December 11, 2019, 10:15 pm
![]()
మైక్రో బ్లాగింగ్ సైట్ 2019లో ఎన్నో మార్పులకు లోనైంది. కానీ ఈ మధ్య అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ ఫీచర్ వీటన్నిటి కంటే పెద్దదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఫీచర్ ఫేస్ బుక్ లో లేనందుకు వినియోగదారులు ఎంతగానో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అదే ఇమేజ్ క్వాలిటీ కంప్రెషన్ ఫీచర్. ఫేస్ బుక్ లో మీరు ఏదైనా ఫొటో అప్ లోడ్ చేస్తే దాని క్వాలిటీ దారుణంగా పడిపోతుంది. చూడటానికి కూడా అంత అందంగా కనిపించదు.
Also Read:
ఇంతకు ముందు ట్వీటర్ కూడా ఆ తరహాలోనే ఉండేది. కానీ ఇప్పుడు ట్వీటర్ లో ఫుల్ రిజల్యూషన్ తో ఫొటోలు అప్ లోడ్ చేయవచ్చు. అంటే.. మీ ఫోన్ లో ఫొటో ఏ క్వాలిటీలో అయితే ఉందో.. అంతే క్వాలిటీతో ట్వీటర్ లో ఫొటోను అప్ లోడ్ చేయవచ్చన్న మాట. ఎవరైనా ఆ ఫొటోను చూస్తే వారికి కూడా అదే క్వాలిటీతో కనిపిస్తుంది.
Also Read:
ఈ విషయాన్ని ట్వీటర్ ప్రొడక్ట్ టీమ్ సభ్యుల్లో ఒకరు నేరుగా వెల్లడించారు. నేటి నుంచి ట్వీటర్ లో అప్ లోడ్ చేసే ఫొటోలు అప్ లోడ్ చేసే నాణ్యతలో 97 శాతం వరకు అదే నాణ్యతతో వస్తాయని పేర్కొన్నారు. అయితే ఫొటోలను థంబ్ నెయిల్ రూపంలో చూసినప్పుడు తక్కువ నాణ్యతలో కనిపిస్తూ.. వాటిని ఓపెన్ చేసినప్పుడు మాత్రమే అధిక నాణ్యతను కూడిన ఫొటోలు కనిపిస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. దీనిపై కూడా ట్వీటర్ త్వరలో పని చేసే అవకాశం ఉంది.
Also Read:
గత నెలలోనే ట్వీటర్ రిప్లైలను కనిపించకుండా చేసే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అంటే మీ ట్వీట్ కింద ఎవరైన ఇచ్చిన రిప్లై మీకు నచ్చకపోతే దాన్ని మీరు కనిపించకుండా చేయవచ్చన్న మాట. ఫేస్ బుక్ లో అయితే ఇలా పోస్టుల కింద నచ్చని కామెంట్లు పెట్టినట్లయితే వాటిని డిలీట్ చేసే అవకాశం ఉంది. ట్వీటర్ లో పూర్తిగా డిలీట్ చేసే అవకాశం లేకపోయినా.. ఇలా దాచిపెట్టే అవకాశాన్ని ట్వీటర్ అందిస్తోంది. వీటి సాయంతో మీరు చేసే ట్వీట్ల కింద జరిగే సంభాషణలను మీరు నియంత్రించవచ్చని ట్వీటర్ తెలుపుతోంది. 2019లో అయితే ట్వీటర్ ఎన్నో మార్పులకు లోనైంది. 2020లో కూడా వినియోగదారులను మెప్పించేలా మరిన్ని మార్పులను చేస్తారా? లేక ఇంతటితో ఆగిపోతారా? అనేది చూడాలి మరి!
↧
December 11, 2019, 10:37 pm
![]()
తెలంగాణ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు కేటుగాళ్లను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. మల్కాజ్‌గిరిలోని గీతానగర్‌కు చెందిన రూపాకుల కార్తికేయ సీఏ చదివాడు. తార్నాకకు చెందిన స్నేహితుడు ఫ్రెడరిక్‌తో కలిసి ప్రైవేట్ కంపెనీలకు కన్సల్టెన్సీ వ్యవహరించేవాడు. వీరిద్దరూ ఆయా కంపెనీల పనిమీద రోజూ ప్రభుత్వాధికారులను కలుస్తూ అక్కడ జరిగే ప్రక్రియలను తెలుసుకునేవారు.
Also Read:
ఈ క్రమంలోనే సులువుగా డబ్బు సంపాదించుకునేందుకు మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శి పేరుతో కార్తికేయ నకిలీ అవతారమెత్తాడు. మారేడ్‌పల్లిలోని కస్తూర్బాగాంధీ మహిళా కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీరాములరాజును పరిచయం చేసుకుని తన ఫ్రెండ్ కుమార్తెకు అందులో సీటు ఇప్పించాడు. ఇందుకోస స్నేహితుడి దగ్గర రూ.90వేలు తీసుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత కార్తికేయకు ఫోన్ చేసిన శ్రీరాముల రాజు తన కుమారుడిని అనారోగ్యంతో ఆస్పత్రిలో చేర్పించామని, ప్రభుత్వం నుంచి వైద్య ఖర్చులు ఇప్పించాలని కోరాడు.
Also Read:
దీనికి సరేనన్న కార్తికేయ సీఎం పేషీ నుంచి తెచ్చినట్లు రూ.2లక్షల వైద్య ఖర్చుల ట్రీట్‌మెంట్ లెటర్‌ను శ్రీరాముల రాజుకు ఇచ్చి కొంత కమిషన్ తీసుకున్నాడు. రాజు ఆ లెటర్‌ను శ్రీకర్ ఆస్పత్రిలో ఇవ్వగా అది నకిలీదని తేలింది. దీంతో బాధితుడు ఈ నెల 6వ తేదీ ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు కార్తికేయ, అతడి ఫ్రెండ్ ఫ్రెడరిక్‌ను అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.
