Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all 86007 articles
Browse latest View live

‘మాతృభాషకి.. దిశా రేప్‌కి లింకేందిరా సోదినా**’: పవన్‌పై విసుర్లు

$
0
0
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు సినీ, రాజకీయ విశ్లేషకుడు . ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి మోహన్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేస్తూ రాజకీయ వర్గాల్లో వేడిపుట్టిస్తున్నారు. అయితే ఈ పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై హాట్ టాపిక్ నడుస్తోంది. దిశ ఘటనతో ముడిపెడుతూ జగన్ పాలనను ప్రశ్నించడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఈ సందర్భంలో ‘ఆడపిల్లల పై అఘాయిత్యాలకు మాతృభాష నిర్లక్ష్యమే కారణం’ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని తప్పు పడుతూ నిప్పులు చెరిగారు కత్తి మహేష్. ‘మాతృభాషకి దిశ రేప్‌కి లింకేందిరా నాయనా.. వామ్మో... వాయ్యో! ఈ సోదిగాడికి పిచ్చి పట్టిందిరో’ అంటూ ఫేస్ బుక్‌లో పవన్‌ను ఏకిపారేస్తూ వరుస పోస్ట్‌లు వదలాడు. "క్రిస్టియానిటీని పాటిస్తే, కులం ప్రస్తావన ఉండదు" అని పవన్ కళ్యాణ్ అంటున్నారని.. అతను కరెక్ట్‌గా ఆరెస్సెస్ బీజేపీ వాళ్ళ మాటలు మాట్లాడావ్. ఈ దేశంలో ఎవరు ఏమతాన్ని నమ్మినా, అందరూ నిజంగా నమ్మేది కులమేరా సోదినాయాలా’ అంటూ పవన్‌కు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌తో అంటకాగి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా నాశనమైపోయిన వాళ్ళు.. వామపక్షాలు, బహుజన్ సమాజ్ పార్టీ, జేడీ లక్ష్మీనారాయణ, జయప్రకాష్ నారాయణ్, చంద్రబాబు నాయుడు. ఎదో జగన్‌కి చెడ్డపేరు వస్తుందని రాయలసీమలో సైలెంట్‌గా ఉన్నారుగానీ... సోదినాయాలు వాగుతున్నవాగుడికి ఎవడో ఒకడు ఈపాటికి కొట్టుండేవాడు. పరిఢవిల్లుతాయి. పరిణమిల్లుతాయికి తేడా చెప్పరా సోదినాయాలా.. తరువాత 'ఆముక్తమాల్యద' గురించి మాట్లాడుకుందాం’ అంటూ పవన్ వ్యాఖ్యలపై ఫైర్ అవుతూ వివాదాస్పద కామెంట్స్ చేశారు కత్తి మహేష్.

ప్రేమోన్మాదం.. 16ఏళ్ల బాలికను కత్తితో 30సార్లు పొడిచి పొడిచి

$
0
0
మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. తన ప్రేమను తిరస్కరించిందన్న అక్కసుతో ఓ యువకుడు 16ఏళ్ల బాలికను కత్తితో కిరాతకంగా చంపేశాడు. ఏకంగా 30సార్లు ఆమెను పొడిచి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. దీంతో బాలిక తీవ్ర రక్తస్రావానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. Also Read: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ జిల్లా కుడ్వారీ గ్రామానికి చెందిన శివకుమార్‌ (24) అనే యువకుడు ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన బాలికను వేధిస్తున్నాడు. దీంతో ఆమె మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తనను కటకటాలపాటు చేసిన ఆమెపై శివకుమార్ పగ పెంచుకున్నాడు. మంగళవారం బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు నేరుగా బాలిక ఇంటికి వెళ్లాడు. Also Read: అదే సమయంలో తల్లిదండ్రులు పనిమీద బయటకు వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. దీంతో లోనికి వెళ్లిన శివకుమార్ తలుపులు మూసేసి కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనను చూసిన బాలిక సోదరుడు స్థానికులను అప్రమత్తం చేయడంతో వారంతా వచ్చి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు. అప్పటికే ఈ దుర్మార్గుడు బాలికను కడుపులో పొడుస్తూ కనిపించాడు. నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పడంతో అంతా కన్నీటి పర్యంతమయ్యారు. పోస్టుమార్టం రిపోర్టుల బాలిక శరీరంపై 30 కత్తిపోట్లు ఉన్నట్లు తేలడంతో పోలీసులు సైతం షాకయ్యారు. Also Read:

అందులోనూ రాజకీయాలా.. ఇది కేంద్రానికి మంచిది కాదు : కేటీఆర్

$
0
0
దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలని తెలంగాణ , పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. రాజకీయపరమైన కారణాలతో కేంద్రం తెలంగాణను పట్టించుకోవడంలేదని విమర్శించారు. బుల్లెట్‌ రైలు వంటి ప్రాజెక్టులను ఢిల్లీ, ముంబయి వంటి నగరాలకే పరిమితం చేశారని.. తెలంగాణ, హైదరాబాద్ గుర్తుకు రావా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో బుధవారం జరిగిన మూడో ఎడిషన్ సీఐఐ డిఫెన్స్ కాన్‌క్లేవ్‌లో పాల్గొని ప్రసంగించారు. డిఫెన్స్‌ కారిడార్‌ను హైదరాబాద్‌-బెంగళూరు మధ్య కాకుండా మరో చోట ఏర్పాటు చేయడాన్ని కేటీఆర్ తప్పు బట్టారు. రక్షణ రంగంలో హైదరాబాద్‌కు ఉన్న గుర్తింపును మరిచి, మరో చోట ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పారిశ్రామికీకరణలో కేంద్రం రాజకీయాలు చేయకూడదని హితవు పలికారు. Also Read: ‘‘టీఎస్‌ ఐపాస్‌ విధానం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రిక. పారిశ్రామిక సంఘాలు, ఉన్నతాధికారులతో బాగా చర్చించి దీనిని రూపొందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతోంది. పారిశ్రామిక కాలుష్యం లేకుండా నగరాన్ని మార్చేందుకు ఓఆర్‌ఆర్‌ బయట ఏర్పాటు చేస్తున్నాం. 2014కు ముందు నాణ్యమైన విద్యుత్తు కోసం ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారు. తెలంగాణ వచ్చిన ఆరు నెలల్లోనే విద్యుత్తు సమస్యను అధిగమించాం. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. కొత్త తరహా ఆలోచనలతో వచ్చే అందరికీ రాయితీలు కల్పిస్తాం. ఎస్సీ, గిరిజన పారిశ్రామికవేత్తలకు రూ.305 కోట్ల మేర రాయితీలు అందజేశాం. ఈ రాయితీల వల్ల కార్మికులకు ఎంతో మేలు చేకూరుతుంది. పొరుగు దేశం చైనాతో పోటీ పడాలంటే ఎంఎస్‌ఎంఈలతో పాటూ మెగా పార్కులు కూడా ఉండాల్సిన అవసరం ఉంది.’’ అని ప్రసంగించారు. Also Read: ఈ విషయంలో రాజకీయాలా? ‘ఇండస్ట్రియల్ కారిడార్ అంటే కేంద్రానికి ఢిల్లీ-ముంబయి పారిశ్రామిక కారిడార్‌ (డీఎంఐసీ) గా చెప్తారు. దక్షిణాన రాష్ట్రాలు లేవా? ఇక్కడ నగరాలు లేవా? బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలను పట్టించుకోరా? ఈ మూడు నగరాలను కలుపుతూ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయవచ్చు కదా? దీని వల్ల ఎన్నో ఫలితాలు ఉంటాయి. వేగవంతమైన బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కూడా ఢిల్లీ, ముంబయి తప్ప దేశంలో మరెక్కడా ఏర్పాటు చేయరు? ఇలాంటి ప్రవర్తన కేంద్రానికి మంచిది కాదు. ఈ ఆలోచనలు మారాలి’’ అని మంత్రి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మరో మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు. Also Read:

వార్డు వాలంటీర్‌ని కత్తితో పొట్టలో పొడిచి.. విశాఖలో ఉన్మాది ఘాతుకం

$
0
0
ఉన్మాది రెచ్చిపోయి వార్డు వాలంటీర్‌ను కత్తితో పొడిచిన ఘటన విశాఖలో కలకలం రేపింది. తన ఇంటికి సర్వే చేసేందుకు రాలేదంటూ కత్తితో పొట్టలో పొడిచాడు. ఉన్మాది దాడితో వాలంటీర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్రగాయాలతో కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వాలంటీర్‌ను స్థానికులు జీజీహెచ్‌కి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ నగరం మధురవాడ పరిధిలోని కే-1 నగర్ వార్డు వాలంటీర్‌గా లాల్ బహదూర్ రాయ్ నియమితుడయ్యాడు. ఇటీవల నిర్వహించిన వైఎస్సార్ నవశకం సర్వేలో తన ఇంటికి సర్వేకు రాలేదంటూ ఓ వ్యక్తి బహదూర్ రాయ్‌పై కత్తితో దాడి చేసి బీభత్సం సృష్టించాడు. విచక్షణా రహితంగా కత్తితో పొట్టలో పొడవడంతో వాలంటీర్ రాయ్ అక్కడే కొందపడిపోయాడు. Also Read: సర్వేకి రాలేదని ఆరోపిస్తూ వాలంటీర్‌పై కత్తితో దాడి చేయడం విశాఖ నగరంలో కలకలం రేపింది. కత్తి గాయాలతో పడిపోయిన వాలంటీర్ లాల్ బహదూర్ రాయ్‌ని కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్)కి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ప్రభుత్వం ఇటీవల వైఎస్సార్ నవశకం సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సర్వేలో భాగంగా వివరాలు సేకరించి అవసరమైన ప్రభుత్వ గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు సహా పలు పథకాలకు సంబంధించిన గుర్తింపు కార్డులను అందజేసేందుకు ప్రభుత్వ సర్వే నిర్వహించింది. గత నెల 30 వరకు ఈ సర్వే కొనసాగింది. Read Also:

వివాదాస్పద బయోపిక్‌లో విజయ్‌ దేవరకొండ.. ఏ క్యారెక్టర్‌ అంటే!

$
0
0
సెన్సేషనల్‌ స్టార్‌ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలను లైన్‌లో పెట్టిన ఈ యంగ్ హీరో తాజాగా ఓ వివాదాస్పద బయోగ్రాఫికల్‌ సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్‌ కాంట్రవర్షియల్‌ బ్యూటీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్ బయోపిక్‌ తలైవి. రాజకీయ జీవితమంత వివాదాలమయే. ఆమె రాజకీయ అరంగేట్రం, సీఎం పదవి చేపట్టడం, తరువాతి పరిణామాలు, శశికళాతో ఆమె సాన్నిహిత్యం లాంటి ఎన్నో వివాదాస్పద అంశాలు ఆమె జీవితంలో ఉన్నాయి. ముఖ్యంగా జయ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే. అందుకే ఆమె కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారంటే ఎన్ని వివాదాలు తెరమీదకు రానున్నాయో అంటున్నారు సినీ జనాలు. Also Read: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత, సినీ నటి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథా కథనాలు అందిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కీలక పాత్రల కనిపించనున్నాడట. జయలలిత జీవితంలో తెలుగు హీరో శోభన్‌బాబుది కీలక పాత్ర. ఒకప్పుడు వీరిద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉండేంది. అంతేకాదు వీరు పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారం కూడా అప్పట్లో చాలా గట్టిగానే జరిగింది. అయితే తరువాత కుటుంబ సమస్యల కారణంగా ఇద్దరు దూరమయ్యారు. ఇప్పుడు జయలలిత బయోపిక్‌లో విజయ్‌ దేవరకొండ శోభన్‌బాబు పాత్రలో నటిస్తున్నాడు. Also Read: అయితే ఈసినిమాలో వీరిద్దరి రిలేషన్‌కు సంబంధించి పెద్దగా కాంట్రవర్సీలకు పోయే అవకాశం లేదు. అందుకే విజయ్‌ కూడా ఈ పాత్రకు ఓకె చెప్పి ఉంటాడని తెలుస్తోంది. జయలలిత పాత్రలో కంగనా రనౌత్‌ నటిస్తున్న ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్రలో అరవింద్‌ స్వామి, కరుణానిథి పాత్రలో ప్రకాష్‌ రాజ్‌లు నటిస్తున్నారు. ఈ సినిమాలో జయలలిత లుక్‌లో కనిపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న కంగనా బరువు పెరిగి మరీ అమ్మ పాత్రకు రెడీ అయ్యారు.

