార్ధం’ (Highly contagious human substance) అని రాసి ఉంది. దీంతో అదేదో వైరస్ లేదా బాంబు అని భావించి.. థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సినిమా ప్రదర్శన ఆపేసి ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, టెక్నీషియన్లు, బాంబ్ స్క్వాడ్‌లు ఆ పార్శి్ల్‌ను అన్నివిధాలా పరిశీలించారు. చివరికి ఆ పార్శిల్ విప్పారు. అందులో ఉన్న డబ్బాను చూసి ఆశ్చర్యపోయారు. అది ప్రమాదకరమైన పదార్థం కాదని, మూత్రమని తెలుసుకుని నవ్వుకున్నారు. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో దాన్ని ల్యాబ్‌కు పంపి మరోసారి పరిశీలించారు. అక్కడ కూడా అది మూత్రమని నిర్ధరించారు. దీంతో అంతా ‘హమ్మయ్య!’ అనుకున్నారు. Also Read: అడ్రస్‌లు తారుమారు కావడం వల్ల ఆ ‘మూత్రం’ శాంపిల్.. థియేటర్‌కు చేరినట్లు తెలుసుకున్నారు. ఈ విషయం తెలియగానే అంతా ఊపిరి పీల్చుకున్నా.. మూత్రాన్ని చూసి ఇంత హడావిడి చేశారా? అని నవ్వుకున్నారు. కానీ.. పెద్దలు చెప్పినట్లుగా ‘కీడెంచి మేలెంచడం’ మంచిదే కదా! పొరపాటున అది ఏ వైరస్సో, బాంబో అయ్యుంటే.. ఎంతమంది ప్రాణాలు ప్రమాదంలో పడేవో కదూ!! Also Read:

Suryapet: ఆ యువకులిద్దరూ ఇష్టపడ్డారు.. పెళ్లి చేసుకుందామంటే!

$
0
0
యువకులిద్దరూ ఒకర్నొకరు ఇష్టపడ్డారు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు.. అన్ని ప్రేమకథల్లో మాదిరిగానే వీరి పెళ్లికి కూడా ఆటంకం ఎదురైంది. అయితే.. ‘ఈ పెద్దోళ్లున్నారే..’ అని అప్పుడే తిట్టుకోమాకండి.. ఈ ప్రేమ కథలో విలన్ ప్రేమికుల్లో ఒకరే! తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఓ యువకుడిపై మరో యువకుడు ఫిర్యాదు చేయడం సూర్యాపేటలో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లా ఇమాంపేటకు చెందిన మునగాల జానయ్య అనే యువకుడు.. సూర్యాపేట పట్టణంలో ఓ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పట్టణానికి చెందిన గుండ్లగాని సాయితో అతడికి పరిచయం ఏర్పడింది. అనతి కాలంలోనే వారి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. Also Read: మహిళగా లింగ మార్పిడి చేసుకుంటేనే పెళ్లి చేసుకుంటానని సాయి చెప్పాడు. మరో ఆలోచన లేకుండా జానయ్య లింగమార్పిడి చేయించుకున్నాడు. తీరా జానయ్య మహిళగా మారిన తర్వాత సాయి మోహం చాటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ పంచాయితీ పోలీసులకు కూడా తలనొప్పిగా మారింది.

SSC CHSL - 2019 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

$
0
0
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్-2019కు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ మంగళవారం వెలువడింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆసక్తి, సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు డిసెంబు 3 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 10 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. Read Also: దీనిద్వారా పలు విభాగాల్లోని లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), పోస్టల్ అసిస్టెంట్ (PA), సార్టింగ్ అసిస్టెంట్ (SA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టులను భర్తీచేయనున్నారు. ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి వచ్చే ఏడాది మార్చి 16 నుంచి 27 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. Read Also: * కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్-2019 అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. వయోపరిమితి: 01.01.2020 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.01.1993 - 01.01.2002 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. Dont Miss: దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: టైర్-1 (ఆన్‌లైన్), టైర్-2 (డిస్క్రిప్టివ్ పేపర్), టైర్-3 (స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్) పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా. 'టైర్-1' పరీక్ష విధానం..➦ మొత్తం 200 మార్కులకు టైర్-1 ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ➦ మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వే్జ్ 25 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు-50 మార్కులు. ➦ పరీక్ష సమయం 60 నిమిషాలు (గంట). నిబంధనల ప్రకారం అనుమతి ఉన్నవారికి 80 నిమిషాల పాటు పరీక్ష ఉంటుంది. ➦ హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ➦ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు. Read Also: 'టైర్-2' పరీక్ష విధానం.. ➦ టైర్-1 పరీక్షలో అర్హత సాధించినవారికి టైర్-2 (డిస్క్రిప్టివ్) పరీక్ష నిర్వహిస్తారు. ➦ 100 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహిస్తారు. పెన్, పేపర్ విధానంలో పరీక్ష ఉంటుంది. ➦ పరీక్షలో భాగంగా 200-250 పదాలతో వ్యాసం (ఎస్సే), 150-200 పదాలతో లెటర్ లేదా అప్లికేషన్ రాయాల్సి ఉంటుంది. ➦ పరీక్ష సమయం 60 నిమిషాలు (గంట). నిబంధనల ప్రకారం అనుమతి ఉన్నవారికి 20 నిమిషాల అదనపు సమయం కేటాయిస్తారు. ➦ కనీస అర్హత మార్కులు 33గా నిర్ణయించారు. 'టైర్-3' పరీక్ష విధానం.. * టైర్-2 పరీక్షలో అర్హత సాధించినవారికి టైర్-3 (స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్) నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. * కంప్యూటర్‌లో టైపింగ్ చేయాల్సి ఉంటుంది. * పోస్టుల వారీగా స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ వేర్వేరుగా ఉంటుంది. Read Also: ముఖ్యమైన తేదీలు.. ➦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.12.2019 ➦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.01.2020 (23:59) ➦ ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరితేది: 12.01.2020 (23:59) ➦ ఆఫ్‌‌లైన్ చలానా జనరేషన్‌కు చివరితేది: 12.01.2020 (23:59) ➦ చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 14.01.2020 ➦ కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష (టైర్-1): 16.03.2020 - 27.03.2020 ➦ టైర్-2 రాతపరీక్ష (డిస్క్రిప్టివ్ పేపర్): 28.06.2020 Read More.. ➦ ➦

