Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all 86034 articles
Browse latest View live

ఆకాశవాణిలో ఉద్యోగాలు.. వీరికి గుడ్ న్యూస్

$
0
0
హైదరాబాద్‌ కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన న్యూస్‌ ఎడిటర్లు, (తెలుగు), న్యూస్‌రీడర్ (తెలుగు, ఉర్దూ) పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నివసించే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. Read Also: వివరాలు..* ఖాళీల సంఖ్య: 03 ➦ న్యూస్ ఎడిటర్/రిపోర్టర్: 01 విభాగం: తెలుగు అర్హత: ఏదైనా డిగ్రీ. జర్నలిజంలో డిగ్రీ, పీజీ డిప్లొమా అర్హత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. అనుభవం: ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టింగ్, ఎడిటింగ్ వర్క్ విభాగాల్లో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయసు: 21 - 50 సంవత్సరాల మధ్య ఉండాలి. Read Also: ➦ న్యూస్ రీడర్: 02 అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. భాషపై పట్టు, మంచి వాయిస్ ఉండాలి. విభాగం: తెలుగు, ఉర్దూ. అనుభవం: టీవీ/రేడియోలో జర్నలిజం విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు: 21 - 50 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. న్యూస్ రీడర్ పోస్టులకు ఆడిషన్ టెస్ట్/ వాయిస్ టెస్ట్ కూడా ఉంటుంది. Read Also: దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 16.12.2019. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Deputy Director General [P], All India Radio, Saifabad, Hyderabad - 500 004. Read More.. ➦ ➦

పాదమా.. పురుషాంగమా? ఈ కేకును చూసి నెటిజన్స్ సందేహాలు.. కారణం ఇదే!

$
0
0
మహిళ తనకు పుట్టిన బిడ్డ జెండర్ రివీల్ కోసం పార్టీ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆమె అత్త గిఫ్టుగా ఓ వెరైటీ కేకును ఆర్డర్ చేసింది. కడుపుతో ఉన్న మహిళ పొట్ట నుంచి పసివాడి పాదం కనిపిస్తున్నట్లుగా ఆ కేకును రూపొందించారు. ఈ కేకు చూసేందుకు వెరైటీగానే కనిపిస్తున్నా.. చాలామందికి చాలా రకాలుగా కనిపిస్తోంది. అమెరికాకు చెందిన ఓ మహిళ ఈ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. దీంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసినవాళ్లు.. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడమే కాకుండా.. అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ కేకులో పసివాడి పాదం అంత సైజు ఉందేంటి? అంత పెద్ద పిల్లాడు కడుపులో ఉన్నాడా? అని కొందరు ప్రశ్నిస్తుంటే.. మరికొందరు మాత్రం, అది పాదంలా లేదు పురుషాంగంలో ఉందని అంటున్నారు. అది జెండర్ రివీల్ కేకు కాబట్టి.. పుట్టింది అబ్బాయని చెప్పడానికి బహుశా కేకు పాదాన్ని అంగం రూపంలో మలిచి ఉంటాడని అని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా.. ఈ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చకే తెరతీసింది. మరి, ఈ కేకును చూస్తే మీకు ఏమనిపిస్తోంది? Also Read: Also Read:

LIC అసిస్టెంట్ 'మెయిన్' హాల్‌టికెట్లు వచ్చేశాయి

$
0
0
ఎల్‌ఐసీలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న మెయిన్ పరీక్ష హాల్‌టికెట్లను లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిసెంబరు 4న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మెయిన్ పరీక్ష హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూలు ప్రకారం డిసెంబరు 22న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహిస్తారు. డిసెంబరు 22 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ డివిజన్ల పరిధిలో 7 వేలకుపైగా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఎల్‌ఐసీ ఇండియా నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. సౌత్ రీజియన్‌లో మొత్తం 631 పోస్టులు ఉండగా.. తెలుగు రాష్ట్రాలకు 276 పోస్టులు కేటాయించారు. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారినే.. మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష ఇలా.. ➥ మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. ➥ వీటిలో జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు - 50 మార్కులు (35 నిమిషాలు), జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు - 40 మార్కులు (35 నిమిషాలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు - 50 మార్కులు (40 నిమిషాలు), రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 60 ప్రశ్నలు - 60 మార్కులు (40 నిమిషాలు) ఉంటాయి. ➥ పరీక్ష సమయం రెండున్నర గంటలు. ➥ అభ్యర్థులు ఒక్కో విభాగంలో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. Dont Miss: . . . Read Also: పోస్టుల వివరాలు.. మొత్తం పోస్టులు: 631 * తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన పోస్టులు- 276
రీజియన్ పోస్టులు
హైదరాబాద్ 40
కడప 40
కరీంనగర్ 68
మచిలీపట్నం 24
నెల్లూరు 36
రాజమండ్రి 11
విశాఖపట్నం 46
వరంగల్ 11
మొత్తం పోస్టులు (ఏపీ, తెలంగాణ) 276
బెల్గామ్ 73
బెంగళూరు 40
ధార్వాడ్ 35
మైసూరు 55
రాయచూర్ 73
షిమోగా 51
ఉడిపి 28
సౌత్ జోన్ పరిధిలోని మొత్తం పోస్టులు 631
Read Also: Read More..