‘మైండ్ బ్లాక్’ సాంగ్‌‌పై జోకులు.. ఫ్యాంట్, షర్ట్ వేసి.. అది మరిచిపోయారట!

$
0
0
‘మైండ్ బ్లాక్’ సాంగ్‌‌పై జోకులు.. ఫ్యాంట్, షర్ట్ వేసి.. అది మరిచిపోయారట!

హన్మకొండ బస్టాండ్ పక్కనే వ్యభిచారం.. పోలీసుల అదుపులో విటులు, మహిళలు

$
0
0
పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యభిచార కేంద్రాన్ని పోలీసులు చేధించారు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని హన్మకొండలో బస్టాండ్ పక్కనే ఉన్న అన్నపూర్ణ లాడ్జిలో కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్న పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో హన్మకొండ ఎస్ఐ రవీందర్ సిబ్బందిని అప్రమత్తం చేసి మంగళవారం లాడ్జిలో రైడ్ చేశారు. Also Read: ఈ సందర్భంగా లాడ్జి గదుల్లో కొన్ని జంటలు అభ్యంతరకర రీతిలో పట్టుబడ్డాయి. పోలీసులు ఇద్దరు విటులతో పాటు వ్యభిచార నిర్వాహకుడిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన మహిళలను పునరావాస కేంద్రానికి తీసుకెళ్లారు. మహిళలంతా ఉమ్మడి జిల్లాలోని తొర్రూరు, నర్సంపేట, పాలకుర్తి ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు. Also Read: ఆయా ప్రాంతాల్లో మహిళల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న దుండగులు వారిని మభ్యపెట్టి వ్యభిచార కూపంలోకి లాగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వీరు ఎక్కువగా వివాహితలనే టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. భర్త సంపాదనతో తృప్తి చెందని వారిని మాయమాటలతో ముగ్గులోకి దించి సెక్స్ వర్కర్లుగా మారుస్తున్నారని చెబుతున్నారు. రైడ్‌లో పట్టుబడిన విటులు, వ్యభిచార నిర్వాహకుడిని బుధవారం కోర్టులో హాజరుపరిచారు. లాడ్జిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చిన యజమానిపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. Also Read:

ఆకాశవాణిలో ఉద్యోగాలు.. వీరికి గుడ్ న్యూస్

$
0
0
హైదరాబాద్‌ కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన న్యూస్‌ ఎడిటర్లు, (తెలుగు), న్యూస్‌రీడర్ (తెలుగు, ఉర్దూ) పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నివసించే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వివరాలు..* ఖాళీల సంఖ్య: 03 ➦ న్యూస్ ఎడిటర్/రిపోర్టర్: 01 విభాగం: తెలుగు అర్హత: ఏదైనా డిగ్రీ. జర్నలిజంలో డిగ్రీ, పీజీ డిప్లొమా అర్హత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. అనుభవం: ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టింగ్, ఎడిటింగ్ వర్క్ విభాగాల్లో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. వయసు: 21 - 50 సంవత్సరాల మధ్య ఉండాలి. ➦ న్యూస్ రీడర్: 02 అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. భాషపై పట్టు, మంచి వాయిస్ ఉండాలి. విభాగం: తెలుగు, ఉర్దూ. అనుభవం: టీవీ/రేడియోలో జర్నలిజం విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు: 21 - 50 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. న్యూస్ రీడర్ పోస్టులకు ఆడిషన్ టెస్ట్/ వాయిస్ టెస్ట్ కూడా ఉంటుంది. దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 16.12.2019. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Deputy Director General [P], All India Radio, Saifabad, Hyderabad - 500 004.

‘కమ్మ’గా టీడీపీని ‘ప్రకాశ’ హీనం చేయనున్న జగన్..? బాబుకు మరో ఝలక్?

$
0
0
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి.. ప్రతిపక్షం నుంచి అధికార పార్టీ వైఎస్సార్‌సీపీలోకి త్వరలోనే భారీగా చేరికలుంటాయన్న ప్రచారం మళ్లీ ఊపందుకుంటోంది. వల్లభవనేని వంశీని తమవైపు తిప్పుకున్న అధికార పార్టీ.. తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టినట్లు అమరావతి సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే ముగ్గురు మంత్రులు టీడీపీ ఎమ్మెల్యేలకు టచ్‌లోకి వెళ్లారనే చర్చ మొదలయ్యింది. Read Also: ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీ వైపు చూస్తున్నారనే . జిల్లా మంత్రి బాలినేనితో పాటూ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు మంతనాలు జరుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. ముగ్గురు ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఫోన్‌లో సంప్రదించినట్లు.. వారు కూడా నియోజకవర్గంలో అనుచరులు, అభిమానులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురు అధికారపార్టీలోకి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారని.. త్వరలోనే సీఎం జగన్‌తో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీకి వచ్చిన 23 సీట్లలో ప్రకాశం జిల్లా నుంచి నలుగురు ఉన్నారు. అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, చీరాల నుంచి కరణం బలరాం, పర్చూరు నుంచి ఏలూరి సాంబశివరావు, కొండపి నుంచి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి విజయం సాధించారు. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు సిద్ధమయ్యారనే చర్చ మొదలయ్యింది. వీరిలో గొట్టిపాటి రవి, ఏలూరితో మంత్రి కొడాలి నాని మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన ఎమ్మెల్యేలతో మంత్రులు చర్చలు జరుపుతున్నారట. ఈ నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు (గొట్టిపాటి రవి, కరణం బలరాం, ఏలూరి సాంబశివరావు) కమ్మ సామాజిక వర్గ నేతలు ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ మధ్యే అదే సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని వంశీని వైఎస్సార్‌సీపీలోకి లాగేశారు.. ఇప్పుడు కూడా అదే టార్గెట్‌గా పావులు కదుపుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే టీడీపీ నేతలు పార్టీ మారబోతున్నారనే ప్రచారంతో చంద్రబాబు కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కర్నూలు పర్యటనలో ఉన్న ఆయన.. నలుగురు ఎమ్మెల్యేలతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఈ ప్రచారం జరుగుతుండగానే ముగ్గురు మంత్రులు సీఎం జగన్‌ను కలిశారు. ఈ భేటీలో కూడా టీడీపీ ఎమ్మెల్యేల చేరికపై ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోపే ఈ చేరికలు ఉంటాయనే మరో ప్రచారం జరుగుతోంది. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారితే చంద్రబాబు ప్రతిపక్ష హోదా కూడా కష్టమనే చెప్పాలి. ఇటీవల చాలామంది మంత్రులు ఇదే అంశాన్ని ప్రస్తావించారు.. జగన్ తలచుకుంటే టీడీపీలో ఎవరూ ఉండరని చెప్పుకొచ్చారు. మరి టీడీపీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు గోడ దూకేస్తారన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ ప్రచారంపై అటు టీడీపీ నుంచి కాని.. ఇటు వైఎస్సార్‌సీపీ నుంచి కాని అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