Also Read:
↧
↧
December 11, 2019, 10:41 pm
![]()
భారతీయ భాషల్లో దక్షిణాది భాషాలు చాలా భిన్నంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఉత్తరాదిలో హిందీ ఎక్కువగా మాట్లాడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటే.. ఈశాన్యంలో బెంగాలీ, దానికి సారూప్యంలో ఉండే మరికొన్ని భాషలను ఎక్కువ మంది మాట్లాడతారు. ఇక దక్షిణాదిలోకి వస్తే.. కన్నడ-తెలుగు లిపి ఒకేలా ఉన్నా భాషను అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ, చాలా వరకు పదాలు తెలుగు భాషతో కలుస్తాయి. అలాగే, మలయాళం-తమిళం భాషల్లో కూడా కొన్ని పదాలు కలుస్తుంటాయి. ఆ భాషాల్లోని కొన్ని పదాలు తెలుగు, కన్నడతో కలుస్తాయి.
సంస్కృతి, ప్రాచీన భాషల ప్రభావం వల్ల పదాలు మధ్య సారూప్యత సాధారణమే. కానీ, దేశం కాని దేశంలోని భాషతో కూడా మన పదాలు కలవడం అనేదే ఆశ్చర్యం కలిగించే విషయం. తమిళ భాషకు సింగపూర్‌తో పాటు చైనా తదితర దేశాల్లో మంచి ఆధరణే ఉంది. సినిమాలకు సైతం అక్కడ మార్కెట్ ఉంది. అయితే, కొరియన్ భాషతో తమిళం ఎలా కలుస్తుందనేదే ఆశ్చర్యం కలిగించే విషయం. కొరియాన్‌లో మాట్లాడే చాలా వరకు పదాలు.. పలకడంలో తేడా ఉన్నా, వాటి అర్థం మాత్రం ఒకటే కావడం అబ్బురపరుస్తుంది.
Also Read:
అమ్మ, నాన్న పదాలతోపాటు వివిధ భావలకు ఉపయోగించే పదాలు సైతం కొరియాన్‌తో కలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూట్యూబర్ బహాఫర్ ఎలాస్ట్ ఇటీవల పోస్ట్ చేసిన వీడియో చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. తమిళ యువతి ఇషా, కొరియా యువతి ఎలన్‌తో కలిసి రూపొందించిన ఈ వీడియోలో కొన్ని కొరియాన్, తమిళ పదాలను చదివి వినిపించారు. సాధారణంగా వేరే భాషలో మన పదాలు ఉన్నా.. వేరే అర్థాలు ఉంటాయని భావిస్తాం. అయితే, కొరియాన్-తమిళం విషయంలో అలా లేదు. ఆ పదాలు, వాటికి అర్థాలు రెండు భాషల్లో ఒకలాగానే ఉన్నాయి. నమ్ముబుద్ధి కావడం లేదు కదూ. అయితే, ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
వీడియో:
Also read:
↧
December 11, 2019, 10:43 pm
![]()
దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై రెండో రోజు విచారణ ముగిసింది. ఈ మేరకు ఉన్నత స్థాయి విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. వీరిలో విశ్రాంత న్యాయమూర్తులు వీఎస్ సిర్పుర్కార్, రేఖ, మాజీ సీబీఐ అధికారి కార్తికేయన్‌లను ధర్మాసనం నియమించింది. ఈ కమిషన్‌కు వీఎస్ సిర్పుర్కార్ నాయకత్వం వహించనుండగా, వీరికి సీఆర్‌పీఎఫ్ భద్రత కల్పిస్తుందని ధర్మాసనం వెల్లడించింది. అంతేకాక, కమిషన్‌కు అయ్యే ఖర్చులను కూడా తెలంగాణ ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది. ఈ కమిటీ హైదరాబాద్‌లో సరైన ప్రదేశంలో ఉండి విచారణ జరపాలని కోర్టు సూచించింది. కమిటీ తొలి విచారణ మొదలు పెట్టిన తేదీ నుంచి ఆరు వారాల్లో సుప్రీంకోర్టుకు నివేదిక అందించాలని సీజేఐ ఆదేశించారు. అంతేకాక, ఈ కేసు విచారణలో మీడియాతోపాటు సామాజిక మాధ్యమాలపై నియంత్రణ ఏర్పర్చాలని సీజేఐ ఆదేశించారు.
వాదనల్లో భాగంగా ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై కోర్టు విచారణ కమిటీని నియమిస్తుందని వెల్లడించింది. అయితే, దీనిపై ఇప్పటికే సిట్ దర్యాప్తు మొదలైందని, ఎన్‌హెచ్‌ఆర్సీ కూడా విచారణ చేసిందని తెలంగాణ తరపు వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ముకుల్ రోహద్గీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో మళ్లీ మరో ఉన్నత స్థాయి కమిటీ విచారణ అవసరం ఉందా? అనేది పరిశీలించాలని రోహద్గీ కోర్టుకు విన్నవించారు. నిందితులు చేసిన ఎదురు దాడి, వారు పారిపోతున్న తీరుకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై తొలుత పిటిషనర్‌ను ప్రశ్నించిన ధర్మాసనం.. ఇందులో మీకు ఆసక్తి ఎందుకని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ. బాబ్డే ప్రశ్నించారు. అయితే, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఎన్‌కౌంటర్ అయినందువల్లే తాను సుప్రీంకోర్టును ఆశ్రయించానని పిటిషనర్ మండి స్పష్టం చేశారు. దీనిపై పూర్తి సమాచారం ప్రభుత్వం నుంచి రాబట్టాలని మండి ధర్మాసనాన్ని కోరారు.