Hyderabad T20: భారత్, వెస్టిండీస్ మధ్య 20 ఓవర్ల పూర్తి మ్యాచ్ డౌట్..?

$
0
0
భారత్, వెస్టిండీస్ మధ్య ఉప్పల్ వేదికగా శుక్రవారం రాత్రి జరగనున్న తొలి టీ20కి వర్షం ముప్పు పొంచి ఉంది. హైదరాబాద్‌లో సోమవారం రాత్రి వర్షం కురవగా.. మంగళ, బుధవారం కూడా వర్షం పడే సూచనలు కనిపించాయి. అయితే.. శుక్రవారం.. అదీ సాయంత్రం 6 గంటల తర్వాత హైదరాబాద్‌ నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ రాత్రి 7 గంటలకి ప్రారంభంకానుండగా.. ఒకవేళ వర్షం కురిస్తే ఓవర్లని కుదించే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో ఇటీవల ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకున్న టీమిండియా మంచి ఊపుమీదుంది. మరోవైపు టెస్టులు, వన్డేల్లో ఎలా ఆడినా.. టీ20ల్లో మాత్రం చెలరేగిపోయే వెస్టిండీస్ కూడా సిరీస్‌లో భారత్‌కి గట్టి పోటీనివ్వాలని ఉవ్విళ్లూరుతోంది. ముఖ్యంగా.. విండీస్ జట్టులోని సగం మంది ఆటగాళ్లకి ఐపీఎల్‌లో ఆడటం ద్వారా ఉప్పల్ పిచ్‌పై మంచి అవగాహన ఉంది. దీనికి తోడు పిచ్‌ బ్యాటింగ్‌కి అనుకూలించేలా క్యూరేటర్ రూపొందించినట్లు వార్తలు వస్తుండటంతో మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశం ఉంది. భారత టీ20 జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ వెస్టిండీస్ టీ20 జట్టు: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), షైహోప్, ఖారీ పియర్, షెల్డన్ కొట్రెల్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, హిట్‌మెయర్, లూయిస్, రొమారియో షెఫర్డ్, జాసన్ హోల్డర్, పాల్, హేడెన్ వాల్ష్, పాబియెన్ అలెన్, దినేశ్ రామ్‌దిన్, కెసిరిక్ విలియమ్స్

సేమ్ టు సేమ్ అదే డిమాండ్.. జగన్ బాటలో చంద్రబాబు

$
0
0
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని.. వైసీపీ కార్యకర్తలు టెర్రరిస్టుల కన్న ఘోరంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించిన చంద్రబాబు.. మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. అమరావతి కాన్సెప్ట్‌ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా చంపేసిందని ఆవేదన చెందారు. రాష్ట్రంలో కృతిమ ఇసుక కొరతను సృష్టించి భవన నిర్మాణ రంగాన్ని నాశనం చేసిన ఘనత జగన్‌దేనని చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. తిరుమల డిక్లరేషన్‌పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్యమతస్తులు ఎవరు వెళ్లినా తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, సోనియా గాంధీ వంటి వారే ఆచరించారని చంద్రబాబు చెప్పారు. Also Read: ప్రభుత్వ కార్యాలయాలు.. పాఠశాలలు.. శ్మశానాలనూ వదలకుండా వైసీపీ రంగులు వేస్తున్నారని.. ఈ ప్రభుత్వానికి కలర్స్ పిచ్చి పట్టుకుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగులు వేసేందుకు ఏకంగా రూ. 1,400 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వాలనే వాలంటీర్ పోస్టులను సృష్టించారని ఆరోపించారు. వారి వల్ల ప్రయోజనం లేకపోగా అరాచకాలు పెరిగి పోతున్నాయని విమర్శలు చేశారు చంద్రబాబు. ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకా హత్య కేసుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. అబ్బాయి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా సొంత బాబాయి కేసు తేల్చలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. మరో డిమాండ్ ప్రభుత్వం ముందుంచారు బాబు. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగిస్తేనే అసలైన దోషులు బయటకు వస్తారని.. తక్షణమే ఆ కేసును సీబీఐకి అప్పగించాలని చంద్రబాబు గట్టిగా డిమాండ్ చేశారు. అయితే ఇక్కడ విషయమేంటంటే అది జగన్ పాత డిమాండ్ కావడం. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్.. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. Read Also:

దిశ కేసు: బీజేపీ రాజాసింగ్‌పై కేసు.. పవిత్రమైన పేరును తప్పుగా వాడారని

$
0
0
గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బహదూర్‌పుర పోలీసులు కేసు నమోదు చేశారు. దిశ హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడి పేరు ప్రస్తావిస్తూ ఇస్లాం మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఆయన స్పందించారని మహ్మద్ నవాజుద్దీన్ అనే వ్యక్తి ఆరోపించారు. ఈ మేరకు రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిశా కేసు గురించి సామాజిక మాధ్యమాల్లో స్పందించేటప్పుడు ముస్లింలకు ఎంతో పవిత్రమైన ‘మహ్మద్’ అనే పేరును రాజాసింగ్ అమర్యాదకరంగా వాడారని నవాజుద్దీన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఇలా వ్యాఖ్యానించడం తగదని, తమ ప్రవక్త పేరును అవమానపరుస్తూ పోస్ట్ చేయడాన్ని ముస్లిం సమాజం ఏ మాత్రం సహించబోదని తెలిపారు. తక్షణం ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. Also Read: మరోవైపు ఈ ఘటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. ‘‘దిశాకు యావత్ ప్రపంచం మద్దతు పలుకుతోంది. కానీ, పాత బస్తీలో కొంత మంది మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. దిశాను కిరాతకంగా హత్యాచారం చేసిన నలుగురు నిందితుల్లో ఒకరైన మహ్మద్ అనే వ్యక్తి పేరును మర్యాదగా పలకాలని ఓ వ్యక్తి డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై బహదూర్‌పుర పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నరహంతకుడైన నిందితుడికి ఉరి శిక్ష పడాలని అంతా కోరుకుంటుంటే.. వాడి పేరు నేను మర్యాదగా ఉపయోగించాలా? అసలు ఫిర్యాదుదారు ఫిర్యాదు చేయగానే ఎస్సై ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు? ఆ నలుగురు నిందితులకు ఉరి శిక్ష పడాల్సిందే. దిశ మరణించినట్లుగానే వారు కూడా చనిపోవాలి.’’ అని ధ్వజమెత్తారు. Also Read:

బుమ్రా నా ముందు ఓ బేబీ బౌలర్.. ఉతికారేస్తా

$
0
0
క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం బెస్ట్ బౌలర్ ఎవరు..? అంటే పేరు ప్రధానంగా వినిపిస్తోంది. భారత డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరొందిన బుమ్రాని ఎదుర్కొనేందుకు అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లు సైతం గత కొంతకాలంగా ఇబ్బందిపడుతున్నారు. అలాంటింది.. బుమ్రా నా ముందు ఓ బేబీ బౌలర్.. అతడి బౌలింగ్‌ని ఉతికారేస్తానంటున్నాడు ఫాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్. ‘నా కెరీర్‌లో ఎంతో మంది వరల్డ్‌క్లాస్ బౌలర్లని నేను ఎదుర్కొన్నాను. కాబట్టి.. బుమ్రా బౌలింగ్‌ని ఎదుర్కోవడం నాకేమీ కష్టం కాదు. ఇంకా చెప్పాలంటే.. ఒత్తిడి బుమ్రాపైనే ఉంటుంది. ఎందుకంటే.. నేను మెక్‌గ్రాత్, వసీమ్ అక్రమ్ లాంటి గొప్ప బౌలర్లని ఎదుర్కొన్నాను. వారితో పోలిస్తే.. జస్‌ప్రీత్ బుమ్రా నా ముందు ఓ బేబీ బౌలర్. అతడ్ని అలవోకగా ఎదుర్కోవడమే కాదు ఆధిపత్యం చెలాయిస్తూ.. ఉతికారేయగలను’ అని రజాక్ వెల్లడించాడు. Read More: దక్షిణాఫ్రికాతో సిరీస్ ముంగిట గాయపడిన జస్‌ప్రీత్ బుమ్రా గత రెండు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్నాడు. అయితే.. ఇటీవల ఫిట్‌నెస్ సాధించి నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ.. వెస్టిండీస్‌తో డిసెంబరు 6 నుంచి ప్రారంభంకానున్న టీ20, వన్డే సిరీస్‌కి మాత్రం అతను ఎంపికవలేదు. దీంతో.. వచ్చే ఏడాది జనవరి వరకూ మళ్లీ మైదానంలోకి ఈ ఫాస్ట్ బౌలర్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. Read More:

ఛార్జింగ్ పెట్టి మొబైల్‌లో గేమ్స్ ఆడిన యువకుడు, షాక్ కొట్టడంతో..

$
0
0
మొబైల్ ఫోన్ ఛార్జింగ్‌లో ఉండగానే చాలామంది పాటలు వింటారు. లేదా వీడియోలు, గేమ్స్ ఆడుతుంటారు. అలా చేయడం ఎంత ప్రమాదకరమో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. థాయ్‌ల్యాండ్‌కు చెందిన కిట్టిశాక్ మూన్‌కిట్టి (28) సోమవారం మధ్యాహ్నం.. పరుపుపై పడుకొని మొబైల్‌లో గేమ్స్ ఆడాడు. బ్యాటరీ అయిపోవడంతో మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టి గేమ్స్ కొనసాగించాడు. ఛార్జర్ నుంచి విద్యుత్ ప్రసారం కావడంతో కిట్టిశాక్ విద్యుద్ఘాతానికి గురయ్యాడు. దీంతో అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయాడు. Also Read: కొన్ని గంటల తర్వాత అతడి తల్లి రిన్నాపార్న్ మూన్‌కిట్టి ఇంటి పనిలో సాయం చేయడం కోసం కిట్టిశాక్‌ను పిలిచింది. అతడు ఎంతకీ స్పందించకపోవడంతో అతడి గదిలోకి వెళ్లి చూసింది. దీంతో ఛార్జింగ్ పెట్టి ఉన్న మొబైల్ ఫోన్ వద్ద నిర్జీవంగా పడి ఉన్న కొడుకును చూసి షాకైంది. అతడి చేయి, ముంజేతులపై గాయాలు ఉండటంతో షాక్ కొట్టి ఉండవచ్చని భావించిన ఆమె ఓ కర్రతో కదిపి చూసింది. అప్పటికీ అతడు స్పందించలేదు. దీంతో వెంటనే ఎమర్జెన్సీ సర్వీసుకు కాల్ చేసింది. అతడి శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా మొబైల్ ఛార్జర్ వల్ల అతడు విద్యుద్ఘాతానికి గురై చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. Also Read: Also Read:

శ్రీశైలం ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సులు ఢీకొని ఇద్దరు మహిళలు..

