Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all 85909 articles
Browse latest View live

గొల్లపూడి మృతిపై సీఎం జగన్ సంతాపం

$
0
0
ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొల్లపూడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. సినిమాల్లో తనదైన శైలితో వినూత్నమైన డైలాగ్‌ డెలివరీతో, రచనల్లో, నాటకాల్లో ఆకట్టుకున్నారని.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గొల్లపూడి సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో గర్వించదగిన స్థానాన్ని సంపాదించారన్నారు. గొల్లపూడి మారుతీరావు గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మారుతి రావుకు ముగ్గురు కుమారులు. ఆయన కుమారుడు శ్రీనివాస్‌ దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. అయితే షూటింగ్‌ సమయంలో జరిగిన ప్రమాదంలో శ్రీనివాస్‌ మరణించారు. తరువాత ఆ సినిమాను గొల్లపూడి స్వీయ దర్శకత్వంలో పూర్తి చేశారు. తనయుడి జ్ఞాపకార్థం ఉత్తమ దర్శకులకు జాతీయ అవార్డును అందజేస్తూ వస్తున్నారు గొల్లపూడి. మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు. చిన్నతనంలో కళారంగంవైపు అడుగులు వేసిన ఆయన.. కాలేజీ రోజుల్లోనే నవలలు, నాటకాలు రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. సినిమాల్లోకి రాకముందు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో రేడియో ప్రయోక్తగా, జర్నలిస్ట్‌గా కొంతకాలం పనిచేశారు. 250కి పైగా సినిమాల్లో నటించిన గొల్లపూడి ఆరు నంది అవార్డులు అందుకున్నారు.

రహస్యంగా రెండోపెళ్లి చేసుకున్న భర్త.. కారణం విని షాకైన మొదటి భార్య

$
0
0
కట్నం కోసం రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా.. మొదటి భార్యను అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌లోని కతిహార్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ముఖేశ్ షా అనే వ్యక్తికి 2012లో ఓ యువతితో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. పెళ్లి సమయంలో ముఖశ్ కుటుంబం రూ.5లక్షలు డిమాండ్ చేయగా.. వధువు తరఫువారు రూ.3లక్షలు మాత్రమే కట్నంగా ఇచ్చారు. Also Read: దీంతో పెళ్లయినప్పటి నుంచి ముఖేశ్ అదనపు కట్నం కోసం భార్యను వేధించేశాడు. ఇటీవల అతడు సరిగ్గా ఇంటికి రాకపోవడంతో పాటు ప్రవర్తనలోనూ తేడా కనిపించడంతో భార్య నిఘా పెట్టగా షాకింగ్ విషయం తెలిసింది. కొంతకాలం క్రితమే రెండో పెళ్లి చేసుకున్న అతడు మరోచోట కాపురం పెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో తన జీవితాన్ని ఎందుకు నాశనం చేశావంటూ ఆమె భర్తను నిలదీసింది. అయితే దీనికి అతడు చెప్పిన కారణంతో మరోసారి షాకైంది. Also Read: పెళ్లి సమయంలో తనకు రూ.2లక్షలు తక్కువగా కట్నం ఇచ్చారని, ఆ డబ్బు కోసమే మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. దీంతో బాధితురాలు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్తపై మోసం, వరకట్న వేధింపుల కింద కేసు పెట్టింది. అదనపు కట్నం తెస్తేనే ఇంట్లో అడుగుపెట్టాలని అత్తమామలు సైతం వేధిస్తున్నారని పోలీసులకు చెప్పింది. Also Read:

టాలీవుడ్ పోల్: 2019 ఉత్తమ నటి ఎవరు? మీ ఓటు ఎవరికి?

$
0
0
టాలీవుడ్ పోల్: 2019 ఉత్తమ చిత్రం ఏది?.. మీ ఓటు ఏ సినిమాకి?

ట్విట్టర్‌లోకి పాంటింగ్ ఎంట్రీ.. ఫస్ట్ పోస్ట్ ఇదే

$
0
0
ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కొన్ని రోజులు కామెంటేటర్‌గా పనిచేసిన పాంటింగ్.. మధ్య మధ్యలో కొన్ని జట్లకి కోచ్‌గానూ వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్‌ 2019 సీజన్‌కి ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌గా పనిచేసిన పాంటింగ్ వచ్చే ఏడాది కూడా అదే బాధ్యతల్లో కొనసాగనున్నాడు. 2003, 2007లో ఆస్ట్రేలియాకి వరల్డ్‌కప్ అందించిన ఈ దిగ్గజ కెప్టెన్ 2012లో రిటైర్మెంట్ తీసుకున్నాడు. Read More: సోషల్ మీడియాకి దూరంగా ఉంటే రిక్కీ పాంటింగ్ తాజాగా ట్విట్టర్ అకౌంట్‌ని తెరిచాడు. అందులో తొలి పోస్ట్‌ చిరకాలం గుర్తుండిపోయేలా కొడుక్కి ఫస్ట్ ప్రాక్టీస్ కోసం బ్యాట్ ఇస్తున్న ఫొటోల్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫొటోకి ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుండగా.. అతని ఫాలోయర్ల సంఖ్య ఇప్పటికే 28 వేలకి చేరుకుంది. Read More: ఆస్ట్రేలియా జట్టులోకి 1995లో అరంగేట్రం చేసిన రిక్కీ పాంటింగ్ అనతికాలంలోనే అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌గా ఎదిగాడు. తన నిలకడతో జట్టుకి విజయాల్ని అందించడమే కాకుండా.. కెప్టెన్‌గానూ విదేశీ గడ్డపై ఆస్ట్రేలియాని తిరుగులేని జట్టుగా నిలిపాడు. ఈ క్రమంలో 168 టెస్టులు, 375 వన్డేలు, 17 టీ20లు ఆడిన పాంటింగ్.. మొత్తం 71 సెంచరీలు నమోదు చేశాడు. Read More:

బ్యాంక్ షేర్ల ర్యాలీ.. దుమ్మురేపిన మార్కెట్..!