24 గంటల్లో చంపేయాలి.. అలాంటి వెదవల్ని వదలొద్దు: మంచు మనోజ్

$
0
0
హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాలుగు మానవ మృగాలు అత్యంత క్రూరంగా ఆమెను రేప్ చేసి చంపి పెట్రోల్ పోసి నిప్పుపెట్టాయి. అమాయకురాలైన ఒక అమ్మాయిని ఇంత క్రూరంగా హత్యచేయడంపై యావత్తు భారతావని భగ్గుమంది. ఆ మగ మృగాలను నడిరోడ్డుపై ఉరితీయాలని నినదించింది. కూతురిని కోల్పోయి దు:ఖంలో ఉన్న దిశ తల్లిదండ్రులను సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సినీ హీరో మంచు మనోజ్ వారిని పరామర్శించారు. దిశ చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. అనంతరం కాసేపు ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. వాళ్లకు ధైర్యం చెప్పారు. దోషులకు శిక్షపడేవరకు ఈ పోరాటం వెనుక తాను కూడా ఉంటానని హామీ ఇచ్చారు. Also Read: దిశ తల్లిదండ్రులను పరామర్శించిన అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడారు. చాలా ఆవేషంగా మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఆడపిల్లలను గౌరవించండి అని నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను. ఈరోజు దిశకు జరిగిందే కాదు.. నిర్భయ విషయంలో, ఆ మధ్య తొమ్మిది నెలల పసిబిడ్డను.. ఇలా రేప్‌లు చేసుకుంటూ పోతే సమాజం ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు. ఇలాంటి సమాజంలోనా మనం ఉంటున్నాం, తిరుగుతున్నాం అని నాకు నేను ఎప్పుడూ ప్రశ్నించుకుంటూనే ఉంటాను’’ అని మనోజ్ అన్నారు. దేవుడి చేతుల్లో బోలెడన్ని ఆయుధాలు ఉంటాయని, మనల్ని కాపాడతాడనే దేవుడుకి అన్ని ఆయుధాలు ఇచ్చామని మనోజ్ చెప్పారు. అయితే, అవే ఆయుధాలను మనం పోలీసులకు ఇచ్చామని, వాళ్లు మనల్ని కాపాడతారనే ధైర్యంతో మన ఆడపిల్లలు రోడ్లపై తిరుగుతున్నారని, అలాంటి ఆ రోజు ఎందుకు నిర్లక్ష్యం జరిగిందో ఆ దేవుడుకే తెలుసు అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వాళ్లింట్లో వాళ్లకు ఎందుకు ఫోన్ చేశారు.. పోలీసులు ఫోన్ చేయొచ్చుగా అని ఒకడు, ఆ టైంలో బయట ఎందుకు తిరుగుతున్నారని ఒకడు మాట్లాడుతున్నారు. అంటే, మన ఆడపిల్లలు బయటికి రాకూడదా? రాత్రిళ్లు తిరగకూడదా? మనం ఆ సెక్యూరిటీ ఇవ్వలేమా?’’ అని ప్రశ్నించారు మనోజ్. బయటికొచ్చి ఎందుకు ఆందోళన చేయట్లేదు, వాళ్లను చంపేద్దాం నరికేద్దాం అని చాలా మంది అంటున్నారని, ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఏమీ చేయలేమని అన్నారు మనోజ్. Also Read: ఇలాంటి ఘటనల్లో తక్షణమే శిక్షలు అమలయ్యేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని మనోజ్ చెప్పారు. ‘‘గీత దాటితే ట్రాఫిక్ పోలీసులు రూ.1000 చలాన్ వేస్తున్నారని, మందు తాగి డ్రైవింగ్ చేస్తే స్పెషల్ డ్రైవ్‌లు పెట్టి పట్టుకుంటున్నారని ఉచ్చ పోసుకున్నాం. తప్పించుకుని తిరిగాం. అలాంటిది ఆడపిల్ల జోలికి వస్తే ఎంత రిస్క్ ఉంటుందో తెలిసేలా అవేర్‌నెస్ తీసుకురావాలి’’ అని మనోజ్ వెల్లడించారు. ఆడవాళ్ల జోలికి వచ్చే వెదల్ని, గాడిదల్ని, బాస్టర్డ్స్‌ని ఎవడినీ వదలకూడదని అన్నారు. మార్పు అనేది ఇళ్లలోనుంచే రావాలని మనోజ్ చెప్పారు. ‘‘తాగేసొచ్చి భార్యల్ని కొట్టేవాళ్లకు, సొంత అమ్మల్ని, పిల్లల్ని తిట్టేవాళ్లకు ఒక రిక్వెస్.. ఈరోజు మీరు తాగేసి ఇళ్లలో అలా చేస్తుంటే మీ పిల్లలు అది చూస్తారు. ఓ మా నాన్న అమ్మను కొడుతున్నాడే వెరీ గుడ్.. రేపు నేను బయటికి వెళ్లి కొడితే ఇలాగే పడుంటారు కదా అనే భావన ఇళ్లలోనే క్రియేట్ చేసి పంపిస్తున్నాం. అది ఇళ్లలోనే దయచేసి ఆపండి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మనోజ్.

బంజారాహిల్స్: క్యాబ్‌లో మంటలు.. చూస్తుండగానే దగ్ధం

$
0
0
బంజారాహిల్స్‌లో ఓ కారు మంటల్లో దగ్ధమైంది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అందరూ చూస్తుండగానే కాలి బూడిదైంది. పొగలు రావడం గమనించిన క్యాబ్ డ్రైవర్ శ్రవణ్ కుమార్ చాకచక్యంగా వ్యవహరించి ఆ కారును రోడ్డుకు ఓ పక్కగా నిలిపేసి కిందకు దిగడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గురైన కారును TS10 UA 5896 నంబర్, 2016 మోడల్‌కు చెందిన ఇండిగో వాహనంగా గుర్తించారు. రోడ్ నెంబర్ 2లో ముఫకుంజ కాలేజ్ సమీపంలోని సిటీ బస్టాఫ్ వద్ద మంగళవారం (డిసెంబర్ 3) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంతో బంజారాహిల్స్‌లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.

ఎస్సైపై సీఎం వైఎస్ జగన్ ప్రశంసలు.. కారణమిదే..!

