Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all 86224 articles
Browse latest View live

రైతుల రెట్టింపు ఆదాయమే లక్ష్యం - ప్రధాని

$
0
0

రైతుల రెట్టింపు ఆదాయమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. దేశ అభివృద్ధిలో వ్యవసాయ రంగానిదే కీలక ప్రాత అని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో వృద్ధి సాధించలంటే పెట్టుబడుపెంచాల్సి ఉందన్నారు. వ్యవసాయం రంగంలో పెట్టుబడులు పెంచడం ద్వారా రైతుల ఆదాయం పెంచవచ్చన్నారు. ఇదే అంశాన్ని పార్లమెంట్ లోనూ ప్రస్తావించామని... దీనిపై ప్రతిపక్షాలు హేళన చేశాయన్నారు. అయితే దీన్ని ఆచరణ సాధ్యం చేసి ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెబుతామన్నారు. ఢిల్లీలో శనివారం అడ్వాన్సింగ్ ఆసియా సదస్సులో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో ఆసియా ప్రధాన ప్రాత పోషిస్తోందన్నారు. ఆర్ధికాభివృద్ధిలో ఆసియా దేశాలకు భారత్ మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. అయితే తమ వ్యాపార ప్రయోజనాల కోసం పొరుగు దేశాల ప్రయోజనాలను పణంగా పెట్టమని మోడీ హామీ ఇచ్చారు. తమకు వ్యాపారం ఎంత ముఖ్యమో .. పొరుగుదేశాలతో సంబంధాలు కూడా అంతే ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆసియా దేశాలకు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

Mobile AppDownload and get updated news


సెక్స్ రాకెట్ బట్టబయలు

$
0
0

ఆగ్రాలో మరో సెక్స్ రాకెట్ బట్టబయలయింది. పక్కా సమాచారం ప్రకారం ఆగ్రా పోలీసులు జరిపిన దాడిలో మొత్తం పన్నెండు మందిని అరెస్ట్ చేసారు. వారిలో ఆరుగురు మహిళలున్నారు. ఈ మహిళలను డిల్లీ, కోల్కతా, ఆగ్రాలనుండి రప్పించారు. రెండో నంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఒక హోటలుతో పాటు, మరో ప్రయివేటు ఆసుపత్రి బేస్మెంటులో ఈ ముఠా వ్యభిచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పోలీసులు తెలిపారు. సెక్స్ రాకెట్ అంతా పూర్తిగా హైటెక్ పద్దతిలో నిర్వహిస్తారు. ఇంటర్నెట్, మొబైల్స్ ద్వారానే విటులకు సమాచారం అందిస్తారు. ముందస్తుగా వారి నుండి డబ్బు వసూలు చేసిన తరువాత రహస్య ప్రాంతానికి రమ్మని కబురంపుతారు. అక్కడ వారికి మహిళలను సరఫరా చేస్తుంటారని తెలిపారు.

Mobile AppDownload and get updated news

ఆర్ఎస్ఎస్, ఐసిస్ ఒకటేనన్న ఆజాద్

$
0
0

కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ అతివాద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్.), ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ (ఐసిస్) ఒకటేనని వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీలో జరిగిన మైనారిటీల బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ కు, ఐసిస్ కు ఏమాత్రం తేడా లేదని రెండింటి లక్షణాలు, వ్యవహార శైలి ఒకటేనని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఐసిస్ తీవ్రవాద సంస్థను ఎలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామో.. అదే రీతిలో ఆర్ఎస్ఎస్ ను కూడా వ్యతిరేకిస్తున్నామని ఆజాద్ చెప్పారు. కాగా ఆయన వ్యాఖ్యలకు బీజేపీతో పాటు పలు హిందూ సంస్థలు తీవ్రంగా స్పందించాయి. గులాం నబీ ఆజాద్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవడంతో పాటు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశాయి. నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రతినిధి ఒకరు దీనిపై మాట్లాడుతూ ఈ తరహా వ్యాఖ్యలు గులాం నబీ ఆజాద్ మేథో దివాళాకోరుతనాన్ని రుజువు చేస్తున్నాయన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని తమ సంస్థ పరిశీలిస్తోందన్నారు. బీజేపీ ప్రతినిధి మాట్లాడుతూ ఆజాద్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. ఆయనపై సోనియా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Mobile AppDownload and get updated news