ఘటన జరిగిన సమయంలో ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదని, ఆ స్థలంలో ఎవరెవరు ఉన్నారని సీజేఐ ప్రశ్నించారు. దీనికి తెలంగాణ తరపున వాదనలు వినిపిస్తున్న మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహద్గీ వాదనలు వినిపిస్తూ.. ఎన్‌కౌంటర్ జరిగిన తీరును ప్రతి సన్నివేశాన్ని వివరించారు. ఈ క్రమంలో నిందితులు పోలీసుల వద్ద తుపాకీలు లాక్కొని కాల్పులు జరిపారా? అని సీజేఐ ప్రశ్నించారు. దీనికి ముకుల్ రోహద్గీ సమాధానమిస్తూ.. వారు తుపాకీలు లాక్కొని పోలీసులపైకి కాల్పులు జరిపారని చెప్పారు. ఈ క్రమంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని, కానీ వారి బుల్లె్ట్లు పోలీసులకు తగలలేదని, తూటాలు గురి తప్పాయని చెప్పారు.
↧
December 11, 2019, 11:02 pm
![]()
ప్రముఖ యాంకర్ ఎక్కడికి వెళ్లినా.. ఆమెను సుడిగాలి సుధీర్ గురించే ఎక్కువగా అడుగుతుంటారు. సుధీర్, రష్మిల జంటకు ఫ్యాన్స్ మామూలుగా లేరు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని చాలా మంది ఆశపడుతున్నారు. కానీ వారిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. అయినా ఫ్యాన్స్, మీడియా ఊరుకోదు. తాజాగా రష్మికి ఓ యాంకర్ నుంచి సుడిగాలి సుధీర్‌కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.
‘రష్మి అని గూగుల్‌లో ఎక్కడ సెర్చ్ చేసినా వెంటనే ఆ తర్వాత కనిపించే పేరు సుడిగాలి సుధీర్. అదీకాకుండా చాలా షోలలో సుధీర్ ఎప్పుడూ ఒకే మాట చెప్తుంటాడు. నేను రష్మిని దాదాపు ఆరేళ్ల నుంచి ట్రై చేస్తున్నాను కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రావడంలేదు అన్నారు. మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌కు శుభం కార్డు పడేదెప్పుడు?’ అని అడిగారు. ఇందుకు రష్మి సమాధానం ఇస్తూ.. ‘అది మీరు షో చూస్తుంటే అర్థమవుతుంది. షోలు ఇంకా నడుస్తున్నప్పుడు అప్పుడే శుభం కార్డు ఎలా వేస్తామండి’ అన్నారు. అయినా ఆ యాంకర్‌కు సరైన సమాధానం దొరకలేదేమో. రష్మిని కాస్త రెచ్చగొట్టారు. ‘నేను చెప్పేది షోకు శుభం కార్డు పడాలని కాదండి. మీ ఇద్దరి గురించి వస్తున్న రూమర్స్‌కి. కనీసం ఇప్పుడైనా మీరు సమాధానం చెప్పాలనుకుంటున్నారా’ అని దబాయించారు.
ఇక రష్మికి ఒళ్లుమండినట్లుంది. తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ‘లేదండీ. ఇప్పుడు కూడా నేనేమీ ఆన్సర్ ఇవ్వాలనుకోవడం లేదు. షోలో మా ఇద్దరి గురించి ఓ ట్రాక్ నడుస్తున్నప్పుడు ప్రాబ్లమ్ ఏంటి. జనాలు కూడా ఎంజాయ్ చేస్తు్న్నారు. యూట్యూబ్, మీడియా ఛానెల్స్ నా బాబువి కావు. కాబట్టి నేనెందుకు ఫీలవ్వాలి. మా గురించి ఎవరో ఏదో రాసుకుంటుంటే మాకేంటి? పాపం వాళ్లు కూడా బతకాలి కదా. ఇప్పుడు నేను ఒక్కమాటలో సమాధానం ఇచ్చేస్తే వాళ్ల పొట్టలు కొట్టినదాన్ని అవుతాను. కాబట్టి నేను ఎందరికో అన్నం పెడుతున్నాను అనుకుంటాను’ అని ఆన్సర్ ఇచ్చారు.
↧
↧
December 11, 2019, 11:01 pm
![]()
మార్షల్స్ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. ఉదయం సభలోకి వస్తున్న సమయంలో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు మార్షల్స్‌తో వాగ్వాదం జరిగింది. ఈ గొడవ జరిగిన సమయంలో ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. దీంతో సభలో ఇరు పార్టీల సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రశ్నోత్తరాలు కాకుండా.. ఈ వ్యాఖ్యలపై చర్చ నడిచింది. టీడీపీ హయాంలో తనపట్ల మార్షల్స్ దురుసుగా ప్రవర్తించిన విషయాన్ని ప్రస్తావించారు.
మార్షల్స్ విషయంలో ఇప్పుడు చంద్రబాబు, టీడీపీ నేతలు మాటలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు రోజా. టీడీపీ హయాంలో మొదటిసారి ఎమ్మెల్యే అయిన తనను అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడనివ్వలేదన్నారు. కాల్ మనీ వ్యవహారాన్ని సభలో ప్రస్తావించామని.. తర్వాత తమను అసెంబ్లీ నుంచి మార్షల్స్‌తో బయటకు గెంటేశారని గుర్తు చేశారు. గత అసెంబ్లీలో వీడియోలను బయటపెడితే తమతో ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో అర్థమవుతుందన్నారు.
తనను నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారని.. టార్గెట్ చేసి మరీ కక్ష సాధించారని మండిపడ్డారు. కాల్‌మనీ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారని.. దీనిపై చర్చించాలని కోరితే చర్చించకుండా.. కామ సీఎం అన్నానని ఏడాది సస్పెండ్ చేశారని.. అప్పుడు కాల్‌మనీకి షార్ట్‌గా కామ అని పెట్టారని.. దానిని తాను అసెంబ్లీలో ప్రస్తావిస్తే అన్యాయంగా సస్పెండ్ చేశారన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్లినట్లు గుర్తు చేశారు.
సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా.. తనను అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకుండా మార్షల్స్ అడ్డుకున్నారని రోజా మండిపడ్డారు. జంతువు కంటే దారుణంగా తనను మార్షల్స్ ఈడ్చుకెళ్లారని గుర్తు చేశారు. తన పట్ల దారుణంగా ప్రవర్తించారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇప్పుడు అసెంబ్లీలో గట్టిగా అరుస్తున్నారని.. గట్టిగా అరిచినంతమాత్రాన గడ్డిపరక గర్జించలేదన్నారు.
టీడీపీ హయాంలో జరిగిన అసెంబ్లీ సమవేశాల్లో సభలో బోండా ఉమా అందరినీ పాతిపెడతానన్న వ్యాఖ్యల్ని రోజా గుర్తు చేశారు. అప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే వ్యతిరేకించడమే ఓ పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అసలు ప్రతిపక్ష నాయకుడా.. పనికిమాలిన నాయకుడా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా డైలాగ్ చెప్పినట్లుగా..150మంది రండీ ఒకేసారి సమాధానం చెప్తానని బాబు గొప్పలు చెబుతున్నారని.. వయస్సు మీద పడుతున్న కొద్దీ ఆయనకు చాదాస్తం పెరుగుతోందని ఎద్దేవా చేశారు.
↧
December 11, 2019, 11:23 pm
![]()
వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదట సంవత్సరంలో కరెంటు ఛార్జీలను పాక్షికంగా పెంచారు. అంటే ప్రజలందరికీ కాకుండా, కొన్ని రంగాలు, వర్గాలకు మాత్రమే పెంచారు. దీనివల్ల విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంలు) ఆదాయం.. వాటి నిర్వహణకు అవుతున్న వ్యయాల మధ్య తేడా వచ్చే ఏడాది నాటికి రూ.11 వేల కోట్లకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో పంపిణీ సంస్థలు ఇన్నాళ్లూ ప్రభుత్వ అండతో నెట్టుకొచ్చాయి. ఇక భారం మరీ పెరిగిపోవడంతో ఛార్జీలు పెంచడం అనివార్యమని డిస్కంలు భావిస్తున్నట్లు తెలిసింది. వారు నిర్వహించుకొనే సమీక్షలో ఛార్జీలు పెంచాల్సిందేనని చాలా రోజుల క్రితమే తీర్మానించుకున్నట్లు సమాచారం.
Also Read:
దీనికి సంబంధించిన ప్రతిపాదనలు విద్యుత్ పంపిణీ సంస్థలు ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే, వీటికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం లభించాల్సి ఉంది. సీఎం ఆమోదం లభిస్తే, సంబంధిత దస్త్రాలను విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించేందుకు డిస్కంలు సిద్ధమవుతున్నాయి. ఒకవేళ ఛార్జీల పెంపునకు కేసీఆర్ అంగీకరించకపోతే, పెంపు ప్రతిపాదనలు లేకుండానే నియంత్రణ మండలికి సాధారణ వార్షిక ఆదాయ అవసరాల నివేదికను సమర్పిస్తారు.
Also Read:
పంపిణీ సంస్థల ప్రతిపాదనలివీ..
ఒక యూనిట్ విద్యుత్‌ను సరఫరా చేసేందుకు పంపిణీ సంస్థలకు సరాసరిన రూ.6కు పైనే ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ శ్లాబుల ఆధారంగా ఛార్జీలు వేస్తుండడం వల్ల మరింత నష్టం వస్తోంది. అంటే, 50 యూనిట్లలోపు విద్యుత్ వాడేవారికి రూ.1.45కి, 51 నుంచి వందలోపు వాడే వారికి రూ.2.60కు విద్యుత్ ఇస్తున్నారు. దీనివల్ల పంపిణీ సంస్థలు నష్టపోతున్నాయి. 50 యూనిట్లలోపు విద్యుత్ వాడేవారికి విద్యుత్ ఛార్జీని 20 ఏళ్ల క్రితం నిర్ణయించారని, దీన్ని ఇంకా కొనసాగించడం వల్ల ఆర్థికంగా నష్టం వస్తోందని డిస్కంలు ప్రతిపాదించాయి. రాష్ట్రంలో దాదాపు 65 శాతం ఇళ్లలో 200 యూనిట్లలోపే కరెంటు వాడుతున్నారు. వీటికి తక్కువ ధరకు కరెంటు సరఫరా చేస్తుండడం వల్ల ఆర్థిక భారం అధికమవుతోంది.
Also Read:
↧
December 11, 2019, 11:19 pm
![]()
హైదరాబాద్ నగరంలో మరో ఘోర ఘటన జరిగింది. పదో తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసిన ఇద్దరు యువకుడు ఆమెపై అత్యాచారానికి యత్నించారు. అయితే పోలీసులు మిగతా ఫిర్యాదుల్లాగా దీన్ని వదిలేయకుండా వెంటనే స్పందించడంతో రెండు గంటల్లోనే నిందితులను పట్టుకుని బాలికను కాపాడగలిగారు.
Also Read:
హైదరాబాద్‌లోని రహ్మత్‌నగర్ సమీపంలో గల జవహర్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో స్టేషనరీ కొనుగోలు చేయడానికి షాప్‌కి వెళ్లింది. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న బాలికపై అదే ప్రాంతంలో హైదరాబాద్ బిర్యానీ హౌజ్ కిచెన్‌లో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన వరుసకు సోదరులైన అంజా (20), షంషాద్(22) కన్నేశారు. ఆమెను బలవంతంగా బైక్ ఎక్కించుకుని వెంకటగిరిలోకి తమ కజిన్ ఇంటికి తీసుకెళ్లారు.