$
0
0
ఆపదలో ఉన్న మహిళను రక్షించిన ఎస్సైని సీఎం వైఎస్ జగన్ అభినందించారు. కాల్వలో కొట్టుకుపోతున్న మహిళను ప్రాణాలకు తెగించి కాపాడిన ఎస్సై ధైర్యసాహసాలను ప్రశంసించారు. విపత్కర పరిస్థితిలో సకాలంలో స్పందించి ఓ నిండుప్రాణాన్ని కాపాడిన రిజర్వ్ ఎస్సై అర్జునరావు మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి వైఎస్ జగన్‌ని కలిశారు. కృష్ణలంక ప్రాంతంలోని బందరు కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను రక్షించిన రిజర్వు సబ్‌ ఇన్స్పెక్టర్‌ అర్జునరావును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభినందించారు. ఆయన సాహసాన్ని ప్రశంసించారు. సీఎం జగన్‌ కాన్యాయ్‌ పైలెట్‌ ఆపీసర్‌గా విధులు నిర్వహిస్తున్న అర్జునరావు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. సీఎం జగన్‌ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి లైఫ్‌ సేవింగ్‌ మెడల్‌కు రికమెండ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. Also Read: లక్మీ అనే మహిళ కుటుంబ సమస్యలతో సోమవారం కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కాల్వలో కొట్టుకుపోతున్న మహిళను చూసి స్థానికులు కేకలు వేయడంతో అటువైపు వెళ్తున్న అర్జునరావు స్పందించారు. కాల్వలో కొట్టుకుపోతున్న మహిళను చూసి వెనుకాముందు ఆలోచించకుండా కాల్వలోకి దూకేశారు. ఈదుకుంటూ వెళ్లి మహిళను ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు.

మాజీ మంత్రి నారాయణకు పరాభవం.. చొక్కా పట్టుకున్న విద్యార్థి నాయకులు

$
0
0
మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణకు అనంతపురంలో చేదు అనుభవం ఎదురైంది. అనంతపురంలోని నారాయణ విద్యాసంస్థలను పరిశీలించేందుకు నారాయణ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు కళాశాల వద్దకు చేరుకున్నారు. విద్యార్థుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని.. కనీస మౌలిక వసతులు కల్పించడం లేదని నారాయణను నిలదీశారు. నారాయణ విద్యాసంస్థల సిబ్బంది కూడా విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నారంటూ అడ్డుకున్నారు. దీంతో సిబ్బందికి విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. Also Read: కళాశాలలపై సమీక్ష నిర్వహించేందుకు వచ్చిన నారాయణను విద్యార్థి నేతలు చుట్టుముట్టారు. ఆయనను ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నారు. విద్యాసంస్థల సిబ్బంది విద్యార్థి నేతల నుంచి నారాయణను తప్పించి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో తోపులాట జరిగింది. ఈ సమయంలో నారాయణ వెళ్లకుండా అడ్డుకునేందుకు విద్యార్థి నేతలు ఆయన షర్ట్ పట్టుకున్నారు. ఒకానొక దశలో దాడికి సిద్ధమైన పరిస్థితి కనిపించింది. స్పందించిన నారాయణ సిబ్బంది ఆయనను విద్యార్థి నేతల నుంచి తప్పించి కారు వరకు తీసుకెళ్లారు. ఆయన కారులో కూర్చున్న తరువాత కూడా విద్యార్థి సంఘాల నాయకులు శాంతించలేదు. కారును చుట్టుముట్టి రాయితో కారుపై కొట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. Read Also:

తెలంగాణ పదోతరగతి పరీక్షల తేదీలు వెల్లడి

$
0
0
తెలంగాణలో పదోతరగతి వార్షిక పరీక్షల తేదీలను స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ మంగళవారం (డిసెంబరు 3) విడుదల చేసింది. షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది మార్చి 19 నుంచి నిర్వహించనున్నారు. రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1తో పరీక్షలు ముగియనుండగా.. స్పెషల్ లాంగ్వేజ్, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6న పరీక్షలు ముగుస్తాయి. Read Also: ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. స్పెషల్ లాంగ్వేజ్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. Read Also: పదోతరగతి పరీక్షల షెడ్యూలు ఇలా.. Read More . .➦ ➦

ప్రకాశం జిల్లాలో దారుణం.. తల్లీబిడ్డను చంపేసి తగలబెట్టిన దుండగులు

$
0
0
తల్లీబిడ్డను అతికిరాతకంగా చంపేసి తగులబెట్టిన దారుణ ఘటన ఏపీలో జరిగింది. రెండేళ్ల బాలుడితో సహా తల్లిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసి తగులబెట్టారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట గ్రామ సమీపంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో రెండు మృతదేహాలను గుర్తించారు. రెండేళ్ల చిన్నారి సహా మహిళను అత్యంత దారుణంగా చంపేసి తగులబెట్టేశారు. ఎక్కడో చంపి ఇక్కడకి తీసుకువచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా అనుమానిస్తున్నారు. రెండేళ్ల చిన్నారిని సైతం నిర్దయగా కాల్చివేయడం చూపరులను తీవ్రంగా కలసివేసింది. Also Read: స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారితో సహా చంపేసి తగులబెట్టడంతో పలు కోణాల్లో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు. దారుణంగా హత్య చేసిన అనంతరం మృతులను తగులబెడుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఆధారాలు దొరక్కుండా తప్పించుకునేందుకే పెట్రోల్ పోసి నిప్పంటిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదల

$
0
0
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది నిర్వహించనున్న పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ డిసెంబరు 3న పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. షెడ్యూలు ప్రకారం మార్చి 23న ప్రారంభమయ్యే పదోతరగతి పరీక్షలు.. రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 6తో ముగియనుండగా.. ఇతరులకు ఏప్రిల్ 8తో ముగియనున్నాయి. అదేవిధంగా స్పెషల్ లాంగ్వేజ్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు, ఒకేషనల్ కోర్సు పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగనున్నాయి. పరీక్షల షెడ్యూల్‌ ఇలా..
పరీక్షతేదీ పరీక్ష
మార్చి 23 ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1
మార్చి 24 ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2
మార్చి 26 సెకండ్‌ లాంగ్వేజ్‌
మార్చి 27 ఇంగ్లిష్‌ పేపర్‌-1
మార్చి 28 ఇంగ్లిష్‌ పేపర్‌-2
మార్చి 30 మ్యాథమెటిక్స్ పేపర్‌-1
మార్చి 31 మ్యాథమెటిక్స్పేపర్‌-2
ఏప్రిల్‌ 01 జనరల్‌ సైన్స్‌ పేపర్‌-1
ఏప్రిల్‌ 03 జనరల్‌ సైన్స్‌ పేపర్‌-2
ఏప్రిల్‌ 04 సోషల్‌ స్టడీస్‌ పేపర్‌-1
ఏప్రిల్‌ 06 సోషల్‌ స్టడీస్‌ పేపర్‌-2
ఏప్రిల్‌ 07 స్పెషల్ లాంగ్వేజ్ (సంస్కృతం, అరబిక్‌, పెర్షియన్‌ సబ్జెక్ట్‌)
ఏప్రిల్‌ 8 ఒకేషనల్‌ పరీక్షలు (థియరీ)
ఇంటర్నల్ మార్కుల్లేవ్.. పదోతరగతి విద్యార్థులకు ఇప్పటికే ఇంటర్నర్ మార్కులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ప్రతి సబ్జెక్టులోనూ 20 ఇంటర్నల్ మార్కులు ఉండేవి. 80 మార్కులకే ప్రశ్నపత్రం ఉండేది.. తాజాగా ఇంటర్నల్ మార్కులను ఎత్తివేయడంతో.. ఒక్కో సబ్జెక్టులో మొత్తం 100 మార్కులకూ రాతపరీక్షే నిర్వహించనున్నారు. ఎప్పటిలాగే హిందీ మినహా ప్రతి సబ్జెక్టులోనూ రెండు పేపర్లు ఉంటాయి. అదేవిధంగా విద్యార్థులు సమాధానాలు రాసేందుకు 18 పేజీల బుక్‌లెట్లను ఇవ్వనున్నారు. విడిగా అడిషనల్ షీట్లను ఇచ్చే విధానం ఇకపై ఉండదు. కొత్త ప్రశ్నపత్రం ఇలా...➤ ఎప్పటిలాగే పరీక్షలో మొత్తం 11 పేపర్లు ఉంటాయి. వీటిలో హిందీకి మాత్రం ఒక పేపరు, మిగతా సబ్జెక్టులకు రెండు పేపర్లు ఉంటాయి. ➤ ఒక్కో ప్రశ్నపత్రానికి 50 మార్కులు ఉంటాయి. పరీక్షల్లో బిట్‌ పేపర్‌ను ఎత్తివేయడంతో... దీనికి బదులుగా ప్రశ్నపత్రంలోనే ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వనున్నారు. ➤ మొత్తం నాలుగు విభాగాలుగా పదోతరగతి ప్రశ్నాపత్రం రూపకల్పన చేశారు. వీటిలో ప్రతి పేపరులోనూ 12 అర మార్కు ప్రశ్నలు (6 మార్కులు), 8 ఒకమార్కు ప్రశ్నలు (8 మార్కులు), 8 రెండు మార్కుల ప్రశ్నలు (16 మార్కులు), 5 నాలుగు మార్కుల ప్రశ్నలు (20 మార్కులు) ఇవ్వనున్నారు. ➤ ఇప్పటి వరకు రెండు పేపర్లలో కలిపి 35 మార్కులు వస్తే ఉత్తీర్ణులుగా ప్రకటించే వారు.. అయితే మారిన విధానం ప్రకారం రెండు పేపర్లలోనూ కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాల్సిందే. ఒక్కో పేపరులో కనీసం 18 మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులైనట్లుగా గుర్తిస్తారు.
ప్రశ్నలు ప్రశ్నల సంఖ్య మార్కులు
1/2 మార్కు ప్రశ్నలు 12 06
1 మార్కు ప్రశ్నలు 8 08
2 మార్కుల ప్రశ్నలు 8 16
4 మార్కుల ప్రశ్నలు 5 20
మొత్తం 33 50 మార్కులు
* ఒక్కో పేపరులో అర్హత మార్కులు: 18 Read More: Read More.. ➦ ➦

నిఖిల్‌కి బంపర్ ఆఫర్.. సుకుమార్, అల్లు అరవింద్ కాంబోలో కొత్త సినిమా

$
0
0
‘అర్జున్ సురవరం’ చిత్రంతో సిద్దార్థ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇదే జోష్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌లో ఛాన్స్ కొట్టేశాడు నిఖిల్. టాలీవుడ్ బడా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కబోయే చిత్రంలో హీరోగా క్రేజీ ఆఫర్ దక్కించుకున్నాడు నిఖిల్. ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించనున్నారు. సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. 2015లో సుకుమార్ కథతో దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించి కుమార్ 21 f చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాకుండా రూ.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిన్న చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. సుమారు నాలుగేళ్ల తరువాత సుకుమార్, సూర్య ప్రతాప్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు గీతా ఆర్ట్స్‌ ద్వారా అల్లు అరవింద్ భాగస్వామ్యం కావడం.. అర్జున్ సురవరంతో హిట్ అందుకున్న నిఖిల్ హీరోగా నటిస్తుండటంతో ఈ చిత్ర అఫీషియల్ అనౌన్స్ మెంట్‌తోనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మెగా హీరోలతో పాటు బయటి హీరోలతోనూ సినిమాలు నిర్మించి మంచి విజయాల్ని అందించిన ఘనత జిఏ 2 పిక్చర్స్ కి ఉంది. ఇప్పుడు నిఖిల్ కు సైతం అద్భుతమైన విజయం ఈ సంస్థనుంచి వస్తుందని ఆశిస్తున్నారు. నాగచైతన్య తో హండ్రెడ్ పర్సంట్ లవ్, నానితో భలే భలే మగాడివోయ్, విజయ్ దేవరకొండతో గీత గోవిందం వంటి విజయవంతమైన చిత్రాలు జిఏ2 బ్యానర్లో బన్నీ వాసు నిర్మాతగా రూపొందించారు. ఇక ఇప్పుడు తొలిసారిగా నిఖిల్ తో చేస్తున్న సినిమా కూడా భారీ విజయం అందుకుంటుందనే ధీమాగా ఉన్నారు. జిఏ2 పిక్చర్స్ బ్యానర్లో, అల్లు అరవింద్ సమర్పణలో, సుకుమార్, బన్నీ వాసు లాంటి నిర్మాతలతో కలిసి వర్క్ చేస్తుండడంతో... నిఖిల్ కెరీర్ మరో కీలక మలుపు తీసకుంటుందని కాన్ఫిడెంట్‌గా నమ్ముతున్నాడు. ఈ సినిమా నిఖిల్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

3 రోజులుగా పెట్రోల్ ధర అక్కడే.. డీజిల్‌దీ ఇదే దారి!