కోల్‌కతా చేరుకున్న పాక్ క్రికెట్ టీమ్

$
0
0



ఎంతో హైడ్రామా అనంతరం భారీ బందోబస్తు మధ్య కెప్టేన్ షాహిద్ అఫ్రీది నేతృత్వంలోని పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ పోటీల్లో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం కోల్‌కతాకి చేరుకుంది. సోమవారంనాడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాక్ జట్టు శ్రీలంక టీమ్‌తో ఓ వామప్ మ్యాచ్ ఆడనుంది. అయితే భారత్, పాక్‌తోపాటు ప్రపంచదేశాల క్రికెట్ అభిమానుల ఫోకస్ మాత్రం ఈ నెల 19న ఇదే ఈడెన్ గార్డెన్స్ సాక్షిగా జరగనున్న భారత్-పాక్ మ్యాచ్‌పైనే వుంది. 15 మంది ఆటగాళ్లు, 12 మంది అధికారులు, సహాయ సిబ్బందితో కలిసి కోల్‌కతా చేరుకున్న పాక్ జట్టుకి తన నగరంలో ఆతిథ్యం ఇచ్చే అవకాశం లభించినందుకు ఆనందం వ్యక్తంచేశారు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడు సౌరబ్ గంగూలి. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధ్యక్షుడు శహర్యర్ ఖాన్ కూడా తనకి ఇష్టమైన కొన్ని నగరాల్లో ఒకటైన కోల్‌కతాకి వచ్చినందుకు ఎంతో సంతోషంగా వుందని అభిప్రాయపడ్డారు.

Mobile AppDownload and get updated news

కాక్రాపార్ అణుశక్తి కేంద్రంలో లీకేజి

$
0
0

గుజరాత్ లోని కాక్రాపార్ అణుశక్తి కేంద్రం (కెఎపిఎస్)లో లీకేజీ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ కేంద్రాన్ని అత్యవసర ప్రాతిపదికన మూసివేయాల్సి వచ్చింది. ఆ కేంద్రంలోని ఒకటో యూనిట్లోని ప్రాథమిక ఉష్ణ సరఫరా విభాగంలో లీకేజీని అణుశక్తి కేంద్ర వర్గాలు శుక్రవారం గమనించాయి. అయితే, ఈ లీకేజీ వల్ల ఎటువంటి ప్రమాదం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. కేవలం నీరు మాత్రమే లీక్ అవుతుందని, ఎటువంటి అణు పదార్థాలు విడుదల కావడం లేదని ప్రజలు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాయి. అణుకేంద్రంలోని సిబ్బంది కూడా రేడియేషన్ ప్రమాదానికి లోనుకాలేదని దేశంలో అణు భద్రత అంశాలను పర్యవేక్షించే బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్) అసోసియేట్ డైరెక్టర్ కె.ఎస్.ప్రదీప్ కుమార్ తెలిపారు.