పాక్: 629 మందిని పెళ్లిపేరుతో చైనాకు అమ్మేసి బలవంతంగా వ్యభిచారం!

$
0
0
పేదరికాన్ని ఆసరాగా తీసుకుని పెళ్లి పేరుతో పెద్ద ఎత్తున మహిళలను అక్రమంగా నుంచి చైనాకు తరలించి, వారిని బలవంతంగా వ్యభిచారం కూపంలోకి నెట్టేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పాక్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 629 మంది మహిళలను పెళ్లి పేరుతో చైనా ముఠాలకు అమ్మేసినట్టు పాకిస్థాన్ అధికారుల దర్యాప్తు నివేదిక అసోసియేటెడ్ ప్రెస్‌కు చిక్కింది. ఈ నివేదిక ప్రకారం.. 2018 నుంచి అక్రమరవాణా చిక్కుకున్న బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంది. గత జూన్ నుంచి మహిళల అక్రమ రవాణా ముఠాల పట్ల దర్యాప్తు అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే, చైనాతో ఉన్న సత్సంబంధాలు దృష్యా పాక్ ఉన్నతాధికారులు వారిపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, మహిళ అక్రమ రవాణాలో నిందితులుగా ఉన్న మొత్తం 31 మంది చైనా పౌరులను అక్టోబరులో ఫైసలాబాద్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కానీ, మొదట్లో పోలీసుల విచారణలో చాలా మంది మహిళలు సాక్ష్యాలను చెప్పడానికి నిరాకరించారు.. ఎందుకంటే వీరిని బెదిరించడం లేదా డబ్బు ఆశచూపడం లాంటి చర్యలతో నోరు నొక్కేశారు. పోలీసులు, న్యాయస్థానం అభిప్రాయం ప్రకారం... వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే ప్రతీకారం తీర్చుకుంటారని భయపడ్డారు. ఇదే సమయంలో మహిళ అక్రమ రవాణా కేసుల్లో దర్యాప్తు అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిందని సామాజిక కార్యకర్త సలీమ్ ఇక్బాల్ వ్యాఖ్యానించారు. కొంత మంది అధికారులను బదిలీచేశారని ఆయన తెలిపారు. అక్రమ రవాణ ముఠాల చేతిలో చిక్కుకుని నరకం అనుభవిస్తున్న కొంత మంది యువతులను రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించడంలో ఇక్బాల్ విశేషంగా కృషిచేస్తున్నారు. ‘ఈ వ్యవహారంపై పాకిస్థాన్ పాలకులు నోరు మెదపడంలేదు. కొంత మంది ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తు జాప్యం చేస్తున్నారు... చైనాలోని వ్యభిచార కూపంలో చిక్కుకున్న యువతలకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదని’ ఓ అధికారి వ్యాఖ్యానించారు. ముఠాల కార్యకలాపాలు రోజు రోజుకూ పెచ్చుమీరుతున్నాయని, ఈ విషయం తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. పైస్థాయి నుంచి ఒత్తిడి అధికంగా ఉందని ఆయన అన్నారు. మరోవైపు, ఈ విషయం తమకు తెలియని చైనా విదేశాంగ శాఖ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. పాకిస్థాన్‌లోని క్రిస్టయన్ మైనార్టీ యువతులను చైనా ముఠాలు టార్గెట్ చేసినట్టు అసోసియేట్ ప్రెస్ విచారణలో తేలింది. తల్లిదండ్రులకు డబ్బులు ఆశచూపి వివాహం చేసుకుని వారిని తమ వెంట చైనాకు తీసుకెళ్తారు. అక్కడ వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారు. పాక్‌లోని పేద వర్గాలకు చెందిన వారిలో క్రిస్టియన్లు ఒకరు కావడంతో వారినే టార్గెట్ చేస్తున్నారు. చైనాకు చెందిన పెళ్లి కొడుకుల నుంచి 25,000 నుంచి 65,000 డాలర్లు అంటే రూ.40 లక్షల నుంచి రూ.కోటి వరకూ మధ్యవర్తులు వసూలు చేసి, యువతుల తల్లిదండ్రులకు కేవలం రూ.2 లక్షలు మాత్రమే చెల్లిస్తుంటారు.

లైవ్ న్యూస్: వైసీపీలోకి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు.. విక్రమ్‌ను గుర్తించింది ఇస్రోనే!