$
0
0
దేశీ ఇంధన ధరలు స్థిరంగానే ఉంటూ వస్తున్నాయి. బుధవారం పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. కూడా ఇదే దారిలో నడిచింది. దీంతో హైదరాబాద్‌లో లీటరు రూ.79.74 వద్దనే ఉంది. డీజిల్ ధర కూడా రూ.71.79 వద్దనే నిలకడగా కొనసాగుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.79.30 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్‌ ధర కూడా రూ.71.09 వద్ద నిలకడగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.78.93 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.70.75 వద్ద నిలకడగా ఉంది. Also Read: దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.74.91 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.65.78 వద్ద నిలకడగా కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర రూ.80.59 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర కూడా రూ.69.00 వద్ద నిలకడగా కొనసాగుతోంది. Also Read: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.36 శాతం పెరుగుదలతో 61.04 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.39 శాతం పెరుగుదలతో 56.32 డాలర్లకు ఎగసింది. Also Read: ఇకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. Also Read:

Mulugu Panchangam: డిసెంబరు 4 బుధవారం.. తిథి మార్గశిర అష్టమి, నక్షత్రం

$
0
0
శుభకార్యాలు, పండగలు, వ్రతాలు లాంటి వాటి విషయానికి వస్తే భారతీయులు సంప్రదాయ కాలగణన సాధనం పంచాంగాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం.. ఈ ఐదింటి కలయికే పంచాంగం. ఇది దుర్ముహూర్తాలు, శుభముహూర్తాలు, వర్జ్యాలు, రాహుకాలం, సూర్యోదయం లాంటి విషయాల గురించి తెలియజేస్తుంది. పంచాంగం కాలగణనకు అనేక పద్దతులు ఉన్నా ప్రస్తుతం మాత్రం రెండు విధానాలే అమల్లో ఉన్నాయి. అవి సూర్యమానం', చంద్రమానం'. చంద్రుని సంచరణతో అనుసంధానమైంది చాంద్రమాన పంచాగం, సూర్యుని సంచరణతో అనుసంధానమైంది సూర్యమాన పంచాంగం. తెలుగువారు చంద్రమానాన్నే అనుసరిస్తారు. కాబట్టి చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాది ఛైత్రంతో ప్రారంభమై, ఫాల్గుణంతో పూర్తవుతుంది. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో సంచరించే స్థితిని బట్టి దీన్ని చాంద్రమానం అంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వివిధ జ్యోతిషశ్శాస్త్ర నిపుణులు పంచాంగాలు మార్కెట్‌లో లభించినా, ములుగు సిద్ధాంతిగారి పంచాంగానికి ఓ ప్రత్యేకత ఉంది. ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగారి పంచాంగంలో తిథి, వార, వర్జ్యాలు, శుభమూహూర్త, దుర్ముహూర్తాల గురించి సరైన సమాచారం ఉంటుంది. గ్రెగేరియన్ క్యాలెండర్‌తోపాటు చంద్రమానం అనుసరించి రోజువారీ, నెలవారీ, వార్షిక పంచాంగాన్ని రూపొందిస్తారు. ములుగు వారి డిసెంబరు 4 బుధవారం పంచాంగం.
తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
డిసెంబరు 4 సౌమ్యవాసరే ఉదయం 6.18- సాయంత్రం 5.20
Read Also:
సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం హేమంతరుతువు మార్గశిరమాసం-శుక్లపక్షం హర్షణం మధ్యాహ్నం 3.45 వరకు తదుపరి వజ్రం- భద్ర/ విష్ఠి ఉదయం 11.50 వరకు తదుపరి బవ రాత్రి 12.50 వరకు ఆ తదుపరి బాలువ అష్టమి రాత్రి 12.44 వరకు తుదపరి నవమి
నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
శతభిష సాయంత్రం 5.09 వరకు తదుపరి పూర్వాభాద్ర రాత్రి 12.21 నుంచి 2.08 వరకు ఉదయం 11.35 నుంచి 12.09 వరకు మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 వరకు ఉదయం 9.20 నుంచి 11.06 వరకు ఉదయం 9.30 నుంచి 10.00 తిరిగి సాయంత్రం 6.30 నుంచి 7.00 వరకు

‘మౌనరాగం’ సీరియల్ : కంగుతిన్న భ‌ర‌త్‌! అమ్ములుతో పెళ్లికి శ‌కునం బాలేదు..