$
0
0
జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. ఎదురెదురుగా ఢీకొనడంతో డ్రైవర్ వెనుక భాగంలో కూర్చున్న మహిళలు మృత్యువాత పడ్డారు. బస్సులు ఢీకొన్న ధాటికి ధర్మవరం బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు మృతదేహాలు ఛిద్రమయ్యాయి. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడడంతో పరిస్థితి భయానకంగా మారింది. శ్రీశైలం నుంచి ప్రకాశం జిల్లా దోర్నాల వెళ్లే ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. శ్రీశైలానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో రెండు బస్సులు ఢీకొన్నట్లు సమాచారం. తూర్పు గోదావరి జిల్లా .. అనంతపురం జిల్లా ధర్మవరం డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. శ్రీశైల శిఖరం చెక్‌పోస్టుకు సమీపంలోని చిన్నారుట్ల వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. Also Read: ఘాట్ రోడ్డు మలుపుల వద్ద నిర్లక్ష్యంగా బస్సు నడపడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్సులు అతివేగంగా ఉండడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆడవాళ్లకు అండగా రణ్‌వీర్.. దీపికా భర్త కొత్త ప్రయోగం

$
0
0
ముంబైలో ‘గల్లీ బోయ్’గా ప్రేక్షకులను మెప్పించిన రణ్‌వీర్ సింగ్ ఇప్పుడు గుజరాత్‌కు చెందిన వ్యక్తిగా మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘జయేష్‌భాయ్ జోర్దార్’. యశ్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దివ్యాంగ్ తక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతోన్న దివ్యాంగ్.. ఒక మంచి కామెడీ కథని గుజరాత్ నేపథ్యంలో ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్ చూస్తుంటే రణ్‌వీర్ మహిళల కోసం పోరాడే ఓ గుజరాతీ యువకుడి పాత్ర పోషిస్తున్నట్టు అర్థమవుతోంది. ఈ సినిమా కోసం రణ్‌వీర్ చాలా బరువు తగ్గారు. ఇప్పటికే ఎన్నో వైవిధ్యభరిత పాత్రలు చేసిన రణ్‌వీర్ ఇప్పుడు మరోసారి సరికొత్త లుక్‌లో ప్రయోగం చేస్తున్నారు. Also Read: ఫస్ట్‌లుక్ విడుదల సందర్భంగా హీరో రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘చార్లీ చాప్లిన్ చెప్పినట్టు, ఒకరిని నవ్వించడానికి మనం బాధను అనుభవించాలి, దానిని ఒక ఆటగా పరిగణించాలి. జయేష్‌భాయ్ అనే వ్యక్తి ఒక అసాధారణమైన నాయకుడు. ఓ మామూలు మనిషి భయంకరమైన పరిస్థితిలో చిక్కుకున్నప్పుడు ఎలా స్పందిస్తాడో మీరు ఈ కథలో చూస్తారు. జయేష్‌భాయ్ ఉన్నత భావాలు కలిగిన, జాలి, దయ ఉన్న యువకుడు. తనచుట్టూ ఉన్న పురుషాధిక్య సమాజానికి ధాటిగా, మహిళలకు, పురుషులకు సమాన హక్కులు ఉండాలని గట్టిగా నమ్మే మనిషి’’ అని చెప్పుకొచ్చారు. ఇలాంటి ఒక విభిన్న పాత్ర మనస్తత్వాన్ని జీర్ణించుకొని.. తనను తాను మలుచుకోడం నటుడిగా తనకో పెద్ద సవాలుగా అనిపించిందని రణ్‌వీర్ అన్నారు. జయేష్‌భాయ్ లాంటి పాత్రను ఇప్పటివరకు తాను పోషించలేదని అన్నారు. Also Read: కాగా.. సినిమా సినిమాకు పొంతన లేకుండా.. మంచి పాత్రలను, కథలను ఎన్నుకొంటున్నారు రణ్‌వీర్. ‘పద్మావత్’లో అల్లాఉద్దీన్ ఖిల్జీగా ప్రతినాయకుడి పాత్రలో జీవించి, ‘గల్లీ బోయ్’ చిత్రంలో ఒక రాప్ సింగర్‌గా తనలోని ప్రతిభను చాటుకొంటూ అభిమానుల మన్ననలను పొందారు. అలాంటి ఒక నటుడు, ఒక కొత్త దర్శకుడితో చేస్తోన్న ప్రయోగం ఇది. ఈ సినిమాతో ఆయన ప్రేక్షకులను ఏ మేర మెప్పిస్తారో చూడాలి.