$
0
0
దేశీ స్టాక్ మార్కెట్ లాభాల ట్రెండ్ కొనసాగుతోంది. బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా రెండో రోజు కూడా దూసుకెళ్లాయి. బ్యాంక్, ఆటో, మెటల్ షేర్ల దన్నుతో గురువారం మార్కెట్‌ లాభాల్లోనే క్లోజయ్యింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వపు దివాలా చట్టం (ఐబీసీ) సవరణలు ఇన్వెస్టర్లను మెప్పించాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 300 పాయింట్ల మేర పరుగులు పెట్టింది. నిఫ్టీ కూడా 12,000 పాయింట్ల స్థాయిని మళ్లీ అందుకుంది. అయితే సూచీలు చివరి వరకు ఇదే జోరు కొనసాగించలేకపోయాయి. సెన్సెక్స్ 169 పాయింట్ల లాభంతో 40,582 పాయింట్ల వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 11,972 వద్ద క్లోజయ్యాయి. Also Read: Stock Market Highlights.. ✺ నిఫ్టీ 50లో టాటా మోటార్స్, యస్ బ్యాంక్, వేదాంత, టాటా స్టీల్, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్ దాదాపు 7 శాతం పెరిగింది. ✺ అదేసమయంలో ఇన్ఫోసిస్, టీసీఎస్, ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టపోయాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు 2 శాతం పడిపోయాయి. Also Read: ✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. ఒక్క నిఫ్టీ ఐటీ మినహా ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1 శాతానికి పైగా పడిపోయింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ మెటల్ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా పెరిగాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. Also Read: ✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.88 శాతం పెరుగుదలతో 64.30 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.56 శాతం పెరుగుదలతో 59.11 డాలర్లకు ఎగసింది. ✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి దాదాపు ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. 4 పైసలు లాభంతో 70.79 వద్ద కదలాడుతోంది. Also Read:

నదిలో వయాగ్రా.. ఆ నీళ్లు తాగి గొర్రెలు నిర్విరామ సెక్స్! వాస్తవం ఏమిటంటే..

$
0
0
యాగ్రా.. ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనేందుకు పురుషులు వాడే ఔషదం ఇది. ఐర్లాండ్‌లోని ఫిజర్ అనే ఫార్మా కంపెనీ ఇటీవల సుమారు 750 టన్నుల శుద్ధి చేయని వయాగ్రాను నదిలో కలిపేసిందట. ఆ నీటిని తాగిన సుమారు 80 వేల గొర్రెలు తాపంతో తహతహలాడాయట. వాటిని అదుపు చేయడం గొర్రెల కాపర్లకు సాధ్యం కాలేదట. కొన్ని గొర్రెలైతే నిర్విరామంగా సెక్స్ చేస్తూనే ఉన్నాయట. Also Read: ఈ సమాచారం ‘ఇండో-ఏసియా న్యూస్ సర్వీస్’ అనే వార్తా ఏజెన్సీ ద్వారా వ్యాపించింది. అది వైరల్ కావడంతో అంతర్జాతీయ మీడియాతోపాటు ఇండియాలోని పలు ప్రముఖ న్యూస్ వెబ్‌సైట్లు సైతం ఈ వార్తను ప్రచురించాయి. అయితే, గొర్రెలు.. వయాగ్రా కలిసిన నదిలో నీళ్లు తాగడం వాస్తవం కాదని, అది ఓ వ్యంగ్య వార్త మాత్రమేనని తేలింది. వాస్తవానికి ఈ కథనాన్ని ‘వరల్డ్ న్యూస్ డైలీ రిపోర్ట్-WDNR’ అనే వార్తా సంస్థ రాసింది. అయితే, ఈ వార్త కల్పితమని స్పష్టం చేసింది. అయితే, ఏజెన్సీ ద్వారా ఈ వార్త వ్యాపించడం వల్ల ప్రముఖ వార్తా సంస్థలు ఈ విషయాన్ని గుర్తించి ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇది ఫేక్ వార్త అని తెలిసిన తర్వాత వెంటనే దాన్ని ఆయా వెబ్‌సైట్ల నుంచి డిలీట్ చేశారు. ఈ వార్త ప్రస్తుతం తెలుగు వెబ్‌సైట్లలో కూడా వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. Also Read:

నిర్భయ దోషుల్లో మృత్యుభయం.. నిద్ర కరువు, అన్నపానీయాలకు దూరం!

$
0
0
నిర్భయ హత్యాచార ఘటన జరిగి ఏడేళ్లు గడిచినా.. దోషులకు ఇప్పటి వరకూ శిక్ష పడలేదు. వీరి క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద ఉంది. ఈ పిటిషన్‌పై రాష్ట్రపతి ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ.. వీరి క్షమాభిక్ష రద్దయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. వీరిని ఉరితీయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీంతో నిర్భయ దోషుల్లో ప్రాణభయం కనిపిస్తోంది. తమ చావు కళ్ల ముందు కదలాడుతున్న వేళ.. నిర్భయ దోషులకు నిద్ర కరువైంది. వారు అన్నపానీయాలను ముట్టడం లేదని సమాచారం. దోషులు అక్షయ్, ముకేశ్, వినయ్, పవన్‌.. అర్ధరాత్రి వరకు తమ తమ జైలు గదుల్లోనే నిద్ర మానేసి అటూ ఇటూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జైలు అధికారులు ఇచ్చిన ఆహారాన్ని వారు సరిగా తినడం లేదు. వీరి ఉరిశిక్ష అమలు గురించి అధికారికంగా ఎలాంటి ఆదేశాలు అందలేదు. కానీ తిహార్ జైల్లో ఇప్పటికే ఉరి తీయడానికి అవసరమైన పనులు జరిగిపోతున్నాయి. నిర్భయ దోషులను డిసెంబర్ 16న లేదా డిసెంబర్ 29న (నిర్భయ చనిపోయిన రోజు) ఉరి తీస్తారని ప్రచారం జరుగుతోంది. నిర్భయ దోషులను ఉరితీయడానికి బక్సార్ జైలు నుంచి ఉరి తాళ్లను తీసుకొస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై అధికారి మాట్లాడుతూ.. తమ దగ్గర ఇప్పటికే ఐదు తాళ్లు ఉన్నాయన్నారు. కానీ తాము బక్సార్ అధికార యంత్రాగాన్ని సంప్రదిస్తున్నామని తెలిపారు. 11 ప్రత్యేక ఉరితాళ్లను తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలో తాము ఆర్డర్ ఇస్తామన్నారు. నలుగురు నిర్భయ దోషులను ఉరి తీస్తే.. తీహార్ జైల్లో ఇక ఒక తాడు మాత్రమే ఉంటుంది. వీరిని ఉరి తీయడానికి ముందు ఒకట్రెండు తాళ్లతో ట్రయల్స్ వేసే అవకాశం ఉంది. ఉరి తాళ్లను పుణేలోని యెరవాడ జైల్లోనూ తయారు చేస్తారు. ఉరి తాళ్ల కోసం తిహార్ జైలు అధికారులు యెరవాడ జైలును కూడా సంప్రదించే అవకాశం ఉంది.