Mobile AppDownload and get updated news

'స్వాతిముత్యం'కు 30 ఏళ్ళు

$
0
0

మార్చ్ 13, 1986న స్వాతిముత్యం విడుదలైంది. అంటే ఈ సినిమా రిలీజై నేటికి 30 ఏళ్ళు పూర్తయిందన్నమాట. ఇప్పటి వరకు తెలుగు చలన చిత్ర చరిత్రలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుకి ఉతమ విదేశీ చిత్ర విభాగంలో ఒక తెలుగు చిత్రం ఉండటం 'స్వాతిముత్యం'కే దక్కింది. పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అభిరుచి గల నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, కళా తపస్వి కే.విశ్వనాధ్ - కమలహాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఆణిముత్యం 1986లో బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించింది. జాతీయ అవార్డ్సులో ఉత్తమ తెలుగు చిత్రం, నంది అవార్డ్సులో బంగారు నంది, ఉత్తమ నటుడు , ఉత్తమ దర్శకుడు అవార్డ్సు, ఫిలింఫేర్ అవార్డ్స్ లాంటివెన్నో పురస్కారాల్ని గెల్చుకుందీ చిత్రం. రష్యన్ భాషలో డబ్ చేయబడి అక్కడ కూడా ఘన విజయం సాధించింది. తమిళంలో 'సిప్పిక్కుల్ ముత్తు'గా అక్కడా రికార్డులు తిరగరాసింది.

Mobile AppDownload and get updated news

భర్తపై మధుప్రియ పోలీసులకి ఫిర్యాదు

$
0
0

తెలంగాణ ఉద్యమ గీతాలతో ఫేమస్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న మధుప్రియ శనివారం రాత్రి 9 గంటలకి హైదరాబాద్‌లోని హుమాయున్‌నగర్ పోలీసులని ఆశ్రయించారు. గత అక్టోబర్‌లో తల్లిదండ్రులని ఎదిరించి శ్రీకాంత్‌ని ప్రేమ వివాహం చేసుకున్న మధుప్రియ ఇప్పుడు అత్తింటివారిపై వేధింపుల కేసు పెట్టారు. గడిచిన నాలుగు నెలలుగా భర్త శ్రీకాంత్ తనని వేధిస్తున్నాడని ఆమె పోలీసులకి ఫిర్యాదు చేశారు. స్నేహితులతో మాట్లాడినా తనని అనుమానిస్తున్నారని.. ఎవ్వరితోనూ మాట్లాడకుండా తన సెల్ ఫోన్ కూడా వాళ్లదగ్గరే పెట్టుకుంటున్నారని ఆమె పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లిదండ్రులని ఎదిరించి మరీ శ్రీకాంత్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న మధుప్రియ.. పెళ్లయిన నాలుగైదు నెలలకే ఇలా పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాల్సి రావడానికి గల కారణాలు ఏంటా అని పోలీసులు ఆరాతీస్తున్నారు.

Mobile AppDownload and get updated news

శ్రీకృష్ణ అలంకారంలో లక్ష్మీనరసింహస్వామి

$
0
0

నల్గొండ: నల్గొండ: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి యాదాద్రి లక్మీ నరసింహస్వామి ..శ్రీకృష్ణుడి అలకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలో స్వామి వారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరిలివస్తున్నారు. భక్తల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు భద్రతను మరింత పెంచారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి 10 గంటలకు స్వామివారు హంస వాహనంపై ఊరేగనున్నారు.

Mobile AppDownload and get updated news


ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ

$
0
0

హైదరాబాద్: సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ ( ఆదివారం) తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సోమవారం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా కేబినెట్ చర్చించనుంది. అనంతరం బడ్జెట్ 2010-17కు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.

Mobile AppDownload and get updated news

లండన్ లో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ

$
0
0

లండన్: పెట్టుబడులే లక్ష్యంగా లండన్ లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజుల పర్యటనలో చంద్రబాబు 22 కంపెనీల ప్రతినిధులతో భేటీ అయినట్లు సమాచారం. ఈ భేటీ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలకు సీఎం ఆహ్వానించారు. ఏపీలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయనే దానిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పారిశ్రామిక వేత్తలకు చంద్రబాబు వివరించారు. సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తామని.. దీంతో పాటు పలు రాయితీలు కల్పిస్తామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు కోసం లండన్ లో అమరావతి కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రవాస భారతీయులతో కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలోని గ్రామాలను దత్తత తీసుకోవాలని ఎన్ఆర్ఐలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