$
0
0
గ‌త ఎపిసోడ్‌లో జ‌రిగిన క‌థ‌భ‌ర‌త్ మ‌నిషిని గుర్తుప‌డుతుంది అమ్ములు. (గ‌తంలో భ‌ర‌త్ నిజ‌స్వ‌రూపం తెలిసిన స‌మ‌యంలో ఆ వ్య‌క్తిని చూస్తుంది త‌ను) భార‌త్ ఆర్డ‌ర్ వేయ‌డంతో.. ఆ వ్య‌క్తే అంకిత్‌ని చావ‌గొట్టి గోదావ‌రి గ‌ట్టున పాడేసింది.. ఆ నేరం సీన‌య్య మీదకు ప‌డేలా చేసిన విష‌యం గుర్తుచేసుకుని... వాడ్ని చేత్తో ప‌ట్టుకుని లాగుతుంది. అయితే వాడు కూడా ఈ అమ్మాయి ఎవ‌రూ అని ఆలోచించుకుంటూ.. ఓ మా బాస్ భ‌ర‌త్ చేసుకునే అమ్మాయి క‌దా.. అమ్మో ఇప్పుడు ఎలా త‌ప్పించుకోవాలి? అనుకుంటుండ‌గా.. అమ్ములు బాబాయ్ వ‌చ్చి.. వాడే అమ్ముల్ని ఏడిపిస్తున్నాడ‌నుకుని.. ఈ అమ్మాయికి కాబోయే వ్య‌క్తి ఎవ‌రో తెలుసా? ఏసీపీ భ‌ర‌త్ అంటూ హ‌డావుడి చేసి చివ‌రికి వాడు పారిపోయేలా చేస్తాడు. 380 ఎపిసోడ్ హైలెట్స్‌ఆ రౌడీ త‌ప్పించుకోవ‌డంతో అమ్ములు బాధ‌ప‌డుతూ ఉంటుంది. ఇంత‌లో అంకిత్ అటుగా వెళ్తూ అమ్ముల్ని క‌లుస్తాడు. నువ్వు నా కోస‌మే వెయిట్ చేస్తున్నావ్ క‌దా? నీ పెద‌వులు మాట్లాడ‌క‌పోయినా నీ క‌ళ్లు మాట్లాడుతూనే ఉంటాయి.. అంటూ ఏదేదో మాట్లాడుతూనే ఉంటాడు. అయితే అమ్ములు కోపంగా విసుక్కుంటుంది. దాంతో నువ్వు భ‌ర‌త్‌ని న‌మ్మి త‌ప్పు చేస్తున్నావ్ అంటుంది అమ్ములు టెన్ష‌న్‌గా. అయితే అంకిత్ వినిపించుకోడు. అమ్ములూ భ‌ర‌త్‌..న‌మ్మ‌క‌పోవ‌డం నీ త‌ప్పు. త‌ను చాలా మంచివాడు అంటూ న‌మ్మ‌కంగా చెబుతుంటాడు. Read Also: దాంతో అమ్ములు కోపంతో ర‌గిలిపోతుంది. ముందు స్నేహా, భ‌ర‌త్‌ల పెళ్లి గురించి ఆలోచించు అని సైగ చేస్తుంది. అయితే అంకిత్ లైట్ తీసుకుంటాడు. ఏం చెప్పాలి అమ్ములూ భ‌ర‌త్‌కి. వాళ్లు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలా మ‌నం ఎలా చెబుతాం? అంటూ రివ‌ర్స్ అవుతాడు. దాంతో అమ్ములు సైగ‌లు చేస్తూనే.. భ‌ర‌త్‌తో నువ్వు మాట్లాడు. స్నేహాని పెళ్లి చేసుకుంటాన‌న్న విష‌యం మా నాన్న‌కు చెప్ప‌మ‌ను. లేదంటే నేను చెబుతాన‌ని చెప్పు అంటుంది అమ్ములు సైగ‌ల‌తో... అందుకు అంకిత్ స‌రేనంటాడు. అమ్ములు, అంకిత్‌లు ఇద్ద‌రూ మాట్లాడుకోవ‌డం దూరం నుంచి స‌ర‌యూ చూసి భ‌ర‌త్‌ని బాగా రెచ్చ‌గొడుతుంది. క‌నీసం ఇప్పుడైనా మ‌గాడిలా బ‌తుకు అంటూ మాట‌లు అనేసి వెళ్లిపోతుంది స‌ర‌యూ. నందినికి విష్ణు మీద అనుమానం వ‌స్తుంది. కంపెనీ ఫైల్స్ అన్నీ చెక్ చేసిన నందినీ... చాలా పొర‌బాట్లు, లావాదేవీల్లో తేడాలు తెలిసిపోతాయి. దాంతో నందిని కంపెనీకి వ‌స్తానంటుంది. ఇద్ద‌రూ క‌లిసి కారులో కంపెనీకి బ‌య‌లుదేర‌తారు. అయితే త‌ప్పు అంతా మ్యానేజ‌ర్ మీద‌కు తోసేసిన విష్ణు.. నందిని దృష్టిని మాయ‌చేస్తాడు. స‌ర‌యూ రెచ్చ‌గొట్ట‌డంతో.. భ‌ర‌త్ అంకిత్‌ని క‌లిసి బాగా తిడ‌తాడు. మాటి మాటికీ అమ్ముల్ని క‌లుస్తూ నా ప‌రువు తీయ్య‌కురా.. నేను త‌ప్పుకునేదాకా కాస్త కూల్‌గా ఉండ‌రా అన‌డంతో.. అంకిత్ సీరియ‌స్ అవుతాడు. ఇంకెప్పుడురా నువ్వు సీన‌య్య‌తో చెబుతావు? న రేపు సాయంలోపు నువ్వు సీన‌య్య గారికి చెప్ప‌క‌పోతే.. నేను వెళ్లి చెప్పేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తాడు అంకిత్‌. దాంతో భ‌ర‌త్ మ‌న‌సులో.. వీడి క‌థ‌కు వీలైనంత త్వ‌ర‌గా చెక్ పెట్టాలి అనుకుంటాడు. భ‌ర‌త్‌, స్నేహాలు కలిసి ఒక గ‌దిలో ఉండి పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. అయితే భ‌ర‌త్‌కి ఫోన్ రావ‌డంతో.. సీన‌య్య అది చూసి భ‌ర‌త్ లోప‌ల ఉన్నాడ‌ని తెలిసి ఫోన్ ఇవ్వ‌డానికి త‌లుపు కొడ‌తాడు. దాంతో స్నేహాని త‌లుపు ప‌క్క‌కు దాచి పెట్టి సీన‌య్య‌కు తెలియ‌కుండా క‌వ‌ర్ చేస్తాడు. అయితే ఆ మొత్తం సీన్.. వ‌సంత చూస్తుంది. త‌ను చెప్పింది ఎవ‌రూ విన‌క‌పోవ‌డంతో అమ్ములుకి కూడా నాన్న‌మ్మ కాంత‌మ్మ మీద ఒట్టు పెట్టి మ‌రీ నిజం చెబుతుంది. సీన్ క‌ట్ చేస్తే.. కాంత‌మ్మ వెనుకే వ‌చ్చి ఒక్క‌టి పీకుతుంది వ‌సంత‌ను. ఆ సీన్ బాగా కామెడీగా ఉంటుంది. క‌మింగ్ అప్‌లో...పెళ్లి ముహూర్తాలు ఇందులో ఉన్నాయి ఏది మీకు కుదురుతుందో అది మీరు చూడండ‌మ్మా అంటూ పూజారి.. నీల‌వేణికి ఇస్తాడు. క‌ళ్ల‌కు అద్దుకుని తీసుకుంటుంది. ఇంత‌లో భ‌ర‌త్‌.. అమ్ములుతో ర‌హ‌స్యంగా చూశావా.. నీ జాత‌కం కొన్ని నిమిషాల్లో నిర్ణ‌యించ‌బడుతుంది. ఇక‌నైనా పిచ్చి ఆలోచ‌న‌లు మానేసి చ‌క్క‌గా ఉండు అంటాడు. ఇంతలో నీల‌వేణి ముహూర్తాలు చూసే ప్ర‌య‌త్నం చేస్తుంటే దేవుడి ప‌టం కింద ప‌డిపోతుంది. శ‌కునం బాగుండ‌లేదనే అర్ధంతో అంతా షాక్ అవుతారు. మ‌రిన్ని వివ‌రాలు త‌రువాయి భాగంలో చూద్దాం. మౌన‌రాగం కొన‌సాగుతోంది.

Mulugu Horoscope: డిసెంబరు 4 రాశి ఫలాలు- ఓ రాశివారికి ఆర్థిక వివాదాలు పరిష్కారం!

$
0
0
శ్రీకాళహస్తి దేవస్థాన పండితుడిగానూ, ఖగోళ, వాస్తు శాస్త్రాల్లో నిష్ణాతుడిగానూ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగారికి విశేష ఆదరణ ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆయన జోస్యం ఫలించింది.