కుక్క పిల్లను కన్న బిడ్డలా పెంచుతున్న కోతి

$
0
0
కుక్క పిల్లను కన్న బిడ్డలా పెంచుతున్న కోతి

ఉప్పల్ టీ20లో విరాట్ కోహ్లీకి భయపడొద్దు

$
0
0
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ చూసి కంగారుపడొద్దని బౌలర్లలో ఆ టీమ్ కోచ్ ఫిల్ సిమన్స్ ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. హైదరాబాద్‌‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య శుక్రవారం రాత్రి తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఈరోజు మీడియాతో మాట్లాడిన సిమన్స్ బౌలర్లకి కొన్ని సూచనలు చేశాడు. కోహ్లీని ఔట్ చేయడానికి తమ వద్ద వ్యూహాలు ఉన్నాయని చెప్పుకొచ్చిన సిమన్స్.. వాటితో భారత కెప్టెన్‌ని కట్టడి చేయగలమని మాత్రం ధీమా వ్యక్తం చేయలేకపోయాడు. భారత్, వెస్టిండీస్ మధ్య శుక్రవారం నుంచి మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన డే/నైట్ టెస్టులో శతకం బాదిన విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. Read More: ‘సిరీస్‌లో వెస్టిండీస్ ముందు ఉన్నది ఒకటే దారి. అది విరాట్ కోహ్లీకి కనీసం శతకం సమర్పించుకుని.. టీమ్‌లోని మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు భారీ స్కోర్లు చేయకుండా కట్టడి చేయడం. మొదట వెస్టిండీస్ బౌలర్లు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూసి భయపడకుండా.. వ్యూహాలకి అనుగుణంగా బౌలింగ్ చేయాలి. మ్యాచ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో..? ఎవరికీ తెలీదు. అయినప్పటికీ విరాట్ కోహ్లీని ఔట్ చేసేందుకు వ్యూహాలు రచించడం చాలా కష్టం’ అని సిమన్స్ వెల్లడించాడు. తొలి టీ20కి ఉప్పల్ స్టేడియం ఇప్పటికే సిద్ధమవగా.. పిచ్‌ని బ్యాటింగ్‌కి అనుకూలంగా క్యూరేటర్ రూపొందించినట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీకి ఈ స్టేడియంలో మెరుగైన రికార్డ్ ఉన్న నేపథ్యంలో.. ఇప్పుడు వెస్టిండీస్ బౌలర్ల దృష్టి అతనిపై పడింది. ముఖ్యంగా సిరీస్ ఆరంభం నుంచి కోహ్లీని కట్టడి చేయడం ద్వారా.. భారత్‌‌ని ఒత్తిడిలోకి నెట్టాలని ఆ జట్టు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. కరీబియన్ బౌలర్ల వ్యూహాలకి భారత కెప్టెన్ దొరుకుతాడా..? లేదా ఉతికారేస్తాడా..? అనేది చూడాలి..! Read More:

వారం రోజుల పోలీస్ కస్టడీకి దిశా కేసు నిందితులు

$
0
0
దిశా కేసు నిందితులను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ షాద్‌నగర్ కోర్టు బుధవారం (డిసెంబర్ 4) సాయంత్రం ఆదేశాలిచ్చింది. ఈ కేసులో నలుగురు నిందితులను వారం రోజుల పాటు విచారించడానికి కోర్టు పోలీసులకు అనుమతి ఇచ్చింది. షాద్‌నగర్‌లో సంచలనం సృష్టించిన ఈ హత్యాచార ఘటనలో నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైలు రిమాండ్ ఖైదీలుగా ఉన్న విషయం తెలిసిందే. వీరిని సైబరాబాద్ పోలీసులు గురువారం ఉదయం తమ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే 3 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సమగ్ర వివరాలు సేకరించే పనిలో ఉన్నాయి. దిశ కేసు సమగ్ర దర్యాప్తులో భాగంగా కేసుకు సంబంధించి కీలక వివరాలు తెలుసుకోవడానికి, ఆధారాలు సేకరించడానికి పోలీసులు వీరిని కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. బాధితురాలి సెల్ ఫోన్ ఇప్పటికీ మిస్సింగ్‌లో ఉంది. దాన్ని ఏం చేశారు? ఎక్కడ పడేశారు? ఘటన తర్వాత లారీని మళ్లీ తొండుపల్లి గేటు వద్దే ఎందుకు పార్క్ చేశారు? తదితర అంశాల మిస్టరీ చేధించనున్నారు. బాధితురాలిని హత్య చేసిన తర్వాత పెట్రోలు పోసి దహనం చేశారా? లేదా సజీవదహనం చేశారా? అనే విషయంలోనూ అనుమానులున్నాయి. పోలీసుల విచారణలో ఈ అంశాల గుట్టు విప్పనున్నారు. దీంతో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తద్వారా శంషాబాద్ టోల్ గేట్ దగ్గర నుంచి చటాన్‌పల్లి వరకు జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలను పూర్తిగా తెలుసుకోనున్నారు. తద్వారా ఘటనకు సంబంధించి మరిన్ని కీలక వివరాలు తెలిసే అవకాశం ఉంది. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించిన వివరాలను కూడా కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. అయితే.. నిందితులపై ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న తరుణంలో దీన్ని ఎంత వరకు చేయగలుగుతారనేది ప్రశ్నార్థకంగా మారింది.

చిత్తూరులో కిడ్నాప్ కలకలం.. బాలికను బలవంతంగా కారులోకి లాగి..