రాష్ట్రంలో మూత పడనున్న ‘మీ-సేవ’ కేంద్రాలు

$
0
0
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ‘మీ-సేవ’ కేంద్రాలు పని చేయవు. మూడు రోజుల పాటు ఈ అంతరాయం ఉండనుంది. ఈ విషయాన్ని నిజామాబాద్‌ జిల్లా ఈడీఎం కార్తీక్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘మీ-సేవా’ డేటా బేస్‌ కార్యకలాపాలను మెరుగుపరుస్తున్నందుకు ఈ అంతరాయం తలెత్తుతున్నట్లు ఆయన ప్రకటనలో వెల్లడించారు. డేటా బేస్ సేవలు మరింత అభివృద్ధి చేసేందుకు మూడు రోజుల సమయం పడుతుందని, దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాలను మూసి ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు అన్ని కార్యాలయాలకు ముందస్తు సమాచారం పంపినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మీ-సేవ నిర్వహకులు కూడా ముందుగానే ఈ అంతరాయం గురించి ప్రజలకు వివరించాలని వారు సూచించారు. Also Read: కేవలం నిజామాబాద్ జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంతరాయం ఉంటుందని వివరించారు. ఈ నెల 13న రాత్రి ఏడు గంటల నుంచి డిసెంబర్‌ 16న ఉదయం వరకూ మీ సేవ కార్యాలయాలు మూసి ఉంటాయని తెలుస్తోంది. మళ్లీ డిసెంబర్‌ 16 ఉదయం 8 గంటల నుంచి మీ సేవ కేంద్రాల సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని కార్తీక్ వివరించారు. ఈ విరామానికి ప్రజలు సహకరించాలని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. Also Read: రెండు తెలుగు రాష్ట్రాల్లో మీ-సేవ కార్యాలయాలు ప్రజా సేవలో ప్రధాన పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. చాలా రకాల ధ్రువీకరణ పత్రాలు మొదలు, బిల్లుల చెల్లింపు వంటి ఎన్నో సేవలు మీ-సేవ ద్వారా పొందవచ్చు. విద్యార్థులు, యువత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం, కరెంటు బిల్లుల చెల్లింపులు, దాదాపు అన్ని రకాల ప్రభుత్వ సేవలకు మీ-సేవ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. నిత్యం లక్షలాది మంది ప్రజలు మీ సేవ ఎన్నో ప్రభుత్వ సేవలను నేరుగా పొందుతున్నారు. మూడు రోజుల పాటు మీ సేవ కార్యాలయాలు పని చేయకపోతే, రాష్ట్ర వ్యాప్తంగా దీని కేంద్రంగా సేవలు పొందాలనుకొనే వారికి తిప్పలు తప్పేలా లేవు. Also Read:

ఏడేళ్ల బాలికను రేప్ చేసి చంపేసి.. సిమెంట్ డ్రమ్ములో వేసి

$
0
0
మహారాష్ట్రలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు ఆమెను కిరాతకంగా చంపేసి స్నేహితుడి సాయంతో సిమెంట్ కాంక్రీట్‌లో వేసి ఖననం చేసేశాడు. వింటుంటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన మహారాష్ట్రలోని ఉత్తాన్ జిల్లాలో వెలుగుచూసింది. Also Read: ఉత్తాన్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు అపహరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో గొంతు నులిచి చంపేశాడు. బాలిక శవం దొరక్కుండా ఉండేందుకు తన స్నేహితుడిని సాయం కోరాడు. Also Read: వారిద్దరు కలిసి బాలిక శవాన్ని ఓ భవన నిర్మాణ ప్రాంతానికి తీసుకెళ్లి ప్లాస్టిక్ డ్రమ్ములో వేశారు. సిమెంట్ కాంక్రీట్‌తో ఆ డ్రమ్మును నింపి ఓ నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు బాలిక శవాన్ని గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చివరికి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:

అయోధ్య తీర్పు.. రాద్ధాంతాలకు ఫుల్ స్టాప్, రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీం

$
0
0
అయోధ్య తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన అన్ని రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది. నవంబర్ 9న సుప్రీం కోర్టు అయోధ్య కేసులో సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి వీలుగా రామ్ లల్లాకు కేటాయించాలని సుప్రీం తీర్పు ఇచ్చింది. మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయోధ్య తీర్పును సమీక్షించాలంటూ.. డిసెంబర్ 2న సుప్రీంలో తొలి రివ్యూ పిటిషన్ దాఖలైంది. జమయత్ ఉలామా ఇ హింద్ ఉత్తరప్రదేశ్ విభాగం అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 6న మరో ఆరు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 9న రెండు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 9న అఖిల భారత్ హిందూ మహాసభ, మరో 40 మంది వ్యక్తులు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అయోధ్య తీర్పును సమీక్షించాలని వీరంతా కోరారు. బాబ్రీ మసీదు పునఃనిర్మాణానికి ఆదేశిస్తేనే పూర్తి న్యాయం జరుగుతుందని పిటిషనర్ మౌలానా సయ్యద్ అషాద్ రషీద్ న్యాయస్థానానికి తెలిపారు. అయోధ్యపై ఇచ్చిన తీర్పుపై మధ్యంతర స్టే ఇవ్వాలన్నారు. అయోధ్య తీర్పుపై అఖిల భారత హిందూ మహాసభ పరిమిత రివ్యూను కోరింది. అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించడాన్ని హిందూ మహాసభ ఖండించింది.