$
0
0
⍟ వల్లభవనేని వంశీ తర్వాత ఆ ముగ్గురు ఎమ్మెల్యేలే టార్గెట్.. మంతనాలు జరుపుతున్న ఏపీ మంత్రులు. ముగ్గురు ఎమ్మెల్యేలను వైఎస్సార్‌సీపీలోకి లాగే దిశగా చర్చలు.. ⍟ విక్రమ్ ల్యాండర్ ఆచూకీని గుర్తించినట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, విక్రమ్‌ జాడను తాము ఎప్పుడో గుర్తించామని ఇస్రో ఛైర్మన్ కే శివన్ బుధవారం ప్రకటించారు. నాసా ప్రకటనను తోసిపుచ్చిన ఆయన.. విక్రమ్ ఆచూకీ కనుగొన్నది నాసా కాదని, ల్యాండర్ శకలాలను అంతకు ముందే గుర్తించామని తెలిపారు. ⍟ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయంటూ మళ్లీ బాంబ్ పేల్చారు.. మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. తాను బీజేపీకి ఎప్పుడూ దూరంగా లేనంటున్నారు పవన్ కళ్యాణ్. . ⍟ ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ జవాన్ తోటి సిబ్బందిపై కాల్పులకు దిగడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. అనంతరం ఆ జవాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. .. ⍟ ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరానికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అరెస్ట్ అయిన 105 రోజుల తర్వాత ఆయనకు జైలు నుంచి బయటకు రానున్నారు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని, ఈ కేసుకు సంబంధించి ప్రెస్ స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దని సుప్రీం చిదంబరాన్ని ఆదేశించింది. ⍟ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( )కు చెందిన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్‌ఎల్వీ) రాకెట్ బూస్టర్ పుదుచ్చేరి తీరంలో మత్స్యకారుల వలకు సోమవారం చిక్కింది. పుదుచ్చేరిలోని వంబాకీరపాళ్యానికి చెందిన మత్స్యకారులు సోమవారం చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. ⍟ ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పట్టణంలో తల్లీకూతుళ్లను దుండగులు దారుణంగా చంపేశారు. బుధవారం ఉదయం ఇద్దరు మహిళలు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ⍟ దిశ కేసులో నిందితుల దారుణాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. ఆమెను హత్యచేసిన తర్వాత పెట్రోలు పోసి తగలబెట్టినట్లు పోలీసులు ఇప్పటివరకు చెబుతున్నారు. కానీ, ఆమె బతికుండగానే సజీవదహనం చేసినట్లు చర్లపల్లి జైల్లో ఉన్న కీలక నిందితుడు ఆరిఫ్‌ కొందరు కిందిస్థాయి అధికారులకు చెప్పిన విషయం బయటకు వచ్చింది. చర్లపల్లి జైలులో ఉన్న నిందితులతో కొంతమంది జైలు సిబ్బంది మాట్లాడినప్పుడు ఆరిఫ్‌ కనీసం భయపడకుండా పలు విషయాలు బయటపెట్టినట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ⍟ లాయర్లకు సంబంధించిన వైఎస్సార్‌ లా నేస్తం పథకానికి ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారు. జూనియర్‌ లాయర్లకు ఆర్థిక సాయం అందజేసే ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు బ్యాంకు అకౌంట్లలోకి నగదు జమ చేస్తారు. లా నేస్తం పథకం కింద జూనియర్‌ లాయర్లకు ప్రతినెలా రూ.5,000 చొప్పున ఆర్థిక సాయాన్ని మూడేళ్ల పాటు అందిస్తారు. . ⍟ జగన్ సర్కార్ మరోసారి రివర్స్ టెండరింగ్‌తో డబ్బు ఆదా చేసింది. పోలవరం, వెలిగొండతో పాటూ మరికొన్ని పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్‌తో సక్సెస్ కావడంతో.. ఈసారి స్మార్ట్ ఫోన్‌ల కొనుగోలుకు సంబంధించి మళ్లీ ఈ విధానాన్ని అమలు చేసింది. ⍟ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణకు అనంతపురంలో చేదు అనుభవం ఎదురైంది. అనంతపురంలోని నారాయణ విద్యాసంస్థలను పరిశీలించేందుకు నారాయణ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు కళాశాల వద్దకు చేరుకున్నారు. ప్రియుడు మోసం చేశాడని యువకుడు ఫిర్యాదు.. సూర్యాపేట జిల్లా ఇమాంపేటకు చెందిన మునగాల జానయ్య అనే యువకుడు.. సూర్యాపేట పట్టణంలో ఓ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పట్టణానికి చెందిన గుండ్లగాని సాయితో అతడికి పరిచయం ఏర్పడింది. అనతి కాలంలోనే వారి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు.

జనసేనను బీజేపీలో విలీనం చేయమన్నాం: బీజేపీ ఎంపీ

$
0
0
జనసేన అధినేత బీజేపీపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. బీజేపీతోనే ఉన్నానంటూ ఆయన వ్యాఖ్యానించడంతో మళ్లీ జనసేనాని చూపు మారిందనే చర్చ జరుగుతోది. తాజాగా ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ స్పందించారు. బీజేపీ విధానాలు నచ్చి తమతో కలిసి పనిచేయాలనుకుంటే తాము సిద్ధమన్నారు.. కాకపోతే ఇది పొత్తులకు సరైన సమయం కాదన్నారు. తమ భుజాలపై నుంచి 6 అడుగుల బుల్లెట్‌ను.. వేరేవారిపైకి సంధించాలనుకుంటే పొరపాటేనని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందే జనసేనని బీజేపీలో విలీనం చేయాలని కోరామని.. జనసేనాని అంగీకరించ లేదన్నారు జీవీఎల్. కేంద్ర పెద్దలంటే గౌరవమని పవన్ కళ్యాణ్‌తో పాటూ టీడీపీ నేతలు చెబుతున్నారని.. తమతో కలిసి పనిచేయాలని భావిస్తే.. ప్రాంతీయ పార్టీల విలీనాన్ని స్వాగతిస్తామని వ్యాఖ్యానించారు. పవన్ విలీన ప్రతిపాదనతో వస్తే ఆహ్వానిస్తామని.. ఈ ప్రక్రియకు సంబంధించి తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ ఇటీవల హిందూ రాజకీయ నేతలు అంటూ చేసిన వ్యాఖ్యల్ని జీవీఎల్ ఖండించారు. మతసామరస్యం లేకపోవడానికి హిందువులే కారణమని పవన్‌ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. హిందువులే మత ఘర్షణలకు కారణం అనడం రాజకీయ దురుద్దేశమేన్న ఆయన.. మతపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వొద్దనేది బీజేపీ సిద్ధాంతమని చెప్పారు.