Also Read:
బాలికను ఇంట్లో బంధించి అత్యాచారం చేయబోయారు. అయితే ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడి వదిలేశారు. ఆ కామాంధుల బారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరిన బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ బలవంతయ్య, ఎస్సై నవీన్‌రెడ్డి బాలికతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆమె చెప్పిన గుర్తుల ఆధారంగా వెంకటగిరిలోని గదిలో ఉన్న నిందితులు అంజా, షంషాద్‌లను అదుపులో తీసుకొన్నారు. నిందితులపై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, కిడ్నాప్ కేసులు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు సకాలంతో స్పందించి కామాంధులను అరెస్ట్ చేయడంపై బాలిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
Also Read:
↧
December 11, 2019, 11:36 pm
![]()
ఏపీ ముఖ్యమంత్రి జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్యకేసు విచారణలో సిట్ స్పీడ్ పెంచింది. అనుమానితులు, సాక్ష్యులతో పాటూ మరికొందర్ని విచారణకు పిలుస్తోంది. తాజాగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి అంశాలపై సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు.
వివేకా హత్యకేసులో భాగంగా తనను సిట్ అధికారులు విచారణకు పిలిచారని చెప్పారు. హత్య జరిగిన రోజు విజయవాడలో ఉన్నానని.. వివేకా హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తప్పు ఉన్నవారిని తప్పకుండా శిక్షించాల్సిందేనన్న ఆయన.. వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసని బాంబ్ పేల్చారు.
అప్పట్లో సీబీఐ కావాలని జగన్ హైకోర్టులో రిట్ వేశారని.. ఆయన సీఎం అయిన తర్వాత ఎందుకు సిట్ వేశారని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి అన్ని పార్టీలు సీబీఐ కావాలని కోరుతున్నాయన్నారు మాజీ మంత్రి. ఈ కేసులో తన ప్రమేయం ఉంటే ఎన్‌కౌంటర్ చేసుకోవచ్చని.. సీబీఐ విచారణ కావాలన్నదే తమ డిమాండ్ అన్నారు.
ఈ కేసుకు సంబంధించి గతవారం సిట్ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి డ్రైవర్ దస్తగిరి, ప్రకాష్‌లను ప్రశ్నించారు. ఇద్దరి నుంచి వివరాలు సేకరించారు. మరికొందరు అనుమానితులు, సాక్ష్యుల్ని కూడా విచారణకు పిలుస్తున్నారు. ఆదినారాయణరెడ్డితో పాటూ మరికొందర్ని కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. మరికొంతమందిని కూడా ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు.
ఎన్నికలకు ముందు మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది.. టీడీపీ-వైఎస్సార్‌సీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. జగన్ సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.. అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినా నిందితులు మాత్రం దొరకలేదు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్తగా సిట్‌ను ఏర్పాటు చేశారు.
↧
↧
December 11, 2019, 11:44 pm
![]()
ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా పనుల్లో బిజీగా ఉన్న తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రారంభించాడు. గతంలో తనతో సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమా చేయనున్నాడు బాలయ్య. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కి్ల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమా హీరో బాలకృష్ణ రెమ్యూనరేషన్ కంటే దర్శకుడు బోయపాటి శ్రీను రెమ్యూనరేషనే ఎక్కువట. ఈ సినిమా కోసం బాలయ్య దాదాపు 10 కోట్ల పారితోషికం అందుకుంటుండగా బోయపాటి మాత్రం 15 కోట్లు అందుకుంటున్నాడట.
Also Read:
బోయపాటి గత చిత్రం వినయ విదేయ రామ భారీ డిజాస్టర్ అయినప్పటికీ ఆయన రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గటం లేదు. కొద్ది రోజులుగా బోయపాటి తన రెమ్యూనరేషన్ సగానికి తగ్గించుకున్నట్టుగా ప్రచారం జరుగుతున్నా తాజా సమాచారం ప్రకారం అలాంటిదేమి లేదని తెలుస్తోంది.
బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీతో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. అయితే ప్రస్తుతం బాలయ్య, బోయపాటి ఇద్దరి కెరీర్ అంత ఆశాజనకంగా లేదు.
Also Read:
బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 2019లో బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో బాలయ్య తదుపరి చిత్రాలపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.
ఇక కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా పేరున్న బోయపాటి శ్రీను, వినయ విధేయ రామ సినిమాతో దారుణమైన రిజల్ట్‌ను చవిచూశాడు. ఈ సినిమా డిజాస్టర్ కావడమే కాదు బోయపాటి కెరీర్‌ను కూడా ఇబ్బందుల్లో పడేసింది. దీంతో బాలయ్య సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చేందుకు చూస్తున్నాడు బోయపాటి.
↧
December 12, 2019, 12:18 am
![]()
యువతి ప్రేమ పేరుతో లొంగదీసుకుని గర్భవతి అయ్యాకు పెళ్లికి మొహం చాటేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన యువకుడికి న్యాయస్థానం తగిన శిక్ష విధించింది. రూరల్ మండలం చెన్నూరు గ్రామానికి చెందిన చెమురు మురళికి పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.11వేల జరిమానా విధిస్తూ 8వ జిల్లా అదనపు సెషన్స్ కోర్టు జడ్జి సత్యనారాయణ బుధవారం తీర్పుచెప్పారు.
Also Read:
చెన్నూరు గ్రామానికి చెందిన మురళికి అదే గ్రామానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఆమె వెంట తిరిగి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించాడు. తన బంధువైన రత్నమ్మ ఇంటికి తీసుకెళ్లి ఆ యువతిపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే యువతి గర్భవతి కావడంతో ఆమె తల్లిదండ్రులకు విషయం తెలిసింది. తమ కూతురిని పెళ్లి చేసుకోవాలని వారు మురళిని పెళ్లిచేసుకోవాలని కోరగా నిరాకరించాడు.