IBPS SO Exam: స్పెషలిస్ట్ ఆఫీసర్స్ హాల్‌టికెట్లు విడుదల

$
0
0
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను (అడ్మిట్ కార్డు) గురువారం (డిసెంబరు 12) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ లేదా రూల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినరోజు వివరాలు అవసరమవుతాయి. డిసెంబరు 29 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. షెడ్యూలు ప్రకారం డిసెంబరు 28, 29 తేదీల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించినవారికి జనవరి 25న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి మొదటి లేదా రెండో వారంలో మెయిన్స్ పరీక్ష హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచుతారు. తదనంతరం మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. తుది ఎంపిక ఫలితాలను ఏప్రిల్‌లో వెల్లడించనున్నారు. పోస్టుల వివరాలు.. స్పెషలిస్ట్ ఆఫీసర్స్: 1163 పోస్టులు
పోస్టు ఖాళీలు
ఐటీ ఆఫీసర్ (స్కేల్-1) 76
అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-1) 670
రాజ్‌బాషా అధికారి (స్కేల్-1) 27
లా ఆఫీసర్ (స్కేల్-1) 60
హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1) 20
మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్-1) 310
మొత్తం ఖాళీలు 1163
ఎంపిక విధానం: మొత్తం మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష, రెండో దశలో మెయిన్స్ పరీక్ష, మూడో దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు. మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన వారికి తర్వాతి దశలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా ఏప్రిల్‌లో తుది నియామకాలు చేపడతారు. పరీక్ష విధానం.. ముఖ్యమైన తేదీలు . . . ➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.11.2019. ➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 26.11.2019. ➥ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ (ప్రిలిమినరీ పరీక్ష): 2019 డిసెంబరులో. ➥ ప్రిలిమినరీ రాతపరీక్ష: 28.12.2019, 29.12.2019 ➥ ప్రిలిమినరీ రాతపరీక్ష ఫలితాలు: 2020 జనవరిలో ➥ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ (మెయిన్ పరీక్ష): 2020 జనవరిలో. ➥ మెయిన్ రాతపరీక్ష: 25.01.2020. ➥ మెయిన్ రాతపరీక్ష ఫలితాలు: 2020 ఫిబ్రవరిలో. ➥ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2020 ఫిబ్రవరిలో. ➥ ఇంటర్వ్యూ నిర్వహణ: 2020 ఫిబ్రవరిలో. ➥ ప్రొవిజినల్ అలాట్‌మెంట్: 2020 ఏప్రిల్‌లో. Read More..➦ ➦

ఛీ పాడు.. పిత్తులతో దోమలను చంపేస్తున్న వ్యక్తి, అతడి ‘గ్యాస్’తో మందు తయారీ!

$
0
0
‘పిత్తు’ ఈ పదాన్ని వింటే చాలు.. చీ పాడు మాటలు అని చికాకు పడతాం. కానీ, దాని గురించి ఇప్పుడు ప్రస్తావించకపోతే.. ఓ అరుదైన వార్తను మిస్సవుతారు. మనుషుల కడుపు నుంచి వచ్చే అవపాన వాయువు (పిత్తు) జనాలను ఎలా తరిమిస్తుందో తెలిసిందే. కానీ, ఆ దుర్వాసన దోమల ప్రాణాలను తీస్తాయట. నమ్మబుద్ధి కావడం లేదు కదూ. అయితే, ఉగాండాకు చెందిన జోయె ర్వామిరామ అనే ఈ వ్యక్తి గురించి తెలుసుకోవల్సిందే. కంపాలాలో నివసిస్తున్న జోయె తన కడుపులో గ్యాసును గాల్లోకి వదిలితే చాలు.. ఆరు మీటర్ల పరిధిలో ఉండే దోమలన్నీ చచ్చిపోతాయట. అతడి సామర్థ్యం గురించి తెలుసుకున్న ఓ కంపెనీ.. దోమలను చంపే మందును తయారు చేసేందుకు జోయెను ఉద్యోగంలో చేర్చుకుంది. ఇందులో అతడు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు. బాగా గ్యాస్ పట్టే ఆహారాన్ని తినడం, దాన్ని చాంబర్‌లోకి వదలడం.. ఇదే అతడి పని. అయితే, అతడు వదిలే గ్యాస్‌లో దోమలను చంపేంత శక్తి ఏముందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ సందర్భంగా జోయె talkofnaija.com అనే వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘‘నేను సాధారణ ఆహారాన్నే తింటాను. కానీ, నాపై ఏ కీటకం వాలదు. నన్నెప్పుడు దోమలు కుట్టవు. సాధారణ వ్యక్తుల్లో వచ్చే వాసనే నా నుంచి కూడా వస్తుంది. నేను రోజూ స్నానం కూడా చేస్తాను. అందరిలాగానే గ్యాస్ వదులుతా. కానీ, అది చిన్న కీటకలు, దోమలకు మాత్రమే ప్రమాదకరం’’ అని తెలిపాడు. అయితే, అతడి ‘గ్యాస్’తో ప్రయోగాలు చేస్తున్న కంపెనీ పేరును బయటకు వెల్లడించకుండా గోప్యంగా ఉంచాడు. Also Read: జోయె గురించి ఓ స్థానిక వ్యక్తి మాట్లాడుతూ.. ‘‘జోయె గురించి మా ఊరిలో ప్రతి ఒక్కరికీ తెలుసు. అతడు మా దగ్గర ఉంటే చాలు.. దరిదాపుల్లో దోమలే ఉండవు. క్షణాల్లో మాయమవుతున్నాయి. అయితే, అతడు పిత్తుతున్నాడని మేము ఏ రోజు వేళాకోలం చేయలేదు. అతన్ని మేం ఎంతో గౌరవిస్తాం’’ అని తెలిపాడు. అతడి వల్ల తమ గ్రామంలో డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంత వ్యాధులు కలిగించే దోమలు చనిపోతున్నాయని, అతడు తమకు ఎంతో మేలు చేస్తున్నాడని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. అతడి ‘గ్యాస్’కు దోమలు పోతున్నాయంటే చాలా ఆశ్యర్యంగా ఉంది కదూ. మనలో కూడా అలాంటి శక్తి దాగి ఉంటుందేమో.. ఓసారి ఇంట్లో ట్రై చేస్తే పోలే!! Also Read:

‘మహా’ మంత్రి పదవుల పంపకాలు.. శివసేనకు హోం, ఎన్సీపీకి ఆర్థికం

$
0
0
సీఎంగా ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేసిన రెండు వారాల తర్వాత మంత్రి పదవుల పంపకంపై , ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ఓ అవగాహనకు వచ్చింది. ఉద్దవ్ థాక్రే నాయత్వంలోకి శివసేనకు కీలకమైన హోం శాఖతోపాటు పట్టణాభివృద్ధి శాఖలను కేటాయించారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి ఆర్థికం, గృహ నిర్మాణ శాఖలను కేటాయించారు. కాంగ్రెస్‌ పార్టీకి రెవెన్యూ శాఖను ఇవ్వాలని నిర్ణయించారు. శివసేనకు హోం, అర్బన్ డెవలప్‌మెంట్, పర్యావరణం, పరిశ్రమలు, హయ్యర్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, క్రీడలు, పబ్లిక్ వర్క్స్, పర్యాటకం, అసెంబ్లీ వ్యవహారాల శాఖలు దక్కాయి. ఎన్సీపీకి ఆర్థిక, హౌసింగ్, ఆహార సరఫరా, కార్మిక శాఖ, గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం, జల వనరులు, ఎక్సైజ్ శాఖలు దక్కాయి. కాంగ్రెస్‌కు రెవెన్యూతోపాటు స్కూల్ ఎడ్యుకేషన్, పశు సంవర్థక శాఖ, గిరిజనాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, ఓబీసీ డెవలప్‌మెంట్ శాఖలు దక్కాయి. నవంబర్లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. ఇరు పార్టీలు మెజార్టీకి సరిపడా సీట్లను సాధించాయి. కానీ సీఎం పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకుందామని శివసేన డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి పదవి లేకుండా బీజేపీతో జతకట్టడానికి ఉద్దవ్ థాక్రే అంగీకరించలేదు. బీజేపీకి ఇందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో.. బీజేపీతో ఉన్న 30 ఏళ్ల స్నేహ బంధాన్ని శివసేన తెంపుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపింది. బీజేపీతో చేతులు కలిపి ఇటీవల మూడు రోజులపాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పని చేసిన అజిత్ పవార్‌కు ఆర్థిక శాఖ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మంత్రిగా ప్రమాణం చేసిన జయంత్ పాటిల్‌కు ఉపముఖ్యమంత్రి పదవి దక్కనుందని సమాచారం. కొద్ది రోజులు కొనసాగిన నాటకీయ పరిణామాల మధ్య.. సీఎం పదవికి రాజీనామా చేసిన దేవేంద్ర ఫడ్నవీస్.. మళ్లీ సీఎంగా ప్రమాణం చేశారు. కానీ అజిత్ పవార్ దెబ్బకు నాలుగో రోజే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. నవంబర్ 28న ముంబైలోని శివాజీ పార్కులో ఉద్దవ్ థాక్రే సీఎంగా ప్రమాణం చేశారు. కానీ పొర్టుపోలియోల విషయమై చర్చలు చాలా రోజుల వరకు కొలిక్కి రాలేదు.

అదిరిపోయే ఫీచర్లతో 5G ఫోన్లను లాంచ్ చేయనున్న Oppo.. OnePlusకు పోటీ ఇవేనా?

$
0
0
కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయడంలో ఒప్పో ఎంతో వేగంగా ముందుకు దూసుకువెళుతోంది. ఫ్లాగ్ షిప్ విభాగంలో ఒప్పో రెనో 2 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసి రెండు నెలలు కూడా కాకముందే ఇప్పుడు రెనో 3ని లాంచ్ చేయడానికి రంగం సిద్ధం చేసింది. విశేషం. డిసెంబర్ 26న చైనాలో ఒప్పో రెనో 3, రెనో 3 ప్రో ఫోన్లు లాంచ్ కానున్నాయి. విశేషం ఏంటంటే.. ఈ రెండూ 5జీ ఫోన్లు కావడం విశేషం. అయితే వీటిని 5జీ టెక్నాలజీతో లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే టీజర్ల ద్వారా తెలిపారు. దీంతో ఫ్లాగ్ షిప్ లో ఇప్పటికే నిలదొక్కుకున్న వన్ ప్లస్ కు ఒప్పోకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. Also Read: ధర ఎంతంటే.. ఇక ధర విషయానికి వస్తే.. ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం రెనో 3 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర 3,299 యువాన్లుగా(సుమారు రూ.33,200) ఉండనుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,599 యువాన్లుగా(సుమారు రూ.36,200) ఉండనున్నట్లు తెలిసింది. రెనో 3 ప్రోకు సంబంధించిన ధర వివరాలు తెలియాల్సి ఉంది. Also Read: స్పెసిఫికేషన్లు ఇవే.. ఇప్పటివరకు లీకైన స్పెసిఫికేషన్ల ప్రకారం చూస్తే.. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ(AMOLED) డిస్ ప్లేను అందించనున్నారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ గా ఉండనుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫ్లాగ్ షిప్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్క్రీన్ తో పాటు ఫోన్ వెనకభాగంలో కూడా గొరిల్లా గ్లాస్ అందించనున్నట్లు తెలుస్తోంది. బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంఏహెచ్ గా ఉండనుంది. VOOC 4.0 ఫాస్ట్ చార్జ్ ఫీచర్ కూడా ఇందులో అందించనున్నారు. ఒప్పో రెనో 3లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 735 ప్రాసెసర్ ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇక అత్యంత ముఖ్యమైన కెమెరాల విషయానికి వస్తే.. వెనకవైపు 48 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న నాలుగు కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా ఇందులో అందించనున్నారు. Also Read: రెనో 3 ప్రో వెర్షన్లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765G ప్రాసెసర్ ను వినియోగించనున్నట్లు సమాచారం. ఇందులో వెనకవైపు 48 మెగా పిక్సెల్, 13 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ కెమెరాలు ఉంటాయని లీకులు చెబుతున్నాయి.