దిశ హత్య: మరో షాకింగ్ న్యూస్.. ప్రాణాలతో ఉండగానే కాల్చేశారు

$
0
0
హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార ఘటనపై యావత్తు భారతావని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మృగాళ్లు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, తర్వాత ఆమెను హత్య చేశారు. అయితే, ఈ కేసులో నిందితుల దారుణాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. ఆమెను ముక్కు, నోరు మూసి చంపేసిన తర్వాత పెట్రోలు పోసి తగలబెట్టినట్లు పోలీసులు ఇప్పటివరకు చెబుతున్నారు. కానీ, ఆమె బతికుండగానే సజీవదహనం చేసినట్లు చర్లపల్లి జైల్లో ఉన్న కీలక నిందితుడు ఆరిఫ్‌ కొందరు కిందిస్థాయి అధికారులకు చెప్పిన విషయం బయటకు వచ్చింది. చర్లపల్లి జైలులో ప్రత్యేక నిఘాలో ఉన్న నిందితులతో కొంతమంది జైలు సిబ్బంది మాట్లాడినప్పుడు ఆరిఫ్‌ కనీసం భయపడకుండా పలు విషయాలు బయటపెట్టినట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఘటన జరిగిన రోజున ఆరిఫ్‌ సహా మరో ముగ్గురు నిందితులు దిశను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి లాక్కుని వెళ్తుంటే ఆమె రక్షించడంటూ పెద్దగా కేకలు వేసింది. ఆమె అరుపులు ఎవరికైనా వినిపిస్తాయనే భయంతో నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు వెంటనే తన జేబులోని మద్యం సీసా తీసి బలవంతంగా ఆమె నోట్లో పోశాడు. అప్పటికే భయపడి ఆందోళనతో ఉన్న దిశ స్పృహ కోల్పోవడంతో ఆమె నలుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత ఆమెను లారీలోకి ఎక్కించి అందులోనూ మళ్లీ అత్యాచారం చేశారు. మద్యం తాగించి, పాశవికంగా అత్యాచారానికి పాల్పడంతో బాధితురాలు పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమె చనిపోయినట్లుగా భావించి చటాన్‌పల్లి వంతెన దగ్గరకు తీసుకువెళ్లి బతికి ఉండగానే పెట్రోల్‌ పోసి నిప్పటించారు. కాగా, దిశ కేసు నిందితులు ఉన్న సెల్‌ను ర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌ ఎం.సంపత్‌ మంగళవారం పరిశీలించి వారితో మాట్లాడారు. దోమలు ఎక్కువగా ఉండటంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని నిందితులు వెల్లడించారు. అంతేకాదు, తనకు జ్వరంగా ఉందని ఆరిఫ్‌ చెప్పడంతో అతడికి వైద్యం అందజేశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతుోన్న మరో నిందితుడుకి కూడా వైద్యం అందిస్తున్నట్లు జైలు వర్గాలు తెలియజేశాయి. నిందితులు నలుగురినీ తమ సెల్ దాటి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. లోపలే బాత్రూం కూడా ఉండటంతో ఆహారం తలుపు కింది నుంచే అందజేస్తున్నారు.

పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

$
0
0
ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును అధికారులు పొడిగించారు. వాస్తవానికి డిసెంబరు 5తో ఫీజు చెల్లింపు గడువు ముగియాల్సి ఉంది. అయితే డిసెంబరు 20 వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి డిసెంబరు 3న ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా డిసెంబరు 20 వరకు ఫీజు చెల్లించవచ్చని ఆయన వెల్లడించారు. రూ.50 అపరాధ రుసుముతో డిసెంబరు 27 వరకు, రూ.200 అపరాధ రుసుముతో జనవరి 4వరకు, రూ.500 ఆలస్య రుసుముతో జనవరి 18 వరకు పరీక్ష ఫీజును చెల్లించవచ్చని ఆయన తెలిపారు. పరీక్ష ఫీజు ఇలా.. ➦ రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ➦ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు మూడు, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు రాసేవారు రూ.125 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. మూడు కంటే తక్కువ ఉన్నవారు రూ.110 పరీక్ష ఫీజు చెల్లించాలి. ➦ ఒక ఒకేషనల్ కోర్సులు చదివేవారు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది. ➦ వయసు తక్కువగా ఉన్నవారు రూ.300 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వీరికి ఫీజు నుంచి మినహాయింపు..కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో రూ.24,000; గ్రామీణ ప్రాంతంలో రూ.20,000 ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 2.5 ఎకరాల మాగాణి, 5 ఎకరాలలోపు బీడు భూమి ఉన్న విద్యార్థులు కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. Read More.. ➦ ➦

జగన్ సర్కార్ మరో రివర్స్ టెండరింగ్.. ఈసారి రూ. 83.8 కోట్లు ఆదా

$
0
0
జగన్ సర్కార్ మరోసారి రివర్స్ టెండరింగ్‌తో డబ్బు ఆదా చేసింది. పోలవరం, వెలిగొండతో పాటూ మరికొన్ని పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్‌తో సక్సెస్ కావడంతో.. ఈసారి స్మార్ట్ ఫోన్‌ల కొనుగోలుకు సంబంధించి మళ్లీ ఈ విధానాన్ని అమలు చేసింది. ఈసారి రూ.83.8కోట్ల ప్రజాధనం ఆదా చేశామని ప్రభుత్వం తెలిపింది.. మరోసారి రివర్స్ టెండరింగ్‌తో సూపర్ హిట్ కొట్టామంటోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వాలంటీర్ల కోసం 2,64,920 స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసేందుకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌(ఏపీటీఎస్‌) పలు కంపెనీలను టెండర్లకు పిలిచింది. మొదట నవంబర్‌ 30న తొలిదశ బిడ్డింగ్‌ తీయగా.. ఎల్‌-1 సంస్థ రూ. 317.61 కోట్లకు బిడ్‌ దాఖలు చేసింది. తర్వాత ఎల్‌-1 ధరపై ఏపీటీఎస్‌ రివర్స్‌ టెండరింగ్‌లో బహిరంగ వేలం నిర్వహించింది. ఈ టెండరింగ్‌లో అదే ఎల్‌-1 సంస్థ రూ. 233.81 కోట్లకు కోడ్‌ చేసి ఈ బిడ్‌‌ను దక్కించుకుంది. ఎల్‌-1 కంపెనీ తొలిదశ బిడ్డింగ్‌తో పోలీస్తే రూ. 83.8 కోట్ల తక్కువకు కోడ్‌ చేసింది. ఏపీ ప్రభుత్వం వాలంటీర్స్‌కు ఇచ్చే స్మార్ట్ ఫోన్‌లకు ఓ ఏడాది పాటు వారెంటీ, 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, ఆక్టాకోర్‌ ప్రొసెసర్‌ వంటి ఫీచర్స్ ఉన్నాయి. మూడేళ్లపాటు మాస్టర్‌ డేటా మేనేజ్‌మెంట్, టైప్‌ ‘‘సి’’ లేదా మైక్రో యూఎస్‌బీ టూ మైక్రో యూఎస్‌బీ కన్వెర్టర్, టాంపర్డ్‌ గ్లాస్, బ్యాక్ కవర్, మూడేళ్ల వరకు మెయింటినెన్స్‌ వాకిన్‌ సపోర్ట్‌‌ను కంపెనీ అందించనుంది. గ్రామ, వార్డు వాలంటరీ వ్యవస్థను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్.. ప్రతి వాలంటీర్‌కు స్మార్ట్ అందిస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం స్మార్ట్ ఫోన్లు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామ, వార్డు వాలంటీరుకు ఈ మొబైల్స్‌ను అందించనున్నారు.