Also Read:
దీంతో గ్రామంలో పంచాయతీ పెట్టగా పెద్దలు మురళిని పెళ్లికి ఒప్పించారు. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని మురళి 2011 జూన్ 6న యువతి ఇంటికి వెళ్లి అసభ్యంగా మాట్లాడుతూ గొడవపడ్డాడు. చుట్టుపక్కలవారు ఈ సంఘటన చూడటంతో మనస్తాపం చెందిన యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తల్లిదండ్రులు, స్థానికులు ఆమెను వెంటనే గూడూరు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
Also Read:
యువతి తండ్రి ఫిర్యాదు మేరకు గూడూరు రూరల్ పోలీసులు మురళితో పాటు నెల్లూరు రత్నమ్మలపై కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో మురళిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పదేళ్ల జైలుశిక్ష విధించారు. రత్నమ్మపై నేరం రుజువుకాకపోవడంతో ఆమెపై కేసును న్యాయమూర్తి కొట్టివేశారు.
Also Read:
↧
December 12, 2019, 12:20 am
![]()
ఏపీ అసెంబ్లీలో గురువారం ఆసక్తికర సీన్ కనిపించింది. నాలుగో రోజు సభకు వచ్చిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఎమ్మెల్యేల కూర్చునే మొదటి వరుసలో.. కొండపి ఎమ్మెల్యే బాల వీరాజనేయ స్వామి పక్క సీట్లో వంశీ కూర్చున్నారు. మీడియాపై ఆంక్షలు, 2430 జీవోపై సభలో చర్చ జరుగుతున్న సమయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ కనిపించారు.
వైఎస్సార్‌సీపీ-టీడీపీ మధ్యలో మాటల యుద్ధం జరుగుతున్న సమయంలో.. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వంశీ కొన్ని స్లిప్స్ రాసి పంపించారట. ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు వల్లభనేని ఈ స్లిప్స్ పంపారు. వంశీ ఎమ్మెల్యేలకు పంపిన స్లిప్పులో ఏం రాసి ఉందన్నది ఆసక్తికరంగా మారింది. అందులో టీడీపీని ఇరుకున పెట్టే అంశాలనే అందులో ప్రస్తావించి ఉండొచ్చనే చర్చ నడుస్తోంది.
రెండు రోజుల క్రితంవల్లభనేని తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని కోరిన సంగతి తెలిసిందే. టీడీపీ నుంచి తనను సస్పెండ్ చేశారని.. తాను గన్నవరం నియోజకవర్గ ప్రజల సమస్యల్ని వినిపించేందుకు సభలో కొనసాగాలనుకుంటున్నానని.. తనకు వేరేగా సీట కేటాయించాలని కోరారు. దీనిపై పరిశీలన చేసిన స్పీకర్.. ఎక్కడైనా కూర్చోవచ్చని చెప్పారు. అయితే వంశీ సభలో గురువారం వ్యవహరించిన తీరు ఆసక్తికరంగా మారింది.
↧
December 12, 2019, 12:25 am
![]()
తెలుగు తెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణం పోసిన గొల్లపూడి మారుతీరావు గురువారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మారుతి రావుకు ముగ్గురు సంతానం. ఆయన కుమారుడు శ్రీనివాస్ దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. అయితే షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో శ్రీనివాస్ మరణించారు. తనయుడి జ్ఞాపకార్థం ఉత్తమ దర్శకులకు జాతీయ అవార్డును అందజేస్తూ వస్తున్నారు గొల్లపూడి.
1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన గొల్లపూడి చిన్నతనం నుంచే కళారంగంవైపు అడుగులు వేశారు. కాలేజీ రోజుల్లోనే నవలలు, నాటకాలు రాసి మంచి పేరు తెచ్చుకున్నారు. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు గొల్లపూడి. సినిమాల్లోకి రాకముందు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో రేడియో ప్రయోక్తగా , జర్నలిస్ట్‌గా కొంతకాలం పనిచేశారు.
దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించిన గొల్లపూడి ఆరు నంది అవార్డులు అందుకున్నారు. యముడికి మొగుడు, ప్రేమ, మనిషికో చరిత్ర, స్వాతి ముత్యం, చాలెంజ్, ఆళయశిఖరం, త్రిశూలం, శుభలేఖ, ఆదిత్య 369, కంచె, సైజ్ జీరో, మనమంతా, జోడీ లాంటి ఎన్నో సినిమాల్లో నటించారు. టెలివిజన్ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన గొల్లపూడి పలు టీవీ సీరియల్స్‌లో నటించారు. 1996లో ఉత్తమ టెలివిజన్ నటుడిగానూ నంది అవార్డు అందుకున్నారు. గొల్లపూడి మృతితో ఇండస్ట్రీ మరో పెద్ద దిక్కును కోల్పోయినట్లయ్యింది. ఆయన మృతి పట్ల యావత్ సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు గొల్లపూడి మారుతీరావు మృతికి సంతాపం తెలియజేశారు.
↧
↧
December 12, 2019, 1:16 am
![]()
గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, వాటిని అమలు చేయలేదని కాంగ్రెస్ విమర్శించారు. ఆ హామీల్లో ముఖ్యమైన రైతు రుణమాఫీని ఇప్పటి వరకు చేయలేదని ధ్వజమెత్తారు. మరోవైపు రైతుబంధు సొమ్ము ఇప్పటిదాకా ఇంకా 60 శాతం రైతులకు రాలేదని విమర్శించారు. నిరుద్యోగులకు నెలకు రూ.3,016 భృతి ఇస్తామని కేసీఆర్ అన్నారని, ఇప్పుడు దాని గురించి మాట్లాడడమే లేదని విమర్శించారు.