$
0
0
జిల్లాలో బాలిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. కాలేజీకి వెళ్లొస్తున్న బాలిక కిడ్నాప్‌కు గురైంది. కళాశాల నుంచి తిరిగి వస్తున్న సమయంలో కారులో వచ్చిన ఓ యువకుడు బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకుని అపహరించుకెళ్లాడు. గత నెలలో ఆరేళ్ల చిన్నారిని ఆగంతకుడు కిడ్నాప్ చేసి హత్యాచారం చేసిన ఘటన మరువక ముందే మరో బాలిక కిడ్నాప్ జిల్లా వాసులను భయాందోళనకు గురిచేస్తోంది. కలకడ మండలం కొత్తపల్లిలో బాలిక కిడ్నాప్‌ ఘటన ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఇంటర్ సెకండియర్ చదువుతున్న బాలికను బలవంతంగా కారులో ఎక్కించి కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కళాశాల నుంచి తిరిగి వస్తుండగా సతీష్ అనే యువకుడు కారులో వచ్చిన బాలికను అపహరించినట్లు సమాచారం. గతంలోనూ బాలికను కిడ్నాప్ చేసేందుకు సతీష్ యత్నించినట్లు తెలుస్తోంది. Also Read: బాలిక కిడ్నాప్ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. విషయం తెలుసుకున్న బాలిక బంధువులు భారీగా కలకడ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. కిడ్నాప్ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాలికను తీసుకెళ్లినట్లుగా భావిస్తున్న పీలేరు - కడప రోడ్డులో సీపీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. Read Also:

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌‌లో ఖాళీలు

$
0
0
లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేష‌న్‌ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌(హెచ్ఎఫ్ఎల్) దేశ‌వ్యాప్తంగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. Read Also: వివరాలు...* అసిస్టెంట్ మేనేజర్ (లీగల్): 35 పోస్టులురాష్ట్రాలవారీగా ఖాళీలు..
ఛత్తీస్‌గఢ్ 01
మధ్యప్రదేశ్ 01
బిహార్ 01
ఒడిశా 01
అసోం 01
వెస్ట్ బెంగాల్ 02
ఉత్తర్ ప్రదేశ్ 04
ఢిల్లీ 03
రాజస్థాన్ 01
చండీగఢ్ 01
కర్ణాటక 04
ఆంధ్రప్రదేశ్ 01
తెలంగాణ 02
కేరళ 01
తమిళనాడు 05
గుజరాత్ 01
మహారాష్ట్ర 05
మొత్తం ఖాళీలు 35
అర్హత: 55 శాతం మార్కులతో లా డిగ్రీ ఉండాలి. కంప్యూట‌ర్ స్కిల్స్‌ తప్పనిసరి. Read Also: వయోపరిమితి: 01.01.2019 నాటికి 23-30 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.500. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా. రాతపరీక్ష విధానం.. ➦ మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. ➦ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు), లాజికల్ రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు), జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు (15 నిమిషాలు), ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు) ఉంటాయి. ➦ పరీక్ష సమయం 120 నిమిషాలు (2 గంటలు). ➦ నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. జీతం: రూ.56,000. Read Also: ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 02.12.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 16.12.2019
ఆన్‌లైన్ పరీక్షతేది 27.01.2020
Read More.. ➦ ➦

ఎక్కడా చోటులేనట్లు.. ఒకే రోజు, రెండుసార్లు రైల్వే స్టేషన్‌లో సెక్స్!

$
0
0
రైలు లేటైందో.. కోరికలు ఆపుకోలేకపోయారో తెలియదు గానీ, ఓ జంట రైల్వే స్టేషన్‌లోనే బరితెగించారు. ప్రయాణికులు చూస్తుండగానే రైల్వే ప్లాట్‌ఫాం మీద సెక్స్‌లో పాల్గొన్నారు. ఒకసారి ఏదో పొరపాటు చేశారని అనుకొనేలోపే.. మరోసారి అదే పని చేసి ప్రయాణికులకు షాకిచ్చారు. దీంతో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రయాణికులతో నిత్యం బిజీగా ఉండే రైల్వే స్టేషన్‌లో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఉదయం 9.30 గంటలకు బోవ్లింగ్ గ్రీన్ స్టేషన్ సబ్ వేలోకి ప్రవేశించిన ప్రయాణికులకు ఓ జంట ఊహించని షాకిచ్చారు. అయితే, ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ వారిని పట్టించుకోకుండా రైలెక్కి వెళ్లిపోయారు. అయితే, సాయంత్రం 6.40 గంటలకు మళ్లీ ఆ జంట అదే పనికి పాల్పడింది. రైల్లో వెళ్తున్న ప్రయాణికులు ఈ ఘటనను వీడియో తీశారు. Also Read: ప్రయాణికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ కెమేరాల్లో ఆ జంటను గుర్తించేందుకు ప్రయత్నించారు. చివరికి పురుషుడి ఫొటో మాత్రమే దొరికింది. ఈ ఘటన న్యూయార్క్ పత్రికల్లో ప్రధానంగా ప్రచురితమైంది. దీంతో అది సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యింది. వారికి అంత కక్కుర్తి ఎందుకు? ఇంటికి వెళ్లో.. రూమ్ తీసుకొనే చేసుకోవచ్చుగా? ఇలా పబ్లిక్‌లో సిగ్గులేకుండా ఏం పని అది అని నెటిజనులు తిట్టిపోస్తున్నారు. బహుసా.. న్యూయార్క్ ప్రజలకు నగరంలో చోటే దొరకడం లేదేమో.. అందుకే ఈ రైల్వే స్టేషన్‌లో ఇలాంటి పనులు చేస్తున్నారని మరికొందరు చమత్కరిస్తున్నారు. పోలీసులు ప్రస్తుతం ఈ జంటను వెతికే పనిలో ఉన్నారు. Also Read:

Team India ఛేజ్ ప్రాక్టీస్.. పరుగే పరుగు

$
0
0
వెస్టిండీస్‌తో తొలి టీ20 ముంగిట టీమిండియా కొత్త తరహా ప్రాక్టీస్‌కి తెరలేపింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ పర్యవేక్షణలో భారత క్రికెటర్లు ‘ఛేజ్’ ప్రాక్టీస్‌ చేశారు. మైదానంలో ఫీల్డింగ్ చేస్తూ ఒకవేళ కింద పడిపోయినా మళ్లీ వేగంగా లేచి బంతి వెనుక ఎలా పరుగెత్తాలి..? అనేదానిపై భారత క్రికెటర్లకి కోచ్ శ్రీధర్ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాడు. కానీ.. ఈ సెషన్‌కి కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు మరికొందరు క్రికెటర్లు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. Read More: సాధారణంగా ఫీల్డింగ్ సమయంలో బంతి కోసం క్రికెటర్లు డైవ్ చేస్తే.. వారి చేతికి అందేది కొన్ని బంతులే. అయితే.. డైవ్ చేసే క్రమంలో కొంత మంది క్రికెటర్లు కింద పడిపోతే అలానే లేవకుండా బంతి బౌండరీ లైన్‌కి వెళ్తుండటాన్ని చూస్తూ ఉండిపోతారు. కానీ.. కొందరు క్రికెటర్లు మాత్రం బంతి అందకపోతే వేగంగా మళ్లీ పైకి లేచి దాని వెంట పడతారు. అది సదరు క్రికెటర్ ఫిట్‌నెస్, మానసిక దృఢత్వంపై ఆధారపడి ఉంటుంది. కానీ.. టీమిండియాలోని ప్రతి క్రికెటర్ బంతి బౌండరీ లైన్‌ని తాకే వరకూ వెంటపడేలా చేయడం కోసం ఆర్. శ్రీధర్ ఈ కొత్త తరహా ఛేజ్ ప్రాక్టీస్‌కి తెరదీశాడు. Read More: భారత క్రికెటర్లు సంజు శాంసన్, మహ్మద్ షమీ, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ ఈ ప్రాక్టీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చారు. తొలి టీ20 కోసం మంగళవారమే హైదరాబాద్‌కి చేరుకున్న విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ తదితరులు బ్యాటింగ్ ప్రాక్టీస్‌తోనే సరిపెట్టినట్లు తెలుస్తోంది. భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్ ప్రమాణాలని తెలియజేసే ‘యో-యో టెస్టు’‌‌‌ని గతంలో తరచూ నిర్వహించిన బీసీసీఐ ఇటీవల ఆ టెస్టుని పట్టించుకోవడం లేదు.

అఫీషియల్‌... వాయిదా పడ్డ `90ఎంఎల్‌`.. డేట్‌ మారినా కిక్‌ తగ్గదు

$
0
0
ఆర్‌ఎక్స్‌ 100 సినిమా ఫేం హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం . మరోసారి బోల్డ్‌ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు కార్తికేయ. కార్తికేయ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు శేఖర్‌ రెడ్డి ఎర్ర దర్శకుడు. ఈ సినిమాను కార్తికేయ హోం బ్యానర్‌లో అశోక్‌ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. సెన్సార్‌ సర్టిఫికేట్‌ రావటంలో ఆలస్యం కారణంగా సినిమా వాయిదా పడిందని వెల్లడించాడు హీరో కార్తికేయ. ఒక్కరోజు ఆలస్యమైన కిక్‌ మాత్రం తగ్గదంటూ భరోసా ఇస్తున్నాడు ఈ యంగ్ హీరో. మంగళవారం సాయంత్రానికి సెన్సార్‌ ఫార్మాలిటీస్‌ పూర్తయ్యాయి. కాస్త బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు సెన్సార్‌ కమిటీ. ఈ సినిమాలో కార్తికేయ ఆథరైజ్డ్‌ డ్రింకర్‌గా నటిస్తున్నాడు. తనకున్న ఆరోగ్య సమస్య కారణంగా మూడు పూటలా 90 ఎంఎల్‌ ఆల్కాహాల్‌ తీసుకునే పాత్రలో కనిపించనున్నాడు. కామెడీ, యాక్షన్‌, రొమాన్స్‌ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ పక్కాగా ఉన్న ఈ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ కార్తికేయ ఖాతాలో మరో హిట్‌గా నిలుస్తుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు చిత్రయూనిట్‌.