దిశ కేసులో కీలక అడుగు.. మహబూబ్‌నగర్‌లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు

$
0
0
దిశ కేసు విచారణ దిశగా కీలక అడుగు పడింది. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటుకు అనుమతి ఇస్తూ బుధవారం (డిసెంబర్ 4) హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వినతికి సానుకూలంగా స్పందించింది. శంషాబాద్‌లో వెటర్నరీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఈ కేసు విచారణను త్వరితగతిన ముగించి నిందితులకు కఠిన శిక్ష విధించేలా కేసీఆర్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ కేసు విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. తాజాగా హైకోర్టు ఆమోదం తెలపడంతో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టింది. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో ఈ కేసుపై రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకోనున్నారు. Also Read: ఇటీవల వరంగల్‌లో సంచంలనం సృష్టించిన తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనపై ప్రత్యేక ఫాస్ట్‌‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. దీంతో కేవలం 56 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించే వెసులుబాటు కలిగింది. అదే తరహాలో దిశ కేసులోనూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుతో సత్వర తీర్పు వచ్చే అవకాశం ఉంది.

Hyderabad T20: పొట్టిఫార్మాట్‌ ఆ టైమ్‌లో బౌలింగ్ చేయడం కష్టం: సుందర్

$
0
0
గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్‌లో రెగ్యులర్ ప్లేయర్‌గా మారిపోయాడు . జట్టులో తొలుత బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ తమిళనాడు ప్లేయర్ ప్రస్తుతం పూర్తిస్థాయి స్పిన్నర్‌గా కుదురుకున్నాడు. మరోవైపు గతకొంతకాలంగా పవర్ ప్లే ఆరంభ ఓవర్లలో స్పిన్ బౌలింగ్ చేసి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. 1992 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ మార్టిన్ క్రో తెచ్చిన సంప్రదాయాన్ని భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కొనసాగించాడు. గతంలో రవిచంద్రన్ అశ్విన్‌ను ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్‌ల సందర్భంగా ఓపెనింగ్ బౌలింగ్ చేసేవాడు. ప్రస్తుతం ఈ పనిని సుందర్ కొనసాగిస్తున్నాడు. అయితే పవర్ ప్లేలలో బౌలింగ్ చేయడం చాలా కష్టసాధ్యమైన విషయమని పేర్కొన్నాడు. Read Also: ‘టీ20ల్లో ఓపెనింగ్ బౌలింగ్ చేయడం సవాలుతో కూడుకున్నది. సరైన ప్రదేశాల్లో బంతుల్నివేస్తేనే ఫలితం ఉంటుంది. ఈక్రమంలో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. దీంతో మూల్యం చెల్లించక తప్పదు. అయితే ఇలాంటి చాలెంజ్‌లను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. పవర్ ప్లేలలో కుడి, ఎడమ చేతివాటం ఆటగాళ్లకు బౌలింగ్ చేయడం సవాలుతో కూడుకున్నదే. అయితే గత రెండు, మూడేళ్లుగా నాకు లభించిన ఈ కొత్త పాత్రను ఆస్వాదిస్తున్నా’ అని సుందర్ వ్యాఖ్యానించాడు. Read Also: మరోవైపు టీ20 వరల్డ్‌కప్ గురించి ఆలోచించడం లేదని సుందర్ అన్నాడు. ప్రస్తుత విషయాలపైనే తన దృష్టంతా ఉందని, వరల్డ్‌కప్ గురించి అంతగా ఆలోచించడం లేదని తెలిపాడు. అయితే ప్రపంచకప్‌లో ఆడడం ఎవరికైన కల అని, అయితే ప్రస్తుతం తాను వర్థమాన విషయాలపైనే ఆలోచిస్తున్నట్లు తెలిపాడు. ఈనెల 6 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌లో సుందర్ ఆడనున్నాడు. హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ అనంతరం తిరువనంతపురం, ముంబైలలో మిగతా రెండు టీ20లు జరుగుతాయి. Read Also:

Cable bridge: హైదరాబాద్ తీగల వంతెన నిర్మాణంలో కీలక ఘట్టం.. ప్రత్యేకతలివే!