SSC CHSL - 2019 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

$
0
0
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్-2019కు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ మంగళవారం వెలువడింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆసక్తి, సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు డిసెంబు 3 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 10 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. Read Also: దీనిద్వారా పలు విభాగాల్లోని లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), పోస్టల్ అసిస్టెంట్ (PA), సార్టింగ్ అసిస్టెంట్ (SA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టులను భర్తీచేయనున్నారు. ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి వచ్చే ఏడాది మార్చి 16 నుంచి 27 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. Read Also: * కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్-2019 అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. వయోపరిమితి: 01.01.2020 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.01.1993 - 01.01.2002 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. Dont Miss: దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: టైర్-1 (ఆన్‌లైన్), టైర్-2 (డిస్క్రిప్టివ్ పేపర్), టైర్-3 (స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్) పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా. 'టైర్-1' పరీక్ష విధానం..➦ మొత్తం 200 మార్కులకు టైర్-1 ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ➦ మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వే్జ్ 25 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు-50 మార్కులు. ➦ పరీక్ష సమయం 60 నిమిషాలు (గంట). నిబంధనల ప్రకారం అనుమతి ఉన్నవారికి 80 నిమిషాల పాటు పరీక్ష ఉంటుంది. ➦ హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ➦ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు. Read Also: 'టైర్-2' పరీక్ష విధానం.. ➦ టైర్-1 పరీక్షలో అర్హత సాధించినవారికి టైర్-2 (డిస్క్రిప్టివ్) పరీక్ష నిర్వహిస్తారు. ➦ 100 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహిస్తారు. పెన్, పేపర్ విధానంలో పరీక్ష ఉంటుంది. ➦ పరీక్షలో భాగంగా 200-250 పదాలతో వ్యాసం (ఎస్సే), 150-200 పదాలతో లెటర్ లేదా అప్లికేషన్ రాయాల్సి ఉంటుంది. ➦ పరీక్ష సమయం 60 నిమిషాలు (గంట). నిబంధనల ప్రకారం అనుమతి ఉన్నవారికి 20 నిమిషాల అదనపు సమయం కేటాయిస్తారు. ➦ కనీస అర్హత మార్కులు 33గా నిర్ణయించారు. 'టైర్-3' పరీక్ష విధానం.. * టైర్-2 పరీక్షలో అర్హత సాధించినవారికి టైర్-3 (స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్) నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. * కంప్యూటర్‌లో టైపింగ్ చేయాల్సి ఉంటుంది. * పోస్టుల వారీగా స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ వేర్వేరుగా ఉంటుంది. Read Also: ముఖ్యమైన తేదీలు.. ➦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.12.2019 ➦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.01.2020 (23:59) ➦ ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరితేది: 12.01.2020 (23:59) ➦ ఆఫ్‌‌లైన్ చలానా జనరేషన్‌కు చివరితేది: 12.01.2020 (23:59) ➦ చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 14.01.2020 ➦ కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష (టైర్-1): 16.03.2020 - 27.03.2020 ➦ టైర్-2 రాతపరీక్ష (డిస్క్రిప్టివ్ పేపర్): 28.06.2020 Read More.. ➦ ➦

లైవ్ న్యూస్: దిశ కేసులో మరో షాకింగ్ న్యూస్.. ఏపీలో మరో రివర్స్ టెండరింగ్

$
0
0
⍟ దిశ కేసులో నిందితుల దారుణాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. ఆమెను హత్యచేసిన తర్వాత పెట్రోలు పోసి తగలబెట్టినట్లు పోలీసులు ఇప్పటివరకు చెబుతున్నారు. కానీ, ఆమె బతికుండగానే సజీవదహనం చేసినట్లు చర్లపల్లి జైల్లో ఉన్న కీలక నిందితుడు ఆరిఫ్‌ కొందరు కిందిస్థాయి అధికారులకు చెప్పిన విషయం బయటకు వచ్చింది. చర్లపల్లి జైలులో ఉన్న నిందితులతో కొంతమంది జైలు సిబ్బంది మాట్లాడినప్పుడు ఆరిఫ్‌ కనీసం భయపడకుండా పలు విషయాలు బయటపెట్టినట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ⍟ జగన్ సర్కార్ మరోసారి రివర్స్ టెండరింగ్‌తో డబ్బు ఆదా చేసింది. పోలవరం, వెలిగొండతో పాటూ మరికొన్ని పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్‌తో సక్సెస్ కావడంతో.. ఈసారి స్మార్ట్ ఫోన్‌ల కొనుగోలుకు సంబంధించి మళ్లీ ఈ విధానాన్ని అమలు చేసింది. ⍟ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణకు అనంతపురంలో చేదు అనుభవం ఎదురైంది. అనంతపురంలోని నారాయణ విద్యాసంస్థలను పరిశీలించేందుకు నారాయణ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు కళాశాల వద్దకు చేరుకున్నారు. ⍟ సూర్యాపేట జిల్లా ఇమాంపేటకు చెందిన మునగాల జానయ్య అనే యువకుడు.. సూర్యాపేట పట్టణంలో ఓ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పట్టణానికి చెందిన గుండ్లగాని సాయితో అతడికి పరిచయం ఏర్పడింది. అనతి కాలంలోనే వారి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు.
Viewing all 85987 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>