Mobile AppDownload and get updated news

మధుప్రియ భర్త శ్రీకాంత్ పై మరో కేసు నమోదు

$
0
0


హైదరాబాద్: తన కూతురిని వేధించాడని ఫిర్యాదు చేసినందుకు తమపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని ఉప్పల్ పోలీస్ స్టేషన్ మధుప్రియ తల్లిదండ్రులు శ్రీకాంత్ పై మరోసారి ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ తో తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీకాంత్ శనివారం అర్థరాత్రి సమయంలో 20 మంది గ్యాంగ్ తో వచ్చి తమపై దాడికి ప్రయత్నించాడని మధుప్రియ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా మధుప్రియను కలిసేందుకు వెళ్లిన తనపై ఆమె బంధువులు కర్రలతో దాడి చేశారని శ్రీకాంత్ ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. దీంతో మధుప్రియ కేసు మరింత జఠిలంగా మారింది

Mobile AppDownload and get updated news

తమిళ స్టార్‌కి విలన్‌గా జగపతి బాబు !

$
0
0

హీరోగా బోలెడంత ఫీమేల్ ఫాలోయింగ్‌తో ఓ వెలుగు వెలిగిన జగపతి బాబు గత కొంతకాలంగా విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన సంగతి తెలిసిందే. తెలుగు ఆడియెన్స్‌కి మాత్రమే కాకుండా తమిళ తంబీలకి సైతం సుపరిచితుడే అయిన జగపతి బాబు ఈ రెండు భాషల్లోని సినిమాల్లో విలన్ పాత్రలు పోషిస్తూ తనకంటూ మరోసారి గుర్తింపుని తెచ్చుకుంటున్నాడు. ఇప్పటికే తమిళంలో రజినీకాంత్ 'లింగ', విక్రమ్ 'తాండవం' సినిమాల్లో నెగటివ్ లీడ్ రోల్స్ పోషించిన జగ్గూ భాయ్ తాజాగా మరో తమిళ సినిమాలో విలన్ పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. తమిళ స్టార్ విజయ్ హీరోగా భరతన్ డైరెక్ట్ చేయనున్న 'విజయ్ 60' అనే సినిమాలో జగపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. విజయా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు కాగా కీర్తి సురేష్ విజయ్ సరసన లీడ్ రోల్ పోషించనుంది.

Mobile AppDownload and get updated news

మాల్యాకు హైదరాబాద్ కోర్ట్ వారంట్

$
0
0

లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా రోజురోజుకు కష్టాల్లో కూరుకుపోతున్నట్లు అనిపిస్తోంది. వేల కోట్ల రూపాయిలను రుణాలుగా తీసుకుని దాదాపు 17 వరకు బ్యాంకుల నెత్తిన శఠగోపం పెట్టి దేశ సరిహద్దులు దాటేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యాకు తాజాగా హైదరాబాద్ కోర్ట్ నాన్ బెయిలబుల్ వారంట్ జారీచేసింది. ఆయనతో పాటు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ ఎ.రఘునాధ్‌కు కూడా కోర్టు వారంట్ జారీచేసింది. ఈ నెల 13వ తేదీ లోపు వారిని తన ఎదుట హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. జీఎంఆర్ సంస్థ కింగ్‌ఫిషర్ కంపెనీపై దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు కోర్టు ఈ వారంట్లు జారీ చేసింది. తనకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుండా కింగ్‌ఫిషర్ యాజమాన్యం మోసం చేసిందని, అది ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయని జీఎంఆర్ సంస్థ కోర్టు దృష్టికి తెచ్చింది.