$
0
0
హైదరాబాద్ మహా నగరంలో మరో సుందర కట్టడం రూపుదిద్దుకుంది. ఇప్పటిదాకా దేశంలో కోల్‌కతా, ముంబయి, రాజస్థాన్‌లోని కోటా వంటి కొన్ని నగరాలకే పరిమితమైన తీగల వంతెన ఇకపై హైదరాబాద్‌లోనూ పర్యటకులను అలరించనుంది. దుర్గం చెరువుపై నిర్మితమైన ఈ ఇంపైన నిర్మాణం ప్రారంభమైతే ఈ ప్రాంతం నగరంలో మరో పర్యాటక ప్రదేశంగా మారనుంది. హైదరాబాద్‌ అంటే గుర్తుకొచ్చే చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్ జాబితాలో ఇకపై కేబుల్‌ బ్రిడ్జి కూడా చేరనుంది. దుర్గం చెరువుపై నిర్మితమవుతున్న కేబుల్‌ బ్రిడ్జి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా తుది సెగ్మెంట్‌ అమరికను మంగళవారం రాత్రి విజయవంతంగా పూర్తి చేశారు. వంతెన మొత్తం 53 సెగ్మెంట్లను ఏర్పాటు చేసేందుకు 22 నెలల సమయం పట్టింది. సెగ్మెంట్లలో చివరి ఘట్టం సందర్భంగా నిర్మాణ టీమ్‌ ఆనందంతో బాణసంచా కాల్చారు. Also Read: వంతెన ప్రత్యేకతలుదుర్గం చెరువుపై నిర్మిస్తున్న తీగల వంతెన మొత్తం పొడవు 755 మీటర్లు. ఆరు లైన్ల వెడల్పుతో దీన్ని నిర్మిస్తున్నారు. అంటే సుమారు వెడల్పు 26 మీటర్లు ఉండనుంది. వంతెనకు ఆధారం రెండు భారీ స్తంభాలు. వీటిని చెరువు ఒడ్డు సమీపంలో నిర్మించారు. ఈ పైలాన్‌ల ఎత్తు 57 మీటర్లు కాగా, వీటి మధ్య దూరం 233.8 మీటర్లు. ప్రపంచంలోనే పొడవైన స్పాన్‌లు (రెండు స్తంభాల మధ్య దూరం) కలిగిన కేబుల్‌ వంతెనలు జపాన్‌లో రెండు (275 మీటర్లు, 271 మీటర్లు) ఉండగా, హైదరాబాద్‌లో నిర్మిస్తున్నది మూడోదని జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు తెలిపారు. దీని స్పాన్ 234 మీటర్లు. స్టీల్‌ లేకుండా ఎక్స్‌ట్రా డోస్డ్‌ కేబుల్‌ స్టే ప్రీకాస్ట్‌ కాంక్రీట్‌ విధానంలో నిర్మించిన బ్రిడ్జిల్లో మాత్రం ప్రపంచంలో ఇదే పొడవైనదని అన్నారు. దుర్గం చెరువుపై ఎక్స్‌ట్రా డోస్డ్‌ కేబుల్‌ స్టే బ్రిడ్జి పనులు 21వ శతాబ్దపు ఇంజినీరింగ్‌ అద్భుతంగా ఇంజినీర్లు అభివర్ణించారు. Also Read: ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా నగర పాలక సంస్థ రూ.184 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జి పనులు చేపట్టింది. దిగ్గజ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ఈ వంతెనను నిర్మిస్తోంది. వంతెనను సుందరీకరణకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.11 కోట్ల ఖర్చు కానున్నట్లు తెలుస్తోంది. ఈ విద్యుత్ దీపాలను చైనా నుంచి దిగుమతి చేసుకోనున్నారు. వంతెనపై ప్రహరీ నిర్మాణానికి రూ.15 కోట్లు అవుతుందని అంచనా. Also Read: చేయాల్సిన పనులివీ..వంతెన పూర్తి కావడానికి మరికొన్ని పనులు మిగిలి ఉన్నాయి. ఫినిషింగ్‌ పనులతో పాటు రెయిలింగ్, ప్రత్యేక విద్యుదీకరణ తదితర పనులు మిగిలి ఉన్నాయి. అన్నీ పూర్తయి వంతెన పూర్తిగా వినియోగంలోకి వచ్చేందుకు మరో 4 నెలలు సమయం పట్టనుంది. ఈ బ్రిడ్జి సేవలు అందుబాటులోకి వస్తే జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి ఐకియా స్టోర్‌ వరకు సిగ్నళ్లు లేని సాఫీ ప్రయాణం సాధ్యపడనుంది. అంటే ఈ మార్గంలో 2 కిలోమీటర్ల వరకూ దూరం తగ్గడంతోపాటు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36, మాదాపూర్‌ మార్గాలపై ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గుతుంది. Also Read:

సూడాన్ ఫ్యాక్టరీలో పేలిన గ్యాస్ ట్యాంకర్.. 18 మంది భారతీయులు దుర్మరణం!

$
0
0
సూడాన్‌లోని ఓ సిరామిక్ ఫ్యాక్టరీలో గ్యాస్ ట్యాంకర్ పేలిన ఘటనలో 18 మంది భారతీయులు సహా 23 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి 130 మంది గాయపడ్డారు. బహ్రి ప్రాంతంలోని సీలా సిరామిక్ ఫ్యాక్టరీలో మంగళవారం పేలుడు జరిగింది. ఈ పేలుడు తర్వాత 16 మంది భారతీయులు కనిపించకుండా పోయారు. తాజా సమాచారం ప్రకారం అధికారికంగా ప్రకటించకపోయినా.. 18 మంది చనిపోయారని భారత ఎంబసీ తెలిపింది. కనిపించకుండా పోయిన వారిలో కొందరు మరణించి ఉంటారని.. శరీరాలు కాలిపోవడంతో మృతులను గుర్తించడం కష్టంగా మారిందని భారత ఎంబసీ వెల్లడించింది. 24 గంటల హాట్ లైన్ +249-921917471ను ఏర్పాటు చేశామని విదేశాంగ మంత్రి జై శంకర్ ట్వీట్ చేశారు. పేలుడులో గాయపడి హస్పిటల్లో చికిత్స పొందుతున్న, కనిపించకుండా పోయిన భారతీయుల వివరాలను భారత ఎంబసీ బుధవారం విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం ఏడుగురు హాస్పిటల్ పాలయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నుంచి తప్పించుకున్న 34 మంది భారతీయులు సాలోమి సిరమిక్స్ ఫ్యాక్టరీ నివాస సముదాయాల్లో ఉన్నారు. పేలుడు జరిగిన ఫ్యాక్టరీలో ఎలాంటి భద్రతా చర్యలు పాటించలేదని, పేలుడు పదార్థాలను కూడా నిల్వ చేశారని... దీని వల్ల మంటలు వ్యాపించాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని స్పష్టం చేసింది.

బ్యాంకులు భళా.. చివర్లో మెరుపులు..

$
0
0
దేశీ స్టాక్ మార్కెట్ రికవరీ అయ్యింది. బుధవారం ఆరంభంలోనే నష్టపోయిన మార్కెట్ మధ్యాహ్నం వరకు అదే ట్రెండ్‌లో కొనసాగింది. అయితే చివర్లో మాత్రం రీబౌండ్ అయ్యింది. దీంతో చివరకు బెంచ్‌మార్క్ సూచీలు లాభాల్లోనే క్లోజయ్యాయి. చివరకు సెన్సెక్స్ 175 పాయింట్ల లాభంతో 40,850 వద్ద ముగిసింది. నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 12,037 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ మళ్లీ 12,000 మార్క్ పైకి చేరింది. Also Read: Stock Market Highlights.. ✺ నిఫ్టీ 50లో టాటా మోటార్స్, యస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, వేతాంత, హిందాల్కో షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్ 7 శాతం పరుగులు పెట్టింది. ✺ అదేసమయంలో ఎల్అండ్‌టీ, రిలయన్స్, కోల్ ఇండియా, ఐఓసీ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టపోయాయి. రిలయన్స్ దాదాపు 2 శాతం పడిపోయింది. Also Read: ✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ మెటల్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీఐటీ, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా పెరిగాయి. Also Read: ✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.96 శాతం పెరుగుదలతో 62.01 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.75 శాతం పెరుగుదలతో 57.08 డాలర్లకు ఎగసింది. ✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి లాభాల్లో ట్రేడవుతోంది. 15 పైసలు లాభంతో 71.53 వద్ద కదలాడుతోంది. Also Read:

సైకిల్‌పై తిరిగి పాల వ్యాపారం చేశా.. సక్సెస్‌కు నేనే నిదర్శనం: మంత్రి మల్లారెడ్డి

$
0
0
ష్టపడితే సాధించలేనిది ఏది లేదనడానికి తానే నిదర్శం అని చెప్పారు. తాను చిన్నప్పుడు సైకిల్ మీద తిరుగుతూ పాలు సరఫరా చేపేవాడినని.. ఇప్పుడు మంత్రి అయ్యానని ఆయన తెలిపారు. పాల వ్యాపారంతో ప్రారంభమైన తన సక్సెస్ మల్లారెడ్డి విద్యా సంస్థల వరకు వచ్చిందంటే అందుకు నిదర్శనం కష్టం అని ఆయన పేర్కొన్నారు. బుధవారం (డిసెంబర్ 4) టీఎస్-ఐపాస్ ఏర్పాటై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఐదేళ్లలో TS-ఐపాస్ సక్సెస్ కావడం పట్ల మంత్రి మల్లారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దీని కోసం కృషి చేసిన మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా సక్సెస్ గురించి ప్రస్తావిస్తూ.. తాను ఎదిగిన క్రమాన్ని చెప్పుకొచ్చారు. Also Read: తెలుగువారికి తెలివితేటలు ఎక్కువ అని.. యువత కసిగా పని చేసి లక్ష్యాలను చేరుకోవాలని ఆయన సూచించారు. అందరం కలిసి పని చేసి తెలంగాణను దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలపాలని చెప్పారు. మంత్రి యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ అని.. ఆయణ్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని మల్లారెడ్డి సూచించారు.

పవన్ ‘బీజేపీ’ వ్యాఖ్యల్లో తప్పేముంది.. మాకూ శత్రుత్వం లేదు.. మాజీ మంత్రి వ్యాఖ్యలు

$
0
0
బీజేపీతో విడిపోయిందేమీ లేదని.. ఒక్క హోదా విషయంలోనే దూరంగా ఉన్నానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపాయి. పవన్ బీజేపీతో కలిసిపోయారా? లేక పార్టీని విలీనం చేస్తారా? అనే చర్చ మొదలైంది. అలాగే అమిత్ షా నాయకత్వమే దేశానికి అవసరం అంటూ పవన్ ప్రశంసించడం కూడా ఆ వాదనలకు బలం చేకూరుస్తోంది. తాజాగా పవన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి స్పందించారు. పవన్ వ్యాఖ్యలను అలా చూడాల్సిన అవసరం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ లాంటి వ్యక్తి ఆలోచించే మాట్లాడతారన్న అచ్చెన్న.. బీజేపీ విషయంలో అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. అందులో తప్పేమీలేదని తేల్చేశారు. టీడీపీకి కూడా బీజేపీ ఏమీ శత్రువు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తమకు వ్యతిరేకమని తామెప్పుడూ అనలేదన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని.. మూడున్నరేళ్ల వరకూ బీజేపీతో కలిసే ఉన్నామని గుర్తు చేశారు. Also Read: రాష్ట్రానికి అన్యాయం జరిగింది.. న్యాయం చేయాలని కోరితే బీజేపీ పట్టించుకోలేదని అచ్చెన్న ఆరోపించారు. అందుకే బీజేపీకి దూరమైనట్లు చెప్పారు. అంతేకానీ తమకి కూడా శత్రుత్వం ఏమీ లేదంటూ చెప్పడం విశేషం. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారనే వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్నామని.. అంతేకానీ జగన్‌తో ఏమైనా వ్యక్తిగత శత్రుత్వం ఏమైనా ఉందా అంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు. పవన్ కళ్యాణ్‌పై మంత్రుల విమర్శలను అచ్చెన్న తప్పుబట్టారు. పవన్ కళ్యాణ్‌పై ఇష్టానుసారం పేలుతున్నారంటూ ధ్వజమెత్తారు. పవన్ నాయుడు అని వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మూకుమ్మడి దాడి చేయడం తగదని హితవు పలికారు. వైసీపీ దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు అందరినీ కలుపుకుపోతామన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. Read Also:

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌‌లో ఖాళీలు

$
0
0
లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేష‌న్‌ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌(హెచ్ఎఫ్ఎల్) దేశ‌వ్యాప్తంగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. Read Also: వివరాలు...* అసిస్టెంట్ మేనేజర్ (లీగల్): 35 పోస్టులురాష్ట్రాలవారీగా ఖాళీలు..
ఛత్తీస్‌గఢ్ 01
మధ్యప్రదేశ్ 01
బిహార్ 01
ఒడిశా 01
అసోం 01
వెస్ట్ బెంగాల్ 02
ఉత్తర్ ప్రదేశ్ 04
ఢిల్లీ 03
రాజస్థాన్ 01
చండీగఢ్ 01
కర్ణాటక 04
ఆంధ్రప్రదేశ్ 01
తెలంగాణ 02
కేరళ 01
తమిళనాడు 05
గుజరాత్ 01
మహారాష్ట్ర 05
మొత్తం ఖాళీలు 35
అర్హత: 55 శాతం మార్కులతో లా డిగ్రీ ఉండాలి. కంప్యూట‌ర్ స్కిల్స్‌ తప్పనిసరి. Read Also: వయోపరిమితి: 01.01.2019 నాటికి 23-30 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.500. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా. రాతపరీక్ష విధానం.. ➦ మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. ➦ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు), లాజికల్ రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు), జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు (15 నిమిషాలు), ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు) ఉంటాయి. ➦ పరీక్ష సమయం 120 నిమిషాలు (2 గంటలు). ➦ నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. జీతం: రూ.56,000. Read Also: ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 02.12.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 16.12.2019
ఆన్‌లైన్ పరీక్షతేది 27.01.2020
Read More.. ➦ ➦
Viewing all 86007 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>