Also Read:
కేసీఆర్ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి, పాలన ఏడాది పూర్తి చేసుకున్నందుకు జగ్గారెడ్డి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంగా ఉండి మంచి పాలన అందిస్తారని తాను ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఓవైపు ముఖ్యమంత్రిని అభినందిస్తూనే మరోవైపు, ఆయన పాలన పట్ల జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. ‘‘హామీల్లో భాగంగా రాష్ట్రంలో అవినీతి ఉండదన్నారు. ప్రస్తుతం తెలంగాణ అవినీతి రహిత రాష్ట్రంగా ఉందా మరి?’’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
Also Read:
రాష్ట్రంలో 12 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసివేయాల్సిన దుస్థితి ఎందుకొచ్చిందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. అక్షరాస్యత విషయంలో తెలంగాణ దేశంలో అట్టడుగు స్థానంలో ఉండడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. పేద వారికి ఉచిత వైద్య చికిత్స ప్రసాదించే సంక్షేమ పథకం.. ఆరోగ్య శ్రీ సేవలు రాష్ట్రంలో నిలిచిపోయిన పరిస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు. హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ మారిందని అన్నారు. నేరాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని చెప్పారు. ప్రభుత్వ కళాశాలలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క సొంత భవనం కూడా కట్టలేదని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధులే లేవని, ఇలా అయితే అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం వల్ల పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
Also Read:
↧
December 12, 2019, 1:37 am
![]()
పూణే ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా పీజీ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హత ఉన్నవారు డిసెంబరు 16 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Read Also: పోస్టుల వివరాలు..
* స్పెషలిస్ట్ ఆఫీసర్స్* మొత్తం ఖాళీల సంఖ్య: 50
Read Also:
పోస్టుల వారీగా ఖాళీలు..
పోస్టులు |
ఖాళీలు |
నెట్‌వర్క్ & సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ |
11 |
డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ (యూనిక్స్) |
07 |
ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజినీర్ |
07 |
ఈమెయిల్ అడ్మినిస్ట్రేటర్ |
02 |
బిజినెస్ అనలిస్ట్ |
05 |
మొత్తం ఖాళీలు |
50 |
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత, అనుభవం.
వయోపరిమితి: 31.03.2019 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో
సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.118 (ఇంటిమేషన్ చార్జీలు), ఇతరులకు రూ.1180. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
Read Also:
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం |
16.12.2019. |
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది |
31.12.2019. |
రాతపరీక్ష తేదీ |
వెల్లడించాల్సి ఉంది. |
గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ తేదీ |
వెల్లడించాల్సి ఉంది. |
Read More . . .
➦
➦
↧
December 12, 2019, 1:17 am
![]()
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మహిళా మంత్రులు, వైఎస్సార్‌సీపీ మహిళా ఎమ్మెల్యేలు కలిశారు. గురువారం సచివాలయంలోని చాంబర్‌కు వెళ్లి.. సీఎంకు రాఖీలు కట్టారు. మహిళల భద్రత కోసం ఏపీ దిశ యాక్ట్ పేరిట చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. మహిళల భద్రత, రక్షణ, చిన్న పిల్లల లైంగిక వేధింపులను దృష్టిలో ఉంచుకుని సీఎం చేసిన దిశ చట్టాన్ని చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. జగన్‌ను కలిసిన వారిలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత, ఏపీఐఐసీ చైర్మన్ రోజాతో పాటు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు.
గురువారం మహిళల భద్రతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా చట్ట సవరణ బిల్లు-2019కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే.. మహిళలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణ శిక్ష పడుతుంది. కేసుకు సంబంధించి పక్కా ఆధారాలు ఉంటే.. అత్యాచార కేసుల దర్యాప్తును వారం రోజుల్లో పూర్తి చేయడంతోపాటు.. 14 రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేస్తారు. 21 రోజుల్లోనే శిక్షలు ఖరారవుతాయి.. మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణ కోసం జిల్లాకు ఓ కోర్టు చొప్పున ఏర్పాటు చేయనున్నారు. మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలను మాత్రమే ఈ కోర్టుల్లో విచారణ జరుగుతాయి.
మహిళలు, చిన్నారులను కించపరుస్తూ.. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటారు. మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్లు, రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధిస్తారు. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం గరిష్టంగా ఐదేళ్ల శిక్ష మాత్రమే పడుతుంది. కాగా.. నేరాల్లో తీవ్రతను బట్టి వారికి గరిష్టంగా జీవిత ఖైదు విధించేలా చట్టం తీసుకురాబోతున్నారు.
↧
December 12, 2019, 12:57 am
రాజకీయాల్లో అయినా, మీడియాలో అయినా, సినిమాల్లో అయినా ప్రజలకు కావాల్సింది కేవలం ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే అనే నీతిని ఈ సినిమా ద్వారా చెప్పారు.
↧
↧
December 12, 2019, 2:00 am
![]()
ప్రియురాలిని అత్యంత కిరాతకంగా చంపి శరీరాన్ని ముక్కలుగా చేసిన కేసులో ఢిల్లీకి చెందిన ప్రముఖ ఫిట్‌నెస్ నిపుణుడు హేమంత్ లంబా అరెస్ట్ అయ్యాడు. ఎవరి కంటా పడకుండా తప్పించుకుని తిరుగుతున్న ఆయన్ని బుధవారం గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. హేమంత్ ప్రియురాలితో పాటు ఓ క్యాబ్ డ్రైవర్‌ను కూడా తుపాకీతో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.
Also Read:
హేమంత్ లంబా అనే యువకుడు ఢిల్లీలో అత్యున్నత ప్రమాణాలతో ఓ జిమ్‌ను నడిపిస్తున్నాడు. అతడికి కొంతకాలం క్రితం రాజస్థాన్‌కు చెందిన యువతి(22)తో పరిచయం ఏర్పడింది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని బంధువుల ఇంట్లో తండ్రితో కలిసి ఉంటున్న ఆ యువతి హేమంత్‌తో ప్రేమలో పడిపోయింది. ఈ క్రమంలోనే ఈ నెల 7వ తేదీన హేమంత్ తన ప్రియురాలితో హర్యానాలోని రివారి ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో తెలీదు గాని. అతడు తుపాకీతో ప్రియురాలి తలపై నాలుగు బుల్లెట్లు దించి ఆమెను దారుణంగా చంపేశాడు. ఎవరూ గుర్తుపట్టకుండా శవాన్ని ముక్కలుగా చేసి నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు.