గొల్లపూడి తెలంగాణ అల్లుడు.. సినారె, కాళోజికి ఆయన మావయ్య గురువు

$
0
0
గొల్లపూడి మారుతీరావు ఒక సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితుడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశారు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశారు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన ‘డాక్టర్ చక్రవర్తి’కి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో పాటు మరో మూడు నందులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. బాల్యం, విద్యాభ్యాసం గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్ 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (పూర్వపు మద్రాసు ప్రావిన్సు) విజయనగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావు. వారు జీవితాంతం విశాఖపట్టణంలోనే నివాసమున్నారు. సి.బి.ఎం. ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్ కళాశాల, ఆంధ్ర విశ్వవిద్యాలయంలలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. ఆయన మ్యాథమేటికల్ భౌతికశాస్త్రంలో బి.యస్‌సీ (ఆనర్స్) చేశారు. ఈయన అన్నపూర్ణ, సుబ్బారావుకి అయిదో కొడుకు. ఉద్యోగం మారుతీరావు 1959లో ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1960 జనవరి 13వ తేదీ చిత్తూరులో ఈ పత్రికకు మరో ఎడిషన్ ప్రారంభించినపుడు, అక్కడ సంపాదక వర్గంలో పనిచేశారు. తరువాత రేడియోలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికై, హైదరాబాదుకు మారారు. ఆకాశవాణి విజయవాడలో కూడా పనిచేశారు. కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొంది, సంబల్‌పూర్ వెళ్లారు. ఆ తరువాత చెన్నై, కడప కేంద్రాలలో కార్యక్రమ నిర్వాహకునిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం ఉప డైరెక్టరుగా పదోన్నతి పొందారు. మొత్తం ఇరవై సంవత్సరాలు పనిచేసి, అసిస్టెంట్ స్టేషను డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశారు. తరువాత ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో నటుడిగా సినిమారంగ ప్రవేశం చేశారు. రచనా ప్రస్థానం మారుతీరావు రాసిన తొలి కథ ‘ఆశాజీవి’. ప్రొద్దుటూరు నుండి వెలువడే స్థానిక పత్రిక ‘రేనాడు’లో 1954, డిసెంబరు 9న వెలువడింది. చిన్న వయసులోనే రాఘవ కళా నికేతన్ పేరున ఆయనొక నాటక బృందాన్ని నడిపేవారు. ఆడది (పినిశెట్టి), కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం (రావి కొండల రావు), రిహార్సల్స్ (సోమంచి యజ్ఞన్న శాస్త్రి), వాపస్ (డి.వి.నరసరాజు), మహానుభావులు (గోగోల్ రాసిన An Inspector Calls ఆధారంగా సోమంచి యజ్ఞన్న శాస్త్రి చేసిన రచన) నాటకాలకు నిర్మాణం, దర్శకత్వం వహించడంతోపాటు, ప్రధానపాత్రధారిగా నటించారు. విద్యార్థి దశలో ఉండగానే శ్రీవాత్సవ రచించగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కె.వి.గోపాలస్వామి దర్శకత్వం వహించిన స్నానాలగది నాటకంలోనూ, భమిడిపాటి రాధాకృష్ణ రచించిన మనస్తత్వాలు నాటకంలోనూ నటించారు. మనస్తత్వాలు నాటకాన్ని ఐదో అంతర విశ్వవిద్యాలయ యువజనోత్సవాలలో భాగంగా కొత్తఢిల్లీలోని తల్కతోరా ఉద్యానవనంలో ప్రదర్శించారు. ఆయన రచన ‘అనంతం’ ఉత్తమ రేడియో నాటకంగా అవార్డును తెచ్చిపెట్టింది. అప్పటి సమాచార, ప్రసార శాఖామాత్యుడు డాక్టర్ బి.వి.కేశ్‌కర్ చేతులమీదుగా ఈ అవార్డును అందుకొన్నారు. ‘మనస్తత్వాలు’ నాటకాన్ని ఆంధ్ర అసోసియేషన్, కొత్తఢిల్లీ వారికోసం ప్రదర్శించారు. ఆ అసోసియేషన్‌కు వి.వి.గిరి అధ్యక్షుడు. చైనా ఆక్రమణపై తెలుగులో మొట్టమొదటి నాటకం రచించి.. చిత్తూరు, మదనపల్లె, నగరిలలో ప్రదర్శించగా వచ్చిన సుమారు యాభై వేల రూపాయల నిధులను ప్రధానమంత్రి రక్షణ నిధికి ఇచ్చారు. చైనా విప్లవంపై తెలుగులో వచ్చిన మొట్టమొదటి నాటకం ‘వందేమాతరం’ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ ప్రచురించింది. అప్పటి విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి పి.వి. నరసింహారావు దానికి ఉపోద్ఘాతం రాశారు. 1959, డిసెంబరు 16న ‘రాగరాగిణి’ అనే నాటకాన్ని అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎదుట ప్రదర్శించారు. ‘పథర్ కే అన్సూ‘ అనే పేరుతో హిందీలోకి కూడా అనువదించారు. రచనలపై పరిశోధన ఆయన రచనలను భారతదేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా వాడుతున్నారు. తెలుగు నాటక రంగం మీద ఆయన రాసిన వ్యాసాల పరంపరను ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని థియేటర్ ఆర్ట్స్ విభాగంలో పాఠ్యపుస్తకంగా నిర్ణయించారు. ఆయన రాసిన ‘కళ్ళు’ నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయం మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులకు పాఠ్యపుస్తకం. ఆయన రచనల మీద పరిశోధన చేసి ఎం.ఫిల్, డాక్టరేట్లు సాధించిన వారు కూడా ఉన్నారు. చాలా సెమినార్లలో మారుతీరావు కీలకోపన్యాసకునిగా వ్యవహరించారు. తెలుగు సాహిత్యం మీద ఆయన రాసిన రెండు పరిశోధన పత్రాలు ఆంధ్రవిజ్ఞాన సర్వస్వం 11వ సంపుటిలో ప్రచురితమయ్యాయి. కుటుంబం మారుతీరావు వివాహం 1961 నవంబరు 11న, విద్యావంతులు సంగీతజ్ఞుల కుటుంబంలో పుట్టిన శివకామసుందరితో హనుమకొండలో జరిగింది. సి.నారాయణ రెడ్డి, కాళోజి నారాయణ రావు వంటి ప్రముఖులకు ఆమె తండ్రి ఉపాధ్యాయుడు. ప్రముఖ రచయిత, విమర్శకుడు డా. శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి, మనోధర్మ సంగీతం బాణీ ప్రముఖుడు పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణి ఆమెకు సమీప బంధువులు. మారుతీరావుకు ముగ్గురు మగసంతానం.. సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన కుటుంబంతో చెన్నైలో నివసిస్తున్నారు. గొల్లపూడి శ్రీనివాస్ స్మారక పురస్కారం 1992 ఆగస్టు 12న మారుతీరావు చిన్న కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్, తన తొలి ప్రయత్నంగా ‘ప్రేమ పుస్తకం’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ చిత్రీకరణ సమయంలో జల ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించాడు. మారుతీరావు, తన కుమారుని జ్ఞాపకంగా, గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు నెలకొల్పి, ప్రతి యేటా ఉత్తమ నూతన సినిమా దర్శకునికి రూ. 1.5 లక్షలు నగదుబహుమతి, ప్రముఖ చిత్రకారుడు దర్శకుడు బాపు రూపొందించిన బంగారపు జ్ఞాపికనూ ప్రదానం చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఏదేని అంశంపై విశేష ఉపన్యాసం చేసిన ప్రముఖునికి గౌరవసూచకంగా రూ.15,000 గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ లెక్చర్ పేరిట బహూకరిస్తారు. సునీల్ దత్, నసీరుద్దీన్ షా, మృణాల్ సేన్, శ్యాం బెనగల్, జావెద్ అక్తర్, అనుపమ్ ఖేర్ మొదలైనవారు ఇందులో ప్రసంగించిన వారిలో ప్రముఖులు. మిగిలిన ఇద్దరు కుమారులు సుబ్బారావు, రామకృష్ణలు మారుతీ ఎయిర్‌లింక్స్ అనే ట్రావెల్ ఏజన్సీని నడుపుతున్నారు. సినిమా ప్రస్థానం 1963లో ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. మారుతీరావుకు అది మొదటి సినిమా. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథారచనకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన నంది అవార్డు లభించింది. మారుతీరావు నటునిగా ప్రధానపాత్ర పోషించిన తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ ఘనవిజయం సాధించిన తరువాత వెనుదిరిగి చూడవలసిన అవసరం కలుగలేదు. 250 చిత్రాలకు పైనే సహాయ నటుడిగా, హాస్య నటుడిగా వివిధ పాత్రలలో నటించారు. అవార్డులు మారుతీరావును ఒక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో అనేక బిరుదులు, సన్మానాలు వరించాయి. ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా ఆరు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నారు. అంతే కాకుండా నాటకాల్లో ఆయనకు పలు పురస్కారాలు లభించాయి. నంది అవార్డులు 1963లో ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాకి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా 1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాకి ఉత్తమ రచయితగా 1983లో ‘తరంగణి’ సినిమాకి ఉత్తమ హాస్యనటుడిగా 1989లో ‘కళ్ళు’ అనే రచన సినిమాగా వచ్చింది.. దానికి ఉత్తమ రచయితగా 1991లో ‘మాస్టారి కాపురం’ సినిమాకి గాను ఉత్తమ సంభాషణల రచయితగా 1994లో ‘ప్రేమపుస్తకం’ సినిమాకి ఉత్తమ స్క్రీన్ ప్లే - శ్రీరామిరెడ్డి, సీనియర్ జర్నలిస్టు