LIC అసిస్టెంట్ 'మెయిన్' హాల్‌టికెట్లు వచ్చేశాయి

$
0
0
ఎల్‌ఐసీలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న మెయిన్ పరీక్ష హాల్‌టికెట్లను లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిసెంబరు 4న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మెయిన్ పరీక్ష హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూలు ప్రకారం డిసెంబరు 22న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహిస్తారు. డిసెంబరు 22 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ డివిజన్ల పరిధిలో 7 వేలకుపైగా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఎల్‌ఐసీ ఇండియా నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. సౌత్ రీజియన్‌లో మొత్తం 631 పోస్టులు ఉండగా.. తెలుగు రాష్ట్రాలకు 276 పోస్టులు కేటాయించారు. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారినే.. మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష ఇలా.. ➥ మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. ➥ వీటిలో జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు - 50 మార్కులు (35 నిమిషాలు), జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు - 40 మార్కులు (35 నిమిషాలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు - 50 మార్కులు (40 నిమిషాలు), రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 60 ప్రశ్నలు - 60 మార్కులు (40 నిమిషాలు) ఉంటాయి. ➥ పరీక్ష సమయం రెండున్నర గంటలు. ➥ అభ్యర్థులు ఒక్కో విభాగంలో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. Dont Miss: . . . Read Also: పోస్టుల వివరాలు.. మొత్తం పోస్టులు: 631 * తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన పోస్టులు- 276
రీజియన్ పోస్టులు
హైదరాబాద్ 40
కడప 40
కరీంనగర్ 68
మచిలీపట్నం 24
నెల్లూరు 36
రాజమండ్రి 11
విశాఖపట్నం 46
వరంగల్ 11
మొత్తం పోస్టులు (ఏపీ, తెలంగాణ) 276
బెల్గామ్ 73
బెంగళూరు 40
ధార్వాడ్ 35
మైసూరు 55
రాయచూర్ 73
షిమోగా 51
ఉడిపి 28
సౌత్ జోన్ పరిధిలోని మొత్తం పోస్టులు 631
Read Also: Read More..

వామ్మో.. ఫ్యామిలీ హీరో రాంబోలా తయారయ్యాడు!!

$
0
0
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోలు నటనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. హీరోలు అందంగా కనిపించడానికి మాత్రమే ప్రయత్నించేవారు. సిక్స్ ప్యాక్‌లు అప్పుడు లేవు. కానీ, ఇప్పుడు అలా కాదు. హీరోలు సినిమా కోసం, తమ పాత్రల కోసం ఎంత రిస్క్ అయినా చేస్తున్నారు. ముఖ్యంగా మేకోవర్ విషయంలో అస్సలు రాజీపడటంలేదు. 6 ప్యాక్, 8 ప్యాక్‌లు చేస్తున్నారు. అవసరమైతే భారీగా బరువు పెరుగుతున్నారు.. అలాగే, భారీగా బరువు తగ్గుతున్నారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, రానా, రవితేజ ఎలా ఎంతో మంది హీరోలు ఈ కోవకు చెందినవారే. ఇప్పుడు ఈ జాబితాలో యంగ్ హీరో నాగశౌర్య చేరారు. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య.. ఆ తరవాత అన్నీ ప్రేమకథలు, కుటుంబ కథాచిత్రాలు మాత్రమే చేశారు. అలాగే, ‘కణం’ వంటి థ్రిల్లర్ మూవీలో కూడా నటించారు. అయితే, ఇప్పుడు తొలిసారి పూర్తిస్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారాయన. సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లో తెరకెక్కుతోంది ఈ సినిమా. టైటిల్ ‘అశ్వథ్థామ’. ఇటీవలే కాన్సెప్ట్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నాగశౌర్య కల్ట్ లుక్‌కి మంచి మార్కులు పడ్డాయి. Also Read: ఇదిలా ఉంటే, తాజాగా నాగశౌర్య ట్విట్టర్‌లో పెట్టిన ఒక ఫొటో సినిమాపై అంచనాలను బాగా పెంచేస్తోంది. ఈ ఫొటోలో నాగశౌర్య కండలు తిరిగిన బాడీతో రాంబోలా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు చాక్లెట్ బోయ్‌లా, లవర్ బోయ్‌లా కనిపించిన నాగశౌర్య మొదటిసారి రఫ్ అండ్ టఫ్ లుక్‌లో ఆశ్చర్యపరుస్తున్నారు. జిమ్‌లో కసరత్తులు చేసేటప్పుడు తీసిన ఈ ఫొటోను ట్వీట్‌ చేసిన నాగశౌర్య.. ‘‘ఏది రైటో అదే చేయండి, ఈజీగా ఉండేది కాదు’’ అని క్యాప్షన్ కూడా పెట్టారు. కాగా, ఈ సినిమాలో నాగశౌర్య సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పోసాని కృష్ణముర‌ళి, స‌త్య, విజ‌య‌ ప్రకాష్‌, కిషోర్‌, ఎం.ఎస్‌. భాస్కర్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి శ్రీచరణ్ సంగీతం సమకూరుస్తు్న్నారు. మనోజ్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నాగశౌర్య తల్లి ఉషా మల్పూరి నిర్మాత. తండ్రి శంకర్ ప్రసాద్ సమర్పకుడు. ‘ఛ‌లో’, ‘నర్తనశాల’ త‌రువాత ఐరా క్రియేషన్స్ బ్యాన‌ర్‌‌లో నాగశౌర్య చేస్తోన్న సినిమా ఇది.
Viewing all 86034 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>