Also Read:
తర్వాత అక్కడి నుంచి పారిపోయేందుకు ఓ క్యాబ్ బుక్ చేసుకుని జైపూర్ వెళ్లాల్సిందిగా డ్రైవర్‌కు చెప్పాడు. అయితే హేమంత్‌పై అనుమానం వచ్చిన డ్రైవర్ అతడిని కారు ఎక్కించుకునేందుకు నిరాకరించాడు. దీంతో నిందితుడు డ్రైవర్‌ను కూడా తుపాకీతో కాల్చి చంపేశాడు. అనంతరం అదే కారులో గుజరాత్‌లోని వల్సాద్ ప్రాంతానికి పరారయ్యాడు. అక్కడ కారు అమ్మేందుకు ఓ డీలర్‌ను సంప్రదించాడు. హేమంత్ ఏం అడిగినా కంగారు పడుతూ సమాధానాలు చెబుతుండటంతో డీలర్‌కు అనుమానమొచ్చి కారుపై ఉన్న మొబైల్ నంబర్‌కు ఫోన్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన డ్రైవర్ భార్య తన భర్త కనిపించడం లేదని అతడికి చెప్పింది.
Also Read:
దీంతో తన అనుమానం నిజమేనని నిర్ధారించుకున్న కార్ డీలర్ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని హేమంత్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం చెప్పాడు. దీంతో పోలీసులు అతడిని రివారి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read:
↧
December 12, 2019, 2:11 am
![]()
రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. పవన్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకపోయినా.. పింక్ రీమేక్‌తో పవన్ రీ ఎంట్రీ ఇస్తున్నారన్న టాక్ టాలీవుడ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది.
అయితే గురువారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను బోనీకపూర్‌తో కలిసి దిల్ రాజునిర్మిస్తున్నాడు. ఈ సినిమాను వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ రోజు ఈ సినిమా ఎస్వీసీ ఆఫీస్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.
Also Read:
అయితే ఈ రోజు పవన్ కళ్యాన్ కాకినాడలో రైతు సౌభాగ్య దీక్షలో పాల్గొంటున్నాడు. దీంతో పవన్ లేకుండానే సినిమాను ప్రారంభించారు చిత్రయూనిట్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సినిమా కోసం పవన్ కేవలం 20 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగా షెడ్యూల్ ప్లాన్ చేసిన చిత్రయూనిట్ ఫిబ్రవరిలో పవన్ సీన్స్‌ను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అమితాబ్ బచ్చన్, తాప్సీ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన పింక్ సినిమాను తమిళ్‌లో అజిత్ శ్రద్ధా శ్రీనాథ్‌లు లీడ్ రోల్స్‌లో రీమేక్ చేశారు. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ లీడ్ రోల్‌లో రీమేక్ చేస్తుండగా తాప్సీ, శ్రద్ధా పోషించిన పాత్రలో నివేదా థామస్ నటించనుందని తెలుస్తోంది.
Also Read:
↧
December 12, 2019, 2:23 am
![]()
డిసెంబర్ 6న తన టారిఫ్ ప్లాన్లను పెంచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత క్రమంగా తన ప్లాన్లకు మార్పులు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే రూ.98, రూ.149 ప్లాన్లకు కూడా మార్పులు చేసింది. అయితే ఈ సారి ప్లాన్లకు సంబంధించిన లాభాలను తగ్గించకుండా పెంచింది.
Also Read:
ఇప్పుడు మీరు రూ.98 ద్వారా రీచార్జ్ చేసుకుంటే 2 జీబీ డేటా లభిస్తుంది. జియో నుంచి జియోకు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 300 ఉచిత ఎస్ఎంఎస్ లు అందించనున్నారు. వేరే నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవాలంటే ఐయూసీ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. పై లాభాలతో పాటు జియో యాప్స్ కు కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ ద్వారా రీచార్జ్ చేసుకోవాలంటే మీరు జియో వెబ్ సైట్ లేదా మై జియో యాప్ లో Affordable plans పేజీలోకి వెళ్లాలి.
Also Read:
అదే రూ.149 ప్లాన్ ద్వారా రీచార్జ్ చేసుకున్నట్లయితే.. మీకు రోజుకు 1 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్ లు కూడా అందిస్తారు. జియో నుంచి జియోకు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వేరే నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 300 ఉచిత నిమిషాలను అందిస్తారు. ఆ తర్వాత ఐయూసీ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు జియో యాప్స్ కు కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజులు మాత్రమే. ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకోవాలంటే జియో వెబ్ సైట్ లేదా మై జియో యాప్ లో 1 GB/Day పేజీలోకి వెళ్లాలి.
Also Read:
జియో మెల్లమెల్లగా తన ప్లాన్లన్నిటికీ మార్పులు చేసుకుంటూ వస్తుంది. గత వారంలోనే జియో తన ప్లాన్లను 40 శాతం వరకు పెంచింది. ఈ రూ.149 ప్లాన్ అయితే నెలరోజుల వ్యవధిలోనే ఏకంగా రెండు సార్లు మార్పులకు లోనైంది. కేవలం జియోనే కాకుండా ఎయిర్ టెల్, వొడాఫోన్ లు కూడా డిసెంబర్ 3 నుంచి పెంచిన రీచార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. మూడేళ్ల క్రితం జియో మార్కెట్లోకి వచ్చినప్పుడు ఆకాశంలో ఉన్న ప్లాన్ల ధరలు ఒక్కసారి అందుబాటులోకి దిగి వచ్చాయి. ఇప్పుడు మళ్లీ టెలికాం చార్జీలు ఆ స్థాయికి వెళతాయేమో అనిపిస్తుంది.
↧