ఢిల్లీ మెట్రోలో 1492 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?

$
0
0
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌(డీఎంఆర్‌సీ)లో ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. దీనిద్వారా దాదాపు 1492 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్, కాంట్రాక్ట్ పోస్టులను డీఎంఆర్‌సీ భర్తీ చేయనున్నారు. డిసెంబరు 14న ఉద్యోగ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎంప్లాయిమెంట్ న్యూస్ పత్రికలోనూ నోటిఫికేషన్ ప్రచురితం కానుంది. అదేరోజు నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జనవరి 13 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పోస్టులు, అర్హతలు, ముఖ్యమైన తేదీలు, ఎంపిక విధానం తదితర వివరాల కోసం డిసెంబరు 14 నుంచి వెబ్‌సైట్ చూడవచ్చు. Dont Miss: పోస్టుల వివరాలు.. మొత్తం ఖాళీలు: 1492 ➥ ఎగ్జిక్యూటివ్ (రెగ్యులర్) ➥ నాన్-ఎగ్జిక్యూటివ్ (రెగ్యులర్) ➥ ఎగ్జిక్యూటివ్ (కాంట్రాక్ట్) ➥ నాన్-ఎగ్జిక్యూటివ్ (కాంట్రాక్ట్) Bank Jobs: ముఖ్యమైన తేదీలు.. ➢ నోటిఫికేషన్ విడుదల: 14.12.2019. ➢ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.12.2019. ➢ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 13.01.2020. Read More..➦ ➦

భాగ్యనగరంలో బిక్కుబిక్కుమంటున్న రోహింగ్యా ముస్లింలు

$
0
0
హైదరాబాద్‌లో బిక్కుబిక్కుమంటున్నారు. పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో తమను దేశం నుంచి ఏ క్షణమైనా పంపించే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. సొంత దేశం మయన్మార్‌లో కల్లోలం నేపథ్యంలో వీరంతా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించారు. కొంత మంది ఇక్కడ అక్రమంగా ఆధార్ తదితర గుర్తింపు కార్డులను కూడా పొందినట్లు సమాచారం. హైదరాబాద్‌ నగరంలో 6 వేల మందికి పైగా రోహింగ్యాలు ఉన్నట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్‌ తర్వాత రోహింగ్యాలు అత్యధికంగా హైదరాబాద్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కూడా గతంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాలాపూర్‌లో ఆశ్రయం పొందుతున్న రోహింగ్యాలను వీడియోలో చూడవచ్చు. రోహింగ్యాలకు అక్రమంగా ఆధార్‌ కార్డులు, ఇతర ధ్రువపత్రాలు జారీ చేసిన అంశం ఆందోళన కలిగించేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తెలంగాణ పోలీసులు కొంత మంది సస్పెన్షన్‌కు గురయ్యారని వెల్లడించారు. రోహింగ్యాలు, భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న వివిధ వర్గాల వారికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కేంద్రం తెప్పించుకుంటోందని ఆయన ఇప్పటికే తెలిపారు. Also Read: ‘మయన్మార్‌కు చెందిన రోహ్యింగాలు ఆ దేశం పక్కనే ఉన్న పశ్చిమ బెంగాల్‌, అసోం రాష్ట్రాలకు వచ్చి తలదాచుకున్నారంటే.. దేశ సరిహద్దులోని కశ్మీర్‌కు వెళ్లారంటే అర్థముంది. దేశం మధ్యలో ఉన్న హైదరాబాద్‌లో పదేళ్ల నుంచి ఉంటున్నారు. ఇక్కడి వరకు ఎలా వచ్చారు? వీరికి ఎవరు ఆశ్రయం కల్పించా?’ అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో రోహింగ్యాలకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు గుర్తింపు కార్డులు ఇప్పించినట్లు తెలుస్తోంది. దేశంలో జనాభా ఇప్పటికే ఎక్కువగా ఉందని.. చాలా మందికి ఇల్లు, ఉపాధి లేదని, ఈ నేపథ్యంలో విదేశీయులు ఇక్కడ ఉండొద్దనేది బీజేపీ సర్కార్ వాదన. ఈ నేపథ్యంలోనే సిటిజన్ షిప్ బిల్లును తీసుకొచ్చారు. శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని.. అక్రమ చొరబాటుదారులను గుర్తించి దేశం నుంచి పంపించేస్తామని చెబుతున్నారు.

కొండ చిలువను కాపాడేందుకు నూతిలోకి యువకుడు, పట్టుతప్పడంతో..