Mobile AppDownload and get updated news

నన్ను విలన్‌ని చేయకండి -మాల్యా

$
0
0

పర్సనల్ పనిపై విదేశాలకొచ్చాను. తిరిగి ఇండియాకు రావాలనే వుంది. కానీ ఇది కరెక్ట్ టైమ్ కాదనిపిస్తోంది అంటున్నాడు భారత్‌లో బ్యాంకులకి వేల కోట్లు ఎగ్గొట్టి ఎంచక్కా విదేశాల్లో విహరిస్తున్న విజయ్ మాల్యా. నేను నిజమైన భారతీయుడిని.. నన్ను ఓ విలన్‌ని చేయకండి. గతేడాదే నాపై లుకౌట్ నోటీసు జారీ అయ్యింది. కానీ నేను ఎక్కడికీ పారిపోలేదే ? మరి ఇప్పుడెందుకు నాపై ఓ క్రిమినల్ అనే ముద్ర వేశారు అని అమాయకంగా ప్రశ్నిస్తున్నాడు విజయ్ మాల్యా. సండే గార్డియన్ అనే న్యూస్ పేపర్‌కి ఈమెయిల్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాల్యా ఈ సమాధానాలు ఇచ్చాడు. ఇచ్చిన రుణమొత్తాన్ని తిరిగి రాబట్టడంలో ఎంత రిస్క్ వుంటుందో రుణాలు ఇస్తున్న బ్యాంకులకి సైతం తెలుసు. వ్యాపారం పెద్దదైనా.. చిన్నదైనా అందులో రిస్క్ వుంటుందనే విషయం జనాలు కూడా అర్థం చేసుకోవాలి. దేశం నాకెంతో ఇచ్చింది. నన్ను విజయ్ మాల్యాని చేసింది. అందుకే ఏదో ఓ రోజు ఇండియాకి తిరిగొస్తాను. కాకపోతే అది ఇప్పుడు మాత్రం కాదు. ఎందుకంటే ఆల్రెడీ దేశం నన్ను ఓ క్రిమినల్‌ని చూసినట్టు చూస్తోంది అని సెలవిచ్చాడు విజయ్ మాల్యా.

అంతటితో సరిపెట్టుకోని విజయ్ మాల్యా.. చివరకి మీడియాపై సైతం తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. నేను ఏ తప్పుూ చేయకున్నా.. మీడియా మాత్రం నాపై లేనిపోని నిందలు వేస్తోందంటున్నాడు మాల్యా. మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు ఏవేవో ఊహాగానాలు రాసేసుకుని నన్ను ఓ బాధితుడిని చేస్తున్నారు అని వాపోతున్న విజయ్ మాల్యా మాటల్నిబట్టి చూస్తోంటే, అతడికి ఇప్పట్లో ఇండియాకి వచ్చే ఉద్దేశమైతే అస్సలే లేదని స్పష్టమవుతోంది.

Mobile AppDownload and get updated news

బడా ప్రొడ్యూసర్‌తో అల్లరి నరేష్ సినిమా

$
0
0

మీడియం, లో బడ్జెట్ చిత్రాలతో కామెడీకి కేరాఫ్ అడ్రస్ అయిన అల్లరి నరేష్ త్వరలోనే ఓ బడా ప్రొడ్యూసర్ సినిమాలో నటించబోతున్నాడు. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి చిత్రాల్ని నిర్మించిన బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించబోయే తర్వాతి సినిమాలో అల్లరి నరేష్ లీడ్ రోల్ పోషిస్తున్నాడని సమాచారం. 'సీమ టపాకాయ్' ఫేమ్ జీ నాగేశ్వర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాని ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మలిచేందుకు ఇప్పటికే యూనిట్ సభ్యులు ప్లాన్ చేసుకుంటున్నారు. రెగ్యులర్‌గా హై బడ్జెట్ సినిమాలే కాకుండా అప్పుడప్పుడు మీడియం బడ్జెట్ చిత్రాలపై కూడా దృష్టిసారిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్టు సినీవర్గాలు చెబుతున్నాయి.