$
0
0
కేరళాలోని త్రిస్సూర్‌లో ఓ కొండ చిలువ నూతిలో చిక్కుకుంది. ఈ సమాచారం అందుకున్న త్రిస్సూర్ అటవీ పర్యవేక్షకుడు షాగిల్ అక్కడికి చేరుకుని కొండ చిలువను రక్షించేందుకు సిద్ధమయ్యాడు. తాడు సాయంతో నూతిలోకి దిగిన త్రిస్సూర్.. ఒక చేత్తో కొండ చిలువ, మరో చేతితో తాడును పట్టుకుని నూతి నుంచి పైకి వచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే, కొండ చిలువను చూసిన గ్రామస్తులు షాగిల్ చేయి పట్టుకుని పైకి లాగడంలో విఫలమయ్యారు. దీంతో షాగిల్ పాముతోపాటు నూతిలో పడిపోయాడు. వీడియో: Also Watch: గ్రామస్తులు వెంటనే తాడును నీటిలో వేసి షాగిల్‌ను బయటకు లాగారు. ఈ సందర్భంగా షాగిల్ మాట్లాడుతూ.. ‘‘నూతిలో కొండ చిలువను చూడగానే.. దాన్ని ట్రాప్ సాయంతో పట్టుకుందామని ప్రయత్నించాం. కానీ, అది ఎంతకీ చిక్కలేదు. చాలాసేపు ప్రయత్నించి అలసిపోయాం. మరోదారి లేకపోవడంతో తాడు పట్టుకుని నూతిలోకి దిగేందుకు ప్రయత్నించా. చెట్టు కొమ్మ సాయంతో కొండ చిలువను నా వైపు లాక్కున్నా. దాని తలను పట్టుకుని పైలేపాను. దాన్ని నా శరీరానికి చుట్టుకుని పైకి ఎక్కడానికి ప్రయత్నించా. ఒకరిని నా చేయి పట్టుకోవాలని అడిగాను. మరి వారు నా చేతిలో కొండ చిలువను చూసి భయపడ్డారో ఏమో.. నన్ను వదిలేశారు. దీంతో నూతిలో పడిపోయా. నూతి నుంచి బయటకు వచ్చిన తర్వాత మరో విధానంలో కొండ చిలువను బయటకు తీసుకొచ్చాం’’ అని తెలిపాడు. Also Read:

వరల్డ్ ఫేమస్ లవర్‌లో ‘శీనయ్య సువర్ణ’ రొమాన్స్.. నలుగురు లవర్స్ వరుసగా

$
0
0
‘నా పేరు సువర్ణ.. ఆ ఆయన పేరు శీనయ్య.. మా ఆయనే ‘’.. మా శీనయ్యను ప్రేమికుల రోజున కలుద్ధాం’ అంటూ శీనయ్యతో రొమాన్స్ చేస్తున్న సువర్ణ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ పోస్టర్‌ను వదిలింది. విజయ్ దేవరకొండ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ మూవీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో నలుగురు హీరోయిన్స్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో విజయ్‌కి భార్యగా నటిస్తున్న ఐశ్వర్యా రాజేష్‌ లుక్‌ను ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఇందులో ఐశ్వర్యా రాజేష్‌.. సువర్ణ పాత్రలో డీ గ్లామరస్‌గా కనిపించి సర్ ప్రైజ్ చేసింది. శీనయ్యగా విజయ్ దేవరకొండ.. సువర్ణను వంటపని చేయనీయకుండా ఒంటిపనికి సిద్దమవుతూ రొమాన్స్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్ర షూటింగ్ పూర్తికావడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేశారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ ఫస్ట్‌లుక్ విడుదల చేయగా.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’‌కి భార్యగా నటించిన ఐశ్వర్య లుక్‌ను నేడు విడుదల చేశారు. ఇక రేపు (డిసెంబర్13) ఇజా బెల్లా, 14న క్యాథరిన్ త్రెసా, 15న రాశీఖ‌న్నాల‌కు సంబంధించిన లుక్‌లు విడుదల చేస్తున్నారు. అలానే.. ఈ మూవీ టీజర్‌ను జనవరి 3 విడుదల చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించింది చిత్ర యూనిట్. ఫిబ్రవరి 14న ప్రేమికులు దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’‌ చిత్రానికి క్రాంతిమాధ‌వ్ దర్శకత్వం వహించారు. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్‌.రామారావు స‌మర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌పై కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీ సుంద‌ర్ సంగీతం అందించారు.

బాకీల, బొందలగడ్డ తెలంగాణగా మార్చారు: రేవంత్ రెడ్డి

$
0
0
ముఖ్యమంత్రి ఏడాది పాలనపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన కేసీఆర్.. బొందలగడ్డ తెలంగాణగా, బాకీల తెలంగాణగా మార్చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పరిపాలనతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు విషాదంలో కూరుకుపోయారని విమర్శించారు. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీనీ ఆయన నెరవేర్చలేదన్నారు. గురువారం (డిసెంబర్ 12) సాయంత్రం పార్లమెంట్ ఆవరణలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని ఆరేళ్లలో అప్పుల కుప్పగా మార్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో తెలంగాణ రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉండగా.. ప్రస్తుతం రూ.3 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారు. బంగారు తెలంగాణ కాదని.. బాకీల తెలంగాణ అయిందని ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, పంట రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, పీజు రీ-ఇంబర్స్‌మెంట్ సహా అనేక అంశాల్లో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ఇంకా ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నమే చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఆరేళ్లలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు ఎంత పెరిగాయో ప్రజలకు తెలుసని రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘ప్రాజెక్టుల పేరుతో దండుకున్న డబ్బులు ఎవరి ఖాతాలో పడ్డాయి? ప్రతి ఇంటికి తాగునీరు పేరుతో ఎలా దోపిడీకి పాల్పడ్డారు? ఇవన్నీ ప్రజలందరికీ తెలియాలి’ అని రేవంత్ రెడ్డి అన్నారు. Also Read: రైతులు, ఇంటర్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బంగారు తెలంగాణ కాదు, బొందలగడ్డ తెలంగాణగా మార్చారని ధ్వజమెత్తారు. లిక్కర్ అమ్మకాల్లో మాత్రం తెలంగాణ అత్యంత ప్రగతి సాధించిందని ఆయన ఎద్దేవా చేశారు. లిక్కర్ కంపెనీల కమీషన్లకు కక్కుర్తి పడి రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచేందుకు సిద్ధమైందని ఆరోపించారు. మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరుగానే చూస్తోందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని ఆరోపించారు.
Viewing all 85909 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>