Mobile AppDownload and get updated news


పవన్ కొత్త సినిమాకి మ్యూజిక్ సిట్టింగ్స్

$
0
0

ప్రస్తుతం సర్ధార్‌ గబ్బర్‌సింగ్ సినిమా షూటింగ్‌తో బిజీగా వున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమా తర్వాత పవన్ మళ్లీ ఖుషీ మూవీ డైరెక్టర్ ఎస్.జే. సూర్యతో కలిసి పనిచేయనున్నాడని గతంలో కొన్ని వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తల్ని ధృవీకరిస్తూ ఎప్పుడూ, ఎటువంటి ప్రకటనలు రాలేదు. అయితే, లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం పవన్ -సూర్య కాంబినేషన్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ప్రముఖ గేయరచయిత రామజోగయ్య శాస్త్రి చేసిన ట్వీట్స్ ఈ ప్రచారానికి కారణమయ్యాయి.
'అబ్ సల్యూట్‌లీ "ఖుషీ" వర్కింగ్ విత్ ఎస్జే సూర్య గారు అండ్ అనూప్ డార్లింగ్" అంటూ రామజోగయ్య శాస్త్రీ తాజాగా ఓ ట్వీట్ పోస్ట్ చేశాడు. అయితే, ఈ ట్వీట్‌లో ఖుషీ అనే పదాన్ని హైలైట్ చేయడం... ఎస్జే సూర్య ప్రస్తావన రావడంతో ఇది కచ్చితంగా పవన్ సినిమానే అయి వుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనికితోడు ఈ ట్వీట్‌లో అనూప్ రూబెన్స్ పేరు కూడా వుంది. ఇక గోపాల గోపాల సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించిన అనూప్‌తో మరో సినిమాకి కలిసి పని చేయడం జరుగుతుందని పవన్ అప్పట్లోనే చెప్పాడు. ఇదంతా పరిశీలిస్తే, ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ పవన్ కొత్త సినిమాకే అయ్యుంటుందనే టాక్ వినిపిస్తోంది.



Mobile AppDownload and get updated news

నలుగురు మెగా హీరోలకి.. హీరోయిన్ ఒక్కరే

$
0
0

మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్, రాంచరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్‌లు ప్రస్తుతం తమతమ సినిమాలతో ఫుల్ బిజీగా వున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సరైనోడు మూవీతో అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'థని ఓరువన్' తెలుగు రీమేక్ అయిన 'ధృవ' మూవీతో రాంచరణ్‌లు బిజీగా వున్నారు. మరోవైపు శ్రీను వైట్ల డైరెక్ట్ చేయనున్న సినిమాలో వరుణ్ తేజ్, దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమాలో సాయిధరమ్ తేజ్ నటిస్తున్నారు.

విచిత్రం ఏంటంటే.. ఇప్పటికే రాంచరణ్ 'ధృవ', అల్లు అర్జున్ 'సరైనోడు' సినిమాలకి పనిచేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్‌నే వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ సినిమాలకి కూడా హీరోయిన్‌గా ఎంపిక చేసుకోవడం. టాలీవుడ్ లక్కీ మస్కట్‌గా పేరున్న రకుల్ ప్రీత్ సింగ్‌‌కి ఏర్పడిన ఈ మెగా డిమాండ్ ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనియాంశమైంది. రెండేళ్ల క్రితం వచ్చిన లౌక్యం తప్పించి ఆ తర్వాత వచ్చిన ఐదు సినిమాలు రకుల్ కి పెద్దగా సక్సెస్ ని ఇవ్వలేదు. అయినప్పటికీ ఇలా మెగా హీరోలు, వారితో సినిమాలు చేస్తున్న దర్శకులు ఆమెనే హీరోయిన్‌గా ఎంచుకోవడం వెనుకున్న కారణం ఏంటా అని సనీవర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.

Mobile AppDownload and get updated news

అప్పటివరకు వేచిచూస్తాను -మధుప్రియ

$
0
0

సింగర్ మధుప్రియ, శ్రీకాంత్ దంపతులకి పోలీసుల సమక్షంలో కౌల్సిలింగ్ ముగిసింది. దాదాపు నాలుగైదు గంటలపాటు కొనసాగిన ఈ కౌన్సిలింగ్ అనంతరం హుమాయున్ నగర్ పోలీసు స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడిన మధుప్రియ.. ''రెండో కౌన్సిలింగ్ తర్వాత శ్రీకాంత్‌తో తన వైవాహిక జీవితంపై ఓ నిర్ణయానికి రానున్నట్టు స్పష్టంచేసింది. ప్రస్తుతానికి మేమిద్దరం కలిసే వుండే విధంగా పోలీసులు, డాక్టర్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరో పదిహేను రోజుల తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ జరగనుంది. అప్పటివరకు తాను తల్లిదండ్రుల వద్దే వుంటాను'' అని అంటోంది మధుప్రియ. సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత తన భర్త శ్రీకాంత్ మారతాడని ఆశాభావం వ్యక్తంచేసిన మధుప్రియని మొదటి కౌన్సిలింగ్ తర్వాత శ్రీకాంత్‌పై మీ అభిప్రాయం ఏంటని అక్కడున్న మీడియా అడగ్గా... ''హీ ఈజ్ గుడ్'' అని బదులిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

Mobile AppDownload and get updated news

నేడు శాసనసభలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్

$
0
0

తెలంగాణ రాష్ట్ర 2016-17 బడ్జెట్‌ను నేడు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశ పెట్టనున్నారు. మొత్తం బడ్జెట్ విలువ 1.26 లక్షల కోట్ల నుంచి 1.27 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. కాగా ఈసారి సాగునీటి రంగానికి భారీగా కేటాయింపులు చేసినట్టు తెలుస్తోంది. దాదాపు పాతికవేల కోట్ల రూపాయలు సాగునీటి రంగానికి అందించారు. తెలంగాణ రాష్ట్రంగా అవతరించాక ప్రవేశపెడుతున్న మూడో బడ్జెట్ ఇది. గత బడ్జెట్ ను 1.15 లక్షల కోట్లతో రూపొందించారు. ఇప్పడు మరో 11 వేల కోట్లు పెంచుతున్నారు. ఈసారి ప్రణాళికేతర కేటాయింపులు తగ్గించి, ప్రణాళిక కేటాయింపులు పెంచనున్నారు. వ్యవసాయరంగానికి, టి.ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మిషన్ కాకతీయకు సముచిత స్థానాన్ని బడ్జెట్లో ఇచ్చినట్టు సమచారం. మిషన్ కాకతీయకు 2,200 కోట్ల దాకా కేటాయించే అవకాశం ఉంది.

Mobile AppDownload and get updated news

ఈడెన్ మాకు కలిసొచ్చే మైదానం

$
0
0

మొత్తానికి ఎలాగోలా పాక్ క్రికెటర్లు భారత్ చేరారు. మూడు రోజుల ముందు వరకు అసలు పాక్ టీ20 ప్రపంచకప్‌లో పాక్ ఆడుతుందా ఆడదా అని ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు తెరపడి... పాక్ జట్టు భారత్ చేరింది. కాగా మార్చి 19 భారత్ - పాక్ మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ లో జరగనుండగా... కొన్ని పరిస్థితుల వల్ల అది కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ కు మార్చిన సంగతి తెలిసిందే. దీనిపై పాక్ కెప్టెన్ ఆఫ్రిది మాట్లాడుతూ తమకు ఈడెన్ గార్డెన్స్ చాలా కలిసొచ్చే మైదానమని అన్నారు. ఇక్కడ భారత్ తో జరిగిన మ్యాచుల్లో ఎక్కువ శాతం తామే గెలిచామని అన్నారు. ఆసియాకప్ లో సరిగా ఆడలేక పోయామని, ఈ సారి మాత్రం అలా కాదని... మంచి ఆటతీరుతో ఆకట్టుకుంటామని తెలిపారు.

Mobile AppDownload and get updated news

Viewing all 86224 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>